irumugan
-
లిప్ లాక్కు నో!
ఒక స్థాయికి చేరుకున్న తరువాత మనిషి ప్రవర్తనలో మార్పు అన్నది తథ్యం. అది ఏ రంగమైనా సరే. ముఖ్యంగా పేరు, డబ్బు పెరిగే కొద్దీ అధికార ధోరణి పెరుగుతుంది. ఇక సినిమా రంగానికి వస్తే నటీనటుల్ని ఎంపిక చేసే ముందు దర్శక నిర్మాతలు వారికి కొన్ని నిభంధనలను విధించడం పరిపాటి. వారు ఒక స్థాయికి చేరుకున్న తరువాత నిబంధనలనేవి రివర్స్ అవుతాయి. ముఖ్యంగా హీరోహీరోయిన్లు కథల విషయాల్లో జోక్యం చేసుకోవడం, తమ పాత్రల్లో మార్పులు, చేర్పులు చేయాలని సూచనలు ఇవ్వడం లాంటివి జరుగుతుండడం సర్వసాధారణంగా మారిపోయింది. ఇక కథానాయకిల విషయానికి వస్తే ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా రాణిస్తున్న నటి నయనతార దర్శక నిర్మాతలకు షరతులు విధించడంలో ముందున్నారనే ప్రచారం జోరందుకుంది. ముఖ్యంగా విక్రమ్‌కు జంటగా నటించిన ఇరుముగన్ చిత్రం తరువాత ఈ అమ్మడి దృక్పథంలో చాలా మార్పు వచ్చిందట. ఇటీవల లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రాల్లో అధికంగా నటిస్తున్న నయనతార కథల ఎంపిక విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు.దర్శకులు చెప్పే కథలను సీన్ బై సీన్ వింటున్నారట. తన పాత్రకు ప్రాధాన్యం ఉంటేనే నటించడానికి పచ్చజెండా ఊపుతున్నారు. అంతే కాదు కథల్లో మార్పులు, చేర్పులు చేయాలని డిమాండ్ చేస్తున్నారని సమాచారం. ముఖ్యంగా ఇంతకు ముందు ఎలాబడితే అలా విచ్చలవిడిగా అందాలను ఆరబోసిన నయనతార ఇప్పుడు దర్శక నిర్మాతలకు మూడు నిబంధనలు విధిస్తున్నారు. అవేమిటంటే లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించను, ఈత దుస్తులు ధరించినటించను. గ్లామరస్‌గా కనిపించను లాంటి నిబంధనలను విధిస్తున్నారట. అయినా నయనతార కాల్షీట్స్ కోసం దక్షిణాది దర్శక నిర్మాతలు క్యూ కడుతూనే ఉన్నారన్నది గమనార్హం. ప్రస్తుతం, చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్నారీ కేరళ భామ. -
సియాన్ తో ఆదితిరావ్ రొమాన్స్
సియాన్ విక్రమ్‌తో బాలీవుడ్ భామ ఆదితిరావ్ రొమాన్స్ కు సిద్ధం అవుతున్నారు. ఇరుముగన్ చిత్రం విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న నటుడు విక్రమ్ తదుపరి చిత్రానికి చిన్న గ్యాప్ తీసుకున్నారు. అయితే ప్రస్తుతం ఈయన చేతిలో రెండు చిత్రాలు ఉన్నాయి. అందులో ఒకటి గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నటించనున్న చిత్రం. ఈ చిత్రం షూటింగ్ విషయంలోనే కాస్త జాప్యం జరిగిందనే ప్రచారం జరుగుతోంది. గౌతమ్‌మీనన్, విక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ తొలి చిత్రానికి ధ్రువనక్షత్రం అనే పేరును ఖరారు చేశారు. నిజానికి ఈ చిత్ర కథను గౌతమ్‌మీనన్ నటుడు అజిత్ కోసం తయారు చేశారట. ఆయనతో చిత్రం సెట్ కాకపోవడంతో ఆ కథను సూర్య కథానాయకుడిగా చిత్రం చేయడానికి చాలా కాలం క్రితమే సన్నాహాలు జరిగాయి. అలాంటిది సూర్యకు కథ నచ్చక పోవడంతో ఆయన చిత్రం నుంచి వైదొలిగారు.ఈ వ్యవహారంలో గౌతమ్‌మీనన్ కు, సూర్యకు మధ్య విభేదాలు తలెత్తాయన్నది గమనార్హం. తాజాగా అదే కథలో నటుడు విక్రమ్ హీరోగా నటించనున్నారు. ఇక ఇందులో హీరోయిన్ గా నటి నయనతారను నటింపజేసే ప్రయత్నాలు జరిగాయని, ఆ అమ్మడు డిమాండ్ చేసిన పారితోషికానికి దర్శకుడు గౌతమ్‌మీనన్ కళ్లు బైర్లు కమ్మాయని వార్తలు వెబ్సైట్లలో హల్చల్ చేశారు. విక్రమ్‌కు జంటగా బాలీవుడ్ బ్యూటీ ఆదితిరావ్ను ఎంపిక చేసినట్లు తెలిసింది. ఈ అమ్మడు ఇప్పటికే మణిరత్నం దర్శకత్వంలో కార్తీకి జంటగా కాట్రు వెలియిడై చిత్రంలో నటిస్తున్నారన్నది గమనార్హం. ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందించనున్న ధ్రువనక్షత్రం చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను సోమవారం విడుదల చేశారు. ఇందులో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో విక్రమ్ గెటప్ ఆయన అభిమానుల్ని యమ ఖుషీ చేస్తోంది. ఇక చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. విక్రమ్ ఈ చిత్రం చేస్తూనే విజయ్‌చందర్ దర్శకత్వంలో మరో చిత్రం చేయనున్నారన్నది గమనార్హం. -
విజయ్‌చందర్ దర్శకత్వంలో విక్రమ్
వైవిధ్య పాత్రలు దొరకాలేగానీ వాటికి జీవం పోయడానికి తన ప్రాణం పణంగా పెట్టడానికై నా సిద్ధపడే నటుడు విక్రమ్. ఇందుకు ఉదాహరణలు ఆయన సినీకెరీర్‌లో చాలా ఉన్నారుు. అరుుతే ఇటీవల సరైన విజయాలు లేక చాలా అసంతృప్తితో ఉన్న విక్రమ్‌కు ఇరుముగన్ చిత్ర విజయం ఫుల్ జోష్ అందించింది. అలాంటి నటుడి తదుపరి చిత్రం ఏమిటన్న ఆసక్తి సినీ అభిమానులందరికి కలగడం సహజమే. అరుుతే ఇరుముగన్ తరువాత విక్రమ్ నటించే చిత్రం గురించి చాలా ప్రచారం జరుగుతోంది. హరి దర్శకత్వంలో సామి-2 చిత్రం చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. మరో పక్క కాదు విక్రమ్ ఆగ్ల చిత్రం చేయనున్నారు. ఆ తరువాతే సామి-2 చిత్రం ఉంటుందని ఒక వర్గం ప్రచారం చేస్తోంది. ఇలాంటి ప్రచారానికి తెరదించేలా విక్రమ్ తాజా చిత్రం గురించి వెల్లడించారు. విక్రమ్ యువ దర్శకుడు విజయ్‌చందర్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు. విజయ్‌చందర్ ఇంతకు ముందు శింబు కథానాయకుడిగా వాలు చిత్రాన్ని తెరకెక్కించారన్నది గమ నార్హం. త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రాన్ని ఎస్ఎఫ్ఎఫ్ సంస్థ భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందులో విక్రమ్ ఇంతకుముందు పోషించనటువంటి విభిన్న కథా పాత్రలో నటించనున్నారని చిత్ర వర్గాలు తెలిపాయి. ఇందులో నటించే కథానాయకి, ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు వారు తెలిపారు. -
హాలీవుడ్ రీమేక్‌లో విక్రమ్..?
హిట్, ఫ్లాప్‌లతో సంబందం లేకుండా వరుసగా ప్రయోగాత్మక చిత్రాలు చేస్తున్న తమిళ స్టార్ హీరో విక్రమ్. ఐ సినిమా తరువాత చాలా కాలం పాటు సక్సెస్‌కు దూరమైన ఈ విలక్షణ నటుడు ఇటీవల ఇరుముగన్ సినిమాతో మంచి సక్సెస్ సాధించాడు. ఈ సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి విక్రమ్ స్టామినాను ప్రూవ్ చేసింది. అదే జోష్‌లో ఇప్పుడు మరిన్ని ప్రయోగాలకు రెడీ అవుతున్నాడు విక్రమ్. ప్రస్తుతం సామి సీక్వల్గా తెరకెక్కుతున్న సామి 2లో నటిస్తున్న విక్రమ్, ఓ హాలీవుడ్ సినిమాను రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు. ఇటీవల హాలీవుడ్లో రిలీజ్ అయిన హారర్ సినిమా డోంట్ బ్రీత్ను విక్రమ్ రీమేక్ చేయాలనుకుంటున్నాడట. ఈ సినిమాలో స్టీఫెన్ లాంగ్ చేసిన అంధుడి పాత్రలో నటించేందుకు విక్రమ్ ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాపై త్వరలోనే క్లారిటీ రానుంది. -
ఇరుముగన్ తెరకెక్కుతుందా?
మొత్తానికి ఇరుముగన్ చిత్రాన్ని సంచలన విజయంగా ప్రేక్షకులు డిసైడ్ చేశారు.దీంతో ఆ చిత్ర యూనిట్ విజయోత్సాహంలో మునిగిపోయారు. సియాన్ విక్రమ్ నటించిన తాజా చిత్రం ఇరుముగన్. తన పాత్రల కోసం తీవ్ర కసరత్తులు చేసే ఈయన ఇరుముగన్ చిత్రానికి అలాంటి శ్రమనే కోరుకున్నారు. అంతగానూ సక్సెస్ అయ్యారు. విక్రమ్ అఖిలన్, లవ్ అనే రెండు పాత్రలను పోషించిన ఈ చిత్రాన్ని శిబు ఫిలింస్ పతాకంపై శిబుతమీన్స్ నిర్మించారు. నయనతార,నిత్యామీనన్ నాయికలుగా నటించిన ఈ చిత్రానికి హారీష్ జయరాజ్ సంగీతాన్ని అందించారు. అరిమానంబి చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన శంకర్ శిష్యుడు ఆనంద్ శంకర్ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను చేపట్టి వాటిని సమర్థవంతంగా నిర్వహించారు.ఆరా సంస్థ గత వారం తమిళనాడు వ్యాప్తంగా విడుదల చేసిన ఇరుముగన్ చిత్రం భారీ వసూళ్లను సాధిస్తూ విజయ బాటలో పయనిస్తోంది.ఈ సందర్భంగా చిత్ర యూనిట్ బుధవారం మధ్యాహ్నం స్థానిక ప్రసాద్ ల్యాబ్‌తో సక్సెస్ మీట్‌ను నిర్వహించారు.ఈ సందర్భంగా చిత్రం దర్శకుడు ఆనంద్ శంకర్ మాట్లాడుతూ అరిమానంబి చిత్రం చూసి అభినందించిన విక్రమ్ మంచి కథ ఉంటే చెప్పండి కలిసి చేద్దాం అని అన్నారన్నారు. నిజానికి అప్పుడు తన వద్ద స్క్రిప్ట్ ఏదీలేదన్నారు.ఒక సింగిల్ లైన్ మాత్రమే చెప్పానన్నారు. అది చాలా బాగుంది బాగా ఇంప్లిమెంట్ చేయమని విక్రమ్ చెప్పారన్నారు. దీంతో తన బాధ్యత మరింతపెరిగిందని అన్నారు. ఒరుముగన్ చిత్రం విజయం వెనుక యూనిట్‌లోని ప్రతి వారి కృషి ఉందని అన్నారు. చిత్ర హీరో విక్రమ్ మాట్లాడుతూ నిజానికి ఇరుముగన్ చిత్రం తెరకెక్కుతుందో? లేదోనన్న ఆందోళనతో ఉన్నామన్నారు. అలాంటి క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు నిర్మాత శిబుతమీన్ రంగంలోకి ప్రవేశించి రెండే రోజుల్లో సమస్యల్ని పరిష్కరించి ఇరుముగన్ చిత్ర నిర్మాణ బాధ్యతల్ని తన తన భుజస్కందాలపై వేసుకుని ఈ విజయానికి కారణం అయ్యారన్నారు. ఇక అఖిలన్, లవ్ పాత్రల్లో ఏ పాత్ర కష్టం అనిపించిందని అడుగుతున్నారని, నిజం చెప్పాలంటే రెండు పాత్రల్లో వైవిధ్యం చూపించడానికి కృషి చేశానన్నారు. ముఖ్యంగా లవ్ పాత్రను కొంచెం ఎక్కువ చేసినా, తక్కువ చేసినా ఇంత ఫలితం ఉండేది కాదన్నారు. నయనతార, నిత్యామీనన్, తంబిరామయ్య ఇలా అందరూ తమతమ పాత్రలకు న్యాయం చేశారని అందుకే ఇరుముగన్ ఇప్పుడు ప్రేక్షకుల ఆదరణను పొందుతోందని విక్రమ్ అన్నారు. ఇరుముగన్ చిత్రం తమిళనాడులో విడుదల చేసిన ఆరా ఫిలింస్ అధినేత సురేశ్ మాట్లాడుతూ ఈ చిత్రం తొలి ఆరు రోజుల్లోనే 29.5 కోట్లు వసూల్ చేసిందని తెలిపారు.వచ్చే వారం కూడా ఒక థియేటర్ తగ్గకుండా ప్రదర్శింపడుతుందని చెప్పారు. -
భారీ వసూళ్లతో ఇరుముగన్
ఇరుముగన్ చిత్రం మంచి టాక్‌ను సంపాదించుకోవడంతో పాటు భారీ వసూళ్లను రాబట్టుకుంటోంది. విక్రమ్ నటించిన తాజా చిత్రం ఇరుముగన్. ఈయనతో అగ్రనాయకి నయనతార తొలిసారిగా జత కట్టిన ఈ చిత్రంలో నిత్యామీనన్ మరో నాయకిగా నటించారు. నాజర్, తంబిరామయ్య, కరుణాకరన్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఇంతకు ముందు అరిమానంబి వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన ఆనంద్‌శంకర్ దర్శకత్వం వహించారు. తమీన్స్ ఫిలింస్ పతాకంపై శిబుతమీన్ నిర్మించిన ఈ భారీ చిత్రంలో విక్రమ్ కథానాయకుడిగా, ప్రతికథానాయకుడిగా నటించడం విశేషం. హారీష్ జయరాజ్ సంగీతాన్ని అందించారు. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఇరుముగన్పై నిర్మాణ దశలోనే మంచి అంచనాలు నెలకొన్నాయి. గురువారం ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణను పొందుతోంది. విక్రమ్, నయనతార కలయికలో రూపొందిన తొలి చిత్రం అన్న క్రేజ్, విక్రమ్ విలన్‌గా నటించారన్న ఆసక్తి చిత్రానికి చాలా ఆకర్షణగా మారాయి. ఇరుముగన్ చిత్రంలో విక్రమ్ పోషించిన లవ్ అనే విలన్ గెటప్ చాలా కొత్తగా ఉంది. గత చిత్రం 10 ఎండ్రదుక్కుళ్ చిత్రంతో చాలా నిరాశను చవిచూసిన విక్రమ్ ఈ చిత్రం నూతనోత్సాహాన్నిచిందని చెప్పవచ్చు. సాధారణంగా కొత్త చిత్రాలు శుక్రవారం రోజున విడుదలవుతుంటాయి. అలాంటిది ఎలాంటి సెలవు దినం కాకపోయినా ఇరుముగన్ చిత్రం గురువారం విడుదలై భారీ వసూళ్లను రాబట్టుకుంటోంది. ఈ చిత్రం తొలి రోజునే తమిళనాడులో ఐదు కోట్లు వసూల్ చేసిందని సినీ వర్గాలు గణాంకాలు చెబుతున్నాయి. చెన్నైలో మాత్రమే 58.73 ల క్షలు వసూలు చేసిందని సమాచారం. అదే విధంగా సెంగల్పట్టులో కోటీ 20 లక్షలు, కోయంబత్తూర్‌లో 80 లక్షలు అంటూ మంచి వసూళ్లను రాబట్టిందని సినీవర్గాలు చెబుతున్నారు. మరో విషయం ఏమిటంటే పెద్ద చిత్రాలేమీ లేక పోవడంతో వారాంతర రోజుల్లోనూ ఇరుముగన్ వసూళ్ల వేట కొనసాగుతుందంటున్నారు. -
ఇంకొకడు రిలీజ్ వాయిదా
విలక్షణ నటుడు విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఇంకొకడు. విక్రమ్ రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్న ఈసినిమా తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఆనంద్ శంకర్ దర్శకుడు. నయనతార, నిత్యామీనన్‌లు విక్రమ్ సరసన హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ సినిమా మీద భారీ హైప్ క్రియేట్ చేసింది. ముందుగా ఈ సినిమాను సెప్టెంబర్ 1న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడిందన్న వార్త వినిపిస్తోంది. కొంత కాలంగా తన స్ధాయికి తగ్గ సక్సెస్ సాధించటంతో విఫలమవుతున్న హీరో విక్రమ్, ఇరుముగన్ సినిమాతో భారీ కలెక్షన్ల మీద కన్నేశాడు. అందుకే తమిళ్‌తో పాటు తెలుగులోనూ ఈ సినిమాను భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అయితే ముందుగా అనుకున్నట్టుగా సెప్టెంబర్ 1న ఇంకొకడు సినిమాను రిలీజ్ చేస్తే ఆ తరువాత రోజే రిలీజ్ అయ్యే జనతా గ్యారేజ్ సినిమా నుంచి ఇబ్బందులు ఎదురవుతాయని భావిస్తున్నారు. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ కూడా తెలుగుతో పాటు తమిళ మలయాళ భాషల్లో భారీగా రిలీజ్ చేస్తున్నారు. దీంతో తన సినిమాను వారం పాటు వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాడు విక్రమ్. ముందుగా అనుకున్నట్టుగా సెప్టెంబర్ 1న కాకుండా ఇంకొకడు సినిమాను సెప్టెంబర్ 8న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. -
మెగాఫోన్ పట్టనున్న అపరిచితుడు
సౌత్ ఇండస్ట్రీలో ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన హీరో విక్రమ్. సినిమా కోసం ఎలాంటి రిస్క్ చేయడానికైనా రెడీగా ఉండే విక్రమ్.. ఇప్పుడు మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే హీరోగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ స్టార్ హీరో, త్వరలో మెగాఫోన్ పట్టాలని నిర్ణయించుకున్నాడు. ఇటీవల చెన్నై వరదల నేపథ్యంలో ఓ షార్ట్ ఫిలింకు దర్శకత్వం వహించిన విక్రమ్ త్వరలోనే పూర్తి స్థాయి సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. దర్శకత్వ బాధ్యతలు తీసుకోవాలని నిర్ణయించుకున్న విక్రమ్ ప్రస్తుతం ఇతర విభాగాల మీద పట్టు సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నాడు. అందుకే షూటింగ్ సమయంలో తన షాట్ అయిపోయినా.. కెమరా, లైటింగ్ లాంటి విషయాల మీద అవగాహన కోసం సెట్స్‌లో ఉంటున్నాడు. అంతేకాదు తాను దర్శకత్వం వహించబోయే సినిమాలో తాను మాత్రం హీరోగా నటించకూడదని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం విక్రమ్ హీరోగా తెరకెక్కిన ఇరుముగన్ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాను తెలుగులో ఇంకొకడు పేరుతో రిలీజ్ చేస్తున్నారు. విక్రమ్ హీరోగా, విలన్‌గా ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో నయనతార, నిత్యామీనన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. -
నయనతో కెమిస్ట్రీ కుదిరింది
నయనతారతో కెమిస్ట్రీ వర్కవుట్ అయ్యిందన్నారు సియాన్ విక్ర మ్. ఈయన కథా నాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ఇరుముగన్. పాత్రల్లో పరకాయ ప్రవేశం చేయడానికి ఎంతకైనా సిద్ధపడే ఈ నట పిపాసి ఈ చిత్రంలో మరో రెండు వైవిధ్యభరిత పాత్రలకు జీవం పోశారనే చెప్పాలి. పులి చిత్ర నిర్మాతల్లో ఒకరైన శిబుతమీన్స్ తన తమీన్స్ ఫిలింస్ పతాకంపై నిర్మిస్తున్న భారీ చిత్రం ఇది. విక్రమ్‌కు జంటగా తొలిసారిగా క్రేజీ నటి నయనతార జత కట్టిన ఈ చిత్రంలో మరో నాయకిగా నిత్యామీనన్ నటించారు. అరిమాతంబి చి త్రం ఫేమ్ ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి హారీష్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం ఉదయం స్థానిక రాయపేటలో గల సత్యం సినిమా థియేటర్లో జరిగింది.నటుడు శివకార్తికేయన్, మలయాళ యువ నటుడు నివీన్‌బాలి విచ్చేసిన ఈ కార్యక్రమంలో దర్శకుడు హరి, నటి లిజి, గీతరచయిత మదన్‌కార్గీ పాల్గొన్నారు. అభిమానులను అలరించాలనే.. విక్రమ్ మాట్లాడుతూ పత్రి చిత్రాన్ని అభిమానులను అలరించాలన్న ఆలోచనతోనే అంగీకరిస్తుంటానన్నారు. ఇరుముగన్ గురించి ఇప్పుడు తానేమీ చెప్పనని చిత్రం చూసిన తరువాత అదే మాట్లాడుతుందని అన్నారు. ఇరుముగన్ చిత్రం కోసం తాను తొమ్మిది నెలలు వేచి ఉన్నానని తెలిపారు.దర్శకుడు అంతగా వెయిట్ చేశారని, నిజానికి ఆయనకు ఒక పెద్ద హీరో చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని, దాన్ని ఆయన అంగీకరించవచ్చునని అన్నారు. ద్విపాత్రాభినయం కథా చిత్రం కోసం తాను చాలా కాలంగా ఎదురు చూస్తున్నానన్నారు. ఇక చిత్ర నిర్మాత శిబు తమాన్స్ గురించి చెప్పేతీరాలన్నారు.ఆయన తాను నటించిన చాలా చిత్రాలను కేరళలో డిస్ట్రిబ్యూషన్ చేశారని తెలిపారు. నయన్‌తో నటించడం గొప్ప అనుభవం తాను, నటి నయనతార కలిసి నటిస్తున్న తొలి చిత్రం ఇదన్నారు. నయనతార చాలా ప్రొఫెషనల్ అని పేర్కొన్నారు. ఆమెతో నటించడం గొప్ప అనుభవం అని.. తమ మధ్య మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యిందని వ్యాఖ్యానించారు. ఇక నటి నిత్యామీనన్ కూడా అంతేనన్నారు. ఇక హరీష్‌జయరాజ్ అంటే తనకు చాలా ఇష్టమని,ఆయన తనకు చాలా మంచి పాటల్ని అందించారని విక్రమ్ పేర్కొన్నారు. విక్రమ్ హిజ్రాగా నటించలేదు విక్రమ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో ఒక పాత్రలో రా అధికారిగా కనిపించనున్నారు. మరో పాత్ర హిజ్రా అనే ప్రచారం జరుగుతోం ది. అయితే దీనిపై దర్శకుడు ఆనంద్ శంకర్ స్ప ష్టం చేస్తూ హిజ్రాను కెమికెల్ ప్రాసెస్ ద్వారా ఆ డగాగానీ మగగా గానీ మార్చవచ్చునని చిత్ర ంలో చెప్పామన్నారు. అయితే ఇందులో విక్రమ్ హిజ్రాగా నటించలేదన్నారు. కాగా రెండో పాత్ర వైవిధ్యభరితంగా ఉంటుందన్నారు. ఇంతకు ముందెప్పుడూ చూడని విధంగా ఉం టుందన్నా రు. ఈ గెటప్ విక్రమ్ అభిమానుల్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచె త్తుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న దర్శకుడు హరి మాట్లాడుతూ విక్రమ్‌ది తనది హిట్ కాంబినేషన్ అన్నారు. తాము కలిసి పని చేసిన సామి చిత్రం అప్పట్లో ట్రెండ్ సెట్టర్ అయ్యిందని,ఆ చిత్రానికి సీక్వెల్‌కు సిద్ధం అవుతున్నట్లు తెలిపారు. -
విక్రమ్ @ 50
నటుడు విక్రమ్ అనే మూడక్షరాల పేరుకి మూడక్షరాల సినిమాకు విడదీయరాని అనుబంధం ఉంది. అలాగే 75 ఏళ్ల సినిమా చరిత్రలో దాదాపు 25 ఏళ్లగా విక్రమ్ పేరు వినిపిస్తూనే ఉంది. నటుడు విక్రమ్‌కు సినిమా అంటే ఎనలేని ఫ్యాషన్. అందుకే చదువు పూర్తి కాగానే తొలి రోజుల్లో మోడలింగ్ రంగంలో పని చేసినా ఆ తరువాత ఇది కాదు తన గోల్ అని నిర్ధారించుకుని నటుడిగా ప్రయత్నాలు మొదలెట్టారు.అలా ప్రయత్నాలకే సుధీర్ఘ పయనం చేయాల్సి వచ్చింది. అలాంటి సమయంలో తన గొంతును ఇతర నటులకు అరువు కూడా ఇచ్చారు. అవన్నీ తన లక్ష్య సాధనలో భాగమే. విక్రమ్ శక్తి వంచన లేని కృషికి, శ్రమకు ఫలితం దక్కింది.1990లో ఎన్ కాదల్ కణ్మణి చిత్రం ద్వారా నటుడిగా రంగప్రవేశం చేశారు. ఆ తరువాత ఒక్కోమెట్టు ఎక్కుతూ అవకాశాలను అందిపుచ్చుకుంటూ, వాటిని సద్వినియోగం చేసుకుంటూ అభిమానులు సిమాన్ అనే బిరుదుతో గౌరవించుకునే స్థాయికి చేరారు. నటుడిగా స్వయం కృషితో ఎదిగిన విక్రమ్‌కు నటుడిగా పెద్ద గుర్తింపు తెచ్చి పెట్టిన చిత్రం సేతు అనే చెప్పాలి.ఆ తరువాత పితామగన్ చిత్రం జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అందించింది. అలా పలు ఫిలింఫేర్ అవార్డు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ నటుడు అవార్డు అంటూ విక్రమ్ తమిళసినిమా అనే పుస్తకంలో తనకంటూ కొన్ని పుటల్లో తన పేరును పొందుపరచుకున్నారు. శంకర్ దర్శకత్వంలో అన్నియన్ లాంటి వైవిధ్యభరిత చిత్రం, ఐ వంటి గ్రాండీయర్ చిత్రంలో నటించి నటుడిగా తన స్థాయిని మరింత పెంచుకున్నారు. ఇప్పటికీ వైవిధ్యం కోసం తపించే వయసు అయిదు పదులకు చేరుకుంది. అవును 1966 ఏప్రిల్ 17న పుట్టిన విక్రమ్ ఆదివారం 50వ ఏట అడుగు పెట్టనున్నారు.ఈ 50 ఏళ్లలో విక్రమ్ పాతికేళ్లగా సినీకళామతల్లి సేవలోనే కొనసాగుతున్నారన్నది గమనార్హం. ఇక ఈ 25 ఏళ్లలో నటుడిగా విక్రమ్ అర్ధ సెంచరీ దాటేశారు.ఇందులో తమిళంతో పాటు తెలుగు,మలయాళం,హిందీ అంటూ ఇతర భాషా చిత్రాలు కూడా ఉన్నాయి. ఇలా బహు భాషానటుడిగా ఉన్నత స్థాయిలో నట పయనాన్ని కొనసాగిస్తున్న విక్రమ్ ప్రస్తుతం ఇరుముగన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. విక్రమ్ అన్నియన్ లాంటి చిత్రాల్లో పలు విభిన్న గెటప్ల్లో నటించినా తన కెరీర్లో ద్విపాత్రాభినయం చేస్తున్న తొలి చిత్రం ఇరుముగన్ అన్నది గమనార్హం. అదే విధంగా ఇందులో తొలిసారిగా నయనతార ఆయనతో జత కట్టడం విశేషం.మరో హీరోయిన్గా నిత్యామీనన్ నటిస్తున్న ఈ చిత్రానికి ఆనంద్‌శంకర్ దర్శకుడు. విజయ్ నటించిన పులి చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యం పంచుకున్న శిబు తమీన్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రానికి హారీష్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్రం 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. చిత్ర టీజర్‌ను విక్రమ్ పుట్టిన రోజును పరస్కరించుకుని ఆదివారం విడుదల చేయనున్నారన్నది ఆయన అభిమానులకు ఆనందాన్ని కలిగించే విషయం. -
నయనకు టెన్షన్ ఎందుకో?
మనిషన్నాక ఎప్పుడోకప్పుడు, ఏదోక సందర్భంలో టెన్షన్ వస్తుంది. అది సహజం కూడా. అలాంటిది నయనతారకు టెన్షన్ రావడంలో ఆశ్చర్యమేముంది. అయితే ఈ ముద్దుగుమ్మ ఎక్కువగా టెన్షన్ అయ్యేది ఎప్పుడన్నది తెలుసుకోవాలనుందా’అయితే చూద్దాం రండి. ప్రస్తుతం కోలీవుడ్‌లో టాప్ రేంజ్లో వెలిగిపోతున్న టాప్‌మోస్ట్ హీరోయిన్ ఆ కేరళ బ్యూటీ. వరుస విజయాలతో మంచి జోష్‌లో ఉన్న నయనతార నటించిన ఇదునమ్మఆళు, తిరునాళ్ చిత్రాలు చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం కార్తీతో కాష్మోరా, విక్రమ్‌కు జంటగా ఇరుముగన్ చిత్రాల్లో నటిస్తున్నారు. తరువాత దాస్ రామస్వామి దర్శకత్వంలో టిక్.టిక్.టిక్ చిత్రంతో పాటు మోహన్‌రాజా దర్శకత్వంలో శివకార్తికేయన్ సరసన నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇంకా తన ప్రియుడిగా ప్రచారంలో ఉన్న విఘ్నేశ్‌శివ చిత్రం తదితర అరడజను పైగా చిత్రాలతో బిజీగా ఉన్న నయనతారకో పాలసీ ఉంది. చిత్రం తరువాత చిత్రం చేసుకుంటూ పోతారు. అలాగే ఒక చిత్రం పూర్తి చేసిన తరువాత ఒకటి రెండు వారాలు నటనకు దూరంగా ఉంటారట. అ రోజుల్ని విదేశాలకు వెళ్లి అక్కడ ఉన్న తన బంధువులు,స్నేహితురాళ్లతో జాలీగా గడిపేస్తారట.ఆ సమయంలో చిత్రపరిశ్రమకు సంబంధించిన ఎవరైనా చిత్ర ఆడియో ఆవిష్కరణలు, ఇతర ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తే యమ టెన్షన్ అయిపోతారట. విరామ సమయాలల్లో కూడా సంతోషంగా గడపనీయరా?అంటూ ఫైర్ అవుతారట.అందుకే మరి నయనా మజాకా అంటుంటారు కోలీవుడ్ వర్గాలు.