సియాన్ తో ఆదితిరావ్‌ రొమాన్స్ | aditi rao ready to romance with vikram | Sakshi
Sakshi News home page

సియాన్ తో ఆదితిరావ్‌ రొమాన్స్

Published Tue, Jan 10 2017 1:37 AM | Last Updated on Tue, Sep 5 2017 12:49 AM

సియాన్ తో ఆదితిరావ్‌  రొమాన్స్

సియాన్ తో ఆదితిరావ్‌ రొమాన్స్

సియాన్  విక్రమ్‌తో బాలీవుడ్‌ భామ ఆదితిరావ్‌ రొమాన్స్ కు సిద్ధం అవుతున్నారు. ఇరుముగన్  చిత్రం విజయాన్ని ఎంజాయ్‌ చేస్తున్న నటుడు విక్రమ్‌ తదుపరి చిత్రానికి చిన్న గ్యాప్‌ తీసుకున్నారు. అయితే ప్రస్తుతం ఈయన చేతిలో రెండు చిత్రాలు ఉన్నాయి. అందులో ఒకటి గౌతమ్‌ మీనన్  దర్శకత్వంలో నటించనున్న చిత్రం. ఈ చిత్రం షూటింగ్‌ విషయంలోనే కాస్త జాప్యం జరిగిందనే ప్రచారం జరుగుతోంది. గౌతమ్‌మీనన్, విక్రమ్‌ కాంబినేషన్  లో తెరకెక్కనున్న ఈ తొలి చిత్రానికి ధ్రువనక్షత్రం అనే పేరును ఖరారు చేశారు. నిజానికి ఈ చిత్ర కథను గౌతమ్‌మీనన్ నటుడు అజిత్‌ కోసం తయారు చేశారట. ఆయనతో చిత్రం సెట్‌ కాకపోవడంతో ఆ కథను సూర్య కథానాయకుడిగా చిత్రం చేయడానికి చాలా కాలం క్రితమే సన్నాహాలు జరిగాయి.

అలాంటిది సూర్యకు కథ నచ్చక పోవడంతో ఆయన చిత్రం నుంచి వైదొలిగారు.ఈ వ్యవహారంలో గౌతమ్‌మీనన్ కు, సూర్యకు మధ్య విభేదాలు తలెత్తాయన్నది గమనార్హం. తాజాగా అదే కథలో నటుడు విక్రమ్‌ హీరోగా నటించనున్నారు. ఇక ఇందులో హీరోయిన్ గా నటి నయనతారను నటింపజేసే ప్రయత్నాలు జరిగాయని, ఆ అమ్మడు డిమాండ్‌ చేసిన పారితోషికానికి దర్శకుడు గౌతమ్‌మీనన్  కళ్లు బైర్లు కమ్మాయని వార్తలు వెబ్‌సైట్లలో హల్‌చల్‌ చేశారు. విక్రమ్‌కు జంటగా బాలీవుడ్‌ బ్యూటీ ఆదితిరావ్‌ను ఎంపిక చేసినట్లు తెలిసింది. ఈ అమ్మడు ఇప్పటికే మణిరత్నం దర్శకత్వంలో కార్తీకి జంటగా కాట్రు వెలియిడై చిత్రంలో నటిస్తున్నారన్నది గమనార్హం. ఏఆర్‌.రెహ్మాన్  సంగీతాన్ని అందించనున్న ధ్రువనక్షత్రం చిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను సోమవారం విడుదల చేశారు.

ఇందులో సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ లుక్‌లో విక్రమ్‌ గెటప్‌ ఆయన అభిమానుల్ని యమ ఖుషీ చేస్తోంది. ఇక చిత్ర షూటింగ్‌ త్వరలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. విక్రమ్‌ ఈ చిత్రం చేస్తూనే విజయ్‌చందర్‌ దర్శకత్వంలో మరో చిత్రం చేయనున్నారన్నది గమనార్హం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement