భారీ వసూళ్లతో ఇరుముగన్ | Iru Mugan: science of the times | Sakshi
Sakshi News home page

భారీ వసూళ్లతో ఇరుముగన్

Published Sat, Sep 10 2016 1:18 AM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM

భారీ వసూళ్లతో ఇరుముగన్

భారీ వసూళ్లతో ఇరుముగన్

ఇరుముగన్ చిత్రం మంచి టాక్‌ను సంపాదించుకోవడంతో పాటు భారీ వసూళ్లను రాబట్టుకుంటోంది. విక్రమ్ నటించిన తాజా చిత్రం ఇరుముగన్. ఈయనతో అగ్రనాయకి నయనతార తొలిసారిగా జత కట్టిన ఈ చిత్రంలో నిత్యామీనన్ మరో నాయకిగా నటించారు. నాజర్, తంబిరామయ్య, కరుణాకరన్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఇంతకు ముందు అరిమానంబి వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన ఆనంద్‌శంకర్ దర్శకత్వం వహించారు. తమీన్స్ ఫిలింస్ పతాకంపై శిబుతమీన్ నిర్మించిన ఈ భారీ చిత్రంలో విక్రమ్ కథానాయకుడిగా, ప్రతికథానాయకుడిగా నటించడం విశేషం. హారీష్ జయరాజ్ సంగీతాన్ని అందించారు.
 
  స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఇరుముగన్‌పై నిర్మాణ దశలోనే మంచి అంచనాలు నెలకొన్నాయి. గురువారం ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణను పొందుతోంది. విక్రమ్, నయనతార కలయికలో రూపొందిన తొలి చిత్రం అన్న క్రేజ్, విక్రమ్ విలన్‌గా నటించారన్న ఆసక్తి చిత్రానికి చాలా ఆకర్షణగా మారాయి. ఇరుముగన్ చిత్రంలో విక్రమ్ పోషించిన లవ్ అనే విలన్ గెటప్ చాలా కొత్తగా ఉంది. గత చిత్రం 10 ఎండ్రదుక్కుళ్ చిత్రంతో చాలా నిరాశను చవిచూసిన విక్రమ్ ఈ చిత్రం నూతనోత్సాహాన్నిచిందని చెప్పవచ్చు. సాధారణంగా కొత్త చిత్రాలు శుక్రవారం రోజున విడుదలవుతుంటాయి.
 
 అలాంటిది ఎలాంటి సెలవు దినం కాకపోయినా ఇరుముగన్ చిత్రం గురువారం విడుదలై భారీ వసూళ్లను రాబట్టుకుంటోంది. ఈ చిత్రం తొలి రోజునే తమిళనాడులో ఐదు కోట్లు వసూల్ చేసిందని సినీ వర్గాలు గణాంకాలు చెబుతున్నాయి. చెన్నైలో మాత్రమే 58.73 ల క్షలు వసూలు చేసిందని సమాచారం. అదే విధంగా సెంగల్‌పట్టులో కోటీ 20 లక్షలు, కోయంబత్తూర్‌లో 80 లక్షలు అంటూ మంచి వసూళ్లను రాబట్టిందని సినీవర్గాలు చెబుతున్నారు. మరో విషయం ఏమిటంటే పెద్ద చిత్రాలేమీ లేక పోవడంతో వారాంతర రోజుల్లోనూ ఇరుముగన్ వసూళ్ల వేట కొనసాగుతుందంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement