సమష్టిగా పనిచేద్దాం
పోలీసు అధికారుల సంఘం నేతలతో డీజీపీ అనురాగ్‌శర్మ
హైదరాబాద్: పోలీసు ప్రతిష్టను పెంచే విధం గా సమష్టిగా పని చేద్దామని తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ పిలుపునిచ్చారు. మంగళవారం పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు గోపిరెడ్డి నేతృత్వంలో వివిధ విభాగాల సంఘం నాయకులు డీజీపీని కలిసి శుభాకాం క్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ పోలీసుల సమస్యలు చాలా వరకు తనకు తెలుసునని, తన పరిధిలో ఉన్న వాటి ని పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పా రు. ప్రభుత్వ స్థాయిలో ఉన్న వాటిని ముఖ్యమంత్రి, హోంమంత్రిల దృష్టికి తీసుకెళుతాన ని హామీ ఇచ్చారు. డీజీపీని కలిసిన వారిలో తెలంగాణ జిల్లాల పోలీసు సంఘాల అధ్యక్షులు, ఎస్‌పీఎఫ్, ఏపీఎస్‌పీ, గ్రేహౌండ్స్, ఆర్మ్‌డ్ రిజర్వు విభాగాల సంఘం నేతలు ఉన్నారు.
పలువురు అదనపు డీజీల బాధ్యతల స్వీకరణ
మంగళవారం పలువురు అదనపు డీజీ స్థాయి అధికారులు బాధ్యతలను స్వీరించారు. రాష్ట్ర శాంతి భద్రతల విభాగం అదనపు డీజీ సత్యనారాయణ్, తెలంగాణ స్పెషల్ పోలీసు బెటాలియన్, ఆక్టోపస్, పోలీసు స్పోర్ట్స్ విభాగం అదనపు డీజీ రాజీవ్ త్రివేది, ఎస్‌పీఎఫ్, ప్రింటింగ్ స్టేషనరీ కమిషనర్ తేజ్‌దీప్ కౌర్ మీనన్, జైళ్ల శాఖ డెరైక్టర్ జనరల్ వినయ్‌కుమార్ సింగ్, అవినీతి నిరోధక శాఖ డెరైక్టర్ కుమార్ విశ్వజిత్‌లు ఉన్నారు. వీరితోపాటు ఐజీ స్థాయి అధికారులు వి.నవీన్‌చంద్, స్వాతి లక్రా, చారుసిన్హా, సౌమ్యమిశ్రా, డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, అమిత్ గార్గ్ తదితర అధికారులు కూడా బాధ్యతలను స్వీకరించిన వారిలో ఉన్నారు.