వచ్చేనెల తొలివారంలోగా రుణమాఫీ కలెక్టర్ శ్రీధర్ | Next month in the first week of the loan waiver | Sakshi
Sakshi News home page

వచ్చేనెల తొలివారంలోగా రుణమాఫీ కలెక్టర్ శ్రీధర్

Published Sat, Aug 16 2014 11:54 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

వచ్చేనెల తొలివారంలోగా రుణమాఫీ కలెక్టర్ శ్రీధర్ - Sakshi

వచ్చేనెల తొలివారంలోగా రుణమాఫీ కలెక్టర్ శ్రీధర్

సాక్షి, రంగారెడ్డి జిల్లా :  రైతుల రుణమాఫీకి సంబంధించి సెప్టెంబర్ మొదటి వారంలోగా లబ్ధిదారుల జాబితా తయారు చేయాలని కలెక్టర్ ఎన్.శ్రీధర్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో వ్యవసాయ అనుబంధ శాఖలు, బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందని, ఆ ఉత్తర్వుల ప్రకారం అర్హులను తేల్చాలని అన్నారు.
 
జిల్లా వ్యాప్తంగా 33 బ్యాంకులకు చెందిన 627 శాఖల ద్వారా రైతులు రుణాలు పొందినట్లు ప్రాథమిక సమాచారముందన్నారు. ఈమేరకు పరిశీలనచేసి అర్హులను గుర్తించాలన్నారు. తహసీల్దార్లు వారి మండలాల్లో భూములను పరిశీలించి రుణం తీసుకున్నట్లు నిర్ధారణచేసిన తర్వాతే అర్హుల జాబితా ఖరారు చేయాలన్నారు. అదేవిధంగా ఈనెల 31తో ఖరీఫ్ ముగుస్తున్నందున కొత్తరుణాలు విడుదల చేయాలన్నారు. సమావేశంలో ఎల్‌డీఎం వెంకట్‌రెడ్డి, జేడీఏ విజయ్‌కుమార్, ఉద్యానశాఖ ఏడీ ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement