మెగాఫోన్ పట్టనున్న అపరిచితుడు | hero Vikram takes up direction | Sakshi
Sakshi News home page

మెగాఫోన్ పట్టనున్న అపరిచితుడు

Published Wed, Aug 17 2016 10:43 AM | Last Updated on Mon, Sep 4 2017 9:41 AM

మెగాఫోన్ పట్టనున్న అపరిచితుడు

మెగాఫోన్ పట్టనున్న అపరిచితుడు

సౌత్ ఇండస్ట్రీలో ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన హీరో విక్రమ్. సినిమా కోసం ఎలాంటి రిస్క్ చేయడానికైనా రెడీగా ఉండే విక్రమ్.. ఇప్పుడు మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే హీరోగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ స్టార్ హీరో, త్వరలో మెగాఫోన్ పట్టాలని నిర్ణయించుకున్నాడు. ఇటీవల చెన్నై వరదల నేపథ్యంలో ఓ షార్ట్ ఫిలింకు దర్శకత్వం వహించిన విక్రమ్ త్వరలోనే పూర్తి స్థాయి సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు.

దర్శకత్వ బాధ్యతలు తీసుకోవాలని నిర్ణయించుకున్న విక్రమ్ ప్రస్తుతం ఇతర విభాగాల మీద పట్టు సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నాడు. అందుకే షూటింగ్ సమయంలో తన షాట్ అయిపోయినా.. కెమరా, లైటింగ్ లాంటి విషయాల మీద అవగాహన కోసం సెట్స్లో ఉంటున్నాడు. అంతేకాదు తాను దర్శకత్వం వహించబోయే సినిమాలో తాను మాత్రం హీరోగా నటించకూడదని నిర్ణయించుకున్నాడు.

ప్రస్తుతం విక్రమ్ హీరోగా తెరకెక్కిన ఇరుముగన్ సినిమా రిలీజ్కు రెడీ అవుతోంది. ఈ సినిమాను తెలుగులో ఇంకొకడు పేరుతో రిలీజ్ చేస్తున్నారు. విక్రమ్ హీరోగా, విలన్గా ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో నయనతార, నిత్యామీనన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement