హాలీవుడ్ రీమేక్లో విక్రమ్..? | Vikram in Dont Breathe remake | Sakshi
Sakshi News home page

హాలీవుడ్ రీమేక్లో విక్రమ్..?

Published Tue, Oct 4 2016 1:50 PM | Last Updated on Fri, Sep 28 2018 7:36 PM

హాలీవుడ్ రీమేక్లో విక్రమ్..? - Sakshi

హాలీవుడ్ రీమేక్లో విక్రమ్..?

హిట్, ఫ్లాప్లతో సంబందం లేకుండా వరుసగా ప్రయోగాత్మక చిత్రాలు చేస్తున్న తమిళ స్టార్ హీరో విక్రమ్. ఐ సినిమా తరువాత చాలా కాలం పాటు సక్సెస్కు దూరమైన ఈ విలక్షణ నటుడు ఇటీవల ఇరుముగన్ సినిమాతో మంచి సక్సెస్ సాధించాడు. ఈ సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి విక్రమ్ స్టామినాను ప్రూవ్ చేసింది.

అదే జోష్లో ఇప్పుడు మరిన్ని ప్రయోగాలకు రెడీ అవుతున్నాడు విక్రమ్. ప్రస్తుతం సామి సీక్వల్గా తెరకెక్కుతున్న సామి 2లో నటిస్తున్న విక్రమ్, ఓ హాలీవుడ్ సినిమాను రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు. ఇటీవల హాలీవుడ్లో రిలీజ్ అయిన హారర్ సినిమా డోంట్ బ్రీత్ను విక్రమ్ రీమేక్ చేయాలనుకుంటున్నాడట. ఈ సినిమాలో స్టీఫెన్ లాంగ్ చేసిన అంధుడి పాత్రలో నటించేందుకు విక్రమ్ ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాపై త్వరలోనే క్లారిటీ రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement