మన్యంలో ఫ్యాన్ గాలి
- ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు వైఎస్సార్‌సీపీ పరం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ పట్నం జిల్లాలో మన్యం వాసులు వైఎస్సార్‌సీపీ పక్షాన నిలిచారు. జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పవనాలు వీ చినా మన్యంలో మాత్రం ఇందుకు భిన్నంగా జరిగిందిు. దివంగత మహా నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పథకాలతో లబ్ధిపొందిన గిరిజనులు ఈ ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డి బలపర్చిన అభ్యర్థులగు గెలిపించడం ద్వారా తమ రుణం తీర్చుకున్నా రు.
ఆరోగ్యశ్రీ, రుణమాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలు మన్యం వాసుల గుండెల్లో రాజన్నను కొలువుంచాయి. అందుకే వారంతా మూకుమ్మడిగా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి రెండు అసెంబ్లీ సీట్లను, ఒక లోక్‌సభ స్థానాన్ని గెలిపించి రాజన్నకు కానుకగా ఇచ్చారు. అరకు నుంచి ఎమ్మెల్యేగా కిడారి సర్వేశ్వరరావును మంచి మెజార్టీతో గెలిపించి గిరిజనులు తమ కలల సారథిగా అసెంబ్లీకి పంపారు.
గతంలో శాసన మండలి సభ్యునిగా ఉన్న సర్వేశ్వరరావును ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో గెలిపించి తమ సమస్యలు పరిష్కరించే బాధ్యత అప్పగించారు. దీంతోబాటు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన టీచర్ ఈశ్వరిని సైతం గిరిజనులు నిరాశపర్చకుండా ఓట్లతో ఆశీర్వదించారు. దీంతో ఆమె మొదటి ప్రయత్నంలోనే సునాయాసంగా చట్టసభకు ఎన్నికయ్యారు.
అరకు లోక్‌సభ సైతం
రెండు అసెంబ్లీ స్థానాలతోబాటు అరకు లోక్‌సభ స్థానంలోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కొత్తపల్లి గీతకు విజయాన్ని అందించారు. గతంలో సబ్‌కలెక్టర్‌గా, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలిగా ప్రజల సమస్యలను దగ్గర్నుంచి చూసిన గీత అయితే తమ సమస్యలను సమర్థంగా పరిష్కరించగలరన్న నమ్మకంతో ఆమెను తమ ప్రతినిధిగా ఏకంగా పార్లమెంట్‌కు పంపారు.
ప్రజల ఆశీర్వాదాలు మెండుగా ఉండడంతో ఆమె ఏకంగా రాజకీయ దిగ్గజమైన కిశోర్ చంద్రదేవ్‌ను సునాయాసంగా ఓడించారు. అంతేకాకుండా అరకు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని సాలూరు, కురుపాం, పాలకొండ నియోజకవర్గాలు సైతం వైఎస్సార్‌సీపీ గెలుచుకోవడం గిరిజనుల్లో వైఎస్‌ఆర్ పట్ల ఉన్న ప్రేమాభిమానాలకు నిదర్శనమని చెప్పవచ్చు.