ఇంకెన్నాళ్లు మోసగిస్తారు..?
- చంద్రబాబు మాయమాటలు ప్రజలు నమ్మరు
- తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి
తిరుపతి (మంగళం), న్యూస్‌లైన్ : మామను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు అవిచేస్తా, ఇవి చేస్తానంటూ ఇంకెన్నాళ్లు మోసగిస్తావంటూ చంద్రబాబుపై తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ధ్వజమెత్తారు. తిరుపతి పరిధిలోని పూ లవానిగుంట, గొల్లవానిగుంట, ఆటోనగర్ ప్రాంతాల్లో పార్టీ నాయకులు రాజ గోపాల్‌రెడ్డి, చల్లా ఆధ్వర్యంలో ఎమ్మె ల్యే ప్రజాబాట నిర్వహించారు. ఈ సందర్భంగా కరుణాకరరెడ్డి మాట్లాడు తూ తొమ్మిదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఆవగింజంత మేలు కూడా చేయలేదని బాబుపై మండిపడ్డా రు. తొమ్మిదేళ్లపాటు చేసిన తప్పులకు ప్రజలు ఆయనను పదేళ్లపాటు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారన్నారు.
మహానేత వైఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కిరణ్ కుమార్‌రెడ్డి నీరుగారుస్తుంటే చంద్రబా బు నోరువిప్పకపోవడం దారుణమన్నా రు. ఐదేళ్ల పాలనలో ప్రపంచంలో ఏ నాయకుడూ చేయలేనన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మహానేత వైఎస్. రాజశేఖరరెడ్డి చేశారని సగర్వం గా చెప్పారు. ఆయన మరణానంతరం తండ్రి ఆశయ సాధనకోసం, పేదల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడుతున్న వ్యక్తి వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.
రాబోయే ఎన్నికల్లో జగనన్న ను గెలిపించాలని, అధికారంలోకి రాగా నే పొదుపు సంఘాల్లోని దాదాపు రూ. 20వేల కోట్ల మహిళా రుణాలను మాఫీ చేస్తారని తెలిపారు. అమ్మఒడి పేరుతో బిడ్డలను బడికి పంపించే ప్రతి తల్లిదండ్రులకు నెలకు రూ.500ల చొప్పున ప్ర తి నెలా వారి ఖాతాలో వేస్తామన్నారు. రూ.6వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా పేద విద్యార్థులకు ఉన్న త విద్యను అందిస్తామని హామీ ఇచ్చా రు. వికలాంగులు, వితంతువులు, వృద్ధులకు ప్రతినెలా రూ.700ల నుంచి వెయ్యి రూపాయల వరకు పెన్షన్ ఇప్పిస్తామని, అలాగే రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు.
అభివృద్ధే లక్ష్యంగా...
తిరుపతి నగరం అభివృద్ధికి నిరంతరం కృషి చేసి నగరంలో మురికివాడలే లేకుండా చేస్తానని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి హామీ ఇచ్చారు. తాను ఉపఎన్నికల్లో గెలుపొందినప్పటి నుంచి నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యలను పూర్తిగా తెలుసుకుని అనేక సమస్యలు పరిష్కరించానని గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో తిరిగి గెలిపిస్తే తిరుపతి నగరాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు వెలగపల్లి వరప్రసాద్, నాయకులు పులుగోరు ప్రభాకర్‌రెడ్డి, ఆదం రాధాకృష్ణారెడ్డి, ఆదం సుధాకర్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, కుప్పయ్య, కిట్టు, నరిసింహారెడ్డి, శంకర్, రాము, బాబూయాదవ్, నూరుల్లా, మునిరత్నం, పూజారి లక్ష్మి, కావేరి, కవిత పాల్గొన్నారు.