నయనకు టెన్షన్ ఎందుకో? | Nayanthara, Sivakarthikeyan team up for new Tamil film | Sakshi
Sakshi News home page

నయనకు టెన్షన్ ఎందుకో?

Published Thu, Apr 14 2016 2:35 AM | Last Updated on Sun, Sep 3 2017 9:51 PM

నయనకు టెన్షన్ ఎందుకో?

నయనకు టెన్షన్ ఎందుకో?

మనిషన్నాక ఎప్పుడోకప్పుడు, ఏదోక సందర్భంలో టెన్షన్ వస్తుంది. అది సహజం కూడా. అలాంటిది నయనతారకు టెన్షన్ రావడంలో ఆశ్చర్యమేముంది. అయితే ఈ ముద్దుగుమ్మ ఎక్కువగా టెన్షన్ అయ్యేది ఎప్పుడన్నది తెలుసుకోవాలనుందా’అయితే చూద్దాం రండి. ప్రస్తుతం కోలీవుడ్‌లో టాప్ రేంజ్‌లో వెలిగిపోతున్న టాప్‌మోస్ట్ హీరోయిన్ ఆ కేరళ బ్యూటీ. వరుస విజయాలతో మంచి జోష్‌లో ఉన్న నయనతార నటించిన ఇదునమ్మఆళు, తిరునాళ్ చిత్రాలు చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం కార్తీతో కాష్మోరా, విక్రమ్‌కు జంటగా ఇరుముగన్ చిత్రాల్లో నటిస్తున్నారు.

తరువాత దాస్ రామస్వామి దర్శకత్వంలో టిక్.టిక్.టిక్ చిత్రంతో పాటు మోహన్‌రాజా దర్శకత్వంలో శివకార్తికేయన్ సరసన నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇంకా తన ప్రియుడిగా ప్రచారంలో ఉన్న విఘ్నేశ్‌శివ చిత్రం తదితర అరడజను పైగా చిత్రాలతో బిజీగా ఉన్న నయనతారకో పాలసీ ఉంది. చిత్రం తరువాత చిత్రం చేసుకుంటూ పోతారు. అలాగే ఒక చిత్రం పూర్తి చేసిన తరువాత ఒకటి రెండు వారాలు నటనకు దూరంగా ఉంటారట.

అ రోజుల్ని విదేశాలకు వెళ్లి అక్కడ ఉన్న తన బంధువులు,స్నేహితురాళ్లతో జాలీగా గడిపేస్తారట.ఆ సమయంలో చిత్రపరిశ్రమకు సంబంధించిన ఎవరైనా చిత్ర ఆడియో ఆవిష్కరణలు, ఇతర ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తే యమ టెన్షన్ అయిపోతారట. విరామ సమయాలల్లో కూడా సంతోషంగా గడపనీయరా?అంటూ ఫైర్ అవుతారట.అందుకే మరి నయనా మజాకా అంటుంటారు కోలీవుడ్ వర్గాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement