జగన్‌తోనే బీసీల సంక్షేమం | Jagan petition Welfare | Sakshi
Sakshi News home page

జగన్‌తోనే బీసీల సంక్షేమం

Published Mon, Apr 14 2014 4:46 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM

జగన్‌తోనే బీసీల సంక్షేమం - Sakshi

జగన్‌తోనే బీసీల సంక్షేమం

  •     మైనారిటీలను బీసీల్లో చేర్చింది వైఎస్‌ఆర్
  •      వైఎస్‌ఆర్ సీపీలోనే బీసీలకు పెద్దపీట
  •      టీటీడీ చైర్మన్‌గా బలహీనవర్గాలఅభివృద్ధికి కృషిచేశా
  •      నాయీబ్రాహ్మణ మహిళలను క్షురకులుగా నియమించా
  •      తిరుమల గొల్ల మండపం సంరక్షణకు అన్ని చర్యలు
  •      ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి
  •  తిరుపతి(మంగళం), న్యూస్‌లైన్: బీసీలకు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేయడం జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే సాధ్యమని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. జననేతను సీఎంగా చేసేందుకు బీసీలంతా వైఎస్‌ఆర్ సీపీకి మద్దతు ఇచ్చి ఓట్లేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. తిరుమల బైపాస్‌రోడ్డులోని ఓ ప్రరుువేటు కల్యాణ మండపంలో ఆదివారం బీసీ నాయకుడు కట్టా జయరాంయాదవ్ ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ భేరి కార్యక్రమాన్నినిర్వహించారు.

    ఈ సమావేశానికి నగర పరిధిలోని అన్ని బీసీ వర్గాల నాయకులు, ప్రజలు వేలాదిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి మాట్లాడుతూ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో బీసీల అభివృద్ధికి ఎంతగా కృషి చేశారో ప్రతి ఒక్కరికి తెలుసునన్నారు. బీసీల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రతి పేదవాడికి లబ్ధి చేకూర్చారని గుర్తు చేశారు. ప్రపంచంలో ఏ నాయకుడు చేయలేని విధంగా పేదల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించిన మహోన్నతి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం రాజశేఖరరెడ్డి మాత్రమేనన్నారు.  

    మహానేత మరణానంతరం సంక్షేమ పథకాలను నీరుగార్చిన దుర్మార్గులు కిరణ్, చంద్రబాబులని మండిపడ్డారు. ఓదార్పుయాత్రను ప్రారంభిస్తే అందుకు అడ్డుతగిలిన రాక్షసి సోనియాగాంధీ అన్నారు. అప్పట్లో మూడున్నర నెలల రాజకీయ అనుభం కూడా లేని జగన్‌మోహన్‌రెడ్డి 125 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీతోపాటు సోనియాగాంధీ ఆదేశాలను సైతం ధిక్కరించి మృతుల కుటుంబాలను పరామర్శించి, వారి కష్టాలను తెలుసుకున్న దమ్మున్న నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.
     
    బీసీలకు పెద్దపీట
     
    జగనన్న పాలనలో బీసీలకు పెద్దపీట వేస్తారని, వారి సంక్షేమానికి  మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతారని తెలిపారు. టీటీడీ చైర్మన్‌గా మహిళా క్షురకులను నియమించిన ఘనత తనకే దక్కుతుందన్నారు. 320 మందిని పీస్‌రేట్ లెక్కన కల్యాణకట్టలో నాయీ బ్రాహ్మణ యువకులకు ఉద్యోగాలు కల్పించానన్నారు. మత్స్యకార గోవిందం, దళితగోవిందం వంటి కార్యక్రమాలు ప్రవేశపెట్టి బలహీనవర్గాలకు వేంకటేశ్వరస్వామి పూజలను దగ్గర చేశానన్నారు.

    తాను చైర్మన్‌గా ఉండగా గొల్లమండపం కొట్టాలని ప్రతిపాదన వస్తే అడ్డుకుని, దాని సంరక్షణకు చర్యలు చేపట్టామన్నారు. భవిష్యత్‌లో కూడా తిరుమలలోని గొల్లమండపం సంరక్షణకు ఎంతవరకైనా పోరాటం చేస్తానన్నారు. బీసీలు వైఎస్‌ఆర్ సీపీకి మద్దతు ప్రకటిస్తూ, ఫ్యాను గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేయాలని పిలుపునిచ్చారు. ఎంపీ అభ్యర్థి వరప్రసాద్‌రావును  గెలిపిం చాలని అభ్యర్థించారు. అనంతరం ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ మాట్లాడుతూ చింతామోహన్‌లాగా ఇళ్లస్థలాలు, పట్టాలు ఇస్తానని మహిళలకు మాయమాటలు చెప్పి మోసం చేయనన్నారు.

    ఒక ఐఏఎస్ అధికారిగా తనకు ఉన్న అపార అనుభవాన్ని ఉపయోగించి భూమన కరుణాకరరెడ్డి సహకారంతో తిరుపతి నగరాన్ని ఒక సాంస్కృతిక రాజధానిగా చేస్తానన్నారు. వైఎస్‌ఆర్ సీపీ నాయకులు మబ్బు చెంగారెడ్డి మాట్లాడుతూ గతంలో గంగమ్మగుడి చైర్మన్ పదవికి కట్టా జయరాంయాదవ్ పేరు ప్రతిపాదించి బీసీలకు ప్రాధాన్యత ఇచ్చింది కరుణాకరరెడ్డి అని గుర్తు చేశారు. తొలినుంచి బీసీలు, ఎస్సీలు, ఎస్టీల పక్షపాతిగా పనిచేస్తున్న నాయకుడు, నీతి, నిజాయితీతో ముందుకెళ్తున్న వ్యక్తి కరుణాకరరెడ్డి అని పేర్కొన్నారు.

    వందమంది బీసీ యువకులు కరుణాకరరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. బీసీ నాయకులు ఎస్‌కే బాబు, షఫీఅహ్మద్ ఖాద్రీ,  పుల్లయ్య, కొమ్ము చెంచయ్యయాదవ్, సాకం ప్రభాకర్, పెంచలయ్య, పార్టీ నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, పోతిరెడ్డి వెంకటరెడ్డి, లక్ష్మయ్యయాదవ్, ముద్రనారాయణ, బాబూయాదవ్, బొమ్మగుంట రవి, కన్నయ్య, శివాచారి, గీతాయాదవ్, రత్నమ్మ, రమణమ్మ, లత, లక్ష్మి, పద్మావతమ్మ, అనురాధ పాల్గొన్నారు. వడ్డెర, మొదలియార్, నాయీబ్రాహ్మణ, యాదవ, బోయ, గౌడ, గాండ్ల వంటి 23 బీసీ కులాలకు చెందిన నాయకులు హాజరయ్యూరు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement