Gopireddy
-
నరసరావుపేట: గోపిరెడ్డి హత్యకు చదలవాడ కుట్ర..!
సాక్షి, నరసరావుపేట, నరసరావుపేట టౌన్ :నరసరావుపేటలో రాజకీయాలను ‘పచ్చ’ దండు వ్యక్తిగత కక్షగా మార్చి, ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఓటమి భయంతో టీడీపీ అరాచకం సృష్టిస్తోంది. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు.. చివరకు ఓటు వేసిన వారి ఇళ్లపై విధ్వంసానికి పూనుకుంది. పల్నాడు ప్రాంతంలో ఎన్నికలప్పుడు ప్రధాన పార్టీల మధ్య గొడవలు ఎన్నో ఏళ్లుగా రగులుతూనే ఉంటాయి. ఎన్నికల అనంతరం ఆ పగలు చల్లారి, అన్నదమ్ముల్లా కలసిమెలసి ఉంటారు. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకత్వం సరికొత్త ప్రతీకారానికి తెర తీసింది.గత ఎన్నికల్లో ఓటమి మూటగట్టుకుని మరోసారి పోటీకి దిగిన నరసరావుపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబుకు మళ్లీ ఓటమి ఖాయమని పోలింగ్‌కు ముందే అన్ని సర్వేలు తేల్చాయి. దీంతో ఆయన వెన్నులో వణుకు పుట్టింది. ఈ క్రమంలో ప్రత్యర్థిని అడ్డు తొలగించుకుంటే తన గెలుపు ఖాయమని భావించి, నరసరావుపేటలో విధ్వంసానికి ప్రణాళిక రచించారని సమాచారం. ఇందులో భాగంగా పోలింగ్ రోజున నరసరావుపేట వైఎస్సార్సీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటిపైకి సుమారు 200 మంది టీడీపీ రౌడీలు మారణాయుధాలతో పట్టపగలు దాడికి వెళ్లారు. ఆ సమయంలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంట్లో లేకపోవడంతో ఆయన మామ కంజుల రామకోటిరెడ్డిపై దాడికి తెగబడ్డారు. ఈ సంఘటనపై అరవింద్‌బాబుతో పాటు మరో 30 మందిపై నరసరావుపేట టూటౌన్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కాగా, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని మట్టుబెట్టాలనే పథకంతోనే ఆయన ఇంటిపైకి దాడికి వచ్చినట్లు తెలిసింది. ఈ దాడికి ఇతర రాష్ట్రాల నుంచి బౌన్సర్లు, కిరాయి రౌడీలను అరవింద్ బాబు పోలింగ్ ముందు రోజు రాత్రికే రప్పించినట్టు సమాచారం.అరవింద బాబు ఇంట్లో పెట్రోల్ బాంబులు, వేట కొడవళ్లు గొడవల నేపథ్యంలో పోలింగ్ అనంతరం టీడీపీ అభ్యర్థి అరవింద బాబును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఆ సయమంలో ఆయన ఇంట్లో (ఇల్లు, ఆస్పత్రి ఒకచోటే) సోదాలు నిర్వహించగా.. పెట్రోల్ బాంబులు, ఇనుప రాడ్లు, వేట కొడÐ] ళ్లు, కంకర రాళ్లు, ఇతర మారణాయుధాలు దొరికాయి. పోలింగ్‌కు ముందుగానే వీటిని తీసుకొచ్చి ఉంచినట్లు సమాచారం.ఈ ఎన్నికల్లోనూ ఓటమి ఖాయమని తేలడంతో గోపిరెడ్డిని అడ్డు తొలగించుకోవాలనే మారణాయుధాలు తెప్పించినట్లు తెలిసింది. మారణాయుధాలకు సంబంధించిన వీడియోలు రెండు రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయినా పోలీసులు ఇందుకు సంబంధించి ఎటువంటి కేసు నమోదు చేయకపోవడం గమనర్హం. పోలీసు పెద్దల అనుమతి రాకపోవడం వల్లే అరవింద్బాబుపై కేసు నమోదు కాలేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా నరసరావుపేటలో అల్లర్ల కారణంగా రెండు రోజుల పాటు దుకాణాలు బంద్ చేయాలని పోలీసులు ఆదేశించారు. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగేలా ఉంది. దీంతో ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టీడీపీ స్వార్థ రాజకీయాల కోసం తాము ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇలాగైతే తామెలా బతకాలని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
మానవత్వం చాటిన ఎమ్మెల్యే గోపిరెడ్డి
నరసరావుపేట: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరు యువకులకు సకాలంలో సపర్యాలు చేసి 108 అంబులెన్స్‌ను పిలిపించి వైద్యశాలకు తరలించి ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తన మానవత్వాన్ని చాటుకున్నారు. మంగళవారం చిలకలూరిపేట–విజయవాడ జాతీయ రహదారిపై ఇద్దరు యువకులు బెంగుళూరుకు కారులో వెళుతుండగా కళ్లెం టెక్స్‌టైల్స్‌కు ఎదురుగా కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టడంతో ప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయానికి ఆ మార్గంలో గుంటూరుకు వెళుతున్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి సంఘటనా స్థలంలో ఆపి స్థానికుల సహాయంతో కారు నుంచి ఆ యువకులను కిందకు తీయించారు. అపస్మారక స్థితిలో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అక్కడకు వచ్చిన అంబులెన్స్ వారిద్దరిని సిబ్బంది గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సంఘటనా స్థలంలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి స్పందించిన తీరును స్థానికులు ప్రశంసించారు. -
గుడ్‌మార్నింగ్ నరసరావుపేట కార్యక్రమంలో ఎమ్మెల్యే గొపిరెడ్డి
-
వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గోపిరెడ్డిపై టీడీపీ నేతల దౌర్జన్యం
-
గుంటూరు:నరసారావుపేటలొ ఉద్రిక్తత
-
‘ఆరోగ్యశ్రీని నిరాకరిస్తుంటే పేదలు తల్లడిల్లిపోతున్నారు’
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఖరితో ఆస్పత్రులు ఆరోగ్యశ్రీని నిరాకరిస్తుంటే పేదలు తల్లడిల్లిపోతున్నారని అన్నారు. ఆరోగ్యశ్రీకి సంబంధించిన లక్షల క్లెయిమ్‌లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. నెట్వర్క్ఆస్పత్రులకు ప్రభుత్వం కోట్ల రూపాయలు బకాయి పడిందని మండిపడ్డారు. రాష్ట్రంలో రెండు వేల మంది ఆరోగ్యమిత్రలు అవసరమైతే.. ప్రస్తుతం 700 మంది మాత్రమే ఉన్నారని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. -
‘ఆరోగ్యశ్రీని నిరాకరిస్తుంటే పేదలు తల్లడిల్లిపోతున్నారు’
-
సమష్టిగా పనిచేద్దాం
పోలీసు అధికారుల సంఘం నేతలతో డీజీపీ అనురాగ్‌శర్మ హైదరాబాద్: పోలీసు ప్రతిష్టను పెంచే విధం గా సమష్టిగా పని చేద్దామని తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ పిలుపునిచ్చారు. మంగళవారం పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు గోపిరెడ్డి నేతృత్వంలో వివిధ విభాగాల సంఘం నాయకులు డీజీపీని కలిసి శుభాకాం క్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ పోలీసుల సమస్యలు చాలా వరకు తనకు తెలుసునని, తన పరిధిలో ఉన్న వాటి ని పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పా రు. ప్రభుత్వ స్థాయిలో ఉన్న వాటిని ముఖ్యమంత్రి, హోంమంత్రిల దృష్టికి తీసుకెళుతాన ని హామీ ఇచ్చారు. డీజీపీని కలిసిన వారిలో తెలంగాణ జిల్లాల పోలీసు సంఘాల అధ్యక్షులు, ఎస్పీఎఫ్, ఏపీఎస్పీ, గ్రేహౌండ్స్, ఆర్మ్డ్ రిజర్వు విభాగాల సంఘం నేతలు ఉన్నారు. పలువురు అదనపు డీజీల బాధ్యతల స్వీకరణ మంగళవారం పలువురు అదనపు డీజీ స్థాయి అధికారులు బాధ్యతలను స్వీరించారు. రాష్ట్ర శాంతి భద్రతల విభాగం అదనపు డీజీ సత్యనారాయణ్, తెలంగాణ స్పెషల్ పోలీసు బెటాలియన్, ఆక్టోపస్, పోలీసు స్పోర్ట్స్ విభాగం అదనపు డీజీ రాజీవ్ త్రివేది, ఎస్పీఎఫ్, ప్రింటింగ్ స్టేషనరీ కమిషనర్ తేజ్‌దీప్ కౌర్ మీనన్, జైళ్ల శాఖ డెరైక్టర్ జనరల్ వినయ్‌కుమార్ సింగ్, అవినీతి నిరోధక శాఖ డెరైక్టర్ కుమార్ విశ్వజిత్‌లు ఉన్నారు. వీరితోపాటు ఐజీ స్థాయి అధికారులు వి.నవీన్‌చంద్, స్వాతి లక్రా, చారుసిన్హా, సౌమ్యమిశ్రా, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అమిత్ గార్గ్ తదితర అధికారులు కూడా బాధ్యతలను స్వీకరించిన వారిలో ఉన్నారు. -
పోలీసులపై దాడులు సరికాదు
భానుపురి, న్యూస్‌లైన్: నిత్యం ప్రజల రక్షణకు పాటుపడుతున్న పోలీసులపై ప్రజాప్రతినిధులు, ప్రజలు దాడులకు పాల్పడడం సరికాద ని పోలీసు అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏదుల గోపిరెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేట ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల విధి నిర్వహణలో ఉన్న కృష్ణాజిల్లా జి.కొండూర్, నల్లగొండ జిల్లా డిండి పోలీస్‌స్టేషన్ ఎస్ఐలపై ఆయా ప్రాం తాల ప్రజలు దాడులకు పాల్పడటం, దురుసుగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అనంతపురం జిల్లాలో ఒక ప్రజాప్రతినిధి పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐపై దాడి చేసేందుకు యత్నించాడని ఆరోపించారు. ప్రజాప్రతినిధులు, ప్రజలు పోలీసులతో స్నేహభావంతో మెలగాలని కోరారు. ఎస్ఐలకు త్వరలో గెజిటెడ్ హోదా రాష్ర్ట పరిధిలోని 5వేల మంది ఎస్ఐలకు గెజిటెడ్ హోదా త్వరలోనే కల్పించనున్నట్టు గోపిరెడ్డి పేర్కొన్నారు. పోలీసుశాఖలో హెడ్‌కానిస్టేబుల్ అయిన రెండు సంవత్సరాలకే ఏఎస్ఐ పదోన్నతి వచ్చే లా, ఉద్యోగులతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా ఆరోగ్య భద్రత ద్వారా ఉచిత వైద్య సేవలందించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. 10వ పీఆర్సీలో పోలీసు సిబ్బందికి వెయిటేజీ ఇంక్రిమెంట్లతో పాటు ప్రత్యేక అలవెన్స్‌ను పెంచాలని డిమాండ్ చేశా రు. అదే విధంగా పెండింగ్‌లో ఉన్న టీఏలు వెంటనే విడుదల చేయాలని కోరారు. జిల్లా కేంద్రంలో త్వరలో పోలీ సు క్యాంటీన్‌ను ప్రారంభించనున్నట్టు పేర్కొన్నారు. సమావేశంలో సంఘం జిల్లా కమిటీ సభ్యులు బి.అంతిరెడ్డి, గాలి శ్రీనివాస్, డి.దయాకర్, శాగంటి ఆదినారాయణమూర్తి, మేడిరాము, ఇబ్రహీం, చెన్నయ్య, సురేష్‌రెడ్డి, లక్ష్మ య్య, బొక్క రవీందర్‌రెడ్డి ఉన్నారు.