
తిరుపతి: టీడీపీ కూటమి ప్రభుత్వం అండతో ఎల్లో మీడియా తనపై తప్పుడు కథనాలు రాస్తోందని పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy)మరోసారి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే తనపై తప్పుడు కథనాలు రాస్తున్నారని ధ్వజమెత్తారు. ఈనాడు, ఈటీవీపై పరువు నష్టం ాదావా వేస్తానని పెద్దిరెడ్డి తెలిపారు. ఆ భూములను గతంలో చంద్రబాబు ప్రభుత్వం విచారణ జరిపి అటవీ భూములు కాదని తేల్చిన సంగతిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోసారి గుర్తుచేశారు.
2001లోనే ఆ భూమిని కొనుగోలు చేశామని, అప్పట్నుంచి ఆ భూమిలో సాగు చేస్తున్నమన్నారు పెద్దిరెడ్డి. ఎల్లో మీడియాను అడ్డం ెపెట్టుకుని వ్యక్తిత్వం హననానికి పాల్పడుతున్నారని, ఇందులో భాగంగానే తప్పుడు కథనాలు రాయిస్తున్నారని పెద్దిరెడ్డి మండిపడ్డారు.
కాగా, పులిచెర్ల మండలంలో అటవీ భూములను తాము కబ్జా చేసినట్లు ఈనాడు ప్రచురించిన కథనం పూర్తి అవాస్తవమని, దీనిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని రామచంద్రారెడ్డి ఇప్పటికే ివివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై బుధవారం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఒక్క ఎకరం అయినా కబ్జా చేసినట్లు నిరూపించగలరా? అని సవాల్ చేశారు. పూర్తి చట్టబద్ధంగా తాము 2001లో కొనుగోలు చేసిన భూములపై పచ్చి అబద్ధాలతో కథనాన్ని ప్రచురించడం వెనుక సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ ఉన్నాయని ధ్వజమెత్తారు. బుధవారం తిరుపతిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
1981లోనే అవి ప్రైవేట్ భూములని నిర్ధారించారు..
నిత్యం చంద్రబాబుకు బాకా ఊదుతూ పచ్చనేతల సేవలో తరించిపోయే ఈనాడు, ఈటీవీ ద్వారా మాపై పలుసార్లు పచ్చి అబద్ధాలతో కూడిన కథనాలను ప్రచురించారు. వీటిపై ఇప్పటికే చిత్తూరు న్యాయస్థానంలో ఎల్లో మీడియాపై రూ.50 లక్షలకు పరువు నష్టం దావా వేశాం.

పులిచర్ల ప్రాంతంలోని 75 ఎకరాల అటవీ భూమిని కబ్జా చేశామని, అటవీ అధికారులకు తెలియకుండా తారు రోడ్డు నిర్మించామంటూ, భూమిని పెంచామంటూ పచ్చి అబద్ధాలు, అభూత కల్పనలతో కథనాలను వెలువరించారు. ఆ భూములు ప్రైవేట్ వ్యక్తులకు చెందిన పట్టా భూములని 1981 నవంబర్ 11న డైరెక్టర్ ఆఫ్ సెటిల్‌మెంట్స్ అధికారి అసదుద్దీన్ అహ్మద్ ఆర్డర్ జారీచేశారు.
ఈ ఉత్తర్వులు పొందిన వ్యక్తుల నుంచి 2001లో వాటిని చట్టబద్ధంగా కొనుగోలు చేసి మామిడితోట, పశువుల పెంపకం చేపట్టాం. కేంద్ర అటవీశాఖ నుంచి 27.6.2022న క్లియరెన్స్ పొందిన తరువాతే అక్కడ రోడ్డు నిర్మాణానికి పీసీసీఎఫ్ అనుమతులు ఇచ్చమన్నారు.