సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఖరితో ఆస్పత్రులు ఆరోగ్యశ్రీని నిరాకరిస్తుంటే పేదలు తల్లడిల్లిపోతున్నారని అన్నారు. ఆరోగ్యశ్రీకి సంబంధించిన లక్షల క్లెయిమ్‌లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. నెట్వర్క్ఆస్పత్రులకు ప్రభుత్వం కోట్ల రూపాయలు బకాయి పడిందని మండిపడ్డారు. రాష్ట్రంలో రెండు వేల మంది ఆరోగ్యమిత్రలు అవసరమైతే.. ప్రస్తుతం 700 మంది మాత్రమే ఉన్నారని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment