చిత్తూరు (జిల్లాపరిషత్), న్యూస్‌లైన్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పం ముందు నీతిమాలిన రాజకీయాలు కొట్టుకుపోతాయని నాయకులు స్పష్టం చేశారు. చిత్తూరులోని జ్యో తిరావుపూలే విగ్రహం వద్ద ఆదివారం సా యంత్రం వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో పలువురు నాయకులు మా ట్లాడారు. ఆంధ్రప్రదేశ్ విభజనకు కేంద్ర, రా ష్ర్ట ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలపై విరుచుకుపడ్డారు. ఈ సభలో వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు మిథున్‌రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
సీల్డ్ కవర్ సీఎంలకు జనం కష్టాలు తెలియవు: ఆర్కే.రోజా
‘‘రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న పోరాటానికి పక్క రాష్ట్రాల్లోని అన్ని పార్టీలూ మద్దతు పలుకుతున్నాయి. అయితే కుమ్మక్కు రాజకీయాలంటూ ప్రజలను మోసం చేయడానికి ఇక్కడి అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. సీల్డ్ కవర్లలో వచ్చిన సీఎంలకు ప్రజల కష్టాలు తెలియవు. కుమారుడిని ప్రధానిని చేయడానికి సోనియాగాంధీ రాష్ట్రాన్ని అడ్డంగా నరికేందుకు కంకణం కట్టుకున్నారు. వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని, ఆయన కుటుంబాన్ని అణగదొక్కేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు సోనియా సేవలో మునిగిపోయి ప్రజా సంక్షేమాన్ని మరచిపోయారు.’’
జగనన్న ముఖ్యమంత్రి కావాలి
- ఏఎస్.మనోహర్
‘‘చిత్తూరు ప్రజల కష్టాలు తీరాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలి. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే మన చిత్తూరుకు మంచినీళ్లు వస్తాయి. వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలుగుగంగ నీళ్లు కండలేరు నుంచి చిత్తూరుకు తరలించేందుకు రూ.1500 కోట్లతో ప్రతిపాదనలు ఆమోదం పొందాయి. రాష్ట్రం విడిపోతే చిత్తూరుకు చుక్కనీరూ వచ్చే పరిస్థితి లేదు. చిత్తూరుకు నీళ్లు కావాలన్నా, చక్కెర ఫ్యాక్టరీ లాభాల్లో నడవాలన్నా, డెయిరీ పునఃప్రారంభం కావాలన్నా, నల్లబెల్లం రైతులకు న్యాయం జరగలన్నా జగన్ ముఖ్యమంత్రి కావాలి.’’
సంక్షేమ సారథి జగన్
- ఆర్.గాంధీ
‘‘మహానేత వైఎస్.రాజశేఖర రెడ్డి బడుగు, బలహీన వర్గాల వారికోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కొనసాగడం జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యం. రాష్ట్ర విభజన జరిగితే తాగు, సాగునీటికి ఇబ్బంది పడాలి. ఆయన చేస్తున్న సమైక్య పోరాటానికి మనమంతా మద్దతు పలకాలి. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న పోరాటానికి మద్దతుగానే నేను టీడీపీని వీడాను.’’
జగన్‌తోనే మహిళాభ్యున్నతి
-గాయత్రీదేవి
‘‘అన్ని రంగాల్లో మహిళాభ్యున్నతి జరగాలంటే జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రావాల్సిన అవసరముంది. వైఎస్‌ఆర్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, 108, 104 సేవలు, విద్యార్థులకు ఫీజు రీయింబర్‌సమెంట్ సమర్థవంతంగా అమలు కావాలటే వైఎస్‌ఆర్‌సీపీని భారీ మెజారిటీతో గెలిపించాలి.’’
కిరణ్ చేసింది శూన్యం
- ఉదయ్‌కుమార్
‘‘చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లా వాసులని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు మహానేత వైఎస్.రాజశేఖర రెడ్డి ఎన్నో ప్రయత్నాలు చేశారు. జలయజ్ఞం ద్వారా హంద్రీనీవా, గాలేరు నగరి పథకాలతో చిత్తూరు జిల్లాకు నీరు తెచ్చేందుకు రాజశేఖర రెడ్డికి తానే సలహా ఇచ్చానని కిరణ్ చెప్పుకుంటున్నారు. అయితే కిరణ్ హయాం లో పనులు ఒక్క అడుగూ ముందుకు సాగలేదు. ఎందుకు?’’
నీతిమాలిన రాజకీయాలు చెల్లవు
Published Mon, Jan 13 2014 3:42 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
Advertisement