shankarabaranam
-
ఈ సారి పాతాళ భైరవి తీస్తాడట..?
రచయితగా టాప్ క్రేజ్ సొంతం చేసుకున్న కోన వెంకట్‌కి ప్రస్తుతం కాలం అంతగా కలిసి రావటం లేదు. శ్రీనువైట్లతో వివాదం, ఆ తరువాత ఈ ఇద్దరు మళ్లీ మనసు మార్చుకొని చేసిన బ్రూస్ లీ సినిమా నిరాశపరచటంతో ఇటీవల సక్సెస్‌లతో కన్నా వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో ఉంటున్నాడు కోన. అదే సమయంలో నిర్మాతగా మారి ఒకప్పటి క్లాసిక్ టైటిల్స్‌తో సినిమాలను నిర్మిస్తున్నాడు. తొలి ప్రయత్నంగా గీతాంజలి పేరుతో ఓ హార్రర్ కామెడీని తెరకెక్కించి మంచి విజయం సాధించాడు. అదే జోష్‌లో మరో క్లాసిక్ శంకరాభరణం టైటిల్‌తో క్రైమ్ కామెడీని ప్లాన్ చేసిన కోన ఆశించిన స్ధాయిలో మెప్పించలేకపోయాడు. అంతేకాదు క్లాసిక్ టైటిల్‌ను సరైన సినిమాకు వినియోగించలేదన్న అపవాదు కూడా మూటగట్టుకున్నాడు. అయినా కోన వెంకట్ మాత్రం తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌కు కూడా ఇదే ఫార్ములాను కంటిన్యూ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. తెలుగు సినిమా గర్వంగా చెప్పుకునే అపురూప చిత్ర రాజాల్లో ఒకటైన పాతాళభైరవి టైటిల్‌తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు కోనవెంకట్. ప్రతి తెలుగు వాడికి సుపరిచితమైన ఈ టైటిల్‌తో సినిమా చేయాలంటే చాలా ధైర్యం కావాలి. కోనకు ఆ ధైర్యం ఉంది. మరి ఆ పేరుకు న్యాయం చేసే అంత మంచి సబ్జెక్ట్ ఉందో లేదో తెలియాలంటే మాత్రం మరికొద్ది వెయిట్ చేయాల్సిందే. -
ప్రయోగాలకే ఓటేస్తున్నాడు
కమర్షియల్ జానర్లో చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవ్వటంతో ప్రయోగాత్మక చిత్రాలు చేస్తున్న నిఖిల్, ఆ జానర్లో మంచి విజయాలు సాధిస్తున్నాడు. స్వామి రారా సినిమాతో తొలిసారిగా కమర్షియల్ ఫార్మాట్‌కు దూరంగా సినిమాలు చేయటం ప్రారంభించిన నిఖిల్, ఆ తరువాత వరుసగా కార్తీకేయ, సూర్య వర్సెస్ సూర్య సినిమాల విషయంలోనూ అదే ఫార్ములాను కంటిన్యూ చేశాడు. అంతేకాదు ఇక ముందు కూడా అదే తరహా సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ప్రస్తుతం కోన వెంకట్ నిర్మిస్తున్న శంకరాభరణం సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న ఈ యంగ్ హీరో. ఆ సినిమా సక్సెస్ మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పటికే హ్యాట్రిక్ హిట్స్‌తో ఫాంలో ఉన్న నిఖిల్, అదే జోరు కంటిన్యూ చేయాలని భావిస్తున్నాడు. అందుకు తగ్గట్టుగానే బాలీవుడ్లో సక్సెస్ అయిన ఫస్ గయా రే ఒబామా సినిమాను తెలుగు నేటివిటికి అనుగుణంగా మార్పులతో రీమేక్ చేశారు. ప్రస్తుతం టైగర్ సినిమా ఫేం విఐ ఆనంద్ దర్శకత్వంలో ఫాంటసీ థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్న నిఖిల్ మరోసారి ప్రయోగానికే ఓటు వేస్తున్నాడు. కార్తీక్ రెడ్డి అనే కొత్త దర్శకున్ని పరిచయం చేస్తూ క్రీడా నేపథ్యంతో తెరకెక్కనున్న సినిమాకు ఓకే చెప్పాడు. 2016 ఫిబ్రవరిలో ఈ సినిమాను స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. -
సర్దుకు పోతున్నారు..!
ప్రస్తుత పరిస్థితుల్లో ఒక సినిమా థియేటర్లో ఉండగా మరో సినిమాను రిలీజ్ చేసి కలెక్షన్లు సాధించటం కష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన రెండు సినిమాలు ఒకే సీజన్లో రిలీజ్ చేసే పరిస్థితి అసలే కనిపించటం లేదు. చిన్న సినిమాల విషయంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అందుకే చాలామంది నిర్మాతలు బరిలో దిగి తేల్చుకుందాం అనే కన్నా, సింపుల్‌గా సర్దుకుపోందాం అంటున్నారు. ఈ డిసెంబర్లో ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్‌లతో తెరకెక్కిన మూడు సినిమాలు, ఒకేసారి రిలీజ్‌కు రెడీ అయ్యాయి. మూడు సినిమాలు ఒకేసారి థియేటర్లలోకి వస్తే థియేటర్ల సమస్యతో పాటు కలెక్షన్ల విషయంలో కూడా ఇబ్బందులు తలెత్తుతాయని భావించిన నిర్మాతలు వారం, వారం గ్యాప్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ముందుగా పివిపి సంస్థ నిర్మిస్తున్న సైజ్ జీరో సినిమాను నవంబర్ 27న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అదే రోజు రిలీజ్‌కు రెడీ అయిన నిఖిల్, కోన వెంకట్ల 'శంకారాభరణం'ను ఒక వారం ఆలస్యంగా డిసెంబర్ 4న రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉన్నా, వాయిదా పడుతూ వస్తున్న 'బెంగాల్ టైగర్' కూడా పోటీ పడటానికి సిద్ధంగా లేడు. అందుకే మరింత గ్యాప్ తీసుకుని, డిసెంబర్ 10న ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. రవితేజ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు సంపత్‌నంది దర్శకుడు. థియేటర్లలో క్లాష్ లేకుండా నిర్మాతలు అడ్జస్ట్ అయిపోవటం మంచి పరిణామమే అయినా, ఎంతమంది నిర్మాతలు ఈ ఫార్ములాను ఫాలో అవుతారో చూడాలి. -
దెయ్యం.. అబ్బాయిని ప్రేమిస్తే!
వరుస సక్సెస్‌లతో మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో నిఖిల్ ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే నెక్ట్స్ సినిమాకు రెడీ అయిపోతున్నాడు. ప్రస్తుతం శంకరాభరణం షూటింగ్లో బిజీగా ఉన్న నిఖిల్ త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టేయనున్నాడు. ఇటీవల పవర్ స్టార్ చేతుల మీదుగా రిలీజ్ అయిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ రావటంతో ఈ సినిమా సక్సెస్ మీద కూడా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. వరుసగా ప్రయోగాత్మక చిత్రాలే చేస్తున్న నిఖిల్ తన నెక్ట్స్ సినిమా విషయంలో కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడు. ఓ దెయ్యం ...అబ్బాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుంది అన్న కాన్సెప్ట్‌తో తెరకెక్కబోయే సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నాడట. దసరా సందర్భంగా సినిమా షూటింగ్‌ను లాంఛనంగా ప్రారంభించనున్నారు. 'అమల' అనే టైటిల్ తో తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్న ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ శిష్యుడు ఆనంద్ డైరెక్ట్ చేయనున్నాడు. ఇటీవల సందీప్ కిషన్ హీరోగా టైగర్ చిత్రానికి దర్శకత్వం వహించిన ఆనంద్ రెండో ప్రయత్నంగా నిఖిల్ తో అమల సినిమాను రూపొందిస్తున్నాడు. -
పవర్ స్టార్ చేతుల మీదుగా టీజర్ లాంచ్
-
పవర్ స్టార్ చేతుల మీదుగా టీజర్ లాంచ్
స్వామి రారా, కార్తీకేయ, సూర్య వర్సెస్ సూర్య లాంటి వరుస సక్సెస్‌ల తరువాత నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'శంకరాభరణం'. సాఫ్ట్ టైటిల్ తో రూపొందుతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో నందిత హీరోయిన్గా నటిస్తుంది. ప్రముఖ రచయిత కోన వెంకట్ కథ స్క్రీన్ మాటలు అందించటంతో పాటు స్వయంగా తానే ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. దీపావళి కానుకగా రిలీజ్ అవుతున్న శంకరాభరణం ఫస్ట్ లుక్ టీజర్‌ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ లో బిజీగా ఉన్న పవన్ చేతుల మీదు గబ్బర్‌సింగ్ సెట్ నుంచే శంకరాభరణం టీజర్‌ను లాంచ్ చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు ఉదయ్ నందనవనం దర్శకుడు. -
అలా చేస్తే చిన్న సినిమాలకు నష్టం
బ్రూస్ లీ రిలీజ్ డేట్ విషయంలో అల్లు అర్జున్ చేసిన కామెంట్స్‌కు తన మద్దతు తెలిపాడు యంగ్ హీరో నిఖిల్. పెద్ద సినిమాల రిలీజ్ వాయిదా వేయటం వల్ల చిన్న సినిమాలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందన్నాడు. ఇలా వాయిదా పడటం పూర్తిగా ఆ సినిమా యూనిట్ తప్పే అంటే ట్వీట్ చేశాడు. బాలీవుడ్లో అయితే ఇలా ఒక్కసారి రిలీజ్ డేట్ వాయిదా పడితే తిరిగి ఆరు నెలల వరకు మరో డేట్ దొరకదు కానీ టాలీవుడ్లో మాత్రం అలాంటి పరిస్థితి లేదన్నాడు నిఖిల్. ప్రస్తుతం క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న 'శంకరాభరణం' సినిమాలో నిఖిల్ నటిస్తున్నాడు. దీపావళి కానుకగా సేఫ్ టైం లో ఈ సినిమా రిలీజ్ చేయాలని భావించినా వరుణ్ తేజ్, క్రిష్ కాంబినేషన్ లో రూపొందుతున్న 'కంచె' సినిమా కూడా అదే సమయానికి వాయిదా పడటంతో శంకరాభరణానికి పోటీ తప్పలేదు. నిఖిల్, నందితా రాజ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న 'శంకరాభరణం' సినిమాకు కోన వెంకట్ కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించటంతో పాటు తానే స్వయంగా నిర్మిస్తున్నాడు. ఉదయ్ నందనవనం దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా దీపావళి కానుకగా రిలీజ్ కు రెడీ అవుతోంది. Absolutely agree with what @alluarjun had to say abt release dates. When Release dates of a films r changed 6 to 7 times its tht films fault — Nikhil Siddhartha (@actor_Nikhil) October 13, 2015 Small films have had to suffer bcos of these random date changes.. If it was bollywood, if u Miss ur release date u get 1 only aftr 6 months — Nikhil Siddhartha (@actor_Nikhil) October 13, 2015