సాక్షి, సిద్ధిపేట జిల్లా: రైతుల ఉసురు పోసుకుందంటూ.. బీజేపీని కార్మిక, కర్షక వ్యతిరేక పార్టీగా అభివర్ణించారు మాజీ మంత్రి హరీష్‌రావు. బడా బడా కార్పొరేట్ సంస్థల గురించి మాత్రమే బీజేపీ ఆలోచించిందని.. 14 లక్షల కోట్లు మాఫీ చేసిందన్నారు. పేదలకు ఒక్క రూపాయి మాఫీ చేయలేదని విమర్శించారు.
హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ, బీజేపీ పంచిన బొమ్మలను చూసి ఓటు వేస్తే కడుపు నిండుతుందా? అంటూ ప్రశ్నించారు.అయోధ్య రామాలయం బీజేపీ కట్టలేదు.. ట్రస్ట్ కట్టింది.ఆలయ నిర్మాణానికి తానుకూడా 2 లక్షలు ఇచ్చానని చెప్పారు.
నిన్న హైదరాబాద్‌లో రాహుల్ గాంధీ సభ తుస్సు మంది. 30 వేల కుర్చీలు వేస్తే 3 వేల మంది రాలేదు. కాంగ్రెస్ వాళ్లు వచ్చి ఓటు అడిగితే ఐదు నెలల 12,500 ఇచ్చిన తర్వాతే ఓటు వేస్తామని అక్క చెల్లెళ్లు చెప్పండి. ప్రియాంక గాంధీ గెలిచాక ఇస్తామని హామీ ఇచ్చిన మెడికల్ కాలేజీ హుస్నాబాద్‌కు వచ్చిందా? రేవంత్ రెడ్డి కంటే రాహుల్ గాంధీ ఎక్కువ అబద్ధాలు మాట్లాడున్నాడు, ఆయన రాహుల్ గాంధీ కాదు రాంగ్ గాంధీ’’ అంటూ హరీశ్ ఎద్దేవా చేశారు.
‘‘ఈ కాంగ్రెస్ పాలన వచ్చాక కల్యాణ లక్ష్మి ఖతమయ్యింది. తులం బంగారం తుస్సు మంది. బండి సంజయ్ బొమ్మలు పంచి ఓట్లు వేయమంటున్నాడు. బండి సంజయ్ కి ఓటు వేస్తే అంతా వృధా అయిపోతుంది. కరీంనగర్‌లో కాంగ్రెస్ పార్టీ మూడోస్థాలో ఉంది. అది గెలిచే ప్రసక్తే లేదు’’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment