Academic departments
-
ఎంబీఏ.. చేరికలేవి?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో విద్యార్థుల చేరికలు నానాటికీ పడిపోతున్నాయి. ఏపీ ఐసెట్–2021 కౌన్సెలింగ్‌కి సంబంధించి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో తొలివిడత సీట్ల కేటాయింపును అడ్మిషన్ల కన్వీనర్ ప్రొఫెసర్ కె.రామ్మోహనరావు బుధవారం ప్రకటించారు. ముందుగా ఎంబీఏ విషయానికొస్తే.. ఈ విద్యా సంవత్సరం ఐసెట్ కౌన్సెలింగ్‌లో కేవలం 25 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. 75 శాతం మేర సీట్లు ఖాళీగా మిగిలాయి. రాష్ట్రంలో మొత్తం 303 ఎంబీఏ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 26 కళాశాలల్లో ఒక్కరు కూడా చేరలేదు. రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఐసెట్ రాసేందుకు దరఖాస్తు చేసుకుంటున్నవారు అంతంతమాత్రంగానే ఉండటమే దీనికి కారణం. ఇక ప్రవేశపరీక్షలో అర్హత సాధించే వారి సంఖ్య మరీ తక్కువగా ఉంటోంది. ఉత్తీర్ణులైనవారిలోనూ కౌన్సెలింగ్‌కు హాజరవుతోంది కొందరే. ఇక సీట్లు పొందాక కళాశాలల్లో చేరేవారూ తక్కువగానే ఉంటున్నారు. -
ప్రైవేటు విద్యార్థులకు కాల్‌సెంటర్
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కాల్‌సెంటర్‌ను అందుబాటులోకి తెచ్చేలా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలలతోపాటు ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థులు కూడా తమ సమస్యలను అ«ధికారుల దృష్టికి తీసుకెళ్లేలా ఈ కాల్‌సెంటర్ సేవలను విస్తరించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇప్పటికే ఈ సేవలను ప్రయోగాత్మకంగా కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) అందుబాటులోకి తెచ్చింది. ఈ సేవలను రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలకు విస్తరింపజేయడం వల్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తాము తెలుసుకోవడంతోపాటు వాటిని త్వరగా పరిష్కరించేందుకు వీలు కలుగుతుందని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ మేరకు పాఠశాల విద్య డైరెక్టర్ విజయ్‌కుమార్ డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు ఏ సమయంలో సమస్యలు వచ్చినా తెలియపరిచేలా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. గురుకులాల్లోనూ ఫోన్ సదుపాయాన్ని కల్పించింది. పోలీసు, వైద్య సహాయం అందించేలా ఏర్పాటు చేసిన 100, 108 నంబర్లతోపాటు పాఠశాల విద్యా డైరెక్టరేట్‌కు మాత్రమే (ఈ మూడు రకాల సేవలు మాత్రమే అందించేలా) ఫోన్ వచ్చేలా రాష్ట్రంలోని 485 కేజీబీవీల్లో ఫ్రీ వైర్లెస్ ఫోన్ సెట్లను ఏర్పాటు చేసింది. విద్యార్థులు ఆ ఫోన్లలోని బటన్‌ను నొక్కితే అది నేరుగా పాఠశాల విద్య డైరెక్టరేట్‌లోని కాల్‌సెంటర్‌కు కనెక్ట్ అవుతుంది. కాల్‌సెంటర్ సిబ్బంది వీటిని రిసీవ్ చేసుకొని సమస్యలను నమోదు చేస్తారు. వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు పంపిస్తున్నారు. దీంతో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు త్వరగా పరిష్కారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని ప్రైవేటు పాఠశాలల్లోనూ ఆ ఫోన్లను ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. దీనిపై ప్రైవేటు పాఠశాలల యాజమాన్య సంఘాలతోనూ సమావేశమై చర్చించామని, అందుకు యాజమాన్యాలు ఒప్పుకున్నాయని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. -
చాక్‌పీసులకూ పైసల్లేవ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్థిక ఇబ్బందులు అధికమయ్యాయి. మొన్నటివరకు ఎన్నికల సమయం కదా అనుకుంటే, ఎన్నికలు పూర్తయ్యాక కూడా ప్రభుత్వం నుంచి పైసా అందలేదు. దీంతో ప్రధానోపాధ్యాయులు లబోదిబోమంటున్నారు. పాఠశాలల్లో నిర్వహణ ఖర్చులను పక్కనపెడితే, విద్యార్థులకు బోధించేందుకు అవసరమైన చాక్‌పీసులకు కూడా దిక్కులేని పరిస్థితి నెలకొంది. గదులు ఊడ్చే, టాయిలెట్లు శుభ్రంచేసే సిబ్బందికి కూడా వేతనాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. 2018–19 విద్యా సంవత్సరంలో జూన్, జూలై, ఆగస్టు నెలలు మినహా ఇప్పటివరకు పాఠశాలలకు ప్రభుత్వం నుంచి పైసా రాకపోవడంతో ప్రధానోపాధ్యాయులు తీవ్ర ఆందో ళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పాఠశాలల నిర్వహణకు, కేజీబీవీల నిర్వహణకు కేంద్రం ఇస్తున్న 60% నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం వద్దే ఉండిపోవడంతో పాఠశాలల్లో ప్రతి పనికీ ఇబ్బంది తప్పడం లేదు. ముఖ్యంగా సమగ్ర శిక్షా అభియాన్‌లో (ఎస్ఎస్ఏ) వివిధ పనులకు నిధులు లేక, సిబ్బందికి వేతనాలులేక తంటాలు పడుతున్నారు. రాష్ట్రంలో ఎస్ఎస్ఏకు కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.1,200 కోట్లకు ఆమోదం తెలిపింది. అందులో 60 శాతం కేంద్రం వెచ్చిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులను వెచ్చించాల్సి ఉంది. ఇందులో భాగంగా కేంద్రం మొదటి విడతలో తమ వాటాగా రూ.470 కోట్లు విడుదల చేసింది. రాష్ట్రం తమ వాటా కలిపి మొత్తంగా రూ.600 కోట్లు సర్వ శిక్షా అభియాన్‌కు విడుదల చేయాల్సి ఉంది. కానీ విద్యా సంవత్సరం మొదట్లో కేవలం రూ.80 కోట్లు మాత్రమే ఇచ్చింది. దీంతో మొదటి మూడు నెలలు పెద్దగా ఇబ్బంది లేకపోయినా ఇపుడు పాఠశాలల్లో ఇబ్బందులు తీవ్రతరం అయ్యాయి. విద్యాశాఖ రూ.600 కోట్లను ఖర్చు చేసి యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇస్తేనే కేంద్రం రెండో విడత డబ్బును విడుదల చేయనుంది. రాష్ట్రం తమ వాటా ఇవ్వకపోగా, కేంద్రం నుంచి వచ్చిన మొదటి విడత నిధులను కూడా విడుదల చేయకపోవడంతో క్షేత్ర స్థాయిలో 27 వేల పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. నిర్వహణ నిధులు లేక, జీతాలు లేక మండలాల్లో పనిచేసే దాదాపు 10 వేల మంది వరకు క్లస్టర్ రీసోర్స్ పర్సన్లు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఇతర ఎస్ఎస్ఏ సిబ్బంది అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో జిల్లాల్లో, పాఠశాలల ఖాతాల్లో ఏమైనా నిధులు ఉంటే వాటిని వేతనాలుగా తీసుకోవాలని పాఠశాల విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసిందంటే పరిస్థితి తీవ్రత ఎలా ఉందో అర్థమవుతోంది. మరోవైపు గత డిసెంబర్ 12వ తేదీన ప్రభుత్వం రూ.472 కోట్లకు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్లు (బీఆర్వో) ఇచ్చినా డబ్బులను మాత్రం విడుదల చేయకపోవడంతో తంటాలు తప్పడం లేదు. పాఠశాలల్లోని విద్యార్థులను బట్టి కొన్ని పాఠశాలల్లో ఒక్కరు, మరికొన్ని స్కూళ్లలో ఇద్దరు చొప్పున పనిచేస్తున్న వేల మంది స్కావెంజర్లు కూడా వేతనాలు లేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ముఖ్యంగా కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లోనూ నిర్వహణ కష్టతరంగా మారింది. -
5 నుంచి 7 వరకు డిగ్రీ స్పెషల్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల్లో భాగంగా జూలై 5 నుంచి 7 వరకు స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి వెల్లడించారు. మూడో దశ కౌన్సెలింగ్‌లో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న వారికి శనివారం సీట్లను కేటాయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈసారి ప్రత్యేకంగా స్లైడింగ్ ఉండదని, స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. ఇప్పటివరకు రిజిస్టర్ చేసుకోని విద్యార్థులు రిజిస్టర్ చేసుకొని వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు. ఇదివరకు తక్కువ ఆప్షన్లు ఇచ్చుకోవడం వల్ల సీట్లు రాని వారు, సీట్లు వచ్చినా కాలేజీల్లో రిపోర్టు చేయని వారు కూడా ఈ స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్‌లో ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని వివరించారు. ఇదివరకే సీటు వచ్చి, మళ్లీ వెబ్ ఆప్షన్లు ఇచ్చుకుంటే ముందుగా వారికే సీట్లు కేటాయిస్తామన్నారు. ఆ తర్వాత కొత్తగా ఆప్షన్లు ఇచ్చుకున్న వారికి, కాలేజీల్లో సీట్లు వచ్చినా చేరని వారికి, గతంలో సీట్లు రాని వారికి సీట్లను కేటాయిస్తామని తెలిపారు. ఈ సీట్ల కేటాయింపును వచ్చేనెల 10న ప్రకటిస్తామని, విద్యార్థులు జూలై 11 నుంచి 13లోగా సంబంధిత కాలేజీల్లో చేరాలని సూచించారు. మరోవైపు మూడో దశలో 59,234 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోగా 57,294 మందికి సీట్లను కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. మరో 2 వేల మంది తక్కువ కాలేజీలకు ఆప్షన్లు ఇచ్చినందునా వారికి సీట్లు లభించలేదన్నారు. సీట్లు లభించిన విద్యార్థులంతా జూలై 4లోగా కాలేజీల్లో ఓటీపీ అందజేసి, సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలన్నారు. జూలై 2న తరగతులు ప్రారంభం అవుతాయని చెప్పారు. మొబైల్ నంబర్ మార్పు చేసుకోవాలనుకునే వారు హెల్ప్‌లైన్ కేంద్రాలకు వెళ్లి బయోమెట్రిక్ అథెంటికేషన్‌తో మార్పు చేసుకోవాలని చెప్పారు. సమావేశంలో ఉన్నత విద్యా మండలి కార్యదర్శి శ్రీనివాసరావు, ఉన్నత విద్యాశాఖ, సీజీజీ అధికారులు పాల్గొన్నారు. మొత్తంగా 1.84 లక్షల మందికి సీట్లు.. మూడు దశల కౌన్సెలింగ్‌లలో మొత్తంగా 1,84,157 మందికి సీట్లను కేటాయించినట్లు దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి వెల్లడించారు. అందులో బాలురు 1,00,743 మంది ఉండగా, బాలికలు 83,414 మంది ఉన్నట్లు తెలిపారు. దోస్త్ పరిధిలోని 1,045 కాలేజీల్లో 4,03,069 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. 21 మైనారిటీ కాలేజీలు, 29 కాలేజీలు కోర్టును ఆశ్రయించి సొంతంగా ప్రవేశాలు చేపడుతున్నాయని పేర్కొన్నారు. మొదటి రెండు దశల్లో 1.51 లక్షల మందికి సీట్లను కేటాయిస్తే 1,26,863 మంది కాలేజీల్లో చేరారన్నారు. ఒక్క విద్యార్థి చేరని కాలేజీలు 43.. డిగ్రీ ప్రవేశాల్లో భాగంగా 43 కాలేజీల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. ఇక 25 మందిలోపు చేరినవి 88, 50 మందిలోపు చేరినవి 101, వందలోపు విద్యార్థులు చేరినవి 234 కాలేజీలున్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో 54,375 సీట్లు భర్తీ అయ్యాయి. సగానికిపైగా బీసీలే.. డిగ్రీ కాలేజీల్లో చేరేందుకు దరఖాస్తు చేసిన వారు, సీట్లు పొందిన వారు సగానికి పైగా బీసీలే ఉన్నారు. సీట్లు పొందిన వారిలో 1,07,676 మంది బీసీలు. ఓసీలు 31,515 మంది ఉండగా, ఎస్సీలు 29,285, ఎస్టీలు 15,681 మంది ఉన్నారు. -
పెనుబాకలో భగ్గువున్న పాతకక్షలు
నిధులు విదల్చని చంద్రబాబు సర్కార్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్న కళాశాలలు ప్రభుత్వ వైఖరిపై మండిపడుతున్న విద్యార్థి సంఘాలు తిరుపతి : ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించదు.. బకాయిలు చెల్లించనిదే కళాశాలల యాజమాన్యాలు కోర్సు పూర్తి అయిపోయినా విద్యార్థులకు టీసీ తదితర సర్టిఫికెట్లు ఇవ్వవు. ఫలితంగా పైచదువులకు వెళ్లాలనుకునే పేద విద్యార్థులు నలిగిపోతున్నారు. సర్టిఫికెట్ల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు కాళ్లరిగేలా కళాశాలల చుట్టూ తిరుగుతున్నారు. డబ్బు లేక చదువు మధ్యలో ఆగి పోరాదు. పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలనే మహోన్నత లక్ష్యంతో దివంగత సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి 2008 అక్టోబర్‌లో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆయన చనిపోయిన తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో పేద విద్యార్థులకు కష్టాలు మొదలయ్యాయి. బీసీ, ఎస్సీ విద్యార్థులకు ప్రీ, పోస్ట్‌మెట్రిక్ స్కాలర్షిప్లు, ట్యూషన్, స్పెషల్ ఫీజు చెల్లింపులకు విఘాతం ఏర్పడింది. ప్రభుత్వం నుంచి బకాయిలు రాకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం జిల్లాలో 55 వేల మంది బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌లకు సంబంధించి రూ.80 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. 32 వేల మంది ఎస్సీ విద్యార్థులకు రూ.47 కోట్లు చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు 22 వేల మందికి 30 కోట్లు చెల్లించారు. 1500 మంది ఎస్టీ విద్యార్థులకు రూ.2 కోట్లు, 2300 మంది మైనారిటీ విద్యార్థులకు రూ.3 కోట్లు వంతున చెల్లించాల్సి ఉంది. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ప్రభుత్వం మంజూరు చేస్తుందన్న నమ్మకం లేక ఇటీవల ఎస్వీయూలో పీజీ అడ్మిషన్లు జరిగినపుడు ఓసీ కేటగిరీ విద్యార్థుల నుంచి అధికారులు ముందుజాగ్రతగా మొత్తం ఫీజు కట్టించుకున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించని ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా విద్యా సంవత్సరం పూర్తిచేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా కళాశాలల యాజమాన్యాలు వేధిస్తున్నాయి. దీనిపై విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపడుతున్నాయి. విద్యారంగం పట్ల నిర్లక్ష్యం ప్రభుత్వం తీరు చూస్తుంటే విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నట్లుంది. పేద విద్యార్థులు ఎదగడం ప్రభుత్వానికి ఇష్టం లేనట్లుంది. కోట్లాది రూపాయ ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా వారి జీవితాలతో ఆటలాడుతోంది. ప్రభుత్వ వైఖరి మారాలి. ఫీజు రీయిం బర్స్మెంట్ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలి. - పద్మ, ఎస్వీయూ పీజీ విద్యార్థిని సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు ఫీజు బకాయిలు ఉన్నాయం టూ కళాశాల యాజమాన్యా లు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ‘ప్రభుత్వం నిధులు మంజూ రు చేయక పోతే ఎలా? మేము నష్టపోవాలా?’ అని కళాశాలల యాజమాన్యాలు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నాయి. తక్షణం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించి ప్రభుత్వమే సమస్యకు పరిష్కారం చూపాలి. - శ్రావణ్, పీజీ విద్యార్థి కంప్లయింట్లు అందుతున్నాయి ఫీజు బకాయిలను సాకుగా చూపి ప్రైవేట్ కళాశాలలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని పడమటి మండలాల నుంచి కంప్లయింట్లు వచ్చాయి. వాటి ని పరిశీలిస్తున్నాం. అయితే ప్రభుత్వ కళాశాలలపై ఎక్కడా ఇలాంటి ఫిర్యాదులు అందలేదు. ఏది ఏమైనా విద్యార్థులను ఇబ్బంది పెట్టే చర్యలను ఉపేక్షించం. - జీఎల్.నాగభూషణం, ఆర్ఐవో -
రాజన్నకు ఘన నివాళి
దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డిని ప్రజలు తమ గుండెల్లో నిలుపుకున్నారు. ఆయన జయంతిని మంగళవారం వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో వాడవాడలా ఘనంగా జరుపుకున్నారు. పలుచోట్ల వైఎస్ఆర్ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. పూజలు నిర్వహించారు. పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. తిరుపతి: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి 65వ జయంతిని జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ శ్రేణులు మంగళవారం ఘనంగా జరుపుకున్నాయి. తిరుపతి తుడా సర్కిల్లో వైఎస్ విగ్రహానికి పార్టీ కేంద్రపాలకవర్గ సభ్యుడు, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పూజలు నిర్వహించి, నివాళులర్పించారు. పార్టీ పట్టణశాఖ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మదనపల్లె పార్టీ కార్యాలయంలో జరిగిన వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో స్థానిక శాసనసభ్యుడు దేశాయ్ తిప్పారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పలువురు పార్టీ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు హాజరై వైఎస్ఆర్ చిత్ర పటానికి పూజలు నిర్వహించి నివాళులు అర్పించారు. పుంగనూరులో జరిగిన జయంతి వేడుకల్లో మున్సిపల్ మాజీ చైర్మన్ కొండవీటి నాగభూషణం, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు వెంకటరెడ్డియాదవ్ పాల్గొన్నారు. పలమనేరులో ఎమ్మెల్యే అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. స్థానిక శివాలయంలో వరుణయాగం జరిపించారు. వర్షాలు విరివిగా కురిసి వ్యవసాయం అభివృద్ధి చెంది వైఎస్ఆర్ ఆశయాలు నెరవేరాలని మొక్కుకున్నారు. పేదలకు అన్నదానం చేశారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని మండల కేంద్రాలు, గ్రామ పంచాయతీల్లో కార్యకర్తలు వైఎస్ఆర్ చిత్రపటాలకు పూజలు నిర్వహించి పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. గంగాధర నెల్లూరు నియోజవర్గంలోని పలు మండ లాల్లో జరిగిన వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో స్థానిక శాసనసభ్యుడు, పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.నారాయణస్వామి పాల్గొన్నారు. ఆయన ఆధ్వర్యంలో కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాలలో పార్టీ నాయకులు,కార్యకర్తలు వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో బి కొత్తకోట, మొలకలచెర్వు, తంబళ్లపల్లె, పెద్దమండ్యం మండలాల్లో వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాలు జరిగాయి. చిత్తూరు డీసీసీబీ కార్యాలయం ఆవరణలోని వైఎస్ఆర్ విగ్రహానికి జంగాలపల్లి శ్రీనివాసులు, పార్టీ మహిళావిభాగం జిల్లా అధ్యక్షురాలు గాయత్రీదేవి ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. వృద్ధాశ్రమంలో అనాథలకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. మాజీ శాసనసభ్యుడు ఏఎస్ మనోహర్ ఆధ్వర్యంలో స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూజలు నిర్వహించి నివాళులర్పించారు. అనుప్పల్లెలోని వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. కుప్పంలో పార్టీ నియోజకవర్గ నాయకుడు చంద్రమౌళి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, స్థానిక బధిర పాఠశాలలో విద్యార్థులకు పండ్లు పంచిపెట్టారు. అన్నదానం చేశారు. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సుబ్రమణ్యం రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూజలు చే సి ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. బంగారుపాళెం, యాదమరి, త వణంపల్లెల్లో జరిగిన వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో స్థానిక శాసనసభ్యుడు డాక్టర్ సునీల్ పాల్గొన్నారు. సత్యవేడులో నియోజకవర్గం ఇన్చార్జ్ ఆదిమూలం ఆధ్వర్యంలో కార్యకర్తలు వైఎస్ఆర్ చిత్రపటానికి నివాళులు అర్పించిన అనంతరం స్వీట్లు పంచిపెట్టారు. -
రాజన్నకు నివాళి
సాక్షి, ఖమ్మం: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 65వ జయంతి వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వైఎస్ విగ్రహాలకు పాలాభిషేకాలు చేసి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్యమంత్రిగా వైఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలను, ఆయన సేవలను స్మరించుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు, అనాథాశ్రమాల్లో పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. జిల్లాలోని పలు ప్రాంతాలలో అన్నదానం చేశారు. ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన జయంతి వేడుకలలో వైఎస్సార్ సీపీ శాసనసభా పక్ష నేత, అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు పాల్గొని వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. అపర భగీరథుడు, పేదల పెన్నిధి వైఎస్ అని కొనియాడారు. ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్మెంట్, రైతులకు రుణమాఫీ, పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు, గిరిజనులకు భూ పంపిణీ చేసి బలహీన వర్గాల ఆశాజ్యోతిగా పేరుతెచ్చుకున్నారని కొనియాడారు. ఆయన మరణంతో రాష్ట్రం చిన్నాభిన్నమై పోయిందని, పేదలకు సంక్షేమ పథకాల అమలులో జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ హయాంలో ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి జరిగిందన్నారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ ప్రస్తుత ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందో..రాదోనని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని, దీనిపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త కూరాకుల నాగభూషణం, నగర పార్టీ అధ్యక్షుడు తోట రామారావు, జిల్లా అధికార ప్రతినిధి ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, నాయకులు ఆకుల మూర్తి మాట్లాడుతూ వైఎస్ అభివృద్ధి, సంక్షేమం అనే రెండు చక్రాల బండితో రాష్ట్రాన్ని పాలించారన్నారు. అలాంటి మహానేత మరణంతో ప్రజలకు భరోసా ఇచ్చేవారు కరువయ్యారని అన్నారు. అనంతరం కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కీసర పద్మజారెడ్డి, నగర అధ్యక్షురాలు కొత్తగుండ్ల శ్రీలక్ష్మీ, ఉపాధ్యాయ విభాగం జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి గురుప్రసాద్, నాయకులు షర్మిలాసంపత్, కాంపెల్లి బాలకృష్ణ, రఘుదారల కొండలరావు, దామోదర్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, హెచ్.వెంకటేశ్వర్లు, మందడపు రామకృష్ణారెడ్డి, భాస్కర్‌నాయుడు, పత్తి శ్రీను, మైకా కృష్ణ, పొదిలి వెంకటేశ్వర్లు, కొంగర జ్యోతిర్మయి, ఆలస్యం సుధాకర్, చక్రపు సత్యనారాయణ, షకీనా, గడ్డం ఉపేందర్, వెంపటి నాగేశ్వరరావునాయుడు, కొణత ఉపేందర్, బాణాల లక్ష్మణ్, పెరుమాళ్ల లత, ఉపేంద్రారెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో పండ్లు పంపిణీ.. వైఎస్ జయంతి సందర్భంగా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఆస్పత్రిలో బిడ్డకు జన్మనిచ్చిన కొత్తగూడెం మండలం పాత అంజనాపురం గ్రామానికి చెందిన చింత కూమారికి పండ్లు పంపిణీ చేశారు. తల్లిదండ్రుల కోరిక మేరకు చిన్నారికి రాజశేఖర్ అని నామకరణం చేశారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే ఆర్థిక సహాయం చేశారు. అనంతరం దమ్మపేటలో జరిగిన కార్యక్రమంలో 25 మంది పేదలకు వస్త్రదానం చేశారు. వైరా, కొణిజర్ల మండలాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే బాణోత్ మద న్లాల్ పాల్గొన్నారు. వైరా బాలవెలుగు పాఠశాలలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. వైరా క్రాస్‌రోడ్డు, పాత బస్టాండ్ సెంటర్లో వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వికలాంగులకు వీల్చైర్లు పంపిణీ చేశారు. మణుగూరు వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కేక్‌కట్ చేసి వైఎస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పినపాకలోని ఏడూళ్లబయ్యారం క్రాస్‌రోడ్డులో వైఎస్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. భద్రాచలం పాత మార్కెట్ సెంటర్లో ఉన్న వైఎస్ విగ్రహానికి వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తెల్లం వెంకట్రావ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎటపాకలోని సరోజనమ్మ వృద్ధాశ్రమంలో అన్నదానం నిర్వహించి పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. కూసుమంచి, నాయకన్గూడెంలలో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం మూడు జిల్లాల కో ఆర్డినేటర్ సాధు రమేష్‌రెడ్డి పాల్గొని వైఎస్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఖమ్మం రూరల్ మండలం మద్దివారిగూడెంలో వైఎస్ విగ్రహానికి పార్టీ నాయకులు మందడి పుల్లారెడ్డి, కొత్తా శ్రీనివాసరెడ్డి పాలాభిషేకం చేశారు. ఇల్లెందు, బయ్యారం, గార్ల, కామేపల్లి, టేకులపల్లి మండల కేంద్రాల్లోనూ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇల్లెందు పట్టణ కన్వీనర్ దొడ్డా డానియేల్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైద్యశాలలో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. కొత్తగూడెం పట్టణ కన్వీనర్ బీమా శ్రీధర్ ఆధ్వర్యంలో సెవెన్‌హిల్స్ సెంటర్ వద్ద వైఎస్సార్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. పాల్వంచలో జిల్లా పార్టీ నాయకులు ఎర్రంశెట్టి ముత్తయ్య, కొత్వాల శ్రీను ఆధ్వర్యంలో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేశారు. సత్తుపల్లిలో పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మట్టా దయానంద్‌విజయ్‌కుమార్ వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి ఆర్పించారు. మధిరలో మండల కన్వీనర్ ఎన్నం కోటేశ్వరరావు ఆధ్వర్యంలో వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి, ప్రభుత్వ ఆస్పత్రి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. -
మన్యంలో ఫ్యాన్ గాలి
ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు వైఎస్సార్సీపీ పరం సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ పట్నం జిల్లాలో మన్యం వాసులు వైఎస్సార్సీపీ పక్షాన నిలిచారు. జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పవనాలు వీ చినా మన్యంలో మాత్రం ఇందుకు భిన్నంగా జరిగిందిు. దివంగత మహా నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పథకాలతో లబ్ధిపొందిన గిరిజనులు ఈ ఎన్నికల్లో జగన్మోహన్రెడ్డి బలపర్చిన అభ్యర్థులగు గెలిపించడం ద్వారా తమ రుణం తీర్చుకున్నా రు. ఆరోగ్యశ్రీ, రుణమాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలు మన్యం వాసుల గుండెల్లో రాజన్నను కొలువుంచాయి. అందుకే వారంతా మూకుమ్మడిగా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి రెండు అసెంబ్లీ సీట్లను, ఒక లోక్‌సభ స్థానాన్ని గెలిపించి రాజన్నకు కానుకగా ఇచ్చారు. అరకు నుంచి ఎమ్మెల్యేగా కిడారి సర్వేశ్వరరావును మంచి మెజార్టీతో గెలిపించి గిరిజనులు తమ కలల సారథిగా అసెంబ్లీకి పంపారు. గతంలో శాసన మండలి సభ్యునిగా ఉన్న సర్వేశ్వరరావును ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో గెలిపించి తమ సమస్యలు పరిష్కరించే బాధ్యత అప్పగించారు. దీంతోబాటు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన టీచర్ ఈశ్వరిని సైతం గిరిజనులు నిరాశపర్చకుండా ఓట్లతో ఆశీర్వదించారు. దీంతో ఆమె మొదటి ప్రయత్నంలోనే సునాయాసంగా చట్టసభకు ఎన్నికయ్యారు. అరకు లోక్‌సభ సైతం రెండు అసెంబ్లీ స్థానాలతోబాటు అరకు లోక్‌సభ స్థానంలోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థి కొత్తపల్లి గీతకు విజయాన్ని అందించారు. గతంలో సబ్‌కలెక్టర్‌గా, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలిగా ప్రజల సమస్యలను దగ్గర్నుంచి చూసిన గీత అయితే తమ సమస్యలను సమర్థంగా పరిష్కరించగలరన్న నమ్మకంతో ఆమెను తమ ప్రతినిధిగా ఏకంగా పార్లమెంట్‌కు పంపారు. ప్రజల ఆశీర్వాదాలు మెండుగా ఉండడంతో ఆమె ఏకంగా రాజకీయ దిగ్గజమైన కిశోర్ చంద్రదేవ్‌ను సునాయాసంగా ఓడించారు. అంతేకాకుండా అరకు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని సాలూరు, కురుపాం, పాలకొండ నియోజకవర్గాలు సైతం వైఎస్సార్సీపీ గెలుచుకోవడం గిరిజనుల్లో వైఎస్ఆర్ పట్ల ఉన్న ప్రేమాభిమానాలకు నిదర్శనమని చెప్పవచ్చు. -
ఇంకెన్నాళ్లు మోసగిస్తారు..?
చంద్రబాబు మాయమాటలు ప్రజలు నమ్మరు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తిరుపతి (మంగళం), న్యూస్‌లైన్ : మామను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు అవిచేస్తా, ఇవి చేస్తానంటూ ఇంకెన్నాళ్లు మోసగిస్తావంటూ చంద్రబాబుపై తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ధ్వజమెత్తారు. తిరుపతి పరిధిలోని పూ లవానిగుంట, గొల్లవానిగుంట, ఆటోనగర్ ప్రాంతాల్లో పార్టీ నాయకులు రాజ గోపాల్‌రెడ్డి, చల్లా ఆధ్వర్యంలో ఎమ్మె ల్యే ప్రజాబాట నిర్వహించారు. ఈ సందర్భంగా కరుణాకరరెడ్డి మాట్లాడు తూ తొమ్మిదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఆవగింజంత మేలు కూడా చేయలేదని బాబుపై మండిపడ్డా రు. తొమ్మిదేళ్లపాటు చేసిన తప్పులకు ప్రజలు ఆయనను పదేళ్లపాటు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారన్నారు. మహానేత వైఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కిరణ్ కుమార్‌రెడ్డి నీరుగారుస్తుంటే చంద్రబా బు నోరువిప్పకపోవడం దారుణమన్నా రు. ఐదేళ్ల పాలనలో ప్రపంచంలో ఏ నాయకుడూ చేయలేనన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మహానేత వైఎస్. రాజశేఖరరెడ్డి చేశారని సగర్వం గా చెప్పారు. ఆయన మరణానంతరం తండ్రి ఆశయ సాధనకోసం, పేదల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడుతున్న వ్యక్తి వైఎస్. జగన్మోహన్రెడ్డి అన్నారు. రాబోయే ఎన్నికల్లో జగనన్న ను గెలిపించాలని, అధికారంలోకి రాగా నే పొదుపు సంఘాల్లోని దాదాపు రూ. 20వేల కోట్ల మహిళా రుణాలను మాఫీ చేస్తారని తెలిపారు. అమ్మఒడి పేరుతో బిడ్డలను బడికి పంపించే ప్రతి తల్లిదండ్రులకు నెలకు రూ.500ల చొప్పున ప్ర తి నెలా వారి ఖాతాలో వేస్తామన్నారు. రూ.6వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా పేద విద్యార్థులకు ఉన్న త విద్యను అందిస్తామని హామీ ఇచ్చా రు. వికలాంగులు, వితంతువులు, వృద్ధులకు ప్రతినెలా రూ.700ల నుంచి వెయ్యి రూపాయల వరకు పెన్షన్ ఇప్పిస్తామని, అలాగే రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు. అభివృద్ధే లక్ష్యంగా... తిరుపతి నగరం అభివృద్ధికి నిరంతరం కృషి చేసి నగరంలో మురికివాడలే లేకుండా చేస్తానని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి హామీ ఇచ్చారు. తాను ఉపఎన్నికల్లో గెలుపొందినప్పటి నుంచి నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యలను పూర్తిగా తెలుసుకుని అనేక సమస్యలు పరిష్కరించానని గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో తిరిగి గెలిపిస్తే తిరుపతి నగరాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు వెలగపల్లి వరప్రసాద్, నాయకులు పులుగోరు ప్రభాకర్‌రెడ్డి, ఆదం రాధాకృష్ణారెడ్డి, ఆదం సుధాకర్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, కుప్పయ్య, కిట్టు, నరిసింహారెడ్డి, శంకర్, రాము, బాబూయాదవ్, నూరుల్లా, మునిరత్నం, పూజారి లక్ష్మి, కావేరి, కవిత పాల్గొన్నారు. -
భయోమెట్రిక్
‘ఉపకారం’ మంజూరుకు కొత్త విధానం సర్కారు గిమ్మిక్కుతో విద్యార్థులకు చిక్కులు విద్యార్థులకు లబ్ధిచేకూర్చే పథకాలకు ఎన్ని అడ్డంకులు సృష్టించాలో అన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఆచరణలో పెడుతోంది. తాజాగా ఉపకార వేతనాల మంజూరుకు సర్కారు ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ విధానంతో విద్యార్థులు కొత్త చిక్కులు ఎదుర్కొంటున్నారు. ఈ విధానంలో లబ్ధిదారులైన విద్యార్థుల వేలిముద్రలను ప్రభుత్వం ఆధార్ లింక్ ద్వారా తీసుకుని బయోమెట్రిక్ మెషీన్లో నిక్షిప్తం చేసింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాతే అసలు సమస్య మొదలవుతోంది. ఈ ప్రక్రియ ముగిశాక మళ్లీ విద్యార్థుల వేలిముద్రలు సేకరిస్తున్నారు. అవి పాతవాటితో సరిపోని పక్షంలో ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు గండికొడుతుండడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నూజివీడు, న్యూస్‌లైన్ : గతంలో కళాశాల విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను మంజూరుచేయాలంటే అధికారులే సంబంధిత విద్యాసంస్థకు వెళ్లి దరఖాస్తులను పరిశీలించేవారు. కానీ ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వం కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ఆధార్ కార్డుకోసం విద్యార్థులిచ్చిన వేలిముద్రలను ప్రభుత్వం లింక్ ద్వారా తీసుకుని వాటిని బయోమెట్రిక్ మెషీన్లో పొందుపరిచింది. విద్యార్థులు ఉపకార వేతనాలకోసం దరఖాస్తు చేసుకోవడం పూర్తయిన తర్వాత మరోసారి వేలిముద్రలను సేకరిస్తున్నారు. ఇవి పాత వేలిముద్రలతో సరిపోతేనే వారికి ఉపకారవేతనం, ఫీజు రీయింబర్స్మెంట్ మంజూరుచేస్తున్నారు. లేకుంటే దరఖాస్తులను పక్కన పెడుతున్నారు. మరికొంతమందికి ఆధార్ కార్డులున్నప్పటికీ వారి వేలిముద్రలను బయోమెట్రిక్ మెషీన్లు తీసుకోవడం లేదు. ఆధార్ దిగినప్పటికీ కార్డు రానివారు వందలాదిమంది విద్యార్థులున్నారు. వారందరి వేలిముద్రలను కూడా ఈ మెషీన్ తీసుకోవడం లేదు. ఫలితంగా వారందరి దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. దీంతో కొన్ని కళాశాలల యాజమాన్యాలు వారందరినీ ఫీజులు చెల్లించాల్సిందేనని కరాఖండిగా చెబుతున్నాయి. ఇక తమకు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ మంజూరుకాదేమోనని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితిని జిల్లాలోని డిగ్రీ, పీజీ, ఇంజినీరింగు, ఫార్మసీ కళాశాలల్లో చదువుకుంటున్న వందలాది మంది విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. ఇదే విషయాన్ని పలువురు ప్రజావాణిలో అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. ఇంటర్మీడియెట్ విద్యార్థులకు మాత్రం బయోమెట్రిక్ విధానం లేకపోవడంతో వారికి ఎలాంటి ఇబ్బందీ లేదు. మూడుసార్లు దిగినా కార్డు రాలేదు.. మొదటిసారి ఆధార్ దిగినప్పుడు కార్డు రాలేదు. అధికారులను అడిగితే మళ్లీ ఫొటో తీశారు. అయినా రాలేదు. మూడోసారి విజయవాడలో మళ్లీ దిగాను. అయినా నాకు ఇంతవరకు కార్డు అందలేదు. బయోమెట్రిక్ మెషీన్ నా వేలిముద్రలను తీసుకోవడం లేదు. అసలు ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందో, రాదో అర్థం కావడం లేదు. ఇప్పటికైనా నా సమస్యను అధికారులు పరిష్కరించాలి. -ముత్యాల ప్రియాంక, డిగ్రీ విద్యార్థిని నూజివీడు విజయవాడ వెళ్లండి.. బయోమెట్రిక్ మెషీన్లో వేలిముద్రలు నమోదు కాని విద్యార్థులు విజయవాడలో ఉన్న శాశ్వత ఆధార్ కేంద్రానికి వెళ్లి తమ వేలిముద్రలు నమోదు చేయించుకోవాలి. అప్పటికీ వేలిముద్రలు సరిపోకపోయినా, మెషీన్ తీసుకోకపోయినా వారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతాం. -మధుసూదనరావు, జేడీ, సాంఘిక సంక్షేమ శాఖ -
పేదల బతుకులో మార్పుతెస్తా
సత్యవేడు/నాగలాపురం, న్యూస్‌లైన్: రెండు సంతకాలతో పేదల బతుకుల్లో మార్పు తీసుకువస్తానని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్. జగన్మోహన్రెడ్డి తెలిపారు. చిత్తూరు రచ్చబండ సభకు వస్తూ మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడాన్ని తట్టుకోలేక నాగలాపురం మండలం ఎస్ఎస్పురం దళితవాడకు చెందిన బాలపల్లి పెద్దబ్బ భార్య సుబ్బమ్మ గుండెపోటుతో మృతి చెందింది. ఆమె కుటుంబాన్ని జగన్ మోహన్‌రెడ్డి సోమవారం ఓదార్చారు. పెద్దబ్బ ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు, మనవడు, మనవరాళ్లను ఆయన పరామర్శించారు. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తానుచేసే తొలి రెండు సంతకాలతో పేదబతుకుల్లో మార్పులు వస్తాయని భరోసా ఇచ్చారు. తొలి సంతకంతో అవ్వా, తాతలకు * 700 పింఛన్, రెండవ సంతకంతో అమ్మఒడి పథకం ద్వారా చదువుకునే చిన్నారులకు నెలకు *1000 అందుతుందని తెలిపారు. ఈ పథకం ద్వారా పేదలు తమ బిడ్డలను ఖర్చు లేకుండా చదివించుకోవచ్చన్నారు. అనంతరం పెద్దబ్బ కుటుంబ సభ్యుల వివరాలను పేరుపేరునా అడిగి తెలుసుకున్నారు. తాను ఎస్వీ యూనివర్సిటీలో ఫిజిక్స్ సబ్జెక్టులో పీహెచ్డీ చేస్తున్నానని, ఫీజు రీయింబర్స్మెంట్ అందక ఇబ్బందులు పడుతున్నామని పెద్దబ్బ చిన్న కుమారుడు చంద్రబాబు తెలిపారు. పీహెచ్డీ చేస్తున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రాజీవ్‌గాంధీ నేషనల్ ఫెలోషిప్ ద్వారా ఇచ్చే స్కాలర్షిప్ను నిలిపివేశారని, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని జననేతకు చంద్రబాబు తెలిపాడు. ఆర్థిక సాయం అందకపోవడంతో చదువులు మాని పనులకు వెళ్తున్నామని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశాడు. అనంతరం తాతా.. పింఛన్ వస్తుందా అని పెద్దబ్బను జగన్మోహన్రెడ్డి అడిగారు. *200 వస్తుందని ఆయన తెలిపాడు. మరో నాలుగు నెలలు ఓపిక పడితే వృద్ధులకు మంచిరోజులు వస్తాయన్నారు. కూలిపనులకు వెళ్లి జీవనం సాగిస్తున్నామని జగన్మోహన్రెడ్డి దృష్టికి పెద్దబ్బ కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం పెద్దబ్బ పెద్దకోడలు రేణుకతో మాట్లాడారు. మీ గ్రామంలో పాఠశాల ఉందా? పిల్లలను బడికి పంపుతున్నారా? వసతులు ఎలా ఉన్నారుు? మంచినీటి వసతి ఉందా? ఉపాధ్యాయులు పాఠాలను సక్రమంగా నేర్పుతున్నారా?, మధ్యాహ్న భోజనం ఎలా ఉంటోందని ఆరాతీశారు. పాఠశాలలో వసతులు సక్రమంగా లేవని, మరుగుదొడ్ల సౌకర్యం లేదని, మధ్యాహ్న భోజనం బాగుండడం లేదని ఆమె తెలిపింది. పావలా వడ్డీ రుణాలు ఇవ్వడం లేదని తెలియజేసింది. అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న పెద్దబ్బ మనవడు మాతయ్య(5), అదే గ్రామానికి చెందిన సుభాషిణి కుమార్తె పూజ(4 నెలలు)ను వైఎస్. జగన్ పరామర్శించారు. వీరిద్దరి వైద్య సేవల విషయమై చూడాలని పార్టీ రాజంపేట, తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గాల పరిశీలకులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వరప్రసాద్‌కు సూచించారు. మిథున్, వరప్రసాద్‌లను ఆయన వారికి పరిచయం చేశారు. తిరుపతి ఎంపీ స్థానానికి వరప్రసాద్, సత్యవేడు అసెంబ్లీ స్థానానికి ఆదిమూలం పోటీ చేయనున్నారని తెలిపారు. వీరికి సహకరించాలని వారి ఫోన్ నంబర్లను పెద్దబ్బ కుటుంబ సభ్యులకు ఇచ్చారు. మీ బాబాయిలా పెద్ద చదువులు చదువుకోవాలని పెద్దబ్బ మనుమరాళ్లను దీవించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గాయత్రీదేవి, సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త ఆదిమూలం, వైఎస్సార్ సీపీ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బీరేంద్ర వర్మ, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు చిన్నదురై, ఎస్ఎస్పురం గ్రామ సర్పంచ్ సుబ్రమణ్యం పాల్గొన్నారు.