Karunakarareddi
-
యువకుల్లో ఆధ్యాత్మిక చైతన్యం
ఉచితంగా వినాయక విగ్రహాలను పంపిణీ చేసిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చెవిరెడ్డి ప్రయత్నం అద్భుతం కరుణాకర రెడ్డి ప్రశంస తిరుపతి : ‘‘తనకున్న భక్తిని పదిమందికి పంచుతూ గ్రామాల్లో మరింతగా ఆధ్యాత్మిక విలువలు పెంపొందించేదుకు నా తమ్ముడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చేపట్టిన వినాయక విగ్రహాల ఉచిత పంపిణీ కార్యక్రమం అద్భుతమైంది’’ అని తిరుపతి మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి అన్నారు. వినాయక చవితిని పురస్కరించుకుని ప్రతి ఏడాది ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చంద్రగిరి నియోజకవర్గంలోని గ్రామాలకు ఉచితంగా వినాయక విగ్రహాలను అందిస్తుంటారు. ఇందులో భాగంగా బుధవారం చేపట్టిన వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని భూమన కరుణాకరరెడ్డి పూజచేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకుల్లో ఆధ్యాత్మిక చైతన్యం, ఐక్యతను పెంచేందుకు చెవిరెడ్డి చేపట్టిన ఉచిత విగ్రహాల పంపిణీ కార్యక్రమం చాలా మంచిదని కొనియాడారు. గ్రామాల్లో విలువలు, ఆధ్యాత్మిక చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం వినాయక విగ్రహాల పంపిణీ ద్వారా చేస్తున్నారన్నారు. ప్రతి ఏడాదీ కొనసాగుతుంది : చెవిరెడ్డి యువకులు ఐకమత్యంగా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే వినాయక చవితిని పురస్కరించుకుని ప్రతి ఏడాదీ వినాయక విగ్రహాలను ఉచితంగా అందిస్తానని చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు. గత ఏడాది 680 విగ్రహాలు ఇచ్చానన్నారు. ఈ ఏడాది విగ్రహాలకు రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరిగిందన్నారు. యువకుల్లో ఆధ్యాత్మిక చైతన్యం పెంచేందుకోసం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టానన్నారు. కష్టపడేతత్వం, ఆధ్యాత్మిక లక్షణాలు ఉంటే ఏధైనా సాధించవచ్చన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల గ్రామాలకు 20 లక్షల రూపాయల ఖర్చుతో 720 విగ్రహాలు ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఉపేంద్రరెడ్డి, కొటాల చంద్రశేఖర్‌రెడ్డి, పొట్టేలు మునస్వామి, చిన్నీయాదవ్, శ్రీరాములు, నంగా బాబురెడ్డి, భాను పాల్గొన్నారు. -
కరుణాకరరెడ్డిపై టీడీపీ అభ్యర్థి దాడి
తిరుపతిలో పోలింగ్ రోజూ టీడీపీ వారి దాష్టీకం కొనసాగింది. ప్రచార పర్వంలో డబ్బు, మద్యంతో వీరు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు ప్రయత్నించడం తెలిసిందే. పోలింగ్ రోజు ఏకంగా బూత్‌ల వద్ద వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. దీంతో ఇరు పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులూ అక్కడకు చేరుకున్నారు. నేతల మధ్య వాగ్వాదం జరగడంతో కరుణాకరరెడ్డిపై వెంకటరమణ చేయి చేసుకున్నారు. పోలీసులు అభ్యర్థులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు. తిరుపతి(మంగళం), న్యూస్‌లైన్: తిరుపతి ఎమ్మెల్యే స్థానానికి వైఎస్ఆర్ సీపీ తరఫున పోటీ చేస్తున్న భూమన కరుణాకరరెడ్డిపై బుధవారం టీడీపీ అభ్యర్థి వెంకటరమణ చేయి చేసుకున్నారు. దీంతో రాజీవనగర్ పంచాయతీ జీవకోనలో ఉద్రిక్తత నెలకొంది. వివరాలిలా.. బుధవారం ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఓటింగ్ సరళి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉండటంతో టీడీపీ వారు అసహనానికి గురయ్యారు. దీంతో పోలింగ్ బూత్‌ల వద్ద హల్చల్ చేయడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో తిరుపతి సత్యనారాయణపురంలోని ప్రాథమికపాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ నాయకులను వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ప్రశ్నించారు. దీంతో ఒక్కసారిగా వారంతా వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై దాడికి దిగారు. ఈ దాడిలో ఇద్దరు వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అభ్యర్థులు భూమన కరుణాకరరెడ్డి, ఎం.వెంకటరమణ అక్కడికి చేరుకున్నారు. ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గుమికూడారు. దీంతో నేతల మధ్య కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం టీడీపీ అభ్యర్థి ఎం. వెంకటరమణ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ తన వెంట పదిమందిని తీసుకుని పోలింగ్ కేంద్రంలోకి వెళ్లారు. కార్యకర్తలను పోలింగ్ కేంద్రంలోకి తీసుకురావడంపై కరుణాకరరెడ్డి ప్రశ్నించారు. పోలీసులు కూడా స్పందించి వెంకటరమణకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అనంతరం రాజీవ్‌నగర్ పంచాయతీ జీవకోనలోని గురుకృప పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి అభ్యర్థులు ఇద్దరూ వేర్వేరుగా వెళ్లారు. లోపల దాదాపు 30 నిమిషాలు పాటు ఇరువురు అభ్యర్థులు పోలింగ్‌ను పరిశీలించారు. అదే సమయంలో ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున బయట గుమికూడారు. సత్యనారాయణపురంలో తమ కార్యకర్తలపై దాడి ఎలా చేయిస్తారంటూ స్థానిక టీడీపీ నాయకులు అన్నా రామచంద్రయ్య, అన్నా రామకృష్ణను వైఎస్ఆర్ సీపీ నాయకులు మబ్బు చెంగారెడ్డి, పెంచలయ్య ప్రశ్నించారు. తాము దాడి చేయలేదని, ఎవరని ప్రశ్నించగా వారు పారిపోయారంటూ టీడీపీ నేతలు సమాధానం చెప్పారు. ఈ వ్యవహారంపై మాటామాటా పెరిగి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి తీవ్ర స్థాయిలో వాగ్వాదాలకు దిగారు. ఒక దశలో ఘర్షణకు దిగారు. పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. ఈ విషయం తెలిసి వెంకటరమణను కరుణాకరరెడ్డి నిలదీశారు. ఇలా దాడులు చేయడం తగదన్నారు. దీంతో ఆగ్రహానికి గురైన ఆయన కరుణాకరరెడ్డిపై చేయి చేసుకున్నారు. అభ్యర్థులు ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేసి ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లారు. రెండుపార్టీల కార్యకర్తలు తిరుపతి ఎస్పీ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. పరస్పరం వ్యతిరేకంగా నినాదాలు చేసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు జాగ్రత్తగా వ్యవ హరించారు. చివరకు ఇద్దరినీ విడుదల చేశారు. -
జగన్‌తోనే బీసీల సంక్షేమం
మైనారిటీలను బీసీల్లో చేర్చింది వైఎస్ఆర్ వైఎస్ఆర్ సీపీలోనే బీసీలకు పెద్దపీట టీటీడీ చైర్మన్‌గా బలహీనవర్గాలఅభివృద్ధికి కృషిచేశా నాయీబ్రాహ్మణ మహిళలను క్షురకులుగా నియమించా తిరుమల గొల్ల మండపం సంరక్షణకు అన్ని చర్యలు ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తిరుపతి(మంగళం), న్యూస్‌లైన్: బీసీలకు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేయడం జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డికే సాధ్యమని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. జననేతను సీఎంగా చేసేందుకు బీసీలంతా వైఎస్ఆర్ సీపీకి మద్దతు ఇచ్చి ఓట్లేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. తిరుమల బైపాస్‌రోడ్డులోని ఓ ప్రరుువేటు కల్యాణ మండపంలో ఆదివారం బీసీ నాయకుడు కట్టా జయరాంయాదవ్ ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ భేరి కార్యక్రమాన్నినిర్వహించారు. ఈ సమావేశానికి నగర పరిధిలోని అన్ని బీసీ వర్గాల నాయకులు, ప్రజలు వేలాదిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి మాట్లాడుతూ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో బీసీల అభివృద్ధికి ఎంతగా కృషి చేశారో ప్రతి ఒక్కరికి తెలుసునన్నారు. బీసీల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రతి పేదవాడికి లబ్ధి చేకూర్చారని గుర్తు చేశారు. ప్రపంచంలో ఏ నాయకుడు చేయలేని విధంగా పేదల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించిన మహోన్నతి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం రాజశేఖరరెడ్డి మాత్రమేనన్నారు. మహానేత మరణానంతరం సంక్షేమ పథకాలను నీరుగార్చిన దుర్మార్గులు కిరణ్, చంద్రబాబులని మండిపడ్డారు. ఓదార్పుయాత్రను ప్రారంభిస్తే అందుకు అడ్డుతగిలిన రాక్షసి సోనియాగాంధీ అన్నారు. అప్పట్లో మూడున్నర నెలల రాజకీయ అనుభం కూడా లేని జగన్మోహన్రెడ్డి 125 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీతోపాటు సోనియాగాంధీ ఆదేశాలను సైతం ధిక్కరించి మృతుల కుటుంబాలను పరామర్శించి, వారి కష్టాలను తెలుసుకున్న దమ్మున్న నాయకుడు జగన్మోహన్రెడ్డి అన్నారు. బీసీలకు పెద్దపీట జగనన్న పాలనలో బీసీలకు పెద్దపీట వేస్తారని, వారి సంక్షేమానికి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతారని తెలిపారు. టీటీడీ చైర్మన్‌గా మహిళా క్షురకులను నియమించిన ఘనత తనకే దక్కుతుందన్నారు. 320 మందిని పీస్‌రేట్ లెక్కన కల్యాణకట్టలో నాయీ బ్రాహ్మణ యువకులకు ఉద్యోగాలు కల్పించానన్నారు. మత్స్యకార గోవిందం, దళితగోవిందం వంటి కార్యక్రమాలు ప్రవేశపెట్టి బలహీనవర్గాలకు వేంకటేశ్వరస్వామి పూజలను దగ్గర చేశానన్నారు. తాను చైర్మన్‌గా ఉండగా గొల్లమండపం కొట్టాలని ప్రతిపాదన వస్తే అడ్డుకుని, దాని సంరక్షణకు చర్యలు చేపట్టామన్నారు. భవిష్యత్‌లో కూడా తిరుమలలోని గొల్లమండపం సంరక్షణకు ఎంతవరకైనా పోరాటం చేస్తానన్నారు. బీసీలు వైఎస్ఆర్ సీపీకి మద్దతు ప్రకటిస్తూ, ఫ్యాను గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని, వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం చేయాలని పిలుపునిచ్చారు. ఎంపీ అభ్యర్థి వరప్రసాద్రావును గెలిపిం చాలని అభ్యర్థించారు. అనంతరం ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ మాట్లాడుతూ చింతామోహన్‌లాగా ఇళ్లస్థలాలు, పట్టాలు ఇస్తానని మహిళలకు మాయమాటలు చెప్పి మోసం చేయనన్నారు. ఒక ఐఏఎస్ అధికారిగా తనకు ఉన్న అపార అనుభవాన్ని ఉపయోగించి భూమన కరుణాకరరెడ్డి సహకారంతో తిరుపతి నగరాన్ని ఒక సాంస్కృతిక రాజధానిగా చేస్తానన్నారు. వైఎస్ఆర్ సీపీ నాయకులు మబ్బు చెంగారెడ్డి మాట్లాడుతూ గతంలో గంగమ్మగుడి చైర్మన్ పదవికి కట్టా జయరాంయాదవ్ పేరు ప్రతిపాదించి బీసీలకు ప్రాధాన్యత ఇచ్చింది కరుణాకరరెడ్డి అని గుర్తు చేశారు. తొలినుంచి బీసీలు, ఎస్సీలు, ఎస్టీల పక్షపాతిగా పనిచేస్తున్న నాయకుడు, నీతి, నిజాయితీతో ముందుకెళ్తున్న వ్యక్తి కరుణాకరరెడ్డి అని పేర్కొన్నారు. వందమంది బీసీ యువకులు కరుణాకరరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. బీసీ నాయకులు ఎస్కే బాబు, షఫీఅహ్మద్ ఖాద్రీ, పుల్లయ్య, కొమ్ము చెంచయ్యయాదవ్, సాకం ప్రభాకర్, పెంచలయ్య, పార్టీ నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, పోతిరెడ్డి వెంకటరెడ్డి, లక్ష్మయ్యయాదవ్, ముద్రనారాయణ, బాబూయాదవ్, బొమ్మగుంట రవి, కన్నయ్య, శివాచారి, గీతాయాదవ్, రత్నమ్మ, రమణమ్మ, లత, లక్ష్మి, పద్మావతమ్మ, అనురాధ పాల్గొన్నారు. వడ్డెర, మొదలియార్, నాయీబ్రాహ్మణ, యాదవ, బోయ, గౌడ, గాండ్ల వంటి 23 బీసీ కులాలకు చెందిన నాయకులు హాజరయ్యూరు. -
అందరికీ ‘సంక్షేమం’ జగన్‌తోనే సాధ్యం
తిరుపతి(మంగళం), న్యూస్‌లైన్: ‘ఫ్యాను గుర్తుకు ఓటెయ్యండి.. వైఎస్ జగన్మోహన్రెడ్డి అందించే సంక్షేమ ఫలాలతో అభివృద్ధి చెందండి’ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్, సినీ నటుడు టీఎస్. విజయ్‌చందర్ విజ్ఞప్తి చేశారు. తిరుపతి పరిధిలోని చంద్రశేఖర్‌రెడ్డి కాలనీలో వైఎస్ఆర్ సీపీ నాయకుడు పోతిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ప్రజాబాట నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయ్‌చందర్ మాట్లాడుతూ వైఎస్.జగన్మోహన్రెడ్డి సీఎం కాగానే అందించే సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజలూ అభివృద్ధి చెందుతారన్నారు. టీటీడీ చైర్మన్‌గా ఉండి శ్రీవారి పవిత్రతను ప్రపంచ దేశాలకు చాటిచెప్పిన మహోన్నత వ్యక్తి భూమన కరుణాకరరెడ్డి అని కొనియాడారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముస్లిం, మైనార్టీలను ఊచకోత కోసిన నరహంతకుడు నరేంద్రమోడి అని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు గెలుపుకోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్నారన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు నరేంద్రమోడి ఎలా చెబితే అలా ఆడే గంగిరెద్దులా మారతాడని, దీంతో ముస్లిం, మైనార్టీలకు పూర్తిగా రక్షణ లేకుండా పోతుందన్నారు. మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కుమ్మక్కు రాజకీయాలతో కిరణ్, చంద్రబాబు నీరుగార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రి ఆశయాల కోసం నిరంతరం పాటుపడుతున్న వ్యక్తి ఒక్క వైఎస్. జగన్మోహన్రెడ్డి మాత్రమేనన్నారు. ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం పాటు పడే జగనన్న నాయకత్వం కావాలా? లేదా అధికారం కోసం ఉత్తుత్తి హామీలు ఇచ్చి వంచించే చంద్రబాబునాయుడు కావాలా అన్న విషయాన్ని ఒక్కసారి ప్రజలు ఆలోచించుకుని ఓటేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రచార కమిటీ సహాయ కో-ఆర్డినేటర్ జొన్నల శ్రీనివాసులురెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, దొడ్డారెడ్డి సిద్దారెడ్డి, ఎస్కె. బాబు, కొమ్ము చెంచయ్యయాదవ్, నీలకంఠారెడ్డి, హర్షవర్ధన్, కేతం జయచంద్రారెడ్డి, పుల్లయ్య, అమరనాథరెడ్డి, రామచంద్రారెడ్డి, పాముల రమేష్‌రెడ్డి, ఎస్కె.చోటా, తాల్లూరి ప్రసాద్, చింతా రమేష్‌యాదవ్, లోకేష్‌బాబు, రఫీ, కొండారెడ్డి, రవిచంద్ర, గఫూర్, గీతాయాదవ్, పుణీత, శాంతారెడ్డి, మల్లికమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ఇంకెన్నాళ్లు మోసగిస్తారు..?
చంద్రబాబు మాయమాటలు ప్రజలు నమ్మరు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తిరుపతి (మంగళం), న్యూస్‌లైన్ : మామను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు అవిచేస్తా, ఇవి చేస్తానంటూ ఇంకెన్నాళ్లు మోసగిస్తావంటూ చంద్రబాబుపై తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ధ్వజమెత్తారు. తిరుపతి పరిధిలోని పూ లవానిగుంట, గొల్లవానిగుంట, ఆటోనగర్ ప్రాంతాల్లో పార్టీ నాయకులు రాజ గోపాల్‌రెడ్డి, చల్లా ఆధ్వర్యంలో ఎమ్మె ల్యే ప్రజాబాట నిర్వహించారు. ఈ సందర్భంగా కరుణాకరరెడ్డి మాట్లాడు తూ తొమ్మిదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఆవగింజంత మేలు కూడా చేయలేదని బాబుపై మండిపడ్డా రు. తొమ్మిదేళ్లపాటు చేసిన తప్పులకు ప్రజలు ఆయనను పదేళ్లపాటు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారన్నారు. మహానేత వైఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కిరణ్ కుమార్‌రెడ్డి నీరుగారుస్తుంటే చంద్రబా బు నోరువిప్పకపోవడం దారుణమన్నా రు. ఐదేళ్ల పాలనలో ప్రపంచంలో ఏ నాయకుడూ చేయలేనన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మహానేత వైఎస్. రాజశేఖరరెడ్డి చేశారని సగర్వం గా చెప్పారు. ఆయన మరణానంతరం తండ్రి ఆశయ సాధనకోసం, పేదల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడుతున్న వ్యక్తి వైఎస్. జగన్మోహన్రెడ్డి అన్నారు. రాబోయే ఎన్నికల్లో జగనన్న ను గెలిపించాలని, అధికారంలోకి రాగా నే పొదుపు సంఘాల్లోని దాదాపు రూ. 20వేల కోట్ల మహిళా రుణాలను మాఫీ చేస్తారని తెలిపారు. అమ్మఒడి పేరుతో బిడ్డలను బడికి పంపించే ప్రతి తల్లిదండ్రులకు నెలకు రూ.500ల చొప్పున ప్ర తి నెలా వారి ఖాతాలో వేస్తామన్నారు. రూ.6వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా పేద విద్యార్థులకు ఉన్న త విద్యను అందిస్తామని హామీ ఇచ్చా రు. వికలాంగులు, వితంతువులు, వృద్ధులకు ప్రతినెలా రూ.700ల నుంచి వెయ్యి రూపాయల వరకు పెన్షన్ ఇప్పిస్తామని, అలాగే రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు. అభివృద్ధే లక్ష్యంగా... తిరుపతి నగరం అభివృద్ధికి నిరంతరం కృషి చేసి నగరంలో మురికివాడలే లేకుండా చేస్తానని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి హామీ ఇచ్చారు. తాను ఉపఎన్నికల్లో గెలుపొందినప్పటి నుంచి నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యలను పూర్తిగా తెలుసుకుని అనేక సమస్యలు పరిష్కరించానని గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో తిరిగి గెలిపిస్తే తిరుపతి నగరాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు వెలగపల్లి వరప్రసాద్, నాయకులు పులుగోరు ప్రభాకర్‌రెడ్డి, ఆదం రాధాకృష్ణారెడ్డి, ఆదం సుధాకర్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, కుప్పయ్య, కిట్టు, నరిసింహారెడ్డి, శంకర్, రాము, బాబూయాదవ్, నూరుల్లా, మునిరత్నం, పూజారి లక్ష్మి, కావేరి, కవిత పాల్గొన్నారు. -
నీచ రాజకీయాలకు ఓట్లేయరు
చంద్రబాబుకు రాజకీయ సన్యాసమే గతి ప్రజాబాటలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తిరుపతి(మంగళం), న్యూస్‌లైన్ : జనంలో జగన్‌కు ఉన్న ఆదరణను తగ్గించేందుకు చంద్రబాబునాయుడు ఎన్ని నీచపు రాజకీయాలు చేసినా ప్రజలు టీడీపీకి ఓట్లు వేయరని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి స్పష్టం చేశారు. తిరుపతి పరిధిలోని తిలక్‌రోడ్డు, దొడ్డాపురం వీధిలో పార్టీ మహిళా నగర కన్వీనర్ చెలికం కుసుమ, బోయళ్ళ రాజేంద్రరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రజాబాట నిర్వహించారు. సాయంత్రం తిమ్మినాయుడుపాళెం పరిధిలోని రెడ్డిభవనం వద్ద ప్రజాబాట నిర్వహించారు. ఈ సందర్భంగా కరుణాకరరెడ్డి మాట్లాడుతూ రోజు రోజుకు జనంలో జగన్‌కు ఆదరణ పెరుగుతోందన్నారు. దీనిని చూడలేక ఎలాగైనా అధికారంలోకి రావాలన్న నీచపు ఆలోచనతో చంద్రబాబు దిగజారుడు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. తిరుపతిలో జగనన్న మోగించిన ‘వైఎస్ఆర్ జన భేరి’ సభకు వచ్చిన జనాన్ని చూసి చంద్రబాబునాయుడు గుండెల్లో దడ పుట్టిందన్నారు. తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో రైతులకు బూటు దెబ్బలు, ప్రజలకు లాఠీదెబ్బలు తప్ప ఒరిగిందేమీ లేదన్నారు. మంచి చేసిన వాళ్లను గుండెల్లో పెట్టుకుని పూజించడం, చెడు చేసిన వాళ్లను చీపుర్లతో తరిమికొట్టడం జనానికి తెలుసన్నారు. ప్రపంచ రాజకీయాల్లో ఏ నాయకుడు చేయలేనన్ని అభివృద్ధి పనులు చేసిన మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డిని ప్రజలు గుండెల్లో పెట్టుకుని పూజిస్తున్నారని గుర్తు చేశారు. ఒక్క రోజు కూడా రాష్ట్ర సమైక్యత కోసం కట్టుబడి ఉండని కిరణ్, చంద్రబాబుకు ప్రజల్లోకి వచ్చి ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. తండ్రి ఆశయాల కోసం కాంగ్రెస్ అధిష్టానాన్ని సైతం ధిక్కరించి, పదవికి రాజీనామా చేసిన ఘనుడు జగనన్న అని గుర్తు చేశారు. ఆయన నిరంతరం ప్రజల అభ్యున్నతికే శ్రమిస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు వెలగపల్లి వరప్రసాదరావు, పార్టీ నాయకులు ఎస్కే. బాబు, కొమ్ము చెంచయ్యయాదవ్, ఎంవీఎస్.మణి, తొండమనాటి వెంకటేష్‌రెడ్డి, తాలూరి ప్రసాద్, కట్టాగోపీయాదవ్, తిమ్మారెడ్డి, రాఘవులునాయుడు, రాజేంద్ర, కన్నయ్య, నూరుల్లా, చాంద్‌బాషా, జనార్ధన్, పుణీత, గౌరి, శాంతారెడ్డి, శమంతకమణి పాల్గొన్నారు. -
విభజన ద్రోహులారా ఖబడ్దార్
సమైక్యం కోసం ప్రాణాలైనా అర్పిస్తాం తెలుగుతల్లి విగ్ర హం వద్ద ఎమ్మెల్యే రాస్తారోకో తిరుపతి(మంగళం), న్యూస్‌లైన్ : రాష్ట్రాన్ని విభజించడానికి పూనుకుంటున్న ద్రోహులారా ఖబడ్దార్ అని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి హెచ్చరించారు. రా ష్ట్ర సమైక్యత కోసం వైఎస్ఆర్ కాం గ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్. జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు శుక్ర వారం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో తిరుపతిలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. శుక్రవారం ఉదయం 6.30 గంటల నుంచే ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ కూడలిలోని తెలుగుతల్లి విగ్రహం వద్ద దాదాపు మూడు గంటల పా టు రాస్తారోకో నిర్వహించారు. అనంతరం నగరంలోని ప్రధానమార్గాల్లో ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా కరుణాకరరెడ్డి మాట్లాడు తూ స్వార్థ రాజకీయాలతో ఓట్లు, సీట్ల కోసం ఆంధ్ర రాష్ట్రాన్ని ముక్క లు చేసి సీమాంధ్రుల బతుకుల్లో చీకటి నింపాలని చూస్తున్న రాక్షసి సోనియాగాంధీ అన్నారు. రాష్ట్ర సమైక్యత కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్. జగన్మోహన్రెడ్డి జైల్లో ఉండి కూడా ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారని గుర్తు చేశారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటూ అనేకపోరాటాలు చేస్తున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ సీపీ అన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్రలోని పట్టభద్రులు, రైతులు రోడ్డున పడి భిక్షాటన చేయాల్సిన దుస్థితి నెలకొంటుందని అసెంబ్లీలో గొంతె త్తి అరిచినా పట్టించుకోలేదన్నారు. రాష్ట్ర సమైక్యత కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్ర విభజన ద్రోహులైన కిరణ్, చంద్రబాబు, సోనియగాంధీలకు రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఓట్లతో బుద్ధి చెబుతారన్నారు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీల కులు వరప్రసాద్, పార్టీ నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, ఎస్కే. బాబు, కొమ్ము చెంచయ్యయాదవ్, ఆదికేశవులురెడ్డి, కేతం జయచంద్రారెడ్డి, ఆదం సుధాకర్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, సురేంద్రరెడ్డి, మహి, పుల్లయ్య, హర్ష, బోయళ్ల రాజేంద్రరెడ్డి, పి. అమరనాథరెడ్డి, తాలూరి ప్రసాద్, టి.రాజేంద్ర, మాధవనాయుడు, నాగిరెడ్డి, మునిరామిరెడ్డి, మునిరెడ్డి, కుసుమ, లతారెడ్డి, గౌరి, పుణీత, రమణమ్మ, పుష్పాచౌదరి, శాంతారెడ్డి, మునీశ్వరి, సాయికుమారి పాల్గొన్నారు. మహిళల ఆత్మాహుతి యత్నం.. ఎమ్మెల్యే తిరుపతిలోని తెలుగుతల్లి విగ్ర హం వద్ద రాస్తారోకో నిర్వహిస్తున్న సమయంలో వైఎస్ఆర్ కాం గ్రెస్ పార్టీ మహిళా నేతలు గీతాయాదవ్, రమణమ్మ ఒంటిపై పె ట్రోల్ పోసుకుని ఆత్మాహుతికి య త్నించారు. పోలీసులు అక్కడికి చే రుకుని వారిపై నీళ్లు పోసి ఆస్పత్రికి తరలించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ కొంతమంది యువ త ఉదయ్ ఇంటర్నేషనల్ హోటల్ పైకి ఎక్కి జై సమైక్యాంధ్రా అంటూ నినాదాలు చేస్తూ పైనుంచి దూకేం దుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని పైనుంచి కిందకు దింపారు. -
నీతిమాలిన రాజకీయాలు చెల్లవు
చిత్తూరు (జిల్లాపరిషత్), న్యూస్‌లైన్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి సంకల్పం ముందు నీతిమాలిన రాజకీయాలు కొట్టుకుపోతాయని నాయకులు స్పష్టం చేశారు. చిత్తూరులోని జ్యో తిరావుపూలే విగ్రహం వద్ద ఆదివారం సా యంత్రం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో పలువురు నాయకులు మా ట్లాడారు. ఆంధ్రప్రదేశ్ విభజనకు కేంద్ర, రా ష్ర్ట ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలపై విరుచుకుపడ్డారు. ఈ సభలో వైఎస్ఆర్సీపీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు మిథున్‌రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. సీల్డ్ కవర్ సీఎంలకు జనం కష్టాలు తెలియవు: ఆర్కే.రోజా ‘‘రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు వైఎస్.జగన్మోహన్రెడ్డి చేస్తున్న పోరాటానికి పక్క రాష్ట్రాల్లోని అన్ని పార్టీలూ మద్దతు పలుకుతున్నాయి. అయితే కుమ్మక్కు రాజకీయాలంటూ ప్రజలను మోసం చేయడానికి ఇక్కడి అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. సీల్డ్ కవర్లలో వచ్చిన సీఎంలకు ప్రజల కష్టాలు తెలియవు. కుమారుడిని ప్రధానిని చేయడానికి సోనియాగాంధీ రాష్ట్రాన్ని అడ్డంగా నరికేందుకు కంకణం కట్టుకున్నారు. వైఎస్.జగన్మోహన్రెడ్డిని, ఆయన కుటుంబాన్ని అణగదొక్కేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు సోనియా సేవలో మునిగిపోయి ప్రజా సంక్షేమాన్ని మరచిపోయారు.’’ జగనన్న ముఖ్యమంత్రి కావాలి - ఏఎస్.మనోహర్ ‘‘చిత్తూరు ప్రజల కష్టాలు తీరాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలి. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే మన చిత్తూరుకు మంచినీళ్లు వస్తాయి. వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలుగుగంగ నీళ్లు కండలేరు నుంచి చిత్తూరుకు తరలించేందుకు రూ.1500 కోట్లతో ప్రతిపాదనలు ఆమోదం పొందాయి. రాష్ట్రం విడిపోతే చిత్తూరుకు చుక్కనీరూ వచ్చే పరిస్థితి లేదు. చిత్తూరుకు నీళ్లు కావాలన్నా, చక్కెర ఫ్యాక్టరీ లాభాల్లో నడవాలన్నా, డెయిరీ పునఃప్రారంభం కావాలన్నా, నల్లబెల్లం రైతులకు న్యాయం జరగలన్నా జగన్ ముఖ్యమంత్రి కావాలి.’’ సంక్షేమ సారథి జగన్ - ఆర్.గాంధీ ‘‘మహానేత వైఎస్.రాజశేఖర రెడ్డి బడుగు, బలహీన వర్గాల వారికోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కొనసాగడం జగన్మోహన్రెడ్డితోనే సాధ్యం. రాష్ట్ర విభజన జరిగితే తాగు, సాగునీటికి ఇబ్బంది పడాలి. ఆయన చేస్తున్న సమైక్య పోరాటానికి మనమంతా మద్దతు పలకాలి. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు జగన్మోహన్రెడ్డి చేస్తున్న పోరాటానికి మద్దతుగానే నేను టీడీపీని వీడాను.’’ జగన్‌తోనే మహిళాభ్యున్నతి -గాయత్రీదేవి ‘‘అన్ని రంగాల్లో మహిళాభ్యున్నతి జరగాలంటే జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రావాల్సిన అవసరముంది. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, 108, 104 సేవలు, విద్యార్థులకు ఫీజు రీయింబర్సమెంట్ సమర్థవంతంగా అమలు కావాలటే వైఎస్ఆర్సీపీని భారీ మెజారిటీతో గెలిపించాలి.’’ కిరణ్ చేసింది శూన్యం - ఉదయ్‌కుమార్ ‘‘చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లా వాసులని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు మహానేత వైఎస్.రాజశేఖర రెడ్డి ఎన్నో ప్రయత్నాలు చేశారు. జలయజ్ఞం ద్వారా హంద్రీనీవా, గాలేరు నగరి పథకాలతో చిత్తూరు జిల్లాకు నీరు తెచ్చేందుకు రాజశేఖర రెడ్డికి తానే సలహా ఇచ్చానని కిరణ్ చెప్పుకుంటున్నారు. అయితే కిరణ్ హయాం లో పనులు ఒక్క అడుగూ ముందుకు సాగలేదు. ఎందుకు?’’ -
సమైక్య జోరు..నిరసనల హోరు
=రెండో రోజూ మిన్నంటిన ఆందోళనలు =పలమనేరులో ఒంటికాలిపై దీక్షలు =చంద్రగిరిలో రైలుపట్టాలపై వంటావార్పు =చెవిరెడ్డి అరెస్ట్ సాక్షి, తిరుపతి: రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు రెండవ రోజైన శనివారమూ రాస్తారోకోలు, నిరసనలు మిన్నంటాయి. తిరుపతి శివారులోని తుమ్మలగుంట ప్రాంతంలో మధ్యాహ్నం ఒంటి గంటకు వైఎస్ఆర్సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత రైలుపట్టాలపై వంటావార్పూ చేపట్టారు. పోలీసులు అక్కడకు చేరుకుని చెవిరెడ్డితో పాటు పార్టీ నాయకులు గోవిందరెడ్డి, దామినేడు కేశవులు, మరో ఆరుగురిని అరెస్ట్ చేసి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి నాయకత్వంలో తుడా కార్యాలయ సర్కిల్ వద్ద రిలే నిరాహారదీక్ష చేపట్టారు. చంద్రగిరి క్లాక్‌టవర్ వద్ద పార్టీ నాయకులు కొటాల చంద్రశేఖర్‌రెడ్డి, చెల్లకూరి యుగంధర్రెడ్డిల నాయకత్వంలో ఆకులు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి నాయకత్వంలో ర్యాలీ, ధర్నా నిర్వహించారు. పార్టీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త ఆదిమూలం ఆధ్వర్యంలో నారాయణవనంలో ధర్నా నిర్వహించారు. నాగలాపురంలో జాతీయ రహదారిని దిగ్బంధించారు. పార్టీ మండల కన్వీనర్ నరేంద్రరెడ్డి గంగమ్మకు పూజలు నిర్వహించి, సోనియా గాంధీకి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరారు. పార్టీ చిత్తూరు జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, నియోజకవర్గ సమన్వయకర్త ఏఎస్.మనోహర్ వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. దుకాణాలు మూయించి, బైక్ ర్యాలీ చేపట్టారు. జిల్లా కార్యాలయాలనూ మూయిం చి, గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. గంగాధరనెల్లూరు నియోజకవర్గంలోని వెదురుకుప్పం, ఎస్ఆర్పురం, కార్వేటినగరం, పాలసముద్రం మండలాల కన్వీనర్లు పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. పలమనేరులో మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి సూచన మేరకు పట్టణంలో రాస్తారోకో, బంద్ చేపట్టారు. పార్టీ నాయకులు రేవంత్కుమార్రెడ్డి, బాలాజీనాయుడుల నాయకత్వంలో జాతీయ రహదారిపై ఒంటికాలితో నిరసన వ్యక్తం చేశారు. వి.కోటలో పార్టీ నాయకులు సురేష్, అరుణ్కుమార్రెడ్డిల నాయకత్వంలో మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. మదనపల్లెలో ఎమ్మెల్సీ దేశాయితిప్పారెడ్డి ఎంబీటీ రోడ్డును దిగ్బంధించారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త షమీమ్‌అస్లాం పాఠశాలలు మూయించి, ర్యాలీ చేపట్టారు. మైనారిటీ నాయకుడు పీఎస్.ఖాన్ ఎన్టీఆర్ సర్కిల్లో ధర్నా నిర్వహించారు. పార్టీ కుప్పం నియోజకవర్గ సమన్వకర్త సుబ్రమణ్యం రెడ్డి ఆధ్వర్యలో నిరసనలు చేపట్టారు. నగరి నియోజకవర్గం పుత్తూరు మండలంలోని తడుకు వద్ద సర్పంచ్‌లు సుశీలమ్మ, సుధాకరయ్య రాస్తారోకో చేపట్టారు. నిండ్ర షుగర్ ఫ్యాక్టరీ వద్ద జాతీయ రహదారిపై పార్టీ నాయకుడు శ్యామ్‌లాల్ నాయకత్వంలో రాస్తారోకో నిర్వహించారు. నగరిలో మునిసిపల్ మాజీ చైర్మన్ విజయకుమార్ ర్యాలీ నిర్వహించారు. -
నిరసన జ్వాల
=జిల్లా అంతటా బంద్ =కదం తొక్కిన వైఎస్సార్సీపీ శ్రేణులు =ధర్నాలు, రాస్తారోకోలు =స్తంభించిన రాకపోకలు =తిరుమలకు మినహారుయింపు =విభజనకు వ్యతిరేకంగా నినాదాలు రాష్ట్రాన్ని విభజించాలని కేంద్ర మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో జిల్లాలో బంద్ విజయవంతమయ్యింది. రాస్తారోకోలు, మోటార్‌సైకిల్ ర్యాలీలు, ధర్నాలతో జిల్లా దద్దరిల్లింది. జాతీయ రహదారుల్లో వాహనాలు నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, బ్యాంకులు మూతపడ్డాయి. సాక్షి, తిరుపతి : రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తిరుమల బైపాస్ రోడ్డులో ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి నేతృత్వంలో రెండు గంటల పాటు ధర్నా చేశారు. దీంతో రెండు వైపుల వాహనాల రాక పోకలు నిలచిపోయాయి. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకుడు వోవీ.రమణ, తదితరులు పాల్గొన్నారు. అలాగే సెంట్రల్ పార్క్ వద్ద వైఎస్ఆర్ పార్టీ తిరుపతి కన్వీనర్ పాలగిరి ప్రతాపరెడ్డి, ఎస్కే.బాబు, దొడ్డారెడ్డి సిద్ధ్దారెడ్డి నాయకత్వంలో రాస్తారోకో జరిగింది. రెండు గంటల పాటు రాకపోకలు స్తంభించాయి. అలాగే మోటార్‌సైకిల్, జీపు ర్యాలీ నిర్వహించారు. దుకాణాలను, ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. నగరి నియోజకవర్గంలోని పుత్తూరు బైపాస్ రోడ్డులో పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి ఆధ్వర్యంలో రాస్తారోకో జరిగింది. సత్యవేడు సమన్వయకర్త ఆదిమూలం, సురేష్ తదితరులు పాల్గొన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నాయకత్వంలో టవర్ క్లాక్ సర్కిల్ వద్ద టైర్లు కాల్చి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. బంద్ సంపూర్ణంగా జరిగింది. పాకాల, చిన్నగొట్టిగల్లు, ఎర్రావారిపాళెం, రామచంద్రాపురం మండలాల్లో మానవహారాలు, ధర్నా కార్యక్రమాలు మిన్నంటాయి. ఈ కార్యక్రమాల్లో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో పాటు కోటాల చంద్రశేఖర్‌రెడ్డి, దామినేడు కేశవులు, ఉద్యోగ జేఏసీ నాయకుడు మధుసూదన్ పాల్గొన్నారు. గుర్రంకొండలో మండల కన్వీనర్ ముక్తియార్ఆలీఖాన్ నాయకత్వంలో దుకాణాలు మూయించారు. రాస్తారోకో నిర్వహించారు. పూతలపట్టులో వైఎస్ఆర్సీపీ నాయకుడు సిద్ధారెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. బంగారుపాళెంలో సమన్వయకర్త డాక్టర్ సునీల్‌కుమార్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్బంధించారు. తవణంపల్లెలో సమన్వయకర్త పూర్ణం ఆధ్వర్యంలో వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. ఐరాలలో రవిప్రసాద్ ఆధ్వర్యంలో అగరంపల్లె రోడ్డుపై ధర్నా చేశారు. చిత్తూరులో సమన్వయకర్త ఏఎస్ మనోహర్ నాయకత్వంలో గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. మోటార్‌సైకిల్ ర్యాలీ నిర్వహించి, ఆర్టీసీ బస్సులను డిపో నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దుకాణాలు, వ్యాపార సంస్థలను మూయించారు. మదనపల్లెలో ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి నాయకత్వంలో భారీ ర్యాలీ, మానవహారం కార్యక్రమం నిర్వహించారు. పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉదయ్‌కుమార్ కదిరి రోడ్డును దిగ్బంధం చేశారు. సమన్వయకర్త షమీమ్ అస్లాం నియోజకవర్గంలో ర్యాలీ నిర్వహించగా, మైనారిటీ నాయకుడు అక్తర్ అహ్మద్ బస్టాండ్ వద్ద మానవహారం నిర్వహించారు. శ్రీకాళహస్తిలో పార్టీ తిరుపతి పార్లమెంటరీ పరిశీలకుడు వరప్రసాద్, నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి నేతృత్వంలో మోటార్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఎద్దులకు సోనియా మాస్క్‌లు తగిలించి వినూత్న ర్యాలీ నిర్వహించారు. ధర్నా, రాస్తారోకో నిర్వహించి, దుకాణాలను బంద్ చేయించారు. కుప్పంలో పార్టీ సమన్వయకర్త సుబ్రమణ్యంరెడ్డి నాయకత్వంలో బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు. ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించి విద్యాసంస్థలు, కార్యాలయాలు మూయించారు. శాంతిపురం, రామకుప్పం, గుడుపల్లెలో కూడా బంద్ జరిగింది. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ములకల చెరువులో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్‌రెడ్డి నాయకత్వంలో బంద్ జరిగింది. పలమనేరులో మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి నేతృత్వంలో ఉదయం ఆరు గంటల నుంచి చెన్నై-బెంగళూరు రహదారిని దిగ్బంధం చేశారు. రోడ్డుపైనే షామియానా వేసి, వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. జేఏసీ నాయకులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. సత్యవేడులో పార్టీ నాయకుడు నిరంజన్‌రెడ్డి నాయకత్వంలో దుకాణాలను మూయించారు. వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. పుంగనూరులో వైఎస్ఆర్ సీపీ నాయకులు రెడ్డెప్ప, నాగభూషణం, భాస్కర్ రెడ్డి, వరదారెడ్డి తదితరులు రోడ్లుపై బైఠాయించారు. టైర్లు కాల్చి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహించారు.