న్యూయార్క్... టు...కోనసీమ
ఎన్నారై కుర్రాడైన రామ్ ఇండియాలోని తన తాతను కలిసేందుకు న్యూయార్క్ నుంచి కోనసీమకొస్తాడు. ఆ ఊళ్లో తన తండ్రికి మంచి పేరుప్రఖ్యాతులుంటాయి. అందుకు కారణమైన వ్యక్తి గురించి తెలుసుకుని, తండ్రిని ఇండియాకు రప్పించడానికి ప్రయత్నాలు మొదలుపెడతాడు. ఈ నేపథ్యంలో ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. చివరికి రామ్ తన తల్లితండ్రులను ఇండియా రప్పించగలిగాడా? అమ్మాయి ప్రేమను గెలుచుకున్నాడా? అవన్నీ తెలియాలంటే తమ చిత్రం చూడాల్సిందేనని నిర్మాత మువ్వా సత్యనారాయణ అంటున్నారు.
అలీ రేజా, సీతా నారాయణన్ జంటగా విజయ్‌చందర్, గీతాంజలి ప్రధాన పాత్రల్లో ఎన్ లక్ష్మీ నందా దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘రామ్ ఎన్నారై’. ‘పవర్ ఆఫ్ రిలేషన్‌షిప్స్’ అనేది ఉపశీర్షిక. మా చిత్రం ప్రస్తుతం నిర్మాణా నంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలోనే పాటలనూ, ఆ వెంటనే సినిమానూ విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ సినిమాకు సంగీతం: శ్రవణ్, కెమేరా: నాగబాబు.