=రెండో రోజూ మిన్నంటిన ఆందోళనలు
=పలమనేరులో ఒంటికాలిపై దీక్షలు
=చంద్రగిరిలో రైలుపట్టాలపై వంటావార్పు
=చెవిరెడ్డి అరెస్ట్
సాక్షి, తిరుపతి: రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు రెండవ రోజైన శనివారమూ రాస్తారోకోలు, నిరసనలు మిన్నంటాయి. తిరుపతి శివారులోని తుమ్మలగుంట ప్రాంతంలో మధ్యాహ్నం ఒంటి గంటకు వైఎస్‌ఆర్‌సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
ఆ తర్వాత రైలుపట్టాలపై వంటావార్పూ చేపట్టారు. పోలీసులు అక్కడకు చేరుకుని చెవిరెడ్డితో పాటు పార్టీ నాయకులు గోవిందరెడ్డి, దామినేడు కేశవులు, మరో ఆరుగురిని అరెస్ట్ చేసి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి నాయకత్వంలో తుడా కార్యాలయ సర్కిల్ వద్ద రిలే నిరాహారదీక్ష చేపట్టారు. చంద్రగిరి క్లాక్‌టవర్ వద్ద పార్టీ నాయకులు కొటాల చంద్రశేఖర్‌రెడ్డి, చెల్లకూరి యుగంధర్‌రెడ్డిల నాయకత్వంలో ఆకులు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి నాయకత్వంలో ర్యాలీ, ధర్నా నిర్వహించారు.
పార్టీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త ఆదిమూలం ఆధ్వర్యంలో నారాయణవనంలో ధర్నా నిర్వహించారు. నాగలాపురంలో జాతీయ రహదారిని దిగ్బంధించారు. పార్టీ మండల కన్వీనర్ నరేంద్రరెడ్డి గంగమ్మకు పూజలు నిర్వహించి, సోనియా గాంధీకి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరారు. పార్టీ చిత్తూరు జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, నియోజకవర్గ సమన్వయకర్త ఏఎస్.మనోహర్ వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు.
దుకాణాలు మూయించి, బైక్ ర్యాలీ చేపట్టారు. జిల్లా కార్యాలయాలనూ మూయిం చి, గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. గంగాధరనెల్లూరు నియోజకవర్గంలోని వెదురుకుప్పం, ఎస్‌ఆర్‌పురం, కార్వేటినగరం, పాలసముద్రం మండలాల కన్వీనర్లు పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. పలమనేరులో మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి సూచన మేరకు పట్టణంలో రాస్తారోకో, బంద్ చేపట్టారు. పార్టీ నాయకులు రేవంత్‌కుమార్‌రెడ్డి, బాలాజీనాయుడుల నాయకత్వంలో జాతీయ రహదారిపై ఒంటికాలితో నిరసన వ్యక్తం చేశారు. వి.కోటలో పార్టీ నాయకులు సురేష్, అరుణ్‌కుమార్‌రెడ్డిల నాయకత్వంలో మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు.
మదనపల్లెలో ఎమ్మెల్సీ దేశాయితిప్పారెడ్డి ఎంబీటీ రోడ్డును దిగ్బంధించారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త షమీమ్‌అస్లాం పాఠశాలలు మూయించి, ర్యాలీ చేపట్టారు. మైనారిటీ నాయకుడు పీఎస్.ఖాన్ ఎన్‌టీఆర్ సర్కిల్‌లో ధర్నా నిర్వహించారు. పార్టీ కుప్పం నియోజకవర్గ సమన్వకర్త సుబ్రమణ్యం రెడ్డి ఆధ్వర్యలో నిరసనలు చేపట్టారు. నగరి నియోజకవర్గం పుత్తూరు మండలంలోని తడుకు వద్ద సర్పంచ్‌లు సుశీలమ్మ, సుధాకరయ్య రాస్తారోకో చేపట్టారు. నిండ్ర షుగర్ ఫ్యాక్టరీ వద్ద జాతీయ రహదారిపై పార్టీ నాయకుడు శ్యామ్‌లాల్ నాయకత్వంలో రాస్తారోకో నిర్వహించారు. నగరిలో మునిసిపల్ మాజీ చైర్మన్ విజయకుమార్ ర్యాలీ నిర్వహించారు.
సమైక్య జోరు..నిరసనల హోరు
Published Sun, Dec 8 2013 4:49 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
Advertisement
Advertisement