అలా చేస్తే చిన్న సినిమాలకు నష్టం
బ్రూస్ లీ రిలీజ్ డేట్ విషయంలో అల్లు అర్జున్ చేసిన కామెంట్స్కు తన మద్దతు తెలిపాడు యంగ్ హీరో నిఖిల్. పెద్ద సినిమాల రిలీజ్ వాయిదా వేయటం వల్ల చిన్న సినిమాలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందన్నాడు. ఇలా వాయిదా పడటం పూర్తిగా ఆ సినిమా యూనిట్ తప్పే అంటే ట్వీట్ చేశాడు.
బాలీవుడ్లో అయితే ఇలా ఒక్కసారి రిలీజ్ డేట్ వాయిదా పడితే తిరిగి ఆరు నెలల వరకు మరో డేట్ దొరకదు కానీ టాలీవుడ్లో మాత్రం అలాంటి పరిస్థితి లేదన్నాడు నిఖిల్. ప్రస్తుతం క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న 'శంకరాభరణం' సినిమాలో నిఖిల్ నటిస్తున్నాడు. దీపావళి కానుకగా సేఫ్ టైం లో ఈ సినిమా రిలీజ్ చేయాలని భావించినా వరుణ్ తేజ్, క్రిష్ కాంబినేషన్ లో రూపొందుతున్న 'కంచె' సినిమా కూడా అదే సమయానికి వాయిదా పడటంతో శంకరాభరణానికి పోటీ తప్పలేదు.
నిఖిల్, నందితా రాజ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న 'శంకరాభరణం' సినిమాకు కోన వెంకట్ కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించటంతో పాటు తానే స్వయంగా నిర్మిస్తున్నాడు. ఉదయ్ నందనవనం దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా దీపావళి కానుకగా రిలీజ్ కు రెడీ అవుతోంది.
Absolutely agree with what @alluarjun had to say abt release dates. When Release dates of a films r changed 6 to 7 times its tht films fault
— Nikhil Siddhartha (@actor_Nikhil) October 13, 2015
Small films have had to suffer bcos of these random date changes.. If it was bollywood, if u Miss ur release date u get 1 only aftr 6 months
— Nikhil Siddhartha (@actor_Nikhil) October 13, 2015