గువహటి: అసోం ఎన్నికల ప్రచారం రసవత్తరంగా కొనసాగుతోంది. అందులో భాగంగా ప్రధాన జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఒకరిపైఒకరు తీవ్రంగా విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గతంలో అస్సాంలో వరదలు వస్తే , పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) సమస్యపై స్పందించని ప్రధాని, 22 ఏళ్ల దిశ రవి ట్విట్‌పై మాత్రం ఎలా స్పందించారంటూ కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఆదివారం అస్సాంలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీని విమర్శించారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఉన్న యువతియువకులను , కార్మికులను, రైతులను భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మోసం చేసిందని ప్రియాంక గాంధీ ఆరోపించారు.
అసోంలోని జోర్హాట్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. "ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడైనా ఒక టీ గార్డెన్‌ను సందర్శించారా..!, అక్కడ మహిళా కార్మికులను కలిశారా? టీ ఎస్టేట్‌లో పనిచేసే కార్మికులకు రోజువారీ వేతనం 350 రూపాయలు ఇస్తానన్న వాగ్దానాన్ని ఇంకా నెరవెర్చలేనందుకు కార్మికుల పట్ల బాధగా లేదా..! " అని ప్రధాని నరేంద్ర మోదీని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ అసోంలో అధికారంలో రావడానికి తీవ్రంగా కృషిచేస్తోందని ప్రియాంక గాంధీ తెలిపారు. అస్సాంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.కాంగ్రెస్ పార్టీ కేవలం అభివృద్ధి కొరకు పాటుపడుతుందన్నారు. అసోంలో 126 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు మూడు దశల్లో జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment