- సమైక్యం కోసం ప్రాణాలైనా అర్పిస్తాం
- తెలుగుతల్లి విగ్ర హం వద్ద ఎమ్మెల్యే రాస్తారోకో
తిరుపతి(మంగళం), న్యూస్‌లైన్ : రాష్ట్రాన్ని విభజించడానికి పూనుకుంటున్న ద్రోహులారా ఖబడ్దార్ అని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి హెచ్చరించారు. రా ష్ట్ర సమైక్యత కోసం వైఎస్‌ఆర్ కాం గ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు శుక్ర వారం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో తిరుపతిలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. శుక్రవారం ఉదయం 6.30 గంటల నుంచే ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ కూడలిలోని తెలుగుతల్లి విగ్రహం వద్ద దాదాపు మూడు గంటల పా టు రాస్తారోకో నిర్వహించారు.
అనంతరం నగరంలోని ప్రధానమార్గాల్లో ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా కరుణాకరరెడ్డి మాట్లాడు తూ స్వార్థ రాజకీయాలతో ఓట్లు, సీట్ల కోసం ఆంధ్ర రాష్ట్రాన్ని ముక్క లు చేసి సీమాంధ్రుల బతుకుల్లో చీకటి నింపాలని చూస్తున్న రాక్షసి సోనియాగాంధీ అన్నారు. రాష్ట్ర సమైక్యత కోసం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి జైల్లో ఉండి కూడా ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారని గుర్తు చేశారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటూ అనేకపోరాటాలు చేస్తున్న ఏకైక పార్టీ వైఎస్‌ఆర్ సీపీ అన్నారు.
రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్రలోని పట్టభద్రులు, రైతులు రోడ్డున పడి భిక్షాటన చేయాల్సిన దుస్థితి నెలకొంటుందని అసెంబ్లీలో గొంతె త్తి అరిచినా పట్టించుకోలేదన్నారు. రాష్ట్ర సమైక్యత కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్ర విభజన ద్రోహులైన కిరణ్, చంద్రబాబు, సోనియగాంధీలకు రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఓట్లతో బుద్ధి చెబుతారన్నారు.
తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీల కులు వరప్రసాద్, పార్టీ నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, ఎస్‌కే. బాబు, కొమ్ము చెంచయ్యయాదవ్, ఆదికేశవులురెడ్డి, కేతం జయచంద్రారెడ్డి, ఆదం సుధాకర్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, సురేంద్రరెడ్డి, మహి, పుల్లయ్య, హర్ష, బోయళ్ల రాజేంద్రరెడ్డి, పి. అమరనాథరెడ్డి, తాలూరి ప్రసాద్, టి.రాజేంద్ర, మాధవనాయుడు, నాగిరెడ్డి, మునిరామిరెడ్డి, మునిరెడ్డి, కుసుమ, లతారెడ్డి, గౌరి, పుణీత, రమణమ్మ, పుష్పాచౌదరి, శాంతారెడ్డి, మునీశ్వరి, సాయికుమారి పాల్గొన్నారు.
మహిళల ఆత్మాహుతి యత్నం..
ఎమ్మెల్యే తిరుపతిలోని తెలుగుతల్లి విగ్ర హం వద్ద రాస్తారోకో నిర్వహిస్తున్న సమయంలో వైఎస్‌ఆర్ కాం గ్రెస్ పార్టీ మహిళా నేతలు గీతాయాదవ్, రమణమ్మ ఒంటిపై పె ట్రోల్ పోసుకుని ఆత్మాహుతికి య త్నించారు. పోలీసులు అక్కడికి చే రుకుని వారిపై నీళ్లు పోసి ఆస్పత్రికి తరలించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ కొంతమంది యువ త ఉదయ్ ఇంటర్నేషనల్ హోటల్ పైకి ఎక్కి జై సమైక్యాంధ్రా అంటూ నినాదాలు చేస్తూ పైనుంచి దూకేం దుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని పైనుంచి కిందకు దింపారు.