రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: రైతుల రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ప్రధాని మోదీ లక్ష్యంగా తన విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు. రైతు సమస్యల పరిష్కారం విషయంలో మొద్దునిద్ర పోతున్న గుజరాత్, అసోం ముఖ్యమంత్రులను తాము నిద్రలేపగలిగామని రాహుల్ వ్యాఖ్యానించారు. త్వరలోనే ప్రధాని మోదీని కూడా నిద్రలేపుతామని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాహుల్ బుధవారం తన ట్విట్టర్ హ్యాండిల్‌లో స్పందిస్తూ..‘మొద్దునిద్ర పోతున్న అసోం, గుజరాత్ ముఖ్యమంత్రులను కాంగ్రెస్ పార్టీ నిద్రలేపగలిగింది.
ప్రధాని మోదీ ఇంకా నిద్రపోతున్నారు. ఆయన్ను కూడా మేం నిద్ర లేపుతాం’ అని ట్వీట్ చేశారు. అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లోనే రుణమాఫీ చేస్తామని చెప్పినప్పటికీ, కేవలం ఆరు గంటల్లోనే రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లో రుణాలను రద్దుచేశామన్నారు. రూ.600 కోట్ల రైతురుణాలను మాఫీ చేస్తామనీ అసోం, రూ.625 కోట్ల విద్యుత్ బకాయిలను రద్దుచేస్తామని గుజరాత్ ప్రభుత్వాలు ప్రకటించ డంతో రాహుల్ ఈమేరకు స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment