రాష్ట్రంలో ఆరోగ్యశ్రీని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఖరితో ఆస్పత్రులు ఆరోగ్యశ్రీని నిరాకరిస్తుంటే పేదలు తల్లడిల్లిపోతున్నారని అన్నారు.