కేశవ కేక
తెలుగు చిత్రసీమలో ఎంత స్నేహపూర్వక, ఆరోగ్యకర వాతావరణం ఉందనేది చెప్పడానికి ఈ సంఘటన ఓ చిన్న ఉదాహరణ. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ నామా తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న సినిమా ‘కేశవ’. నిఖిల్, రీతూ వర్మ జంటగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న ఈ ‘కేశవ’ నైజాం హక్కులను మరో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ‘ఏషియన్’ సునీల్ నారంగ్ ఫ్యాన్సీ రేటుకి సొంతం చేసుకున్నారు. ‘‘సునీల్ నారంగ్, నేనూ కలసి ‘అత్తారింటికి దారేది’, ‘మనం’ వంటి హిట్ చిత్రాలను పంపిణీ చేశాం.
నాకు మంచి ఫ్రెండ్. ‘కేశవ’ గురించి ఆయనకు తెలుసు. అందువల్ల, ఫ్యాన్సీ రేటుకి నైజాం హక్కులు తీసుకున్నారు. మార్చిలో చిత్రాన్ని విడుదల చేయాలను కుంటున్నాం. ఈ ‘కేశవ’ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. సినిమా కేక అని చూసినవాళ్లు అంటారు’’ అన్నారు అభిషేక్. ఈ చిత్రానికి సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల.