ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యతిరేకి: ప్రియాంక | Patel Opposed RSS Said By Priyanka Gandhi | Sakshi
Sakshi News home page

ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యతిరేకి: ప్రియాంక

Published Thu, Oct 31 2019 5:36 PM | Last Updated on Thu, Oct 31 2019 5:45 PM

Patel Opposed RSS Said By Priyanka Gandhi - Sakshi

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి స్వాతంత్రోద్యమ పోరాటంలో పాల్గొన్న నాయకుడు లేడని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ట్వీట్‌ చేశారు. భారత మాజీ హోంమంత్రి ఉక్కుమనిషి సర్దార్‌ వల్లబాయ్‌ పటేల్‌ జయంతి వేడుకలను గురువారం కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె స్పందిస్తూ.. పటేల్‌ జీవితాంతం కాంగ్రెస్‌ సిద్ధాంతాలను గౌరవించేవాడని పేర్కొన్నారు.

కాగా, ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాలను వ్యతిరేకించేవారని గుర్తుచేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్దాంతాలను బీజేపీ పాటిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. మరోవైపు పటేల్‌కు సన్నిహితుడైన మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ సైతం ఆర్‌ఎస్‌ఎస్‌ను వ్యతిరేకించేవారని తెలిపింది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పటేల్‌ను కాంగ్రెస్‌ విస్మరించిందంటూ బీజేపీ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆమె విమర్శించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement