తిరుపతి(మంగళం), న్యూస్‌లైన్: ‘ఫ్యాను గుర్తుకు ఓటెయ్యండి.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందించే సంక్షేమ ఫలాలతో అభివృద్ధి చెందండి’ అంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్, సినీ నటుడు టీఎస్. విజయ్‌చందర్ విజ్ఞప్తి చేశారు. తిరుపతి పరిధిలోని చంద్రశేఖర్‌రెడ్డి కాలనీలో వైఎస్‌ఆర్ సీపీ నాయకుడు పోతిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ప్రజాబాట నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయ్‌చందర్ మాట్లాడుతూ వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కాగానే అందించే సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజలూ అభివృద్ధి చెందుతారన్నారు. టీటీడీ చైర్మన్‌గా ఉండి శ్రీవారి పవిత్రతను ప్రపంచ దేశాలకు చాటిచెప్పిన మహోన్నత వ్యక్తి భూమన కరుణాకరరెడ్డి అని కొనియాడారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముస్లిం, మైనార్టీలను ఊచకోత కోసిన నరహంతకుడు నరేంద్రమోడి అని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు గెలుపుకోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్నారన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు నరేంద్రమోడి ఎలా చెబితే అలా ఆడే గంగిరెద్దులా మారతాడని, దీంతో ముస్లిం, మైనార్టీలకు పూర్తిగా రక్షణ లేకుండా పోతుందన్నారు. మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కుమ్మక్కు రాజకీయాలతో కిరణ్, చంద్రబాబు నీరుగార్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
తండ్రి ఆశయాల కోసం నిరంతరం పాటుపడుతున్న వ్యక్తి ఒక్క వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనన్నారు. ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం పాటు పడే జగనన్న నాయకత్వం కావాలా? లేదా అధికారం కోసం ఉత్తుత్తి హామీలు ఇచ్చి వంచించే చంద్రబాబునాయుడు కావాలా అన్న విషయాన్ని ఒక్కసారి ప్రజలు ఆలోచించుకుని ఓటేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రచార కమిటీ సహాయ కో-ఆర్డినేటర్ జొన్నల శ్రీనివాసులురెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, దొడ్డారెడ్డి సిద్దారెడ్డి, ఎస్‌కె. బాబు, కొమ్ము చెంచయ్యయాదవ్, నీలకంఠారెడ్డి, హర్షవర్ధన్, కేతం జయచంద్రారెడ్డి, పుల్లయ్య, అమరనాథరెడ్డి, రామచంద్రారెడ్డి, పాముల రమేష్‌రెడ్డి, ఎస్‌కె.చోటా, తాల్లూరి ప్రసాద్, చింతా రమేష్‌యాదవ్, లోకేష్‌బాబు, రఫీ, కొండారెడ్డి, రవిచంద్ర, గఫూర్, గీతాయాదవ్, పుణీత, శాంతారెడ్డి, మల్లికమ్మ తదితరులు పాల్గొన్నారు.
అందరికీ ‘సంక్షేమం’ జగన్‌తోనే సాధ్యం
Published Tue, Apr 8 2014 2:14 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
Advertisement
Advertisement