vijaycandar
-
సాయే దైవం
షిర్డీ సాయిబాబా భక్తుల అనుభవాలే కథాంశంగా శ్రీనివాస్ జీఎల్బీ దర్శకత్వంలో పొనుగోటి భవానీ అర్జున్‌రావు నిర్మించిన చిత్రం ‘సాయేదైవం’. విజయ్‌చందర్ సాయిబాబాగా నటించారు. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ లభించింది. నిర్మాత పొనుగోటి భవానీ అర్జున్‌రావు మాట్లాడుతూ– ‘‘సాయి సమాధి చెంది వందేళ్లవుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బాబా భక్తులకు కానుకగా త్వరలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం. తెలుగు రాష్ట్రాల్లోని సాయిబాబా మందిరాల్లో చిత్రీకరణ జరిపాం. ఇందులో ఐదు పాటలు, మూడు శ్లోకాలు ఉన్నాయి. వాటికి భక్తులతో పాటు శ్రోతల నుంచి చక్కటి ఆదరణ లభిస్తోంది’’ అన్నారు. సుమన్, చంద్రమోహన్, కోట శ్రీనివాసరావు, రావు రమేశ్, ఎల్బీ శ్రీరామ్ నటించిన ఈ చిత్రానికి మాటలు–సంగీతం: పోలూర్ ఘటికాచలం. -
విజయ్‌చందర్ దర్శకత్వంలో విక్రమ్
వైవిధ్య పాత్రలు దొరకాలేగానీ వాటికి జీవం పోయడానికి తన ప్రాణం పణంగా పెట్టడానికై నా సిద్ధపడే నటుడు విక్రమ్. ఇందుకు ఉదాహరణలు ఆయన సినీకెరీర్‌లో చాలా ఉన్నారుు. అరుుతే ఇటీవల సరైన విజయాలు లేక చాలా అసంతృప్తితో ఉన్న విక్రమ్‌కు ఇరుముగన్ చిత్ర విజయం ఫుల్ జోష్ అందించింది. అలాంటి నటుడి తదుపరి చిత్రం ఏమిటన్న ఆసక్తి సినీ అభిమానులందరికి కలగడం సహజమే. అరుుతే ఇరుముగన్ తరువాత విక్రమ్ నటించే చిత్రం గురించి చాలా ప్రచారం జరుగుతోంది. హరి దర్శకత్వంలో సామి-2 చిత్రం చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. మరో పక్క కాదు విక్రమ్ ఆగ్ల చిత్రం చేయనున్నారు. ఆ తరువాతే సామి-2 చిత్రం ఉంటుందని ఒక వర్గం ప్రచారం చేస్తోంది. ఇలాంటి ప్రచారానికి తెరదించేలా విక్రమ్ తాజా చిత్రం గురించి వెల్లడించారు. విక్రమ్ యువ దర్శకుడు విజయ్‌చందర్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు. విజయ్‌చందర్ ఇంతకు ముందు శింబు కథానాయకుడిగా వాలు చిత్రాన్ని తెరకెక్కించారన్నది గమ నార్హం. త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రాన్ని ఎస్ఎఫ్ఎఫ్ సంస్థ భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందులో విక్రమ్ ఇంతకుముందు పోషించనటువంటి విభిన్న కథా పాత్రలో నటించనున్నారని చిత్ర వర్గాలు తెలిపాయి. ఇందులో నటించే కథానాయకి, ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు వారు తెలిపారు. -
న్యూయార్క్... టు...కోనసీమ
ఎన్నారై కుర్రాడైన రామ్ ఇండియాలోని తన తాతను కలిసేందుకు న్యూయార్క్ నుంచి కోనసీమకొస్తాడు. ఆ ఊళ్లో తన తండ్రికి మంచి పేరుప్రఖ్యాతులుంటాయి. అందుకు కారణమైన వ్యక్తి గురించి తెలుసుకుని, తండ్రిని ఇండియాకు రప్పించడానికి ప్రయత్నాలు మొదలుపెడతాడు. ఈ నేపథ్యంలో ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. చివరికి రామ్ తన తల్లితండ్రులను ఇండియా రప్పించగలిగాడా? అమ్మాయి ప్రేమను గెలుచుకున్నాడా? అవన్నీ తెలియాలంటే తమ చిత్రం చూడాల్సిందేనని నిర్మాత మువ్వా సత్యనారాయణ అంటున్నారు. అలీ రేజా, సీతా నారాయణన్ జంటగా విజయ్‌చందర్, గీతాంజలి ప్రధాన పాత్రల్లో ఎన్ లక్ష్మీ నందా దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘రామ్ ఎన్నారై’. ‘పవర్ ఆఫ్ రిలేషన్షిప్స్’ అనేది ఉపశీర్షిక. మా చిత్రం ప్రస్తుతం నిర్మాణా నంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలోనే పాటలనూ, ఆ వెంటనే సినిమానూ విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ సినిమాకు సంగీతం: శ్రవణ్, కెమేరా: నాగబాబు. -
అందరికీ ‘సంక్షేమం’ జగన్‌తోనే సాధ్యం
తిరుపతి(మంగళం), న్యూస్‌లైన్: ‘ఫ్యాను గుర్తుకు ఓటెయ్యండి.. వైఎస్ జగన్మోహన్రెడ్డి అందించే సంక్షేమ ఫలాలతో అభివృద్ధి చెందండి’ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్, సినీ నటుడు టీఎస్. విజయ్‌చందర్ విజ్ఞప్తి చేశారు. తిరుపతి పరిధిలోని చంద్రశేఖర్‌రెడ్డి కాలనీలో వైఎస్ఆర్ సీపీ నాయకుడు పోతిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ప్రజాబాట నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయ్‌చందర్ మాట్లాడుతూ వైఎస్.జగన్మోహన్రెడ్డి సీఎం కాగానే అందించే సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజలూ అభివృద్ధి చెందుతారన్నారు. టీటీడీ చైర్మన్‌గా ఉండి శ్రీవారి పవిత్రతను ప్రపంచ దేశాలకు చాటిచెప్పిన మహోన్నత వ్యక్తి భూమన కరుణాకరరెడ్డి అని కొనియాడారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముస్లిం, మైనార్టీలను ఊచకోత కోసిన నరహంతకుడు నరేంద్రమోడి అని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు గెలుపుకోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్నారన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు నరేంద్రమోడి ఎలా చెబితే అలా ఆడే గంగిరెద్దులా మారతాడని, దీంతో ముస్లిం, మైనార్టీలకు పూర్తిగా రక్షణ లేకుండా పోతుందన్నారు. మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కుమ్మక్కు రాజకీయాలతో కిరణ్, చంద్రబాబు నీరుగార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రి ఆశయాల కోసం నిరంతరం పాటుపడుతున్న వ్యక్తి ఒక్క వైఎస్. జగన్మోహన్రెడ్డి మాత్రమేనన్నారు. ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం పాటు పడే జగనన్న నాయకత్వం కావాలా? లేదా అధికారం కోసం ఉత్తుత్తి హామీలు ఇచ్చి వంచించే చంద్రబాబునాయుడు కావాలా అన్న విషయాన్ని ఒక్కసారి ప్రజలు ఆలోచించుకుని ఓటేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రచార కమిటీ సహాయ కో-ఆర్డినేటర్ జొన్నల శ్రీనివాసులురెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, దొడ్డారెడ్డి సిద్దారెడ్డి, ఎస్కె. బాబు, కొమ్ము చెంచయ్యయాదవ్, నీలకంఠారెడ్డి, హర్షవర్ధన్, కేతం జయచంద్రారెడ్డి, పుల్లయ్య, అమరనాథరెడ్డి, రామచంద్రారెడ్డి, పాముల రమేష్‌రెడ్డి, ఎస్కె.చోటా, తాల్లూరి ప్రసాద్, చింతా రమేష్‌యాదవ్, లోకేష్‌బాబు, రఫీ, కొండారెడ్డి, రవిచంద్ర, గఫూర్, గీతాయాదవ్, పుణీత, శాంతారెడ్డి, మల్లికమ్మ తదితరులు పాల్గొన్నారు.