ఆ హిట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ | Rakul preeth Thanked Lukyam team | Sakshi
Sakshi News home page

ఆ హిట్ ఇచ్చినందుకు థ్యాంక్స్

Published Sat, Sep 26 2015 9:45 AM | Last Updated on Tue, Jul 23 2019 11:50 AM

ఆ హిట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ - Sakshi

ఆ హిట్ ఇచ్చినందుకు థ్యాంక్స్

కెరటం సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన రకుల్ప్రీత్సింగ్ ప్రస్తుతం స్టార్ స్టేటస్ను ఎంజాయ్ చేస్తోంది. రామ్ చరణ్తో బ్రూస్లీ, ఎన్టీఆర్తో నాన్నకు ప్రేమతో సినిమాలతో పాటు బన్నీ - బోయపాటి శ్రీనుల కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తోంది ఈ బ్యూటీ.

తనకు ఈ స్థాయి రావడానికి హెల్ప్ అయిన సక్సెస్ఫుల్ సినిమా లౌక్యం విడుదలై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తరువాత తన కెరీర్లో సెకండ్ బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అందించిన లౌక్యం యూనిట్తో పాటు తనను నమ్మి ఆ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు దర్శకుడు శ్రీవాస్కు కృతజ్ఞతలు తెలియజేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement