bruclee
-
'బ్రూస్ లీ' మూవీ రివ్యూ
టైటిల్: బ్రూస్ లీ జానర్: ఫ్యామిలీ యాక్షన్ డ్రామా తారాగణం: రామ్ చరణ్, చిరంజీవి (అతిథి పాత్ర), రకుల్ ప్రీత్ సింగ్, కృతీకర్బందా దర్శకత్వం: శ్రీనువైట్ల సంగీతం: ఎస్ ఎస్ థమన్ నిర్మాత: డివివి దానయ్య గోవిందుడు అందరివాడేలే సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న రామ్ చరణ్ మరోసారి ఫ్యామిలీ డ్రామానే నమ్ముకొని చేసిన సినిమా బ్రూస్ లీ. మెగా అభిమానులకు నచ్చే మాస్ ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా ఉన్న ఈ సినిమా సక్సెస్ మీద చిత్రయూనిట్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ముఖ్యంగా చిరు గెస్ట్ అప్పియరెన్స్ కూడా సినిమా మీద అంచనాలను భారీగా పెంచింది. ఆగడు లాంటి డిజాస్టర్ తరువాత శ్రీను వైట్ల తనని తాను ప్రూవ్ చేసుకోవటానికి తెరకెక్కించిన సినిమా బ్రూస్ లీ. ఇలా అన్ని రకాలుగా భారీ అంచనాలు ఉన్న బ్రూస్ లీ ఆడియన్స్‌ను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం.. కథ: చిన్నప్పటి నుంచి బ్రూస్ లీ యాక్షన్ చూసి ఆకర్షితుడైన హీరో కార్తీక్ (రామ్ చరణ్) తన పేరును కూడా బ్రూస్ లీగా మార్చేసుకుంటాడు. కార్తీక్‌ది అందమైన కుటుంబం అమ్మ (పవిత్ర లోకేష్), నాన్న రామచంద్రరావు (రావు రమేష్), అక్క (కృతి కర్బందా). కార్తీక్ తండ్రి, జయరాజ్ (సంపత్), వసుంధర (నదియా)కు చెందిన వసుంధర ల్యాబ్స్‌లో పనిచేస్తుంటాడు. అదే సమయంలో కార్తీక్ కూడా స్టంట్ మాస్టర్‌గా పనిచేస్తూ తండ్రికి సహాయపడుతుంటాడు. వీడియో గేమ్ డెవలపర్ రియా (రకుల్ ప్రీత్ సింగ్)కు పోలీస్‌నే పెళ్లి చేసుకోవాలనే కోరిక ఉంటుంది. అయితే అదే సమయంలో కార్తీక్‌ను చూసిన రియా తొలిచూపులోనే ఇష్టపడుతుంది. కార్తీక్‌నే హీరోగా పెట్టి ఓ గేమ్ డెవలప్ చేస్తుంది. అదే సమయంలో పోలీస్‌నే పెళ్లి చేసుకోవాలనే తన పిచ్చి వల్ల అనుకోని సమస్యలను ఎదుర్కొంటుంది. ఆ సమస్యల నుంచి రియాను కాపాడాలనుకున్న కార్తీక్... దీపక్ రాజ్ (అరుణ్ విజయ్) గ్యాంగ్‌తో గొడవ పడతాడు. వసుంధర ల్యాబ్స్‌లో పనిచేస్తున్న రామచంద్రరావు కూతురు కృతిని ఆ కంపెనీ ఓనర్ జయరాజ్ తన కోడలిగా చేసుకోవాలనుకుంటాడు. ఆ సమయంలో జయరాజ్‌కు సంబందించి కొన్ని నిజాలు బయటికి వస్తాయి. ఒకేసారి జయరాజ్, దీపక్ రాజ్‌ల నుంచి కార్తీక్ కుటుంబానికి సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్యల నుంచి కార్తీక్ అలియాస్ బ్రూస్ లీ తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు, అసలు విలన్లతో బ్రూస్ లీకి ఉన్న శతృత్వం ఏంటి. అన్నదే మిగతా కథ. నటీనటులు : రామ్ చరణ్ ఈ సినిమాలో చాలా ఫ్రెష్ లుక్ లో కనిపించాడు. గత సినిమాల మాదిరిగానే డ్యాన్స్‌లు, ఫైట్లలో తన మార్క్ చూపించాడు. అయితే కొత్తగా కామెడీ ట్రై చేసిన చరణ్ మంచి విజయం సాధించాడు. నటనకు పెద్దగా అవకాశం లేకపోయినా రకుల్ తన అందాలతో మాత్రం బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా పాటల్లో రకుల్ చేసిన గ్లామర్ షో సినిమాకు బిగెస్ట్ ప్లస్ పాయింట్. చెర్రీ సిస్టర్‌గా కృతి ఆకట్టుకుంది. తన పరిధి మేరకు మెప్పించింది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన అరుణ్ విజయ్ చిన్న పాత్రే అయినా ఆకట్టుకున్నాడు. యంగ్ విలన్ గా మెప్పించాడు. బ్రహ్మనందం కామెడీ రొటీన్‌గా ఉంది. రావు రమేష్, పవిత్రా లోకేష్, సంపత్, నదియా, బ్రహ్మజీ, పోసాని కృష్ణమురళి మెప్పించారు. సినిమాకు మెయిన్ హైలైట్ చిరు గెస్ట్ అప్పియరెన్స్, ఆరేళ్ల తరువాత మేకప్ వేసుకున్న చిరు ఏజ్ ఏ మాత్రం పెరగలేదా అనిపించాడు. పర్ఫార్మెన్స్‌లోనూ యాక్షన్ సీక్వన్స్లోనూ చెర్రీకి పోటీ ఇచ్చి 150 సినిమా మీద ఆశలు కల్పించాడు. ఇక 'జస్ట్ టైం గ్యాప్ అంతే, టైమింగ్‌లో మాత్రం గ్యాప్ ఉండదు' లాంటి పంచ్‌లు విసిరిన చిరు 5 నిమిషాల పాటు థియేటర్లలో కేక పెట్టించాడు. సాంకేతిక నిపుణులు : ఆగడు తరువాత శ్రీను వైట్ల చేస్తున్న సినిమా కావటంతో రూట్ మార్చి కొత్త తరహా కథ చేస్తాడని భావించిన ఆడియన్స్‌కు నిరాశే కలుగుతుంది. మరోసారి రొటీన్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శ్రీను. అయితే కథనంలో మాత్రం తన మార్క్‌తో ఆకట్టుకున్నాడు. ఫస్టాఫ్ వరకు బాగానే సాగినా, సెకండాఫ్‌లో మాత్రం ఆడియన్ను కథతో కనెక్ట్ చేయలేకపోయారు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. తక్కువ టైంలోనే మంచి అవుట్ పుట్ ఇచ్చాడు మనోజ్ పరమహంస. పాటలు, నేపధ్య సంగీతం ఓ కమర్షియల్ సినిమాకు కావాల్సిన స్థాయిలో ఉన్నాయి. సెకండాఫ్ లో ఇంకాస్త ఎడిట్ చేసి ఉంటే బాగుండనిపించింది. ఫైట్స్ బ్రూస్ లీ అన్న టైటిల్ ను జస్టిఫై చేసేలా ఉన్నాయి. విశ్లేషణ : రొటీన్ కథ కథనాలకు కొత్త సాంకేతిక జోడించి తెరకెక్కించిన సినిమా బ్రూస్ లీ. క్వాలిటీ పరంగా మెప్పించినా, అభిమానులు ఆశించిన స్ధాయి సినిమాగా అలరించలేకపోయింది. ముఖ్యంగా సినిమాలో కీలకమైన ట్విస్ట్‌ను ఫస్టాఫ్‌లోనే రివీల్ చేయటంతో సెకాండఫ్ ఇంట్రస్టింగ్‌గా అనిపించదు. ఇక కామెడీతో పాటు సిస్టర్ సెంటిమెంట్ కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. కొన్ని పాత్రలకు సరైన జస్టిఫికేషన్ ఇవ్వలేకపోవటం కూడా సినిమాకు మైనస్. ఫస్టాఫ్ మాస్ ఆడియన్స్‌ను మెప్పించటంతో పాటు, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ చాలా బాగా రావటంతో ఆడియన్స్ కాస్త సంతృప్తి పడతారు. ప్లస్ పాయింట్స్: చిరంజీవి గెస్ట్ అప్పియరెన్స్ చరణ్ ఫ్రెష్ లుక్ రకుల్ గ్లామర్ సినిమాటోగ్రఫీ మైనస్ పాయింట్స్ : సెకండాఫ్ కామెడీ ట్రాక్ ఎడిటింగ్ ఓవరాల్ గా బ్రూస్ లీ మెగా అభిమానులను మెప్పించే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ -
అలా చేస్తే చిన్న సినిమాలకు నష్టం
బ్రూస్ లీ రిలీజ్ డేట్ విషయంలో అల్లు అర్జున్ చేసిన కామెంట్స్‌కు తన మద్దతు తెలిపాడు యంగ్ హీరో నిఖిల్. పెద్ద సినిమాల రిలీజ్ వాయిదా వేయటం వల్ల చిన్న సినిమాలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందన్నాడు. ఇలా వాయిదా పడటం పూర్తిగా ఆ సినిమా యూనిట్ తప్పే అంటే ట్వీట్ చేశాడు. బాలీవుడ్లో అయితే ఇలా ఒక్కసారి రిలీజ్ డేట్ వాయిదా పడితే తిరిగి ఆరు నెలల వరకు మరో డేట్ దొరకదు కానీ టాలీవుడ్లో మాత్రం అలాంటి పరిస్థితి లేదన్నాడు నిఖిల్. ప్రస్తుతం క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న 'శంకరాభరణం' సినిమాలో నిఖిల్ నటిస్తున్నాడు. దీపావళి కానుకగా సేఫ్ టైం లో ఈ సినిమా రిలీజ్ చేయాలని భావించినా వరుణ్ తేజ్, క్రిష్ కాంబినేషన్ లో రూపొందుతున్న 'కంచె' సినిమా కూడా అదే సమయానికి వాయిదా పడటంతో శంకరాభరణానికి పోటీ తప్పలేదు. నిఖిల్, నందితా రాజ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న 'శంకరాభరణం' సినిమాకు కోన వెంకట్ కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించటంతో పాటు తానే స్వయంగా నిర్మిస్తున్నాడు. ఉదయ్ నందనవనం దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా దీపావళి కానుకగా రిలీజ్ కు రెడీ అవుతోంది. Absolutely agree with what @alluarjun had to say abt release dates. When Release dates of a films r changed 6 to 7 times its tht films fault — Nikhil Siddhartha (@actor_Nikhil) October 13, 2015 Small films have had to suffer bcos of these random date changes.. If it was bollywood, if u Miss ur release date u get 1 only aftr 6 months — Nikhil Siddhartha (@actor_Nikhil) October 13, 2015 -
బ్రూస్ లీకి బన్నీ సపోర్ట్
కొద్ది రోజులుగా 'బ్రూస్ లీ' సినిమా విడుదల వాయిదా వేయాలంటూ వస్తున్న కథనాలపై అల్లు అర్జున్ స్పందించాడు. 'బ్రూస్ లీ' చిత్ర యూనిట్ తన రిలీజ్ డేట్ వాయిదా వేసుకోకపోవటంపై వారిని నిందించడం సరికాదన్నాడు బన్నీ. 'బ్రూస్ లీ టీం సినిమా మొదలైన సమయంలోనే విడుదల తేదీని ప్రకటించారు. ఆ సమయంలో రుద్రమదేవి సినిమా సెప్టెంబర్ 4న విడుదల అవుతుందని భావించారు. అనేక కారణాలతో రుద్రమదేవి వాయిదా పడుతూ అక్టోబర్ 9న విడుదలైంది. బ్రూస్ లీ 16న విడుదల అవుతుందన్న విషయం తెలిసే రుద్రమదేవి యూనిట్ తమ సినిమాను 9న రిలీజ్ చేశారు. పండగ సీజన్ కావటంతో రెండు సినిమాలకు స్కోప్ ఉంటుందన్న భావనతో ఈ నిర్ణయం తీసుకున్నారు' అని క్లారిటీ ఇచ్చాడు అల్లు అర్జున్. రుద్రమదేవి సినిమా తరువాత పెద్ద సినిమాలు విడుదల కావటం మంచి కాదని సోమవారం జరిగిన సక్సెస్ మీట్ లో సీనియర్ దర్శక నిర్మాత దాసరి నారాయణరావు కామెంట్ చేయగా, అదే రోజు అల్లు అర్జున్ ట్విట్టర్లో ఈ విషయంపై అభిమానులకు క్లారిటీ ఇచ్చాడు. My view about BRUCELEE release clash with RUDHRAMADEVI pic.twitter.com/qK2yjek3i2 — Allu Arjun (@alluarjun) October 12, 2015 -
నిర్మాణ రంగంలోనూ మెగా మార్క్
యంగ్ హీరో రామ్ చరణ్ హీరోగానే గాక నిర్మాణ రంగంలోనూ తన మార్క్ చూపించాలనుకుంటున్నారు. అందుకే ఒకేసారి రెండు నిర్మాణ సంస్థలను స్థాపించి నిర్మాణం రంగంలోనూ హవా కొనసాగించాలనుకుంటున్నారు. చిరు రీ ఎంట్రీ సినిమాను తన సొంతం నిర్మాణ సంస్థ ద్వారా తెరకెక్కిస్తున్న చరణ్, తరువాత కూడా వరుసగా సినిమాలు నిర్మించడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. చిరు 150 వ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్న చరణ్.. వైట్ హార్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చిన్న సినిమాలను నిర్మించడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ బ్యానర్‌పై 5 కోట్ల లోపు బడ్జెట్‌తో సినిమాలను తెరకెక్కించనున్నారు. ఈ బ్యానర్ ద్వారా కొత్త నటీనటులను, దర్శకులను, సాంకేతిక నిపుణులను పరిచయం చేయడానికి రెడీ అవుతున్నారు మెగా పవర్ స్టార్. చరణ్ ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన బ్రూస్ లీ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. అక్టోబర్ 16న రిలీజ్ అవుతున్న ఈ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. -
విలన్ పాత్రలో మాధవన్
ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీ అంతా 'తనీ ఒరువన్' రీమేక్ వైపే చూస్తోంది. రామ్‌చరణ్ 'బ్రూస్ లీ' షూటింగ్ పూర్తి చేసి ప్రమోషన్ పనుల్లో బిబీగా ఉన్నాడు. ఈ సినిమా అక్టోబర్ 16న రిలీజ్ అవుతుండటంతో, చెర్రీ నెక్ట్స్ ప్రాజెక్ట్ మీదే అందరి దృష్టి ఉంది. అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా.. చరణ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ తమిళ సినిమా 'తనీ ఒరువన్' రీమేక్ అన్న విషయం కన్ఫామ్ అయిపోయింది. అయితే ఈ సినిమాలో నటించే విలన్ పాత్ర కోసం చాలా రోజులుగా వేట కొనసాగుతున్నా ఇంత వరకు ఫైనల్ కాలేదు. ముందుగా రానా నటిస్తాడని భావించినా 'బాహుబలి 2' షూటింగ్ ఉండటంతో డ్రాప్ అయ్యాడు. తరువాత నాగార్జున తో చేయించాలని అనుకున్నా.. అది కూడా వర్క్ అవుట్ కాలేదు. ప్రస్తుతం 'సఖీ' ఫేం మాధవన్‌తో ఈ పాత్ర చేయించాలని ప్లాన్ చేస్తున్నారట చిత్రయూనిట్. లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న అరవింద్ స్వామి చేసిన పాత్రలో అదే ఇమేజ్ ఉన్న మాధవన్ చేస్తే మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు. 'బ్రూస్ లీ' సినిమా రిలీజ్ రోజున చరణ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ డిటెయిల్స్‌లో పాటు కాస్టింగ్ కూడా ఎనౌన్స్ చేసే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. -
బ్రూస్లీ సెట్లో మెగాస్టార్
ఫైనల్‌గా చిరు 150వ సినిమా ఏదన్నది తేలిపోయింది. ఈ సారికి సోలో హీరోగా కాకుండా అతిథి పాత్రలోనే సరిపెట్టేస్తున్నాడు మెగాస్టార్. రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కుతున్న బ్రూస్లీలో మూడు నిమిషాల పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం మూడు రోజుల డేట్స్ మాత్రమే ఇచ్చిన చిరు ఇప్పటికే తన షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేశాడు. అయితే చిరు రీ ఎంట్రీకి సంబంధించిన లుక్ విషయంలో చిత్రయూనిట్ చాలా గోప్యంగా వ్యవహరిస్తున్నారు. దాదాపు ఆరేళ్ల విరామం తరువాత వెండితెర మీద దర్శనమిస్తున్న చిరు లుక్ ఎలా ఉండబోతుందో వెండితెర మీదే చూడాలంటున్నారు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో చిరు లుక్‌కి సంబందించిన ఓ ఫొటో హల్చల్ చేస్తుంది. గ్యాంగ్‌లీడర్ సినిమా టైంలో చిరు ఎలా ఉండేవాడో దాదాపు అదే డ్రెసింగ్ స్టైల్, లుక్‌తో ఉన్న చిరంజీవి సెట్ లో ఉన్నఫొటో ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. బ్లాక్ జాకెట్ తో కనిపిస్తున్న చిరు.. కుర్ర హీరోలకు పోటీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడేమో అన్నట్టుగా ఉంది ఈ ఫొటో. అయితే ఇది బ్రూస్లీ సినిమా సెట్లోదేనన్న ప్రచారం జరుగుతున్నా చిత్రయూనిట్ మాత్రం ఇంత వరకు స్పందించలేదు. -
ఆ హిట్ ఇచ్చినందుకు థ్యాంక్స్
కెరటం సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన రకుల్‌ప్రీత్‌సింగ్ ప్రస్తుతం స్టార్ స్టేటస్‌ను ఎంజాయ్ చేస్తోంది. రామ్ చరణ్‌తో బ్రూస్లీ, ఎన్టీఆర్‌తో నాన్నకు ప్రేమతో సినిమాలతో పాటు బన్నీ - బోయపాటి శ్రీనుల కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తోంది ఈ బ్యూటీ. తనకు ఈ స్థాయి రావడానికి హెల్ప్ అయిన సక్సెస్ఫుల్ సినిమా లౌక్యం విడుదలై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ తరువాత తన కెరీర్లో సెకండ్ బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అందించిన లౌక్యం యూనిట్‌తో పాటు తనను నమ్మి ఆ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు దర్శకుడు శ్రీవాస్‌కు కృతజ్ఞతలు తెలియజేసింది. #1yearofloukyam , 2nd turning point in my career .Very special film.Thanks to d entire team specially dir Srivasu sir for believing in me :) — Rakul Preet (@Rakulpreet) September 26, 2015