Farmers Debt Waiver
-
తిరిగేది 8వేల కోట్ల విమానంలో..
మహోబా(యూపీ): రూ.8వేల కోట్ల ఖరీదైన విమానంలో ప్రయాణించే ప్రధాని మోదీ..రైతుల రుణాలను మాత్రం మాఫీ చేయడం లేదని కాంగ్రెస్ నేత ప్రియాంకాగాంధీ విమర్శించారు. శనివారం ఆమె యూపీలోని బుందేల్‌ఖండ్ జిల్లాలో కాంగ్రెస్ నిర్వహించిన ప్రతిజ్ఞార్యాలీలో ప్రసంగించారు. విమానాలు కొనుగోలు చేసేందుకు ప్రధాని వద్ద డబ్బుంటుంది కానీ, సామాన్యులకు ఇచ్చేందుకు ఉండదన్నారు. ప్రధాని మోదీ స్నేహితులైన బడాపారిశ్రామిక వేత్తల ఆదాయం రోజుకు రూ.10వేల కోట్లు కాగా, సాధారణ వ్యక్తి ఆదాయం రోజుకు కేవలం రూ.27 మాత్రమేనని ఆమె అన్నారు. ప్రధాని మోదీ రైతులు, ప్రజల సంక్షేమానికి చేసిందేమీ లేదన్నారు. -
రుణమాఫీకి రూ.28 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీ విధివిధానాల ముసాయిదాను వ్యవసాయ శాఖ ఖరారు చేసింది. నివేదికను సర్కారుకు పంపింది. దాని ఆధారంగా సర్కారు అనుమతిస్తే కేటగిరీ వారీగా రైతుల వివ రాలు సిద్ధం చేస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు లేఖ రాసింది. ఎంతమంది రైతులకు ఎంతెంత బ్యాంకు రుణం ఉందో సమగ్రమైన వివరాలతో ఇస్తామని పేర్కొంది. తాజాగా తయారు చేసిన విధివిధానాల ముసాయిదాను 2014–15లో అమలుచేసిన రుణమాఫీ నిబంధనలకు అనుగుణంగా రూపకల్పన చేశారు. కుటుంబానికి ఒక్కరికే రుణమాఫీ వర్తించేలా విధివిధానాల్లో పేర్కొన్నారు. ఆ ప్రకారం 35 లక్షల మంది రైతులకు రూ.28 వేల కోట్ల వరకు రుణమాఫీ చేయాల్సి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. అయితే ఈసారి ప్రభుత్వం రైతులకే నేరుగా డబ్బు ఇస్తానని హామీ ఇచ్చినందున సర్కారు మార్గదర్శకాలు కీలకం కానున్నాయి. గతంలో రుణమాఫీని అమలు చేసినప్పుడు రైతుల వివరాలను 5 అనెగ్జరీల్లో పొందుపరిచారు. సర్కా రు అనుమతిస్తే ఈ సారి కూడా అలాగే తయారు చేస్తామని, అందుకు తాము సన్నద్ధంగా ఉన్నామని ఓ అధికారి పేర్కొన్నారు. గతంలో రైతుల ఖాతాల్లో రుణమాఫీ సొమ్ము జమ చేశారు. ఈసారి నేరుగా రైతులకే డబ్బు ఇస్తామని సీఎం వివిధ సందర్భాల్లో స్పష్టం చేశారు. ఆ ప్రకారమే వ్యవసాయ శాఖ సన్నద్ధమైంది. గతేడాది ఖరీఫ్ రైతు బంధు సొమ్మును చెక్కుల రూపంలో ఇచ్చినట్లే, ఈసారి రుణమాఫీ సొమ్ము కూడా అలాగే ఇచ్చే అవకాశముందని భావిస్తున్నారు. నాలుగు విడతల్లో.. 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు టీఆర్ఎస్ రూ.లక్ష రుణమాఫీ అమలుచేసింది. మొదటి విడత 2014–15లో రూ.4,040 కోట్లు మాఫీ చేసింది. రెండో విడత 2015–16లోనూ రూ.4,040 కోట్లు, 2016–17లో మూడో విడత రూ.4,025 కోట్లు, నాలుగో విడత 2017–18లో రూ.4,033 కోట్లు మాఫీ చేసింది. ఈ సారి ఎన్ని విడతలుగా మాఫీ చేస్తారన్న దానిపై స్పష్టత రాలేదు. మార్గదర్శకాలు వచ్చాక గానీ ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశముంది. గత డిసెంబర్ 11ను కటాఫ్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. గత రుణమాఫీకి ఇప్పటికీ రైతుల సంఖ్య పెద్దగా పెరిగే అవకాశం లేదని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. రుణమాఫీ సొమ్ము మాత్రం పెరుగుతుందంటున్నాయి. నోరువిప్పని అధికారులు.. ఖరీఫ్‌లో రైతులకు వ్యవసాయ పంట రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు అలక్ష్యం వహిస్తున్నాయి. ఖరీఫ్‌లో పంట రుణాల లక్ష్యం రూ.29 వేల కోట్లు కాగా, ఇప్పటివరకు రూ.14,588 కోట్లే ఇచ్చినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇంత తక్కువ రుణాలు ఇవ్వడంపై సర్కారు బ్యాంకుల పట్ల గుర్రుగా ఉంది. పాత బకాయిలు చెల్లించకుం డా రుణమాఫీకి రైతులు ఎదురు చూస్తున్నారు. బ్యాంకులు మాత్రం పాత అప్పులు చెల్లించకపోవడంతో కొత్త రుణాలు ఇవ్వట్లేదు. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. డిసెంబర్ 11కు ముం దున్న బకాయిలు తీర్చి తిరిగి బ్యాంకుల్లో కొత్త రుణాలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఇటీవల రైతులను కోరారు. రుణమాఫీ అమలు చేసినప్పు డు చెల్లించిన పాత బకాయిల సొమ్ము రైతులకు నేరుగా ఇస్తామన్నారు. దీనిపై వ్యవసాయ అధికారుల నుంచి ఆదేశాలు రాకపోవడంతో రైతులు అయోమయంలో పడ్డారు. కొందరు మాత్రం సీఎం చెప్పినట్లు అప్పులు తీర్చేందుకు సిద్ధమయ్యారని బ్యాంకర్లు చెబుతున్నారు. -
రైతు చుట్టూ చీకట్లు తొలగేనా?
వ్యవసాయ రుణమాఫీలు ఆర్థిక అవసరంగా ఉంటూ, వాటికోసం రాష్ట్ర ప్రభుత్వాలు తగినన్ని వనరులను వెతకాల్సి ఉంటున్న నేపథ్యంలో, ప్రత్యక్ష నగదు మద్ధతును వ్యవ సాయ సంక్షోభానికి శాశ్వత పరిష్కారంగా చూడకూడదు. తక్షణ ఉపశమన చర్యలను చేపడుతూనే, వ్యవసాయ రంగానికి పలు గట్టి సంస్కరణలను అమలు చేయడం ఎంతైనా అవసరం. అందుకే ఈ 2019 సంవత్సరం వ్యవసాయ సంస్కరణల సంవత్సరంగా మారుతుందని ఆశిద్దాం. చిన్న, పెద్ద వ్యాపారాల్ని సులభతరం చేసే అవకాశా లను కల్పించడానికి ప్రభుత్వాలు 7,000 రకాల చర్యలు చేపడుతున్నప్పుడు, వ్యవసాయాన్ని సులభతరం చేసేందుకు చిన్న మొత్తాన్ని కేటాయించడం తప్పెలా అవుతుంది? ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాకు చెందిన బంగాళాదుంపలు పండించే రైతు ప్రదీప్ శర్మ వరు సగా నాలుగేళ్లు నష్టాలను ఎదుర్కొన్నారు. ఈ సంవత్సరం 10 ఎకరాల్లో బంగాళా దుంపల సాగు చేసిన ఈయన 19,000 కేజీల దిగుబడిని మండీకి తీసుకు వచ్చారు. కానీ పంటను మొత్తంగా అమ్మిన తర్వాత రూ. 490ల లాభం మాత్రమే దక్కింది. ఆ రైతు ఆగ్రహంతో తనకు వచ్చిన లాభాన్ని ప్రధానికి పంపుతూ తన సమస్యలను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు. అంతకు కొన్ని రోజుల ముందు మధ్యప్రదేశ్ రైతు భేరూలాల్ మాలవీయ తీవ్ర మైన మనస్తాపానికి గురై చనిపోయారు. మండసార్ మార్కెట్లోకి తాను తీసుకువచ్చిన 27,000 కిలోల ఉల్లిపాయలకు కేవలం రూ. 10 వేల ధర పలకడమే కారణం. మీడియాలో వస్తున్న ఇలాంటి విషాదకరమైన వార్తలతో కొంత కాలంగా రైతుల దుస్థితి గురించిన సమాచారం పతాక శీర్షికల్లో చోటు చేసుకుంటోంది. సంవత్సరాలుగా నష్టాలు చవిచూస్తుండటంతో, రైతులు వాస్తవంగానే అప్పులు తీసుకుని బతుకుతున్నారు. ప్రభుత్వ, ప్రభుత్వేతర వనరుల నుంచి వీరు రుణాలు పొందుతున్నారు. 2016 సెప్టెంబర్ నాటికి, దేశంలో వ్యవసాయ రుణాల మొత్తం రూ. 12.60 లక్షల కోట్లకు చేరుకుంది. 17 రాష్ట్రాల్లో అంటే సగం దేశంలో రైతుల ఆదాయం సగటున కేవలం రూ. 20,000గా ఉన్న పరిస్థితితో ఈ భారీ రుణాలను పోల్చి చూస్తే రైతు జీవితంలో నిస్సహాయత అర్థమవుతుంది. రైతుల బాధలను పరిష్కరించడానికి వ్యవసాయ రుణాల మాఫీ సరైన సమాధానం అవుతుందా అనే అంశంపై ప్రస్తుతం సాగుతున్న చర్చ నేపథ్యంలో భయంకరమైన వ్యవసాయ దుస్థితిని ఊహించుకోండి. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఆర్థిక భారాన్ని ఎలా భరిస్తాయి? ఇటీవలే ముగి సిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే మధ్యప్రదేశ్, రాజ స్తాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఎంపికైన కొత్త ముఖ్యమంత్రులు వ్యవసాయ రుణాల మాఫీని ప్రకటించిన వేగాన్ని పరిశీలిస్తే వారి చర్య వెనుక ఉన్న రాజకీయ కొలమానం కంటే ఆర్థికంగా అది చెల్లుబాటవుతుందా అనే ప్రశ్న కలుగుతోంది. పైగా, ఈ రుణమాఫీకి అవసరమైన డబ్బు ఎక్క డినుంచి వస్తుందనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఇది ఇంతటితో ముగియడం లేదు. రైతులకు ప్రత్యక్ష నగదు ప్రోత్సాహకాన్ని కల్పిస్తూ సంవత్సరానికి రూ. 8,000ల (ఇప్పుడు దీన్ని రూ. 10,000కు పెంచారు) నిర్దిష్ట మొత్తాన్ని అందించే విశిష్టపథకం రైతుబంధును తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన తర్వాత, దేశంలోని పలు రాష్ట్రాలు వరుసగా అదేవిధమైన లేక మెరుగుపర్చిన రూపంలో రైతులకు ఆర్థిక ప్రోత్సాహకాలను ప్రకటిస్తూ వస్తున్నాయి. మొదటగా, కర్ణాటకలో మునుపటి కాంగ్రెస్ ప్రభుత్వం మెట్ట భూములున్న రైతులకు హెక్టారుకు రూ. 5,000ల ప్యాకేజీని ప్రతిపాదించింది. హిందీ ప్రాబల్య ప్రాంతంలో ఇటీవలి ఎన్నికల్లో అధికార బీజేపీ కుప్పగూలిన నేపథ్యంలో తమకు అధికారమిస్తే వ్యవసాయ రుణాలను రద్దుచేస్తామంటూ కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న వాగ్దానాలతో భీతిల్లిన కారణం కావచ్చు.. ఒడిశాలో రానున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రైతులను బుజ్జగించే ప్రయత్నంలో భాగంగా నవీన్ పట్నాయక్ ప్రభుత్వం రైతులకు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. అయితే రుణమాఫీకి బదులుగా రైతుకు సహాయ పథకం పేరిట మూడేళ్లపాటు రూ. 10,180 కోట్ల ప్యాకేజీని ఒడిశా ప్రభుత్వం భూ యజమానులకు, కౌలురైతులకు, భూమి లేని కూలీలకు ప్రకటించింది. దీంతో ఒడిశాలో 57 లక్షల వ్యవసాయ కుటుం బాలకు మేలు చేకూరనుంది. ఇక జార్ఖండ్ ప్రభుత్వం కూడా అయిదు ఎకరాల లోపు భూమి ఉన్న 22.76 లక్షలమంది సన్న, చిన్న కారు రైతులకు సంవత్సరానికి రూ.5,000ల ఆర్థిక సహాయం అందించినున్నట్లు శరవేగంగా ప్రకటిం చింది. ఇక హరియాణా ప్రభుత్వం రైతులకు పెన్షన్ పథకం ప్రకటిం చగా, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తానేం తక్కువ తినలేదన్నట్లుగా కృషిక్ బంధు పథకంతో ముందుకొచ్చింది. దీంట్లో భాగంగా ఆ రాష్ట్రంలోని ప్రతి రైతూ సంవత్సరానికి ఎకరాకు రూ. 10,000ల నగదు ప్రోత్సాహకం లభించనుంది. దీంతోపాటు 18 నుంచి 60 ఏళ్ల లోపు వయసున్న ప్రతి రైతుకూ రూ.2 లక్షల మేరకు జీవిత భీమాను మమత ప్రభుత్వం ప్రకటించింది. ఈ బీమా ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. ఈ వరుస రుణమాఫీలను పరిశీలిద్దాం. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం రైతు రుణమాఫీని ప్రకటించాక, తొలి దశలో 3.5 లక్షల రైతుల బ్యాంకు ఖాతాలలోకి రూ. 1,248 కోట్లను ఇప్పటికే బదలాయించారు. అంటే ప్రతి రైతుకూ గరిష్టంగా రూ. 2 లక్షలవరకు రుణమాఫీ చేశారు. పంజా బ్లో పురోగతి మందగించినప్పటికీ, కోఆపరేటివ్, వాణిజ్యబ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను చెల్లించలేకపోయిన 4.14 లక్షలమంది చిన్న, సన్నకారు రైతులకు దాదాపు రూ.3,500 కోట్ల రుణాలను మాఫీ చేశారు. దేశవ్యాప్తంగా చూస్తే కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంద్రప్రదేశ్, రాజస్తాన్, తెలంగాణ, పంజాబ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు రాష్ట్రాల ప్రభుత్వాలు మొత్తం మీద రూ. 2.3 లక్షల కోట్ల మేరకు రైతురుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో 3.4 కోట్ల వ్యవసాయ కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. వీటిని కార్పొరేట్ సంస్థల రుణమాఫీలతో పోల్చి చూద్దాం. మన దేశంలోని డబ్బును ఎవరు దారి మళ్లిస్తున్నారో ఇది మనకు తేల్చి చెబు తుంది. భారతీయ రిజర్వ్ బ్యాంకు ప్రకారం, 2014 ఏప్రిల్ నుంచి 2018 ఏప్రిల్ వరకు నాలుగేళ్ల కాలంలో రూ.3.16 లక్షల కోట్ల కార్పొరేట్ రుణాలను రద్దు చేయగా, దానిలో రూ. 32,693 కోట్లను మాత్రమే రాబ ట్టుకున్నారు. పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్‌లను మినహాయిస్తే, 528 మంది కార్పొరేట్ రుణగ్రహీతల వద్ద రూ. 6.28 లక్షల కోట్ల నిరర్ధక ఆస్తులు నమోదయ్యాయి. వీరిలో 95 మంది ఒక్కొక్కరు వెయ్యి కోట్ల రూపాయలను చెల్లించాల్సి ఉంది. అయితే అతి కొద్దిమంది కార్పొరేట్ రుణ గ్రహీతలకు ఇంత భారీ స్థాయిలో రుణమాఫీ చేయడంలోని ఆర్థిక అరాచకత్వ గురించి ఏ ఒక్కరూ అడిగిన పాపాన పోలేదు. కానీ అదే సమయంలో వ్యవసాయ రుణమాఫీలపై తీవ్రమైన చర్చలు, వాదోపవా దాలకు మాత్రం అందరూ సిద్ధపడిపోవడం గమనార్హం. ఈలోగా, నికర నిరర్ధక ఆస్తులు 2017–18 ఆర్థిక సంవత్సరంలో 11.2 శాతానికి మరింతగా పెరిగి రూ. 10.39 లక్షల కోట్లకు చేరుకు న్నాయి. అయితే ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్న ఇన్సా ల్వెన్సీ అండ్ బ్యాంకింగ్ కోడ్ (ఐబీసీ), సర్ఫేసీ యాక్ట్ ద్వారా కేవలం రూ. 40,400 కోట్లను మాత్రమే ప్రభుత్వం స్వాధీనపర్చుకుంది. దేశీ యంగా నికర నిరర్ధక ఆస్తులు ఇంత భారీగా పెరిగిపోవడానికి గత పదేళ్లుగా పరిశ్రమకు కల్పించిన రూ. 18.60 లక్షల కోట్ల ఆర్థిక ఉద్దీపనే కారణం. 2008–09 సంవత్సరంలో ప్రపంచ ఆర్థిక పతనం సమయంలో భారతీయ పరిశ్రమలకు 1.86 లక్షల కోట్ల మేరకు ఆర్థిక ఉద్దీపన ప్యాకే జీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ తరహా ప్యాకేజీ నేటికీ కొనసా గుతోండటం గమనార్హం. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రతి సంవత్సరం పారిశ్రామికరంగం ప్రత్యక్ష నగదు ప్రోత్సాహకాన్ని పొందుతూనే ఉంది. వ్యవసాయ రుణ మాఫీల కంటే తక్కువ మొత్తంలో దేశంలోని రైతులందరికీ ప్రత్యక్షంగా తలొక రూ. 4,000 ప్రత్యక్ష నగదు సహా యాన్ని అందించే అవకాశం గురించి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సూచనలు వస్తున్నాయి. ఈ ప్రత్యక్ష నగదు ప్రోత్సాహకం వల్ల కేంద్రంపై మరొక 2 లక్షల కోట్ల రూపాయల భారం పడుతుంది. ఈ మొత్తం చూడ్డానికి కాస్త పెద్ద మొత్తంగానే కనిపించవచ్చు కానీ సంవత్సరానికి రైతుకు నాలుగు వేల రూపాయల నగదు సహాయం అంటే నెలకు వారికి దక్కేది రూ. 340 మాత్రమే. అంటే ఏ ట్రెండీ కాఫీ షాపులో అయినా మనం రెండు కప్పుల కాఫీ లేక టీ తాగినదాంతో సమానం. నిస్సహా యస్థితిలో ఉన్న రైతాంగానికి నెలకు రూ. 340ల సహాయం చేయడం ఆర్థికపరంగా సరైన చర్య అనుకుంటే దేశంలో ఆదాయాల మధ్య అస మానతకు ఇంతకు మించిన ఉదాహరణ ఉండదు గాక ఉండదు. వ్యవసాయ రుణమాఫీలు ఆర్థిక అవసరంగా ఉంటూ, వాటికోసం రాష్ట్ర ప్రభుత్వాలు తగినన్ని వనరులను వెతకాల్సి ఉంటున్న నేపథ్యంలో, ప్రత్యక్ష నగదు మద్ధతును వ్యవసాయ సంక్షోభానికి శాశ్వత పరిష్కా రంగా చూడకూడదు. తక్షణ ఉపశమన చర్యలను చేపడుతూనే, వ్యవ సాయ రంగానికి పలు గట్టి సంస్కరణలను అమలు చేయడం ఎంతైనా అవసరం. అందుకే ఈ 2019 సంవత్సరం వ్యవసాయ సంస్కరణల సంవత్సరంగా మారుతుందని ఆశిద్దాం. చిన్న, పెద్ద తరహా వ్యాపా రాన్ని సులభతరం చేసే అవకాశాలను కల్పించడానికి ప్రభుత్వాలు 7,000 రకాల చర్యలు చేపడుతున్నప్పుడు, వ్యవసాయాన్ని సులభతరం చేసే అవకాశాలను కల్పించడానికి చిన్న మొత్తాన్ని కేటాయించడం తప్పెలా అవుతుందో నాకు చిన్న కారణం కూడా కనిపించడం లేదు. అయినా వ్యవసాయం దేశీయ జనాభాలో 52 శాతానికి సంబంధించి నది. ‘సబ్కా సాత్, సబ్కా వికాస్’ నిజంగా సిద్ధించాలంటే ఇది మాత్రమే సరైన ఆర్థిక చికిత్స అవుతుంది. దేవిందర్‌శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ :hunger55@gmail.com -
ఎన్నికల వేళ రైతులకు తాయిలాలు
న్యూఢిల్లీ: 2019 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రైతులను మచ్చిక చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. వ్యవసాయ రంగం సంక్షోభంపై ప్రతిపక్షాలతోపాటు రైతు సంఘాల నుంచి ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది. దీంతోపాటు రైతు సమస్యలే ప్రధాన ఎజెండాగా ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అధికారం కోల్పోయిన విషయం తెలిసిందే. వీటన్నిటినీ బేరీజు వేసుకుంటూ బీజేపీ నేతలు, ఎంపీలు, వివిధ వర్గాలు ఇచ్చిన నివేదికల ఆధారంగా రైతులకు భారీ ఆర్థిక ప్యాకేజీపాటు పలు ప్రోత్సాహకాలను ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. దీనిపై రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను వ్యవసాయ శాఖ ప్రధాని మోదీకి ఇప్పటికే వివరించింది. ఇందులో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలకు పరిష్కారాలను చూపింది. ఏడు రాష్ట్రాల్లో రుణమాఫీ అమలు, ఒడిశాలో ఇన్పుట్ సబ్సిడీ, తెలంగాణలో రైతు బంధు పథకం సహా వివిధ రాష్ట్రాల్లో చేపట్టిన రైతు సంక్షేమ చర్యల వంటివి ఇందులో ఉన్నాయి. రైతుల సమస్యలు, వాటి పరిష్కారాలపై ఎన్నికల లోపే ప్రభుత్వం ఒక ప్రకటన చేసే అవకాశాలున్నాయని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. -
సీఎంలను నిద్రలేపాం.. మోదీనీ నిద్రలేపుతాం!
న్యూఢిల్లీ: రైతుల రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ప్రధాని మోదీ లక్ష్యంగా తన విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు. రైతు సమస్యల పరిష్కారం విషయంలో మొద్దునిద్ర పోతున్న గుజరాత్, అసోం ముఖ్యమంత్రులను తాము నిద్రలేపగలిగామని రాహుల్ వ్యాఖ్యానించారు. త్వరలోనే ప్రధాని మోదీని కూడా నిద్రలేపుతామని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాహుల్ బుధవారం తన ట్విట్టర్ హ్యాండిల్లో స్పందిస్తూ..‘మొద్దునిద్ర పోతున్న అసోం, గుజరాత్ ముఖ్యమంత్రులను కాంగ్రెస్ పార్టీ నిద్రలేపగలిగింది. ప్రధాని మోదీ ఇంకా నిద్రపోతున్నారు. ఆయన్ను కూడా మేం నిద్ర లేపుతాం’ అని ట్వీట్ చేశారు. అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లోనే రుణమాఫీ చేస్తామని చెప్పినప్పటికీ, కేవలం ఆరు గంటల్లోనే రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లో రుణాలను రద్దుచేశామన్నారు. రూ.600 కోట్ల రైతురుణాలను మాఫీ చేస్తామనీ అసోం, రూ.625 కోట్ల విద్యుత్ బకాయిలను రద్దుచేస్తామని గుజరాత్ ప్రభుత్వాలు ప్రకటించ డంతో రాహుల్ ఈమేరకు స్పందించారు. -
ఎట్టకేలకు అంగీకారం!
సాక్షి ప్రతినిధి, కడప: న్యాయంగా రావాల్సిన బీమా అందలేదు. రైతులకు అండగా నిలవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించింది. ప్రత్యక్ష పోరాటం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చినా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపలేదు. వెరసి రైతులకు నిరీక్షణ తప్పలేదు. వైఎస్సార్సీపీ ప్రత్యక్ష పోరాటంతో ఆలస్యంగానైనా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం వచ్చింది. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వానికి అంగీకార లేఖ రాస్తూ నిర్ణయం తీసుకుంది. రైతులు వారి వారి పంటలకు బీమా చెల్లించుకునే వెసులుబాటు ఉంది. ప్రీమియం చెల్లించిన తర్వాత బాధ్యత ఇన్య్సూరెన్సు కంపెనీలదే. బీమా చెల్లించాల్సిన సమయంలో దరఖాస్తులు సక్రమంగా పూరించలేదని అర్హులైన రైతులకు బీమా చెల్లించకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించింది. రైతులకు తెలియక చేసిన తప్పులకు శిక్ష విధిస్తారా... అంటూ వైఎస్సార్సీపీ ధ్వజమెత్తింది. వివిధ దశల్లో ప్రత్యక్ష ఆందోళన చేసింది, తుదకు ఆపార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సైతం ధర్నా చేపట్టారు. ఆపై కేంద్ర ప్రభుత్వం దిగివచ్చినా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లోపించింది. రెండున్నరేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లించేందుకు అంగీకరిస్తూ లేఖలో వెల్లడించిన వైనమిది. జిల్లాలో 2012–13 పంటలబీమాకు శనగ, పొద్దుతిరుగుడు పంటలకు రైతులు బీమా ప్రిమియం చెల్లించారు. 76,750 మంది బీమా చెల్లించగా వారిలో 21,965 క్లైయిమ్లను అగ్రికల్చర్ ఇన్య్సూరెన్సు కంపెనీ (ఏఐసీ) తిరస్కరించింది. అందులో ప్రధానంగా 20,655 దరఖాస్తులు పంటలు సాగుచేసిన తేది పొందుపర్చలేదని పంటల బీమా మంజూరు చేయకుండా తిరస్కరించింది. వారిలో 16,889 మంది బుడ్డశనగ, 3,766 మంది పొద్దుతిరుగుడు రైతులు ఉన్నారు. వారందరికీ పంటల బీమా మంజూరు చేయకుండా తిరస్కరించింది. ఈపరిస్థితుల్లో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వారికి అండగా అత్యంత చిత్తశుద్ధితో వైఎస్సార్సీపీ పోరాటాన్ని ఎంచుకుంది. కడప మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డి ఏఐసీ అధికారులతో అనేక పర్యాయాలు చర్చించారు. అదేవిధంగా వ్యవసాయశాఖ కమిషనర్‌తో సైతం మంతనాలు చేపట్టారు. రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కలిసి హైదరాబాద్‌లోని ఏఐసీ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. రాష్ట్ర పరిధిలో ఉన్న అడ్డంకులను చేధించుకుని ఏఐసీ జీఎం రాజేశ్వరి ద్వారా ఢిల్లీలోని కేంద్ర కార్యాలయానికి ప్రతిపాదనలు పంపించారు. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రితోనూ, కేంద్ర వ్యవసాయశాఖ జాయింట్ సెక్రెటరీతోనూ ప్రత్యేకంగా పలుమార్లు కలుస్తూ ఐదేళ్లుగా రైతులు ఎదుర్కొంటున్న అవస్థలను వివరిస్తూ, ప్రత్యేక సమావేశాల ద్వారా వ్యవహారాన్ని కొల్కి తెచ్చారు. ఆమేరకు 2016 మార్చి 10న కేంద్రప్రభుత్వం లేఖ రాసింది. పెండింగ్‌లో ఉన్న ఆ క్లైయిమ్స్ రాష్ట్రప్రభుత్వ వాటానిమిత్తం అంగీకారం కోరింది. ఇలాంటి తరుణంలో తక్షణమే స్పందించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం రెండున్నరేళ్లుగా నిర్లక్ష్యం ప్రదర్శించింది. 2018 సెప్టెంబర్ 19న అగ్రికల్చర్ స్పెషల్ సెక్రెటరీ డి.మురళీధర్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి అంగీకార లేఖ రాశారు. చిత్తశుద్ధి పోరాటం చేసిన ఫలితమే... పంటలకు బీమా ప్రీమియం చెల్లించిన తర్వాత కూడా రైతులకు బీమా మంజూరు కాకపోవడంపై వైఎస్సార్సీపీ రైతులకు అండగా నిలిచింది. చిత్తశుద్ధితో అడుగడుగునా వైఎస్సార్సీపీ ప్రత్యక్ష పోరాటం చేసిన నేపథ్యంలో తక్షణమే స్పందిస్తే ఆ పార్టీకి మంచిపేరు వస్తుందని కావాలనే రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు కాకపోతే వైఎస్సార్సీపీ నేతృత్వంలో ఏర్పడే ప్రభుత్వంలోనైనా శనగ రైతులకు పంటల బీమా చెల్లింపు చేస్తామని ప్రజాసంకల్పయాత్రలో సైతం ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ పోరాట ఫలితంగా ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వంలో చలనం వచ్చింది. కేంద్ర ప్రభుత్వం లేఖకు స్పందిస్తూ అంగీకార లేఖ రాసింది. గతంలో కూడా ఇలాంటి విపత్కర పరిస్థితిని రైతులు చవిచూశారు. 2012–13 రబీ పంటల బీమా మంజూరు చేయడంలో ఏఐసీ నిర్లక్ష్యం ప్రదర్శించడంతో ఎంపీ హోదాలో పలుమార్లు పార్లమెంటు దృష్టికి తీసుకెళ్లడం, స్వయంగా ఇన్సూరెన్సు అధికారులను కలవడంతో రూ.132కోట్లు మంజూరు చేస్తూ ఏఐసీ నిర్ణయం తీసుకుంది. తొలివిడతగా 17,161మంది శనగ రైతులకు రూ.88 కోట్లు బీమా మొత్తం జమ అయింది. రెండో విడతగా 11,286 మంది శనగ రైతులకు రూ.44కోట్లు బీమా మొత్తం మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అప్పట్లో శనగరైతులు సైతం కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని కృషిని కొనియాడుతూ వచ్చారు. తక్షణమే పరిహారం అందించకుండా దాదాపు నాలుగు వారాలు అధికారపార్టీ నేతలు అడ్డుకున్నారు. ‘అమ్మ పెట్టదు...అడుక్కోనివ్వదు’ అన్నట్లుగా వ్యవహరించారు. తాజాగా 2012–13 రబీ పంటల బీమా దరకాస్తులు పూరించడంలో పంట సాగుచేసిన తేది పొందుపర్చలేదనే కారణంగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుదారులు త్వరలో శుభవార్త వినే అవకాశం ఉంది. -
ప్రతిష్టాత్మకంగా ‘ఆసరా’
మంత్రి మహేందర్‌రెడ్డి ఆదిబట్ల : ఆసరా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని , అర్హులందరకీ పింఛన్లు అందించటంమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటోందని రోడ్డు రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని ఎంపీ పటేల్‌గూడలో జిల్లా సంయుక్త పాలనాధికారి చంపాలాల్, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో కలిసి ఆసరా పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు.అనంతరం మాట్లాడుతూ జిల్లాలో గతంలో రూ.7 కోట్ల రూపాయలు మేరకు పింఛన్లు అందించేవారని, ఇప్పుడు ఆసరా పథకంలో భాగంగా రూ.27 కోట్ల పింఛన్లు ఇవ్వడం జరుగుతోందని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వం రైతుల రుణమాఫీలో భాగంగా మొదటి విడతగా ఐదు వేల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసిందని తెలిపారు. బడ్జెట్లో ఆర్‌అండ్‌బీకి రూ.10 వేల కోట్లు, పంచాయతీ రాజ్ రోడ్లకు రూ. 5 వేల కోట్లను కేటాయించామని తెలిపారు. మిషన్ కాకతీయ పేరుతో చెరువుల పునరుద్ధరణకు బడ్జెట్‌ను కేటాయించటం జరిగిందన్నారు. ఇళ్లు లేని నిరుపేదలకు మూడు ల క్షల మూపై వేల రూపాయలతో ఇళ్లు నిర్మించి ఇస్తామని, దళిత ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అమ్మాయిలకు 51 వేల రూపాయలు ఇచ్చి వివాహలు జరిపిస్తామని తెలిపారు. జంట నగరాలలో కోటీ 20 ల క్షల జనాభాకు మంచి నీరుకు 4000 నుంచి 5000 కోట్ల రూపాయల ఖర్చు అవుతున్నాయన్నారు. మల్కాజ్‌గిరిలో రూ,240 కోట్లతో మంచి నీటి కార్యక్రమం చేపట్టామని తెలిపారు. రూ.150 కోట్లతో 540 కొత్త బస్సులు కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు. అలాగే నిరుద్యోగ సమస్యపై మాట్లాడుతూ.. జిల్లాపై అత్యధిక కంపెనీలు మొగ్గు చూపుతున్నాయని తెలిపారు. వాటితో చర్చలు జరిపి నిరుద్యోగులకు ఉపాధిని చూపిస్తామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు ఐలయ్య, ఎంపీపీ, వైస్ ఎంపీపీ వెంకట్రారాంరెడ్డి, కొత్త అశోక్‌గౌడ్, సర్పంచ్ పొట్టి రాములు, ఎంపీటీ సీ సభ్యులు గౌని అండాలు బాలరాజ్గౌ డ్, ఆర్డీవో యాదగిరి రెడ్డి, తహసీల్దార్ ఉపేందర్‌రెడ్డి, ఎంపీడీవో అనిల్‌కుమార్, నాయకులు కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి, ఈసీ శేఖర్‌గౌడ్, లచ్చిరెడ్డి పాల్గొన్నారు. -
రుణ మాఫీపై పిల్లిమొగ్గలు ఇంకెన్నాళ్లు?
రైతు రుణాల రద్దుపై తెలుగుదేశం ప్రభుత్వం తొలి నుంచీ పిల్లిమొగ్గలు వేస్తూ కాలం వెళ్లబుచ్చుతున్నది. ప్రభుత్వం పనిచేస్తున్నది స్వార్థపూరిత రాజకీయ లబ్ధికోసమే తప్ప, తమ సంక్షేమం కోసం కాదనే విషయం ప్రజలకు బోధపడింది. పూర్తిస్థాయిలో రైతుల రుణ మాఫీ ఇప్పటికి లేదనే విషయం స్పష్టంగా తేలిపోయింది. చంద్రబాబు కట్టుకథలతో రైతాంగాన్ని ఇంకా ఎన్నాళ్లు మభ్యపెడతారు? ఆకాశమే హద్దు అన్నట్లుగా ఎన్నికల హామీలను గుప్పించిన తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అధికారమిచ్చారు. నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారం చేపట్టగానే మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా తమ రూ. 87,612 కోట్ల రుణాలన్నీ ఒక్క సంతకంతో మాఫీ అయిపోతాయని, ఇతర వర్గాల ప్రజల మాదిరిగానే, రైతులు కూడా ఆశించారు. అయితే రైతులు అనుకున్నదొకటి. అయ్యింది వేరొకటి. రుణ మాఫీ.. కొత్త రుణాల వితరణ సజావుగా జరిగి ఉంటే పంటలకు బీమా రక్షణ లభించేది. కానీ, ప్రభుత్వ నిర్వాకం పుణ్యమా అని బీమా రక్షణ లేని పరిస్థితుల్లో ఉత్తరాంధ్ర రైతులు నిలువునా మునిగిపోయారు. కల్లబొల్లి మాటలతోనే కాలక్షేపం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం పరిపాలనా పగ్గాలు చేపట్టి 5వ నెల కూడా గడచిపోతున్నది. కొండంత ఆశతో రైతులు ఎదురుచూస్తున్న రుణ మాఫీ విషయం మాత్రం నానాటికీ జటిలమవుతున్నదే తప్ప, నిర్దిష్ట పరిష్కార మార్గమేదీ కనుచూపు మేరలో కనబడటం లేదు. ఇదేనా అపారమైన పాలనానుభవం? రైతు రుణాల రద్దుపై తెలుగుదేశం ప్రభుత్వం తొలి నుంచీ ఎన్నో పిల్లిమొగ్గలు వేస్తూ కాలం వెళ్లబుచ్చుతున్న తీరు నయవంచన తప్ప మరొకటి కాదు. ‘‘నిపుణులతో చర్చించి, మాకున్న అపారమైన పరిపాలన అనుభవాన్ని జోడించి మేనిఫెస్టోను రూపొందించాం.. దీనిలో పేర్కొన్న ప్రతి ఒక్క హామీని, పథకాన్ని, ప్రణాళికనూ చిత్తశుద్ధితో అమలుచేస్తాం, ఆచరణలో ఆదర్శంగా నిలుస్తాం..’’ ఇదీ తెలుగుదేశం ఎన్నికల నాటి మాట. ‘అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకంతోనే మీ రుణాలన్నీ మాఫీ అయిపోతాయి.. మీరు బ్యాంకులకు రుణాలు చెల్లించవద్దు..’ అని చంద్రబాబు ఎన్నికల సభల్లో ఊదరగొట్టారు. ఈ మాటలు నమ్మి నట్టేట మునిగిపోయామని క్రమేపీ గాని రైతులకు అర్థం కాలేదు. రుణాల పూర్తి మాఫీ కాదు.. రూ. లక్షన్నర మేరకే.. అదికూడా పంట రుణాలు మాత్రమేనని.. బంగారంపై మహిళలు తీసుకున్న వ్యవసాయ రుణాలు మాత్రమేనని.. అది కూడా రూ.50 వేల మేరకే మాఫీ అని.. ఇంటిలో ఒకరి రుణాలే రద్దని.. ఎన్ని విధాలా ఆంక్షలు విధించాలో అన్నిటినీ తెరపైకి తెచ్చారు. బూటకపు వాగ్దానాల అసలు రంగు బట్టబయలు తాను చెప్పినట్లు నడచుకునే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని, ఆ మంత్రివర్గంలో తెలుగుదేశం పార్టీ కూడా భాగస్వామిగా ఉందని, రుణమాపీ పెద్ద సమస్య కాదని చంద్రబాబు నమ్మబలికారు. తీరా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కుండ బద్దలు కొట్టినట్లు అసలు సంగతి బయటపెట్టారు. వ్యవసాయ రుణాల మాఫీ కేంద్రానికి సంబంధం లేదని, అసలు రుణ మాఫీ విధానమే మంచి సంప్రదాయం కాదని ఆయన ప్రకటించడంతో రాష్ట్ర రైతాంగం నివ్వెరపోయింది. గతంలో డా. వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన మాట ప్రకారం కేంద్ర ప్రభుత్వ సహకారంతో రుణ మాఫీ చేశారు. ఎన్నికల వాగ్దానాలను తు.చ. తప్పకుండా అమలుచేశారు. అదేమాదిరిగా చంద్రబాబు నాయుడు కూడా చేస్తాడని అతిగా ఊహించుకున్నారు. కానీ, చంద్రబాబు చేసిన రుణ మాఫీ వాగ్దానంలో విశ్వసనీయత లేదని, ఆనాడు అధికారాన్ని చేజిక్కించుకోవడానికి మాత్రమే హామీ ఇచ్చారని, చంద్రబాబు నాయుడు చేసినవి బూటకపు వాగ్దానాలేనని ఈనాడు వాపోతున్నారు. రుణ మాఫీలో జాప్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు రైతుల దృష్టిని చంద్రబాబు బ్యాంకు వైపు, రిజర్వ్ బ్యాంకు వైపు మళ్లించారు. అయితే, వివిధ పరిణామాల అనంతరం రుణ మాఫీకి సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం, బ్యాంకింగ్ వ్యవస్థలు తోసిపుచ్చాయి. ఒక రాజకీయ పార్టీ ఎన్నికల వాగ్దానాల అమలులో బ్యాంకులు భాగస్వాములు కాలేవని, కాకూడదని నిర్మొహమాటంగా తేల్చి చెప్పాయి. ఏది వాస్తవం? ఏది అవాస్తవం?! అయినా, ఏదో ఒకటి చెప్పి రైతులను మభ్యపెట్టే ప్రయత్నాలను మాత్రం ప్రభుత్వం ఇప్పటికీ మానుకోలేదు. రైతు సాధికార సంస్థను ఏర్పాటు చేయడం కూడా ఈ కోవలోనిదే. ఇది లిమిటెడ్ లయబిలిటీ కార్పొరేషన్. దీనికి రూ.5 వేల కోట్ల మూల ధనం కేటాయించారు. ఆ మేరకు బాండ్లను విడుదల చేయడం వరకే దీని విధి. రైతులకు 10% వడ్డీతో బాండ్లు ఇస్తామని, రైతులపై ఉన్న రుణభారంలో 20% రుణాన్ని ఈ సంవత్సరం మాఫీ చేసి, రాబోయే 4 ఏళ్లలో 10% వడ్డీతో రైతులకు బాండ్లు ఇవ్వడం ద్వారా రుణ మాఫీని పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చెబుతున్నారు. అయితే, ఇప్పుడు బాండ్లు ఇస్తాం.. 2015 జనవరి తర్వాత రైతులు ఈ బాండ్లను సంస్థకు అందజేస్తే 10% వడ్డీతో పూర్తి నగదు ఇస్తారని వనరుల సమీకరణ కమిటీ అధ్యక్షుడు సుజనా చౌదరి అంటున్నారు. ఏది వాస్తవమో? ఏది అవాస్తవమో భగవంతునికే తెలియాలి. ఇంకెన్నాళ్లు మభ్యపెడతారు? రైతు సాధికార సంస్థకు ఏటా కేటాయించే రూ. 5 వేల కోట్లు రుణ బకాయిలపై వడ్డీ(ఏటా రూ.13 వేల కోట్లు) చెల్లించడానికి కూడా సరిపోవు. అలాంటప్పుడు రూ. 87,612 కోట్ల రుణ మాఫీ ఎప్పటికి పూర్తయ్యేను? దీని అర్థం ఏమిటంటే.. రుణ మాఫీ కోసం ఎదురుచూస్తున్న రైతాంగం ఎప్పటికీ రుణ విముక్తులయ్యే అవకాశమే లేదు. కాబట్టి రుణ మాఫీ చేస్తామంటూ ప్రభుత్వం రైతులను ఇంకా మభ్యపెట్టడం తగదు. ఎన్నికల వాగ్దానం మేరకు పూర్తి రుణ మాఫీ చేయడం ఇప్పట్లో జరగదని తేలిపోయింది. అయినా.. కట్టుకథలు చెప్పి రైతాంగాన్ని చంద్రబాబు ఇంకెన్నాళ్లు మభ్యపెడతారు? ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలి. రుణ మాఫీపై అనుసరించదలచిన విధానాన్ని ఇప్పటికైనా స్పష్టం చేయాలి. - ప్రొ. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యవసాయ రంగ నిపుణులు -
వ్యవసాయ రుణమాఫీ కసరత్తు పూర్తి
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లా రైతుల రుణమాఫీ అమలుకు సంబంధించిన కసరత్తు పూర్తయింది. జిల్లావ్యాప్తంగా 4,56,286 మంది రైతులకు రుణమాఫీ వర్తింపజేయాలని అధికారులు లెక్కతేల్చారు. దీనికి రూ.2,682 కోట్లు అవసరం కానున్నాయి. పంటరుణాలు, బంగారం తాకట్టు పెట్టి తెచ్చిన వ్యవసాయ రుణాలను కుటుంబానికి రూ.లక్ష కంటే ఎక్కువ కాకుండా పరిమితం చేస్తూ రుణమాఫీని వర్తింపజేయనున్నారు. ఈ మేరకు బ్యాంకర్లు తయారు చేసిన జాబితాపై బుధవారం నుంచి గ్రామస్థాయిలో సామాజిక తనిఖీ నిర్వహిస్తారు. ఈ తనిఖీలు పూర్తయిన వెంటనే తుది జాబితా తయారుచేసి రుణమాఫీని వర్తింపజేస్తామని, ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని మండల స్థాయి వ్యవసాయ, ఇతర శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్. కె. ఇలంబరితి జరిపిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మరో వారం లోపు జిల్లా రైతాంగానికి రుణమాఫీ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు. నేడు తనిఖీ జిల్లాలో రుణమాఫీ ప్రక్రియను ఐదు దశల్లో పూర్తి చేయాలని నిర్ణయించిన కలెక్టర్ ఈ మేరకు కొన్ని దఫాలను పూర్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం ఎంత మంది రైతులకు రుణమాఫీ వర్తిస్తుందో, ఎంత మొత్తం మాఫీ చేయాల్సి వస్తుందనే అంశాలపై బ్యాంకర్ల నుంచి ఆయన జాబితా తెప్పించారు. మొదటి దశలో పంటరుణాలు, రెండో దశలో బంగారం రుణాల వివరాలను తెప్పించిన కలెక్టర్ మూడో దశలో ఈ మొత్తాన్ని కలిపి ఓ జాబితా రూపొందించారు. ఈ జాబితాపై ఇప్పటికే మండలస్థాయి బ్యాంకర్ల సమావేశాలు పూర్తికాగా, బుధవారం నాలుగోదశలో భాగంగా గ్రామస్థాయిలో సామాజిక తనిఖీ చేస్తారు. దీనిలో భాగంగా లబ్ధిదారులుగా గుర్తించిన రైతు కుటుంబాలకు వ్యవసాయ రుణాల కింద ఉన్న మొత్తం రుణం ఎంత? ఎన్ని బ్యాంకుల్లో ఉంది? అనే అంశాలను గుర్తిస్తారు. ఒక్కో కుటుంబానికి రూ.లక్షకు మించకుండా (ఎన్ని బ్యాంకుల్లో ఉన్నా) రుణమాఫీని వర్తింపజేస్తారు. ఒక బ్యాంకులో లక్ష రుణం తీసుకుని, మరో బ్యాంకులో ఇంకా అదనంగా తీసుకుంటే ఆ రుణానికి మాఫీ వర్తించదని అధికారులు చెపుతున్నారు. నాలుగోదశలో ఈ గుర్తింపు ప్రక్రియ పూర్తయ్యాక ఐదో దశలో తుది జాబితా తయారుచేసి రుణమాఫీ మొత్తాన్ని నేరుగా బ్యాంకర్లకు చెల్లించనున్నారు. రుణమాఫీ పొందుతున్న రైతుల వివరాలను నమోదు చేసుకోవడంతో పాటు వారి వివరాలను ఆధార్‌కార్డుతో అనుసంధానం చేయనున్నారు. రెండు, మూడు రోజుల్లో సామాజిక తనిఖీ పూర్తవుతుందని, ఆ తర్వాత తుదిజాబితా తయారుచేసి వారం రోజుల్లోపు రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ ఇలంబరితి మంగళవారం ‘సాక్షి’తో చెప్పారు. -
వచ్చేనెల తొలివారంలోగా రుణమాఫీ కలెక్టర్ శ్రీధర్
సాక్షి, రంగారెడ్డి జిల్లా : రైతుల రుణమాఫీకి సంబంధించి సెప్టెంబర్ మొదటి వారంలోగా లబ్ధిదారుల జాబితా తయారు చేయాలని కలెక్టర్ ఎన్.శ్రీధర్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో వ్యవసాయ అనుబంధ శాఖలు, బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందని, ఆ ఉత్తర్వుల ప్రకారం అర్హులను తేల్చాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 33 బ్యాంకులకు చెందిన 627 శాఖల ద్వారా రైతులు రుణాలు పొందినట్లు ప్రాథమిక సమాచారముందన్నారు. ఈమేరకు పరిశీలనచేసి అర్హులను గుర్తించాలన్నారు. తహసీల్దార్లు వారి మండలాల్లో భూములను పరిశీలించి రుణం తీసుకున్నట్లు నిర్ధారణచేసిన తర్వాతే అర్హుల జాబితా ఖరారు చేయాలన్నారు. అదేవిధంగా ఈనెల 31తో ఖరీఫ్ ముగుస్తున్నందున కొత్తరుణాలు విడుదల చేయాలన్నారు. సమావేశంలో ఎల్డీఎం వెంకట్‌రెడ్డి, జేడీఏ విజయ్‌కుమార్, ఉద్యానశాఖ ఏడీ ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. -
రుణమాఫీపై కసరత్తు షురూ
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వం ప్రకటించిన రైతుల రుణమాఫీపై జిల్లా యంత్రాంగం కసరత్తు మొదలుపెట్టింది. రూ.లక్షలోపు రుణం మాఫీ చేస్తామని ఎన్నికల్లో టీఆర్ఎస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ సర్కారు.. తాజాగా రుణ మాఫీకి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది. దీంతో చర్యలకు ఉపక్రమించిన జిల్లా యంత్రాంగం.. మార్గదర్శకాల ఆధారంగా జిల్లాలో ఎంతమంది రైతులు రుణమాఫీకి అర్హత కలిగి ఉన్నారో తేల్చే పనిలోపడింది. బ్యాంకుల వారీగా లెక్కలు.. రైతు రుణాలకు సంబంధించి బ్యాంకుల వారీగా లబ్ధిదారులను గుర్తించేందుకు అధికారులు చర్యలు వేగిరం చేశారు. ఇప్పటికే ప్రాథమికంగా రూపొందించిన జాబితాలో 2.48 లక్షల మంది రైతులకు రూ. 1,223.98 కోట్లు మాఫీ చేయాల్సిందిగా గుర్తించారు. అయితే సర్కారు తాజా నిబంధనల్లో ఒక కుటుంబానికి గరిష్టంగా రూ.లక్ష వరకు మాత్రమే మాఫీ చేయనున్నారు. దీంతో ఈ నిబంధనల ప్రకారం ఎంతమంది అర్హులు కానున్నారనే అంశంపై బ్యాంకర్లు కసరత్తు చేస్తున్నారు. ముందుగా బ్యాంకు శాఖల వారీగా, ఆ తర్వాత మండల స్థాయిలో బ్యాంకుల వారీగా, ఆ తర్వాత జిల్లా స్థాయిలో బ్యాంకుల వారీగా వివరాలు పరిశీలించి వడపోత చేపట్టనున్నారు. మండల స్థాయిలో ఉమ్మడి బ్యాంకర్ల సమావేశం నిర్వహించి లబ్ధిదారులను గుర్తిస్తారు. చివరకు జిల్లా స్థాయిలో బ్యాంకర్ల సమావేశం నిర్వహించి లబ్ధిదారుల సంఖ్యను నిర్ధారిస్తారు. ఈ ప్రక్రియకు దాదాపు మూడువారాల సమయం పడుతుందని కలెక్టర్ ఎన్.శ్రీధర్ తెలిపారు. -
సిఎం గారూ రైతుగా 6 సందేహాలు
1 రైతుల రుణమాఫీపై క్యాబినేట్ నిర్ణయం తీసుకుందని ప్రకటించారు. కానీ ఎప్పుడు, ఎలా చేస్తారనే అంశాలపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. అంతా అయోమయం, గందరగోళంగా ఉంది. 2 రుణమాఫీపై అబద్ధపు ప్రచారాలెందుకు? ఎర్రచందనం చెట్లను తాకట్టు పెడతామని, నదుల్లో ఇసుక తవ్వకాలపై సెస్ వేస్తామని.. ఇలా ఆచరణ సాధ్యంకాని ప్రతిపాదనలు తెరమీదకు తెచ్చి ఎందుకు మభ్యపెట్టాలనుకుంటున్నారు? 3 పాత రుణాలు చెల్లించి కొత్త రుణాలు తీసుకోవాలని మంత్రులే చెబుతున్నారు. బ్యాంకర్లు మాత్రం కొత్త రుణాలు ఇవ్వడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా రుణమాఫీ ఎక్కడుంది? 4 మీ హామీలు నమ్మి పాత రుణాలను బ్యాంకులకు చెల్లించలేదు. జూన్ 30వ తేదీలోపు చెల్లిస్తే పావలా వడ్డీతో సరిపోయేది. ఇప్పుడు 13 శాతం వడ్డీ కట్టాలంటున్నారు. ఉదాహరణకు అప్పట్లో రూ. 3,000 కడితే సరిపోయేది. ఇప్పుడు రూ.13,000 చెల్లించాలి. అదనంగా ఈ వడ్డీ ఎవరు కట్టాలి? మేమా.. లేక ప్రభుత్వం భరిస్తుందా? దయ చేసి స్పష్టత ఇవ్వండి. 5 రుణాలు సకాలంలో చెల్లించకపోవడం వల్ల పంటల బీమాకు మేము అనర్హులమవుతున్నాం. ఈ నష్టాన్ని ఎలా భర్తీ చేస్తారు? 6 రుణమాఫీ అమలు అయిపోయినట్లే టీడీపీ సంబరాలు చేసుకుంది. సీఎంగా మిమ్మల్ని అభనందించడానికి పోటీపడ్డారు. కానీ బ్యాంకులు రుణాలు కట్టాలని నోటీసులు ఇస్తున్నాయి. బంగారం వేలం వేస్తామని నిక్కచ్చిగా చెబుతున్నాయి. ఇది న్యాయమా? -
రీషెడ్యూల్ పేరుతో ఏపీ సర్కారు నయా డ్రామా
వైఎస్సార్సీఎల్పీ ఉప నేత జ్యోతుల ధ్వజం సాక్షి, హైదరాబాద్: రైతుల రుణాలను మాఫీ చేస్తారో లేదో చెప్పకుండా రీషెడ్యూలుకు రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) అంగీకరించిందని చెప్పి చంద్రబాబు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్రామాలెందుకు ఆడుతోందని వైఎస్సార్సీ ఎల్పీ ఉప నేత జ్యోతుల నెహ్రూ ధ్వజమెత్తారు. రుణ మాఫీపై స్పష్టత ఇవ్వాలని బుధవారం డిమాండ్ చేశారు. రుణాలను రీషెడ్యూల్ చేయడం కొత్తేమీ కాదని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, కరువు పరిస్థితులు నెలకొన్నప్పుడు నిబంధనల ప్రకారం అమలు చేసేదేనని తెలిపారు. అయితే, రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అదేదో ఇప్పుడే జరుగుతున్నట్లు మరో డ్రామాకు తెరలేపుతున్నారని, రుణ మాఫీపై స్పష్టత ఇవ్వకుండా దాటవేసే ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు. డాక్యుమెంట్ల మాటేమిటి? నగలు తిరిగి ఇస్తారా? ‘‘రీషెడ్యూల్ చేస్తే అప్పుల కోసం రైతులు బ్యాంకుల్లో ఉంచిన డాక్యుమెంట్లు, కుదువపెట్టిన ఆడపడుచుల నగలు తిరిగి రావు. వాటిని రైతులకు ఇప్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందా? ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలి, రైతుల డాక్యుమెంట్లను, బంగారాన్ని ఇప్పించాలి’’ అని నెహ్రూ కోరారు. -
రాజన్నకు ఘన నివాళి
దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డిని ప్రజలు తమ గుండెల్లో నిలుపుకున్నారు. ఆయన జయంతిని మంగళవారం వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో వాడవాడలా ఘనంగా జరుపుకున్నారు. పలుచోట్ల వైఎస్ఆర్ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. పూజలు నిర్వహించారు. పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. తిరుపతి: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి 65వ జయంతిని జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ శ్రేణులు మంగళవారం ఘనంగా జరుపుకున్నాయి. తిరుపతి తుడా సర్కిల్లో వైఎస్ విగ్రహానికి పార్టీ కేంద్రపాలకవర్గ సభ్యుడు, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పూజలు నిర్వహించి, నివాళులర్పించారు. పార్టీ పట్టణశాఖ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మదనపల్లె పార్టీ కార్యాలయంలో జరిగిన వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో స్థానిక శాసనసభ్యుడు దేశాయ్ తిప్పారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పలువురు పార్టీ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు హాజరై వైఎస్ఆర్ చిత్ర పటానికి పూజలు నిర్వహించి నివాళులు అర్పించారు. పుంగనూరులో జరిగిన జయంతి వేడుకల్లో మున్సిపల్ మాజీ చైర్మన్ కొండవీటి నాగభూషణం, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు వెంకటరెడ్డియాదవ్ పాల్గొన్నారు. పలమనేరులో ఎమ్మెల్యే అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. స్థానిక శివాలయంలో వరుణయాగం జరిపించారు. వర్షాలు విరివిగా కురిసి వ్యవసాయం అభివృద్ధి చెంది వైఎస్ఆర్ ఆశయాలు నెరవేరాలని మొక్కుకున్నారు. పేదలకు అన్నదానం చేశారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని మండల కేంద్రాలు, గ్రామ పంచాయతీల్లో కార్యకర్తలు వైఎస్ఆర్ చిత్రపటాలకు పూజలు నిర్వహించి పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. గంగాధర నెల్లూరు నియోజవర్గంలోని పలు మండ లాల్లో జరిగిన వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో స్థానిక శాసనసభ్యుడు, పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.నారాయణస్వామి పాల్గొన్నారు. ఆయన ఆధ్వర్యంలో కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాలలో పార్టీ నాయకులు,కార్యకర్తలు వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో బి కొత్తకోట, మొలకలచెర్వు, తంబళ్లపల్లె, పెద్దమండ్యం మండలాల్లో వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాలు జరిగాయి. చిత్తూరు డీసీసీబీ కార్యాలయం ఆవరణలోని వైఎస్ఆర్ విగ్రహానికి జంగాలపల్లి శ్రీనివాసులు, పార్టీ మహిళావిభాగం జిల్లా అధ్యక్షురాలు గాయత్రీదేవి ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. వృద్ధాశ్రమంలో అనాథలకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. మాజీ శాసనసభ్యుడు ఏఎస్ మనోహర్ ఆధ్వర్యంలో స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూజలు నిర్వహించి నివాళులర్పించారు. అనుప్పల్లెలోని వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. కుప్పంలో పార్టీ నియోజకవర్గ నాయకుడు చంద్రమౌళి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, స్థానిక బధిర పాఠశాలలో విద్యార్థులకు పండ్లు పంచిపెట్టారు. అన్నదానం చేశారు. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సుబ్రమణ్యం రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూజలు చే సి ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. బంగారుపాళెం, యాదమరి, త వణంపల్లెల్లో జరిగిన వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో స్థానిక శాసనసభ్యుడు డాక్టర్ సునీల్ పాల్గొన్నారు. సత్యవేడులో నియోజకవర్గం ఇన్చార్జ్ ఆదిమూలం ఆధ్వర్యంలో కార్యకర్తలు వైఎస్ఆర్ చిత్రపటానికి నివాళులు అర్పించిన అనంతరం స్వీట్లు పంచిపెట్టారు. -
రాజన్నకు నివాళి
సాక్షి, ఖమ్మం: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 65వ జయంతి వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వైఎస్ విగ్రహాలకు పాలాభిషేకాలు చేసి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్యమంత్రిగా వైఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలను, ఆయన సేవలను స్మరించుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు, అనాథాశ్రమాల్లో పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. జిల్లాలోని పలు ప్రాంతాలలో అన్నదానం చేశారు. ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన జయంతి వేడుకలలో వైఎస్సార్ సీపీ శాసనసభా పక్ష నేత, అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు పాల్గొని వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. అపర భగీరథుడు, పేదల పెన్నిధి వైఎస్ అని కొనియాడారు. ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్మెంట్, రైతులకు రుణమాఫీ, పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు, గిరిజనులకు భూ పంపిణీ చేసి బలహీన వర్గాల ఆశాజ్యోతిగా పేరుతెచ్చుకున్నారని కొనియాడారు. ఆయన మరణంతో రాష్ట్రం చిన్నాభిన్నమై పోయిందని, పేదలకు సంక్షేమ పథకాల అమలులో జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ హయాంలో ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి జరిగిందన్నారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ ప్రస్తుత ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందో..రాదోనని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని, దీనిపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త కూరాకుల నాగభూషణం, నగర పార్టీ అధ్యక్షుడు తోట రామారావు, జిల్లా అధికార ప్రతినిధి ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, నాయకులు ఆకుల మూర్తి మాట్లాడుతూ వైఎస్ అభివృద్ధి, సంక్షేమం అనే రెండు చక్రాల బండితో రాష్ట్రాన్ని పాలించారన్నారు. అలాంటి మహానేత మరణంతో ప్రజలకు భరోసా ఇచ్చేవారు కరువయ్యారని అన్నారు. అనంతరం కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కీసర పద్మజారెడ్డి, నగర అధ్యక్షురాలు కొత్తగుండ్ల శ్రీలక్ష్మీ, ఉపాధ్యాయ విభాగం జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి గురుప్రసాద్, నాయకులు షర్మిలాసంపత్, కాంపెల్లి బాలకృష్ణ, రఘుదారల కొండలరావు, దామోదర్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, హెచ్.వెంకటేశ్వర్లు, మందడపు రామకృష్ణారెడ్డి, భాస్కర్‌నాయుడు, పత్తి శ్రీను, మైకా కృష్ణ, పొదిలి వెంకటేశ్వర్లు, కొంగర జ్యోతిర్మయి, ఆలస్యం సుధాకర్, చక్రపు సత్యనారాయణ, షకీనా, గడ్డం ఉపేందర్, వెంపటి నాగేశ్వరరావునాయుడు, కొణత ఉపేందర్, బాణాల లక్ష్మణ్, పెరుమాళ్ల లత, ఉపేంద్రారెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో పండ్లు పంపిణీ.. వైఎస్ జయంతి సందర్భంగా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఆస్పత్రిలో బిడ్డకు జన్మనిచ్చిన కొత్తగూడెం మండలం పాత అంజనాపురం గ్రామానికి చెందిన చింత కూమారికి పండ్లు పంపిణీ చేశారు. తల్లిదండ్రుల కోరిక మేరకు చిన్నారికి రాజశేఖర్ అని నామకరణం చేశారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే ఆర్థిక సహాయం చేశారు. అనంతరం దమ్మపేటలో జరిగిన కార్యక్రమంలో 25 మంది పేదలకు వస్త్రదానం చేశారు. వైరా, కొణిజర్ల మండలాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే బాణోత్ మద న్లాల్ పాల్గొన్నారు. వైరా బాలవెలుగు పాఠశాలలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. వైరా క్రాస్‌రోడ్డు, పాత బస్టాండ్ సెంటర్లో వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వికలాంగులకు వీల్చైర్లు పంపిణీ చేశారు. మణుగూరు వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కేక్‌కట్ చేసి వైఎస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పినపాకలోని ఏడూళ్లబయ్యారం క్రాస్‌రోడ్డులో వైఎస్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. భద్రాచలం పాత మార్కెట్ సెంటర్లో ఉన్న వైఎస్ విగ్రహానికి వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తెల్లం వెంకట్రావ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎటపాకలోని సరోజనమ్మ వృద్ధాశ్రమంలో అన్నదానం నిర్వహించి పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. కూసుమంచి, నాయకన్గూడెంలలో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం మూడు జిల్లాల కో ఆర్డినేటర్ సాధు రమేష్‌రెడ్డి పాల్గొని వైఎస్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఖమ్మం రూరల్ మండలం మద్దివారిగూడెంలో వైఎస్ విగ్రహానికి పార్టీ నాయకులు మందడి పుల్లారెడ్డి, కొత్తా శ్రీనివాసరెడ్డి పాలాభిషేకం చేశారు. ఇల్లెందు, బయ్యారం, గార్ల, కామేపల్లి, టేకులపల్లి మండల కేంద్రాల్లోనూ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇల్లెందు పట్టణ కన్వీనర్ దొడ్డా డానియేల్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైద్యశాలలో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. కొత్తగూడెం పట్టణ కన్వీనర్ బీమా శ్రీధర్ ఆధ్వర్యంలో సెవెన్‌హిల్స్ సెంటర్ వద్ద వైఎస్సార్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. పాల్వంచలో జిల్లా పార్టీ నాయకులు ఎర్రంశెట్టి ముత్తయ్య, కొత్వాల శ్రీను ఆధ్వర్యంలో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేశారు. సత్తుపల్లిలో పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మట్టా దయానంద్‌విజయ్‌కుమార్ వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి ఆర్పించారు. మధిరలో మండల కన్వీనర్ ఎన్నం కోటేశ్వరరావు ఆధ్వర్యంలో వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి, ప్రభుత్వ ఆస్పత్రి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. -
రుణమాఫీపై బ్యాంకర్లకు స్పష్టత ఇవ్వని చంద్రబాబు!
హైదరాబాద్: రైతు రుణమాఫీ అంశంపై బ్యాంకర్లకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య అనిశ్చితి కొనసాగుతోంది. రుణమాఫీపై బ్యాంకర్లకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టత ఇవ్వకపోవడం గందరగోళానికి దారి తీస్తోంది. ఎంత మేరకు రైతులకు రుణాలు మాఫీ చేస్తారో, ఎంతకాలం వరకు రుణాలు మాఫీ చేస్తారనే విషయాన్ని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పకపోవడంతో బ్యాంకర్లు తికమకపడుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఖరీఫ్ పంటకు మాత్రం రైతులకు బ్యాంకర్లు సహకరించాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులున్నాయని, తొందర్లోనే రుణమాఫీపై నిర్ణయం తీసుకుంటామనడంతో చంద్రబాబు దాటవేత ధోరణిని ఎంచకున్నట్టు కనిపిస్తోంది. రైతులకు కొత్త రుణాలు ఇచ్చేందుకు రుణాలను రీషెడ్యూల్ చేయండని బ్యాంకర్లను చంద్రబాబు కోరారు. రుణాలు చెల్లించకపోయినా రుణమాఫీ పథకం వర్తించేలా చూస్తామన్నారు. బంగారు రుణాలపై కూడా ఈ పథకాన్ని వర్తింపచేస్తామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంకర్లు సహకరించాలని చంద్రబాబు అన్నారు. కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియాతో రుణమాఫిపై మాట్లాడుతున్నామని, అయితే ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదని చంద్రబాబు తెలిపారు. బకాయిల చెల్లింపుల కోసం రైతులపై ఒత్తిడి తేవొద్దని బ్యాంకర్లతో ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. -
ఆదర్శ రైతులందరూ కాంగ్రెస్ కార్యకర్తలే: పల్లె
అనంతపురం: ఆదర్శ రైతులందరూ కాంగ్రెస్ కార్యకర్తలేనని ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తలనే ఆదర్శ రైతులుగా ఎంపిక చేశారని... అందుకే వారందర్ని తొలగించామని రఘునాథ్‌రెడ్డి తెలిపారు. అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. రైతుల వ్యవసాయ మోటార్స్ మార్చేందుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. కాంగ్రెస్ హాయంలో పార్టీకి చెందిన కార్యకర్తలని మాత్రమే ఆదర్శ రైతులుగా ఎంపిక చేశారని, అయితే నిజమైన ఆదర్శ రైతులను ఎంపిక చేయడానికే అందర్ని తొలగించామన్నారు. ఆదర్శ రైతులను తొలగిస్తూ తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయం వివాదస్పదమైంది. -
చంద్రబాబు మెడకు రుణమాఫీ ఉచ్చు!
ఎన్నికల సమయంలో ముందువెనక చూడకుండా టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రైతులు, చేనేత కార్మికుల రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. రుణమాఫీపైనే తొలి సంతకం అన్నారు. ఇప్పుడు అదే ఆయన మెడకు ఉచ్చులా బిగుసుకోనుంది. ఎన్నికల సమయంలో చంద్రబాబు మాటలు నమ్మి ప్రజలు ఓట్లు వేశారు. టిడిపి అధికారంలోకి వచ్చింది. తీరా తొలి సంతకం దగ్గరకు వచ్చేసరికి రుణమాఫీ కాస్త రుణమాఫీ కమిటీగా మారిపోయింది. కమిటీ పేరుతో కాలయాపన మొదలైంది. ఇక్కడే ఓ మోసం బట్టబయలైపోయింది. వర్షాలు కురిస్తే వ్యవసాయ పనులు మొదలు పెట్టాలి. పాత రుణాలు మాఫీ అయితేగానీ బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వవు. రుణమాఫీ కాకపోవడంతో రైతులకు బ్యాంకులు నోటీసులు ఇస్తున్నాయి. బంగారం వేలం వేస్తామని హెచ్చరిస్తున్నాయి. రుణమాఫీ అమలును ఏదోవిధంగా అమలు చేశాం అనిపించుకోవడానికి టిడిపి ప్రభుత్వం ఎత్తులకుపైఎత్తులు వేస్తోంది. మాఫీ చేసే రుణాలను కుదించడానికి మార్గాలను అన్వేషిస్తోంది. 50 వేల రూపాయల లోపు - లక్ష రూపాయల లోపు- రెండు ఎకరాల లోపు రైతు- అయిదు ఎకరాల లోపు రైతు - రుణం తీసుకున్నా కాలం - ఒక కుటుంబానికి ఒక రుణమాఫీ....ఇలా ప్రభుత్వం అనేక ఆలోచనలు చేస్తోంది. అందులో భాగంగా అనేక ప్రతిపాదనలను ముందుకు తీసుకువచ్చింది. అందులో ప్రధానమైనది రుణాల రీషెడ్యూల్. రుణాల రీషెడ్యూల్ అంటే ఇప్పటికే రైతులకు బ్యాంకులు ఇచ్చిన రుణాలను వెంటనే చెల్లించవలసిన అవసరంలేకుంవడా, వాటిని మూడు సంవత్సరాల కాలంలోపల చెల్లించే అవకాశం ఇస్తారు. అలా రీషెడ్యూల్ చేస్తే కొత్త రుణాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. రీషెడ్యూల్ అనేది రుణాల రద్దు కాదు, బకాయిలు అలానే ఉంటాయి, చెల్లింపునకు గడువు పొడిగింపు మాత్రమే. రుణాలను రీషెడ్యూల్ చేయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని, బ్యాంకులను, రిజర్వు బ్యాంకును కోరింది. పాత బకాయిలు అలా ఉంచి, బ్యాంకులు కొత్త రుణాలు ఎక్కడ నుంచి ఇస్తాయి? నగదు సర్క్యులేషన్ ఎలా? పాత బకాయిలు చెల్లిస్తేనే కొత్త రుణాలు ఇచ్చే అవకాశం ఉంటుందని రిజర్వు బ్యాంకు మొదటి నుంచి చెబూతూనే ఉంది. రుణాల రీషెడ్యూల్కు బ్యాంకులు సుముఖంగాలేవు. రైతులు కూడా అందుకు అంగీకరించడంలేదు. రైతులు రుణమాఫీని కోరుకుంటున్నారు. చెల్లించడానికి వాయిదానికాదు. రైతు రుణమాఫీపై అధ్యయనం కోసం నాబార్డు మాజీ చైర్మన్ డాక్టర్ పమిడి కోటయ్య అధ్యక్షతన నియమించిన కమిటీ ఆదివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సమావేశమైంది. ఈ సమావేశంలో మంత్రులు యనమల రామకృష్ణుడు, పత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్ బాబు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ రుణమాఫీపై వివరాల సేకరణకు కొంత సమయం కావాలని కమిటీ కోరినట్లు తెలిపారు. కాలయాపన కోసం ఇటువంటి మాటలు చెబుతున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి. రుణమాఫీ, రీషెడ్యూల్కు సంబంధించి కోటయ్య కమిటీ రిజర్వు బ్యాంకుకు మూడు రోజుల క్రితం ఒక లేఖ రాసింది. ఆర్బిఐ నుంచి ఎటువంటి సమాధానం లేదు. దాంతో కోటయ్య కమిటీ ఆర్బిఐ అధికారులను నేరుగా కలవనుంది. ఇదిలా ఉంటే ఒక కుటుంబానికి ఒక రుణమాఫీ మాత్రమే వర్తించేలా ఆలోచన చేస్తున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సాక్షిటీవీకి చెప్పారు. రుణమాఫీకి రిజర్వ్ బ్యాంక్ ఒప్పుకునేలా కోటయ్య కమిటీ ప్రయత్నిస్తోందన్నారు. రిజర్వ్ బ్యాంకు నుంచి సమాధానం వచ్చిన తరువాత రుణమాఫీపై స్పష్టత వస్తుందని చెప్పారు. రైతుల రుణబకాయిలను నగదు రూపంలో చెల్లించకుండా బ్యాంకులు తిరిగి రుణాలు ఇచ్చే పరిస్థితిలేదు. ప్రభుత్వ హామీలను బ్యాంకులు అంగీకరించవు. ఆ విషయం రిజర్వు బ్యాంకు స్పష్టం చేసింది. ఈ పరిస్థితులలో చంద్రబాబు నాయుడు మాటలు నమ్మిన రైతులకు కష్టాలు మొదలయ్యాయి. మోసపోయినట్లు రైతులు గుర్తించడం మొదలైంది. ఏదిఏమైనా ఇప్పుడు చేయగలిగిందిలేమీలేదు. చంద్రబాబు నాయుడుకు అయిదేళ్లకు అధికారం కట్టబెట్టారు. భరించకతప్పదు. -
షరతుల్లేకుండా రుణాలు మాఫీ చేయాలి
రాయదుర్గం : ఎన్నికల సందర్భంగా టీడీపీ మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా రైతులకు చెందిన అన్ని రకాల రుణాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎలాంటి షరతులు లేకుండా వెంటనే మాఫీ చేయాలని మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. అలాగే రుణాలు చెల్లించాలని బ్యాంకర్లు రైతులపై ఒత్తిడి చేయకుండా తక్షణం ఆదేశాలు జారీ చేయాలన్నారు. శనివారం సాయంత్రం ఆయన తన స్వగృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ మేరకు డిమాండ్ చేశారు. రైతు రుణాలు మాఫీ చేస్తానని, తొలి సంతకం ఆ ఫైలుపైనే చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు, దానిపై కమిటీ వేయడానికి దస్త్రాలపై సంతకం పెట్టి, మొదటి సంతకంతోనే రైతులను మోసం చేశాడని ధ్వజమెత్తారు. రుణ మాఫీ హామీ ఇవ్వడం వల్లే రైతులు టీడీపీకి అధికారం కట్టబెట్టారని, ఇపుడేమో కమిటీల పేరుతో కాలయాపన చేసి దగా చేయాలని ప్రయత్నిస్తే, రైతుల తరఫున ప్రతిపక్ష పార్టీగా వైఎస్సార్సీపీ ఆందోళన చేయడానికి సిద్ధమవుతుందని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ప్రారంభమైందని, వెంటనే పంట రుణాలతో పాటు, బంగారు నగలు తాకట్టు పెట్టి పొందిన రుణాలు, వ్యవసాయం కోసం తీసుకున్న ట్రాక్టర్ల రుణాలను కూడా మాఫీ చేసి, కొత్త రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులు కూడా బ్యాంకులకు ఎలాంటి రుణాలను చెల్లించవద్దని ఆయన పిలుపునిచ్చారు. అలాగే రైతుల ఖాతాల్లో ఉన్న పొదుపు లేదా డిపాజిట్ల సొమ్మును బ్యాంకర్లు రుణాలకు జమ చేసుకోకుండా బ్యాంకుల్లో ఉన్న నగదును డ్రా చేసుకోవాలని సూచించారు. సబ్సిడీ ధరతో వెంటనే విత్తన వేరుశనగ, ఎరువులు అందించాలని, డ్వాక్రా రుణాలు సైతం ఎలాంటి ఆంక్షలు లేకుండా మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యువతకు నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం ఇచ్చి మాట నిలబెట్టుకోవాలని కోరారు. పింఛన్లను ఏ నిబంధనలూ లేకుండా అందించాలన్నారు. టీడీపీ తన మేనిఫెస్టోలోని హామీలను నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేయాలని చూస్తే, అన్ని వర్గాల ప్రజల తరఫున పోరాటాలు చేస్తామన్నారు. -
రైతులను కేసీఆర్ మోసం చేశాడు: కిషన్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావుపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో రుణమాఫీ చేస్తానని తెలంగాణ రైతులను కేసీఆర్ మోసం చేశాడని కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ రైతుల ఓట్ల కోసమే రుణమాఫీ హామీ ఇచ్చారని.. ఎలాంటి షరతులు లేకుండా రైతు రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చిన ఆయన ప్రస్తుతం మాటమార్చడంపై కిషన్ రెడ్డి విమర్శించారు. ఇప్పుడు 2013-14 తర్వాత తీసుకున్న రుణాలు మాఫీ చేస్తాననడం మాటమార్చడమే అని కిషన్ రెడ్డి అన్నారు. -
బాబుకు రుణమాఫీ సవాల్