
మహోబా(యూపీ): రూ.8వేల కోట్ల ఖరీదైన విమానంలో ప్రయాణించే ప్రధాని మోదీ..రైతుల రుణాలను మాత్రం మాఫీ చేయడం లేదని కాంగ్రెస్ నేత ప్రియాంకాగాంధీ విమర్శించారు. శనివారం ఆమె యూపీలోని బుందేల్‌ఖండ్ జిల్లాలో కాంగ్రెస్ నిర్వహించిన ప్రతిజ్ఞార్యాలీలో ప్రసంగించారు. విమానాలు కొనుగోలు చేసేందుకు ప్రధాని వద్ద డబ్బుంటుంది కానీ, సామాన్యులకు ఇచ్చేందుకు ఉండదన్నారు. ప్రధాని మోదీ స్నేహితులైన బడాపారిశ్రామిక వేత్తల ఆదాయం రోజుకు రూ.10వేల కోట్లు కాగా, సాధారణ వ్యక్తి ఆదాయం రోజుకు కేవలం రూ.27 మాత్రమేనని ఆమె అన్నారు. ప్రధాని మోదీ రైతులు, ప్రజల సంక్షేమానికి చేసిందేమీ లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment