స్వయం భూ ప్రారంభం | Nikhil Swayambhu shoot begins at Hyderabad | Sakshi
Sakshi News home page

స్వయం భూ ప్రారంభం

Aug 19 2023 4:18 AM | Updated on Aug 19 2023 6:23 AM

Nikhil Swayambhu shoot begins at Hyderabad - Sakshi

నిఖిల్‌ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘స్వయం భూ’. ఈ చిత్రంలో సంయుక్తా మీనన్‌ హీరోయిన్‌. నిర్మాత ‘ఠాగూర్‌ మధు’ సమర్పణలో భువన్, శ్రీకర్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నిర్మాత ‘దిల్‌’ రాజు కెమెరా స్విచాన్‌ చేయగా, నిర్మాత అల్లు అరవింద్‌ క్లాప్‌ కొట్టారు. గీత రచయిత రామజోగయ్య శాస్త్రి తొలి షాట్‌కి దర్శకత్వం వహించగా, చదలవాడ శ్రీనివాసరావు స్క్రిప్ట్‌ని మేకర్స్‌కి అందజేశారు.

అలాగే ‘స్వయం భూ’ సినిమాలోని నిఖిల్‌ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ‘‘నిఖిల్‌ను ఫెరోషియస్‌ వారియర్‌గా చూపించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ‘స్వయం భూ’ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ను ఈ రోజే (ఆగస్టు 18) స్టార్ట్‌ చేశాం’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్, కెమెరా: మనోజ్‌ పరమహంస, సహనిర్మాతలు: విజయ్‌ కామిశెట్టి, జీటీ ఆనంద్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement