షూటింగ్ మొదలుకాకుండానే బిజినెస్‌ | Nikhil Next Movie Satellite Rights | Sakshi
Sakshi News home page

Published Sun, Apr 8 2018 12:37 PM | Last Updated on Sun, Apr 8 2018 12:37 PM

Nikhil Next Movie Satellite Rights - Sakshi

నిఖిల్‌

విభిన్న చిత్రాలతో వరుస విజయాలు సాధిస్తున్న యంగ్ హీరో నిఖిల్ ఇటీవల కిరాక్‌ పార్టీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కన్నడ రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. మరోసారి రీమేక్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు నిఖిల్. తమిళ్‌లో ఘనవిజయం సాధించిన కనితన్‌ సినిమాను తెలుగులో రీమేక్‌ చేయనున్నాడు నిఖిల్.

ప‍్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముద్ర అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఠాగూర్‌ మధు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. అయితే షూటింగ్ మొదలవటానికి ముందే ఈ సినిమా శాటిలైట్‌ రైట్స్‌ భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి. స్టార్ మా సంస్థ ఈ సినిమా తెలుగు, హిందీ శాటిలైట్‌ హక్కులను 5.5 కోట్లకు సొంతం చేసుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement