విజయ్‌చందర్ దర్శకత్వంలో విక్రమ్ | Vikram in Vijaycandar direction | Sakshi
Sakshi News home page

విజయ్‌చందర్ దర్శకత్వంలో విక్రమ్

Published Fri, Nov 18 2016 1:23 AM | Last Updated on Mon, Sep 4 2017 8:22 PM

విజయ్‌చందర్ దర్శకత్వంలో విక్రమ్

విజయ్‌చందర్ దర్శకత్వంలో విక్రమ్

వైవిధ్య పాత్రలు దొరకాలేగానీ వాటికి జీవం పోయడానికి తన ప్రాణం పణంగా పెట్టడానికై నా సిద్ధపడే నటుడు విక్రమ్. ఇందుకు ఉదాహరణలు ఆయన సినీకెరీర్‌లో చాలా ఉన్నారుు. అరుుతే ఇటీవల సరైన విజయాలు లేక చాలా అసంతృప్తితో ఉన్న విక్రమ్‌కు ఇరుముగన్ చిత్ర విజయం ఫుల్ జోష్ అందించింది. అలాంటి నటుడి తదుపరి చిత్రం ఏమిటన్న ఆసక్తి సినీ అభిమానులందరికి కలగడం సహజమే. అరుుతే ఇరుముగన్ తరువాత విక్రమ్ నటించే చిత్రం గురించి చాలా ప్రచారం జరుగుతోంది. హరి దర్శకత్వంలో సామి-2 చిత్రం చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. మరో పక్క కాదు విక్రమ్ ఆగ్ల చిత్రం చేయనున్నారు.

ఆ తరువాతే సామి-2 చిత్రం ఉంటుందని ఒక వర్గం ప్రచారం చేస్తోంది. ఇలాంటి ప్రచారానికి తెరదించేలా విక్రమ్ తాజా చిత్రం గురించి వెల్లడించారు. విక్రమ్ యువ దర్శకుడు విజయ్‌చందర్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు. విజయ్‌చందర్ ఇంతకు ముందు శింబు కథానాయకుడిగా వాలు చిత్రాన్ని తెరకెక్కించారన్నది గమ నార్హం. త్వరలో   సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రాన్ని ఎస్‌ఎఫ్‌ఎఫ్ సంస్థ భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందులో విక్రమ్ ఇంతకుముందు పోషించనటువంటి విభిన్న కథా పాత్రలో నటించనున్నారని చిత్ర వర్గాలు తెలిపాయి. ఇందులో నటించే కథానాయకి, ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు వారు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement