రాజన్నకు నివాళి | grandly celebrated YSR Jayanti | Sakshi
Sakshi News home page

రాజన్నకు నివాళి

Published Wed, Jul 9 2014 2:32 AM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM

grandly celebrated YSR Jayanti

సాక్షి, ఖమ్మం: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 65వ జయంతి వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వైఎస్ విగ్రహాలకు పాలాభిషేకాలు చేసి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్యమంత్రిగా వైఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలను, ఆయన సేవలను స్మరించుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు, అనాథాశ్రమాల్లో పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. జిల్లాలోని పలు ప్రాంతాలలో అన్నదానం చేశారు.

 ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన జయంతి వేడుకలలో వైఎస్సార్ సీపీ శాసనసభా పక్ష నేత, అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు పాల్గొని వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. అపర భగీరథుడు, పేదల పెన్నిధి వైఎస్ అని కొనియాడారు. ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతులకు రుణమాఫీ, పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు, గిరిజనులకు భూ పంపిణీ చేసి బలహీన వర్గాల ఆశాజ్యోతిగా పేరుతెచ్చుకున్నారని కొనియాడారు.

ఆయన మరణంతో రాష్ట్రం చిన్నాభిన్నమై పోయిందని, పేదలకు సంక్షేమ పథకాల అమలులో జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ హయాంలో ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి జరిగిందన్నారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ ప్రస్తుత ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ వస్తుందో..రాదోనని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని, దీనిపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త కూరాకుల నాగభూషణం, నగర పార్టీ అధ్యక్షుడు తోట రామారావు, జిల్లా అధికార ప్రతినిధి ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, నాయకులు ఆకుల మూర్తి మాట్లాడుతూ వైఎస్ అభివృద్ధి, సంక్షేమం అనే రెండు చక్రాల బండితో రాష్ట్రాన్ని పాలించారన్నారు.

అలాంటి మహానేత మరణంతో ప్రజలకు భరోసా ఇచ్చేవారు కరువయ్యారని అన్నారు. అనంతరం కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కీసర పద్మజారెడ్డి, నగర అధ్యక్షురాలు కొత్తగుండ్ల శ్రీలక్ష్మీ, ఉపాధ్యాయ విభాగం జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి గురుప్రసాద్, నాయకులు షర్మిలాసంపత్,  కాంపెల్లి బాలకృష్ణ, రఘుదారల కొండలరావు, దామోదర్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, హెచ్.వెంకటేశ్వర్లు, మందడపు రామకృష్ణారెడ్డి, భాస్కర్‌నాయుడు, పత్తి శ్రీను, మైకా కృష్ణ, పొదిలి వెంకటేశ్వర్లు, కొంగర జ్యోతిర్మయి, ఆలస్యం సుధాకర్, చక్రపు సత్యనారాయణ, షకీనా, గడ్డం ఉపేందర్, వెంపటి నాగేశ్వరరావునాయుడు, కొణత ఉపేందర్, బాణాల లక్ష్మణ్, పెరుమాళ్ల లత, ఉపేంద్రారెడ్డి పాల్గొన్నారు.

 ప్రభుత్వ ఆస్పత్రిలో పండ్లు పంపిణీ..
 వైఎస్ జయంతి సందర్భంగా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఆస్పత్రిలో బిడ్డకు జన్మనిచ్చిన కొత్తగూడెం మండలం పాత అంజనాపురం గ్రామానికి చెందిన చింత కూమారికి పండ్లు పంపిణీ చేశారు. తల్లిదండ్రుల కోరిక మేరకు చిన్నారికి రాజశేఖర్ అని నామకరణం చేశారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే ఆర్థిక సహాయం చేశారు.

అనంతరం దమ్మపేటలో జరిగిన కార్యక్రమంలో 25 మంది పేదలకు వస్త్రదానం చేశారు.  వైరా, కొణిజర్ల మండలాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే బాణోత్ మద న్‌లాల్ పాల్గొన్నారు. వైరా బాలవెలుగు పాఠశాలలో అన్నదాన  కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. వైరా క్రాస్‌రోడ్డు, పాత బస్టాండ్ సెంటర్‌లో వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వికలాంగులకు వీల్‌చైర్లు పంపిణీ చేశారు. మణుగూరు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కేక్‌కట్ చేసి వైఎస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

పినపాకలోని ఏడూళ్లబయ్యారం క్రాస్‌రోడ్డులో వైఎస్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. భద్రాచలం పాత మార్కెట్ సెంటర్‌లో ఉన్న వైఎస్ విగ్రహానికి వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తెల్లం వెంకట్రావ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎటపాకలోని సరోజనమ్మ వృద్ధాశ్రమంలో అన్నదానం నిర్వహించి పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. కూసుమంచి, నాయకన్‌గూడెంలలో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ యువజన విభాగం మూడు జిల్లాల కో ఆర్డినేటర్ సాధు రమేష్‌రెడ్డి పాల్గొని వైఎస్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఖమ్మం రూరల్ మండలం మద్దివారిగూడెంలో వైఎస్ విగ్రహానికి పార్టీ నాయకులు మందడి పుల్లారెడ్డి, కొత్తా శ్రీనివాసరెడ్డి పాలాభిషేకం చేశారు.

ఇల్లెందు, బయ్యారం, గార్ల, కామేపల్లి, టేకులపల్లి మండల కేంద్రాల్లోనూ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇల్లెందు పట్టణ కన్వీనర్ దొడ్డా డానియేల్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైద్యశాలలో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. కొత్తగూడెం పట్టణ కన్వీనర్ బీమా శ్రీధర్ ఆధ్వర్యంలో సెవెన్‌హిల్స్ సెంటర్ వద్ద వైఎస్సార్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. పాల్వంచలో జిల్లా పార్టీ నాయకులు ఎర్రంశెట్టి ముత్తయ్య, కొత్వాల శ్రీను ఆధ్వర్యంలో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేశారు. సత్తుపల్లిలో పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మట్టా దయానంద్‌విజయ్‌కుమార్ వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి ఆర్పించారు. మధిరలో మండల కన్వీనర్ ఎన్నం కోటేశ్వరరావు ఆధ్వర్యంలో వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి, ప్రభుత్వ ఆస్పత్రి రోగులకు పండ్లు పంపిణీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement