assam assembly election
-
అసోం సీఎంగా హిమంత బిశ్వ శర్మ!
దిస్పూర్: అస్సాం నూతన ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై సస్పెన్స్ వీడింది. ఆదివారం జరిగిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మను బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఈ పదవి కోసం సీనియర్ నేతలు సర్బానంద సోనోవాల్, హిమంత బిశ్వ శర్మ పోటీపడిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వంలో సోనోవాల్ ముఖ్యమంత్రిగా, శర్మ ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. మరో వైపు అసోం సీఎం సర్బానంద సోనోవాల్ రాజీనామా చేశారు. గవర్నర్‌కు తన రాజీనామా లేఖను సమర్పించారు. ఇక సీఎంగా ఎన్నికైన బిశ్వ శర్మ అస్సామీ బ్రాహ్మణుడు. ఈశాన్య ప్రజాస్వామ్య కూటమి కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. అస్సాంలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నాయకత్వం ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది ప్రకటించలేదు. అస్సాంలో 126 అసెంబ్లీ సీట్లుండగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 60 సీట్లు గెలుచుకుంది. దాని మిత్రపక్షాలైన ఏజీపీ 9, యూపీపీఎల్ 6 సీట్లు దక్కించుకున్న సంగతి తెలిసిందే. చదవండి: ఒట్టి చేతులతో వచ్చారేంటి.. సీఎస్‌పై గవర్నర్ ఫైర్ -
అస్సాం ముఖ్యమంత్రి ఎవరో?
న్యూఢిల్లీ: అస్సాం నూతన ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ పదవి కోసం సీనియర్ నేతలు సర్బానంద సోనోవాల్, హిమంత బిశ్వ శర్మ పోటీపడుతున్నారు. గత ప్రభుత్వంలో సోనోవాల్ ముఖ్యమంత్రిగా, శర్మ ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. వారిద్దరూ శనివారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా, పార్టీ జనరల్ సెక్రటరీ(సంస్థాగత) బి.ఎల్.సంతోష్‌తో పలుమార్లు సమావేశమయ్యారు. తదుపరి ముఖ్యమంత్రి ఎవరో తేల్చాలని బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయించింది. ఢిల్లీకి రావాలంటూ సోనోవాల్, శర్మకు శుక్రవారం వర్తమానం పంపింది. శనివారం పార్టీ పెద్దలతో భేటీ అనంతరం హిమంత బిశ్వ శర్మ మీడియాతో మాట్లాడారు. బీజేపీ అస్సాం శాసనసభాపక్ష సమావేశం ఆదివారం గువాహటిలో జరిగే అవకాశం ఉందని చెప్పారు. కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై చర్చిస్తామని వెల్లడించారు. కొత్త ముఖ్యమంత్రి పేరు ఖరారుపై, నూతన ప్రభుత్వ ఏర్పాటుపై అన్ని ప్రశ్నలకు ఈ సమావేశంలోనే సమాధానం దొరుకుతుందన్నారు. ఢిల్లీలో సోనోవాల్, శర్మతో బీజేపీ అగ్రనేతలు రెండుసార్లు విడివిడిగా మాట్లాడారు. ఒకసారి ఇద్దరినీ కలిపి కూర్చోబెట్టి చర్చించారు. నడ్డా నివాసానికి వేర్వేరు వాహనాల్లో వచ్చిన సోనోవాల్, శర్మ తిరిగి వెళ్లేటప్పుడు ఒకే కారులో వెళ్లారు. సీఎం రేసులో ముందంజలో ఉన్నారని భావిస్తున్న సోనోవాల్ అస్సాంలోని స్థానిక సోనోవాల్–కచారీ గిరిజన తెగకు చెందిన నాయకుడు. ఇక శర్మ అస్సామీ బ్రాహ్మణుడు. ఈశాన్య ప్రజాస్వామ్య కూటమి కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈసారి ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కాలని ఉవ్విళ్లూరుతున్నారు. అస్సాంలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నాయకత్వం ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది ప్రకటించలేదు. 2016లో ఎన్నికల కంటే ముందు సోనోవాల్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. రాష్ట్రంలో తొలిసారిగా గెలిచింది. ఆయనకు ముఖ్యమంత్రి పదవి అప్పగించింది. అస్సాంలో 126 అసెంబ్లీ సీట్లుండగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 60 సీట్లు గెలుచుకుంది. దాని మిత్రపక్షాలైన ఏజీపీ 9, యూపీపీఎల్ 6 సీట్లు దక్కించుకున్నాయి. -
Assam: కొడుకు బెయిల్ కోసం ఎన్నికల్లో గెలిపించిన తల్లి
అఖిల్ గొగొయి జైల్లో ఉన్నారు. ఆయన తరఫున 85 ఏళ్ల ఆయన తల్లి ప్రియాద ఎన్నికల ప్రచారం చేశారు. అస్సాంలోని శివసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అఖిల్ సుమారు 12 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక 30 ఏళ్ల చందనా బారి ఒక పూరి గుడిసెలో ఉంటారు. భర్త రోజువారీ కూలీ. పశ్చిమ బెంగాల్‌లోని సల్తోరా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నాలుగు వేల ఓట్లు మెజారిటీతో గెలిచారు. డబ్బు, రాజకీయ అనుభవం లేకున్నా చందన గెలిస్తే.. తన బిడ్డను ఎలాగైనా జైలు నుంచి విడిపించుకునే ప్రయత్నంలో భాగంగా ప్రియాద అతడిని గెలిపించుకున్నారు. వీరివి అసాధారణ విజయాలు మాత్రమే కాదు.. వీరు అసాధారణ విజేతలు కూడా! ప్రియాద అఖిల్ సామాజిక కార్యకర్త. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా అస్సాంలో ప్రదర్శనలు నిర్వహించి 2019 డిసెంబరులో అరెస్ట్ అయ్యారు. ఎన్నికల్లో తన సొంత పార్టీ ‘రైజోర్ దళ్’ అభ్యర్థిగా శివసాగర్ నియోజకవర్గం నుంచి పోటీకి నిలబడ్డారు. కానీ బయటికి వచ్చి ప్రచారం చేయడానికి లేదు. ఆ బాధ్యతను వృద్ధురాలైన అతడి తల్లి ప్రియాద తన భుజంపై వేసుకున్నారు. ఆమె ఆశ ఒక్కటే. తన కొడుకు గెలిస్తే, అప్పుడైనా అతడిని విడుదల చేస్తారని. అందుకే అతడిని గెలిపించడం కోసం ఆమె శివసాగర్‌లో ఇంటింటికి తిరిగారు. వేసవి గాలుల్ని, తన హృద్రోగాన్ని, సహకరించని కంటి చూపును కూడా ఆమె లక్ష్య పెట్టలేదు. ఆ మాతృమూర్తి పట్టుదలకు చలించిపోయిన ప్రముఖ సామాజిక కార్యకర్తలు మేధా పాట్కర్, సందీప్ పాండే ఆమెకు తోడుగా ప్రచారానికి వచ్చారు. ఆ తల్లి శ్రమ ఫలించింది. అఖిల్ గెలిచాడు. ఇక అతడికి బెయిలు రావడమే మిగిలింది. చందన పశ్చిమ బెంగాల్‌లోని సల్తోరా నియోజకవర్గం నుంచి గెలిచిన చందనా బారి బీజేపీ నిలబెట్టిన అభ్యర్థి. ఆ రాష్ట్రంలో ఆ పార్టీ తరఫున ఆశ్చర్యకరమైన రీతిలో గెలిచిన వారిలో చందన ఒకరు. నిరుపేద కుటుంబం. భర్త రోజువారీ కూలి. అధికార తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిపై ఆమె ఘన విజయం సాధించగానే ట్విట్టర్లో చందన పేరు మార్మోగిపోయింది. ఆమె గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ ఆమె ఓట్లు అడిగిన విధానం, ఏ బలమూ లేని నిదానం.. ఓటర్లను ఆకట్టుకుంది. ‘‘ఆమెను చూడండి. రాజకీయాలు తెలియవు. డబ్బు లేదు. ఉండటానికి సరైన ఇల్లు కూడా లేదు. అయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో ప్రజలకు సేవ చేసేందుకు ముందుకొచ్చింది’’ అని ట్విట్టర్ యూజర్లు వందల సంఖ్యలో చందనకు నేటికింకా అభినందనలు తెలియజేస్తూనే ఉన్నారు. చదవండి: West Bengal: మూడోసారి సీఎంగా మమత ప్రమాణ స్వీకారం -
Akhil Gogoi: జైలు నుంచి అసెంబ్లీకి..
శివసాగర్(అస్సాం): పౌరసత్వ సవరణ చట్ట(సీఏఏ) వ్యతిరేక ఉద్యమకారుడు, సమాచార హక్కు చట్టం కార్యకర్త అఖిల్ గొగోయ్(46) జైల్లో ఉంటూ అస్సాంలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తొలినేతగా గుర్తింపు పొందారు. ఆయన శివసాగర్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీ అభ్యర్థి సురభీ రాజ్‌కొన్వారీపై 11,875 ఓట్ల తేడాతో నెగ్గడం విశేషం. దేశద్రోహం ఆరోపణలతో 2019 డిసెంబర్లో అఖిల్ గొగోయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి జైల్లో ఉంటున్నారు. రాయ్జోర్ దళ్ అనే కొత్త పార్టీని స్థాపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. 57,219 ఓట్లు సాధించారు. పోలైన మొత్తంలో ఓట్లలో 46.06 ఓట్లు దక్కించుకోవడం గమనార్హం. అస్సాంలో కాంగ్రెస్ పార్టీ తొలుత అఖిల్‌కి మద్దతు ప్రకటించింది. పార్టీ టికెట్‌ను మాత్రం శుభ్రమిత్ర గొగోయ్‌కు కేటాయించింది. శుభ్రమిత్ర మూడో స్థానంలో నిలిచారు. జైలు నుంచి బహిరంగ లేఖలు అఖిల్ జైల్లో ఉంటూనే ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నించారు. తరచుగా అస్సాం ప్రజలకు బహిరంగ లేఖలు రాశారు. ప్రజా సమస్యలను లేవనెత్తేవారు. ఆయన తల్లి ప్రియద 85 ఏళ్ల వృద్ధురాలు. కుమారుడి గెలుపు కోసం శివసాగర్ నియోజకవర్గంలో ప్రచారం చేశారు. ప్రముఖ సామాజిక ఉద్యమకారులు మేధా పాట్కర్, సందీప్ పాండే అఖిల్‌కు మద్దతుగా ప్రచారం చేశారు. వందలాది మంది రాయ్జోర్ దళ్ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఓట్లు అడిగారు. అఖిల్ గొగోయ్‌ను గెలిపించాలని కోరారు. ఆయన చేతిలో డబ్బులేవీ లేవు. రూ.60,497 బ్యాంకు డిపాజిట్లు మాత్రమే ఉన్నాయి. అఖిల్ గొగోయ్ గౌహతిలోని కాటన్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. 1995–96లో కాటన్ కాలేజీ విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. -
అసోం: తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న బీజేపీ కూటమి
లైవ్ అప్డేట్స్: Time 7.12 అసోంలో ఎన్డీయే కూటమి మరోసారి అధికారంలో రావడానికి కృషి చేసిన బీజేపీ పార్టీ కార్యకర్తలకు సర్బానంద సోనోవాల్ అసోం ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం అసోంలో బీజేపీ కూటమి ఆధిక్యంలో ఉండగా.., బీజేపీ 75, కాంగ్రెస్ 50, ఇతరులు 1 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. బీజేపీ మ్యాజిగ్ ఫిగర్ దాటి, తిరిగి అసోంలో ఏన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనుంది. Time 5.38 హిమంత బిస్వా శర్మ భారీ మెజార్టీతో గెలుపు హిమంత బిస్వా శర్మ జలుక్బారి నియోజకవర్గం నుంచి వరుసగా ఐదోసారి గెలుపొందారు. సుమారు లక్షపైగా మెజార్టీని సాధించారు. ఈ సందర్భంగా హిమంత బిస్వా శర్మ నియోజక వర్గ ప్రజలకు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా ప్రస్తుతం అసోంలో బీజేపీ కూటమి ఆధిక్యంలో ఉండగా.., బీజేపీ 73, కాంగ్రెస్ 52, ఇతరులు 1 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. బీజేపీ మ్యాజిగ్ ఫిగర్ దాటి, తిరిగి అసోంలో ఏన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనుంది. @BJP4India won Jalukbari LAC-by a margin of 1,01,911 votes. It would be my Privilege to represent the constituency for 5th consecutive term. My gratitude to the people of Jalukbari,Honble PM @narendramodi , HM @AmitShah and national president @JPNadda JAI AAI ASOM,JAI HIND — Himanta Biswa Sarma (@himantabiswa) May 2, 2021 Time 5.03 సర్బనంద్ సోనావాల్‌కు అభినందనలు తెలిపిన రాజ్‌నాథ్ సింగ్ ► అసోంలో ఎన్డీయే కూటమి విజయం సాధించినందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. అసోంలో ఎన్డీయే విజయానికి కృషి చేసిన బీజేపీ కార్యకర్తలను అభినందించారు. The pro-people policies of Shri @narendramodi led Govt & the state Govt under @sarbanandsonwal have once again helped the BJP in winning assembly elections in Assam. Congratulations to PM Modi, CM Sonowal, Adhyaksh Shri @JPNadda & karyakartas on BJP’s impressive victory in Assam. — Rajnath Singh (@rajnathsingh) May 2, 2021 Time 4.52 బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ సీనియర్ నాయకురాలు ఓటమి ► కోక్రాజార్ ఈస్ట్ నుంచి పోటిచేస్తున్న బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్) సీనియర్ నాయకురాలు ప్రమీలా రాణి బ్రహ్మ సమీప అభ్యర్థి యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ (యుపీపీఎల్) అభ్యర్థి లారెన్స్ ఇస్లారీ చేతిలో ఓడిపోయారు. 1991 నుంచి ప్రతిసారి ఈ స్థానాన్ని గెలుచుకుంటూ వచ్చారు. అంతకుముందు సర్బానంద సోనోవాల్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. ప్రస్తుత ఎన్నికల్లో ఎన్డీయే కూటమి నుంచి బీపీఎఫ్ బయటకు వచ్చి , కాంగ్రెస్ తో జత కట్టింది. కాగా ప్రస్తుతం అసోంలో బీజేపీ కూటమి ఆధిక్యంలో ఉంది. అసోంలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. బీజేపీ 75, కాంగ్రెస్ 49, ఇతరులు 2 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. బీజేపీ మ్యాజిగ్ ఫిగర్ దాటింది Time 4.00 ► అసోంలో బీజేపీ కూటమి ఆధిక్యంలో ఉంది. అసోంలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. బీజేపీ 71, కాంగ్రెస్ 53, ఇతరులు 2 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. బీజేపీ మ్యాజిగ్ ఫిగర్ దాటింది. Time 3.00 ► అసోంలో బీజేపీ కూటమి ఆధిక్యంలో ఉంది. అసోంలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. బీజేపీ 73, కాంగ్రెస్ 50, ఇతరులు 3 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. బీజేపీ మ్యాజిగ్ ఫిగర్ దాటింది. 12.50 ► అసోంలో బీజేపీ కూటమి ఆధిక్యంలో ఉంది. అసోంలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. బీజేపీ 76, కాంగ్రెస్ 47, ఇతరులు 3 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. బీజేపీ మ్యాజిగ్ ఫిగర్ దాటింది. Time 12.00 ► అసోంలో బీజేపీ కూటమి ఆధిక్యం ప్రదర్శిస్తోంది. అసోంలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. బీజేపీ 81, కాంగ్రెస్ 44, ఇతరులు 1 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. బీజేపీ మ్యాజిగ్ ఫిగర్ దాటింది. Time 11.10 ► అసోంలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. బీజేపీ 83, కాంగ్రెస్ 41, ఇతరులు 2 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. బీజేపీ మ్యాజిగ్ ఫిగర్ దాటింది. ► అసోంలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. బీజేపీ మ్యాజిగ్ ఫిగర్ దాటింది. బీజేపీ 78, కాంగ్రెస్ 35, ఇతరులు 2 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. Time 10.20 ► అసోంలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. బీజేపీ మ్యాజిగ్ ఫిగర్ దాటింది. 73 చోట్ల బీజేపీ ఆధిక్యంలో ఉంది. Time 10.00 ► అసోంలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. బీజేపీ ఆధిక్యంతో దూసుకుపోతుంది. బీజేపీ 68, కాంగ్రెస్ 39, ఇతరులు 2 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. ►అసోంలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. జలుక్బరిలో బీజేపీ అభ్యర్థి హిమంత బిశ్వ శర్మ ముందంజ ►అసోంలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మజోలిలో సీఎం శర్బానంద సోనావాల్ వెనుకంజ. Time 9.40 ► అసోంలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు బీజేపీ అధిక్యంతో కొనసాగుతోంది. బీజేపీ 49, కాంగ్రెస్ 24, ఇతరులు 2 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. ► అసోంలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. అసోంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ కోసం 64 అవసరం అవుతాయి. సీఎం సోనోవాల్(బీజేపీ) మజులీలో పోటీ చేశారు. హిమంత బిశ్వశర్మ(బీజేపీ) జులుక్బారీలో పోటీ చేశారు. కేశబ్ మహంత(ఏజీపీ) సమగురిలో పోటీ చేశారు. 2016లో 86 సీట్లతో ఎన్డీఏ అధికారం దక్కించుకుంది. ► అసోంలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు బీజేపీ ముందంజలో ఉంది. బీజేపీ 43, కాంగ్రెస్ 20, ఇతరులు 2 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. ► అసోంలో బీజేపీ ముందంజలో ఉంది. బీజేపీ 36, కాంగ్రెస్ 19, ఇతరులు 2 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. ► అసోంలో బీజేపీ ముందంజలో ఉంది. బీజేపీ 35, కాంగ్రెస్ 17 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. ► అసోంలో బీజేపీ ముందంజలో ఉంది. బీజేపీ 29, కాంగ్రెస్ 14 చోట్ల ఆధిక్యం కనబరుస్తున్నాయి. ► అసోంలో బీజేపీ ముందంజలో ఉంది. బీజేపీ 27, కాంగ్రెస్ 14 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. ► అసోంలో బీజేపీ ముందంజలో ఉంది. బీజేపీ 23, కాంగ్రెస్ 11 చోట్ల ఆధిక్యం కనబరుస్తున్నాయి. ► అసోంలో బీజేపీ ముందంజలో ఉంది. బీజేపీ 18, కాంగ్రెస్ 11 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. ► అసోంలో బీజేపీ ముందంజలో ఉంది. బీజేపీ 11, కాంగ్రెస్ 5 చోట్ల ఆధిక్యం కనబరుస్తున్నాయి. ► అసోంలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్లో బీజేపీ ముందంజలో ఉంది. ► అసోంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ► కౌంటింగ్ సిబ్బంది కౌంటింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. కరోనా జాగ్రత్తలు తీసుకొని అధికారులు థర్మల్ స్కానింగ్ చేసి సిబ్బందిని కౌంటింగ్ కేంద్రాలకు అనుమతిస్తున్నారు. దిస్పుర్: అసోంలో ఎవరు అధికారంలోకి రానున్నారో నేటి ఫలితాలు తేల్చనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ జరిగిన 47 స్థానాల ఫలితాల కౌంటింగ్ ప్రక్రియ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. అధికారాన్ని కాపాడుకోవడానికి బీజేపీ-ఏజీపీ కూటమి పకడ్బందీ వ్యూహాలను రచించిన విషయం తెలిసిందే. 126 అసెంబ్లీ స్థానాలున్న అస్సాంలో మార్చి 27 నుంచి ఏప్రిల్ 6 దాకా మూడు దశల్లో ఎన్నికలు జరిగాయి. గత ఎన్నికల్లో బీజేపీ-ఏజీపీలు 47 స్థానాలకు గాను 35 సీట్లలో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే అసోంలో ఈ ఎన్నికల్లో గెలిచి తప్పకుండా అధికారంలోకి రావాలని భావిస్తున్న కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. లోకల్ కార్డుతో కొత్తగా ఏర్పాటైన అసోం జాతీయ పరిషత్ కూడా బరిలో నిలవటంలో అసెంబ్లీ ఎన్నికల పోరు ఉత్కంఠ రేపుతోంది. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ని, జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ)ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నేపథ్యంలో అస్సాం అసెంబ్లీ పోరు రసవత్తరంగా మారింది. -
కార్యకర్తకు వడదెబ్బ: ప్రసంగం ఆపి వైద్యులను పంపిన ప్రధాని
గుహవాటి: అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం అసోంలో పర్యటించారు. భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా పార్టీ కార్యకర్త ఒకరు వడదెబ్బ (డీహైడ్రేషన్)కు గురయ్యాడు. దీంతో సభా ప్రాంగణంలో కలకలం రేపింది. దీంతో ప్రధానమంత్రి ప్రసంగం ఆపేసి వెంటనే అతడి గురించి ఆరా తీశారు. వెంటనే తన వైద్య సిబ్బందిని పంపించి అతడికి వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ మేరకు కొద్దిసేపు పాటు నరేంద్ర మోదీ తన ప్రసంగం ఆపేసి కార్యకర్త వైద్యంపై ఆదేశాలు ఇచ్చారు. అసోంలోని బస్కా జిల్లా తముల్పూర్లో బహిరంగసభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతున్నారు. ఆ సమయంలో జనాల్లో ఉన్న కార్యకర్త హరిచరణ్ దాస్ ఎండలకు తాళలేక వడదెబ్బ (డీహైడ్రేషన్) తగిలింది. దీంతో కార్యకర్త సొమ్మసిల్లి పడడంతో జనాల్లో కలకలం మొదలైంది. ఈ విషయాన్ని గమనించిన ప్రధాని మోదీ వెంటనే ప్రసంగం ఆపేశారు. అనంతరం తన వైద్య బృందాన్ని అతడికి వైద్యం చేయాలని పంపించారు. వెంటనే ప్రధానమంత్రి వైద్య బృందం హరిచరణ్ దాస్ వద్దకు వెళ్లి వైద్యం అందించారు. అతడి ఆరోగ్యం మెరుగుపడిందని వైద్యులు తెలిపారు. అనంతరం ప్రధాని ప్రసంగం కొనసాగించారు. ప్రధానమంత్రి వెంట ఎప్పటికీ నలుగురితో కూడిన వైద్య బృందం వెంట ఉండే విషయం తెలిసిందే. నిరంతరం ఆ వైద్యులు ప్రధాని వెంట ఉంటారు. #WATCH: During a rally in Assam's Tamalpur, PM Narendra Modi asked his medical team to help a party worker who faced issues due to dehydration.#AssamAssemblyPolls pic.twitter.com/3Q70GPrtWs — ANI (@ANI) April 3, 2021 -
బెంగాల్లో 80%, అస్సాంలో 72% పోలింగ్
న్యూఢిల్లీ/కోల్‌కతా/మిడ్నాపూర్: పశ్చిమ బెంగా ల్, అస్సాంలో శాసనసభ తొలి దశ ఎన్నికలు శనివారం జరిగాయి. సాయంత్రం 5 గంటల వరకు బెంగాల్లో 79.79 శాతం, అస్సాంలో 72.14 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం(ఈసీ) ప్రకటించింది. తొలి దశలో బెంగాల్లో 30, అస్సాంలో 47 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా కోవిడ్–19 నిబంధనలను పక్కాగా అమలు చేశారు. కొన్ని పోలింగ్ బూత్‌ల్లో ఓటర్లకు మాస్కులు, శానిటైజర్లు, పాలిథీన్ గ్లోవ్స్ అందజేశారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎం) మొరాయించిన ఘటనలు ఈసారి తక్కువగానే రికార్డయ్యాయని ఈసీ తెలిపింది. చెదురుమదురు ఘటనలు మినహా రెండు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని వివరించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై సివిజిల్ యాప్ ద్వారా బెంగాల్లో 167, అస్సాంలో 582 ఫిర్యాదులు వచ్చాయని పేర్కొంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ఇప్పటివరకు 2 రాష్ట్రాల్లో కలిపి రూ.281.28 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఈసీ తెలియజేసింది. బెంగాల్లో 74 లక్షల మంది ఓటర్ల కోసం 10,288 పోలింగ్ కేంద్రాలు, అస్సాంలో 81 లక్షల మంది ఓటర్ల కోసం 11,537 పోలింగ్ కేంద్రాలు ఏ ర్పాటు చేశారు. కరోనా నిబంధనల దృష్ట్యా ఈసారి పోలింగ్ కేంద్రాల సంఖ్యను భారీగా పెంచారు. బెంగాల్లో ఉద్రిక్తతలు తొలి దశ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పశ్చిమ బెంగాల్లో పలు ప్రాంతాల్లో స్వల్ప ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పూర్బ మేదినీపూర్ జిల్లాలోని కాంతి దక్షిణ్‌లో ఈవీఎంలలో గోల్మాల్ జరుగుతోందని ఆరోపిస్తూ ఓటర్లు పోలింగ్ కేంద్రం ఎదుట ధర్నాకు దిగారు. ఇక మాజ్నా పట్టణంలో తాము ఒక పార్టీకి ఓటు వేస్తే మరోపార్టీకి వేసినట్లు వీవీప్యాట్ స్లిప్పులు వస్తున్నాయని జనం ఆగ్రహించారు. అధికారులు ఇక్కడ వీవీప్యాట్ యంత్రాన్ని మార్చారు. కాంతిదక్షిణ్‌లో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు తన కారుపై దాడి చేశారని, డ్రైవర్ గాయపడ్డాడని బీజేపీ నేత సువేందు అధికారి సోదరుడు సౌమేందు ఆరోపించారు. దంతాన్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మోహన్పూర్లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరగడంతో నలుగురు గాయపడ్డారు. ఒక పార్టీకి ఓటు వేస్తే మరో పార్టీకి వెళ్తోందని ఆరోపిస్తూ పశ్చిమ మేదినీపూర్ జిల్లాలోని కేషియారీలో జనం బైఠాయించగా పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. -
నిజమైన భారతీయులను రక్షిస్తాం: బీజేపీ మేనిఫెస్టో
గుహవాటి: అస్సాం క్షేమం కోసం ‘జాతీయ పౌర పట్టిక’ (ఎన్నార్సీ)ని పటిష్టంగా అమలు చేస్తామని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. నిజమైన భారతీయులను కాపాడుకుంటాం.. చొరబాటుదారులను తరిమేస్తామని వ్యాఖ్యానించారు. అసోంవాసులు సురక్షితంగా ఉండండి అని హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మంగళవారం కేంద్ర మంత్రి నరేంద్రసింగ్ తోమర్, ముఖ్యమంత్రి సరబనందా సోనోవల్‌తో కలిసి పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. అసోం రాజకీయ హక్కులు కాపాడుతామని, చొరబాట్ల కట్టడిని వేగవంతం చేస్తామని జేపీ నడ్డా ప్రకటించారు. బ్రహ్మపుత్ర నదిపై అతి పెద్ద రిజర్వాయర్లు కడతామని మేనిఫెస్టోలో బీజేపీ హామీ ఇచ్చింది. రిజర్వాయర్‌తో వరదల నుంచి విముక్తి లభిస్తుందని తెలిపారు. 30 లక్షల కుటుంబాలకు రూ.3 వేల చొప్పున నెలకు ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. అసోం స్వయం సమృద్ధి కోసం సూక్క్ష్మ, స్థూల ప్రణాళికలు అమలు చేస్తామని చెప్పారు. రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటన. వారిలో 2022 మార్చి 1లోపు లక్ష ఉద్యోగాలు ఇస్తామని ప్రధానంగా బీజేపీ మరో హామీ ఇచ్చింది. ప్రైవేటు రంగంలో 8 లక్షల ఉద్యోగాల కల్పనకు కృషి. భూమి లేనివారికి పట్టా పద్ధతి అమలు చేస్తామని వెల్లడి. 126 స్థానాలు ఉన్న అసోం అసెంబ్లీకి మూడు దశల్లో పోలింగ్ జరగనుంది. మార్చి 27, ఏప్రిల్ 1, 6వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. వీటి ఫలితాలు మే 2వ తేదీన వెల్లడవుతాయి. -
ఆఫీసర్స్ అందరూ మహిళలే
మహిళల్లో ఓటు వేయాలన్న ఉత్సాహం కలిగించడం కోసం అస్సాంలోని నల్బరి జిల్లా యంత్రాంగం కొత్తగా ఆలోచిస్తోంది. నల్బరినే ఎందుకు అంటే.. ఆ జిల్లాలోని అత్యున్నతస్థాయి అధికారులంతా దాదాపుగా మహిళలే కావడం! డిప్యూటీ కమిషనర్ మహిళ. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మహిళ. ముగ్గురు అడిషనల్ డిప్యూటీ కమిషనర్లు మహిళలు. వీళ్లంతా కలిసి నల్బరిలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లను పోలింగ్ స్టేషన్లకు నడిపించేందుకు రకరకాల ప్రణాళికలు, పథకాలు రచిస్తున్నారు! 126 స్థానాలు గల అస్సాం అసెంబ్లీకి మూడు విడతలుగా.. మార్చి 27, ఏప్రిల్ 1, 6 తేదీలలో.. పోలింగ్ జరుగుతోంది. అభ్యర్థుల గెలుపోటములపై మహిళా ఓటర్లే ప్రభావం చూపబోతున్నారని సర్వేల అంచనా. బ్రహ్మపుత్ర నది ఉత్తరపు ఒడ్డున అస్సాం నగరం గువాహటికి 60 కి.మీ. దూరంలో ఉంది నల్బరి జిల్లా. ఆ జిల్లాను నడిపే అత్యున్నతస్థాయి అధికారులంతా మహిళలేనన్నది మరీ కొత్త సంగతైతే కాదు. అయితే వీళ్లంతా కలిసి మహిళా ఓటర్లను పోలింగ్ బూత్‌ల వైపు ఆకర్షించేందుకు కొత్త కొత్త ఐడియాలు వేస్తున్నారు. వీళ్లకేం పని? వీళ్లకే పని! డిప్యూటీ కమిషనర్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అడిషనల్ డిప్యూటీ కమిషనర్లు.. వీళ్లే కదా జిల్లా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయవలసింది, బాధ్యత గల పౌరులుగా మెలిగేలా నడిపించవలసింది! అస్సాంలో త్వరలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటు వేయడం పౌరధర్మం అయితే, ఓటు వేయించడం అధికారం ధర్మం. ఆ ధర్మాన్నే ఈ మహిళా అధికారులంతా బాధ్యతగా, వినూత్నంగా చేపడుతున్నారు. అభ్యర్థులు మహిళల ఓట్ల కోసం పాట్లు పడుతుంటే, అధికారులు మహిళల చేత ఓటు వేయించడం కోసం ‘ప్లాట్’లు ఆలోచిస్తున్నారు. మహిళల కోసం ప్రత్యేక పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయిస్తున్నారు. లోపల బూత్ సిబ్బంది, బయట భద్రతా సిబ్బంది అంతా మహిళల్నే నియమిస్తున్నారు. ఇందులో కొత్తదనం ఏమీ లేదు. మహిళల్ని ఆ పోలింగ్ బూత్‌లకు రప్పించేందుకు జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలైన నల్బరీ, బర్క్షెత్రి, ధర్మాపూర్లను ప్రత్యేక జోన్లుగా, సెక్టార్లుగా, చౌక్‌లుగా విభజించి అక్కడ మహిళా చైతన్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆ కేంద్రాలలో ఉండేది మళ్లీ మహిళలే. వారు తమ పరిధిలోని మహిళలకు ఓటు ఎందుకు వేయాలో చెబుతారు. ఓటు వేయకపోతే ఏం జరుగుతుందో వివరిస్తారు. ‘ఈసారి మన మహిళల ఓటు మీద అస్సాం భవిష్యత్తు ఆధారపడి ఉంది’ అని సర్వేలను ఉదహరిస్తూ కొన్ని ప్రధానమైన అభివృద్ధి అంశాలను అర్థమయ్యేలా చేస్తారు. ఓటు ఎవరికి వేసినా గానీ, మొత్తానికైతే ఓటు వేయడం మానకూడదన్న స్పృహ కలిగిస్తారు. ఇందుకోసం ఆ కేంద్రాల్లోని మహిళా సిబ్బందికి శిక్షణ ఇవ్వడం ఇప్పటికే పూర్తయింది. ఇక పోలింగ్ డ్యూటీలో ఉన్న మహిళలకైతే వాళ్లెంత చిన్న బాధ్యతల్లో ఉన్నా ప్రత్యేక వసతుల్ని కల్పిస్తున్నారు. ‘‘మహిళలు సౌకర్యంగా ఉంటే, సమాజం సవ్యంగా సాగుతుంది’’ అంటారు డిప్యూటీ కమిషనర్ పురబి కన్వార్. అందుకే ఆమె ఓటు వేసే మహిళలకే కాకుండా, ఓటు వేయమని చెప్పే, బూత్ లోపల ఓటు వేసేందుకు దారి చూపే మహిళా సిబ్బంది అందరికీ కూడా సౌకర్యంగా ఉండేట్లు ఏర్పాటు చేయిస్తున్నారు. పురబి కన్వార్ జిల్లా ఎన్నికల అధికారి కూడా. మరోవైపు.. ఇళ్లకు డెలివరీ అయ్యే గ్యాస్ సిలిండర్లపై ‘ఓటు వెయ్యడం మీ కర్తవ్యం’ అని తెలియజెప్పే స్టిక్కర్లను అతికించమని చెబుతున్నారు. ఇప్పటి వరకు అలా స్టిక్కర్లు అంటించిన సిలిండర్లు ఐదు వేల వరకు డెలివరీ అయ్యాయి. అలాగే వీధి నాటకాలు వేయిస్తున్నారు. మహిళా కళాశాలల్లో సమావేశాలు ఏర్పాటు చేయిస్తున్నారు. ‘మహిళా అధికారుల జిల్లా’గా నల్బరి స్టోరీ అప్పుడే అయిపోలేదు. డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్, డిస్ట్రిక్ట్ ఫుడ్ ఇన్స్పెక్టర్, డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్.. అందరూ మహిళలే! జిల్లా ఎస్పీ మహిళ (అమన్‌జీత్ కౌర్). జిల్లాలోని ఐదుగురు జడ్జిలు, నలుగురు సర్కిల్ ఆఫీసర్లు, సబ్–రిజిస్ట్రార్ (రెవిన్యూ), ఇంకా.. డిస్ట్రిక్ట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ లేబర్ ఆఫీసర్, సబ్–డివిజినల్ అగ్రికల్చర్ ఆఫీసర్, సాయిల్ సైంటిస్ట్, డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్, చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్లు అంతా మహిళలే. ఇంత మంది మహిళా అధికారులు ఉన్నప్పుడు మహిళా సంక్షేమానికి ప్రాధాన్యం లేకుండా ఉంటుందా? మహిళల్లో చైతన్యం వెల్లివిరవకుండా ఉంటుందా? -
మోదీ ఎప్పుడైనా టీ గార్డెన్‌ను సందర్శించారా?
-
మోదీ ఎప్పుడైనా టీ గార్డెన్‌ను సందర్శించారా?
గువహటి: అసోం ఎన్నికల ప్రచారం రసవత్తరంగా కొనసాగుతోంది. అందులో భాగంగా ప్రధాన జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఒకరిపైఒకరు తీవ్రంగా విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గతంలో అస్సాంలో వరదలు వస్తే , పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) సమస్యపై స్పందించని ప్రధాని, 22 ఏళ్ల దిశ రవి ట్విట్‌పై మాత్రం ఎలా స్పందించారంటూ కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఆదివారం అస్సాంలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీని విమర్శించారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఉన్న యువతియువకులను , కార్మికులను, రైతులను భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మోసం చేసిందని ప్రియాంక గాంధీ ఆరోపించారు. అసోంలోని జోర్హాట్లో జరిగిన బహిరంగ సభలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. "ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడైనా ఒక టీ గార్డెన్‌ను సందర్శించారా..!, అక్కడ మహిళా కార్మికులను కలిశారా? టీ ఎస్టేట్‌లో పనిచేసే కార్మికులకు రోజువారీ వేతనం 350 రూపాయలు ఇస్తానన్న వాగ్దానాన్ని ఇంకా నెరవెర్చలేనందుకు కార్మికుల పట్ల బాధగా లేదా..! " అని ప్రధాని నరేంద్ర మోదీని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ అసోంలో అధికారంలో రావడానికి తీవ్రంగా కృషిచేస్తోందని ప్రియాంక గాంధీ తెలిపారు. అస్సాంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.కాంగ్రెస్ పార్టీ కేవలం అభివృద్ధి కొరకు పాటుపడుతుందన్నారు. అసోంలో 126 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు మూడు దశల్లో జరగనున్నాయి. (చదవండి: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఏఏ నిలిపేస్తాం ) -
‘ఐదు హామీలు పక్కా .. ఇది ప్రజా మేనిఫెస్టో’
గుహవాటి: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల వేళ ఓటర్లకు ప్రధాన పార్టీలు భారీగా తాయిలాలు ప్రకటిస్తున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు పెద్ద ఎత్తున హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలు విడుదల చేస్తున్నాయి. తాజాగా అసోంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. ఐదు హామీలు కచ్చితంగా అమలు చేస్తామని ప్రకటించింది. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)లో లేని మహిళలకు రూ.2 వేల ఆర్థిక సహాయం, 5 లక్షల ఉద్యోగాల కల్పన, నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, తేయాకు కార్మికులకు కనీస కూలీ రూ.365 కల్పిస్తామని మేనిఫెస్టో కాంగ్రెస్ ప్రధాన హామీలు ప్రకటించింది. అసోంవాసుల కలలు.. ఆశలు మేనిఫెస్టోలో ప్రతిబింబిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహూల్ గాంధీ తెలిపారు. అసోం భాష, చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతామని స్పష్టం చేశారు. ‘ఇది మా నిబద్ధత.. మీరు బీజేపీ, ఆరెస్సెస్ దాడుల నుంచి అప్రమత్తంగా ఉండండి’ అసోం ప్రజలకు పిలుపునిచ్చారు. చదవండి: ఏపీ పథకంపై కేంద్రానికి ఢిల్లీ సీఎం విజ్ఞప్తి -
అస్సాం ఎటువైపు?
ఎన్నికలు జరగబోతున్న నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో బీజేపీ ఖచ్చితంగా గెలిచే అవకాశం వుందని అత్యధికులు పరిగణించే రాష్ట్రం అస్సాం. 126 స్థానాలుండే రాష్ట్ర అసెంబ్లీకి ఈనెల 27, ఏప్రిల్ 1, 6 తేదీల్లో మూడు దఫాలుగా ఎన్నికలు జరగబోతున్నాయి. దాదాపు అన్ని సర్వేలూ అస్సాం మళ్లీ బీజేపీదేనని జోస్యం చెప్పాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలో కొచ్చినప్పటినుంచీ ఆదివాసీలతోసహా అన్ని వర్గాల్లోనూ చొచ్చుకుపోతూ, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ బీజేపీ తన పునాదిని పటిష్ట పరుచుకుంది. అయితే ఆ పార్టీకి నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అంశాలతోపాటు మరో రెండు ప్రధాన సమస్యలున్నాయి. ఇంతవరకూ బీజేపీ కూటమిలో భాగస్వామిగా వున్న బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్(బీపీఎఫ్), ఇప్పుడు కాంగ్రెస్ కూటమికి వలసపోయింది. అలాగే జాతీయ పౌర నమోదు చిట్టా(ఎన్ఆర్సీ), పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)లపై 2019లో సాగిన ఉద్యమాలు కూడా బీజేపీ గెలుపు అవకాశాలను ప్రభావితం చేయొచ్చన్నది విశ్లేషకుల అంచనా. రెండు సంవత్సరాలక్రితం ఎన్ఆర్సీ తుది జాబితా విడుదల య్యాక రాష్ట్రంలో అలజడి రేగింది. దాదాపు 20 లక్షలమంది ఇక్కడి పౌరులు కారని నిర్ధారించటం అందుకు కారణం. వీరంతా ఈ దేశస్తులమేనని నిరూపించుకోవటానికి అవసరమైన పత్రాలు లేని నిరక్షరాస్యులు, నిరుపేద వర్గాలవారు. చివరకు దీన్ని రద్దు చేసి, దేశవ్యాప్తంగా ప్రారంభం కాబోయే ఎన్ఆర్సీలో అస్సాంను కూడా చేర్చమని ఆర్థికమంత్రి హిమంత బిశ్వ శర్మ కోరాల్సివచ్చింది. అటుపై సీఏఏ పార్లమెంటులో ఆమోదం పొందాక దేశంలోని ఇతర రాష్ట్రాలతోపాటు అస్సాం కూడా భగ్గుమంది. అయితే వేరే రాష్ట్రాల్లో సీఏఏను వ్యతిరేకించటానికీ, అస్సాంలో వ్యతిరేకించటానికీ వ్యత్యాసం వుంది. వేరేచోట్ల ఈ చట్టాన్ని ప్రధానంగా ముస్లింలు వ్యతిరేకించారు. ఆ పేరుతో తమపై ఈ దేశ పౌరులు కారన్న ముద్రేస్తారన్నది వారి ఆందోళనకు మూలం. కానీ అస్సాంలో ముస్లింలతో సహా అందరూ సీఏఏను వ్యతిరేకించారు. ఇరుగు పొరుగు దేశాల్లో వేధింపులు ఎదుర్కొంటున్న మైనారిటీ మతస్తులకు ఆశ్రయమిచ్చేందుకు ఆ చట్టం అవకాశమివ్వటమే అందుకు కారణం. ఈ చట్టం మాటున బంగ్లాదేశ్‌లో వుండే హిందువులు తమ రాష్ట్రానికి వెల్లువలా వస్తారని స్థానికుల భయం. అస్సామేతరులెవరూ ఉండటానికి వీల్లేదని వారి వాదన. ఈ విషయంలో గత నాలుగు దశా బ్దాలుగా ఉద్యమాలు సాగుతూనేవున్నాయి. ఆ ఉద్యమాలే అసోం గణ పరిషత్(ఏజీపీ) ఆవిర్భావా నికి దారితీశాయి. బీపీఎఫ్ బీజేపీ కూటమికి దూరం కావటానికి కూడా ఆ పార్టీకి సీఏఏపై వున్న వ్యతిరేకతే కారణం. కూటమిలోని మరో ప్రధాన భాగస్వామి అసోం గణ పరిషత్(ఏజీపీ)లోనూ సీఏఏపై విభేదాలున్నాయి. సీఏఏకు పార్టీ అధికారికంగా మద్దతిస్తున్నా పార్టీ సీనియర్ నేత మాజీ ముఖ్యమంత్రి ప్రఫుల్ల కుమార్ మహంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో ఎన్ఆర్సీ, సీఏఏలను బీజేపీ కూటమి ప్రస్తావించకపోవటం గమనించదగ్గ అంశం. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో సీఏఏ అమలు గురించి మాట్లాడే సీనియర్ నేతలు అస్సాంకొచ్చేసరికి మౌనం పాటిస్తున్నారు. సీఏఏ వ్యతిరేకత తమ గెలుపును ప్రభావితం చేయ బోదని బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారంలోవున్న హిమంత బిశ్వ శర్మ అంటున్నారు. కరోనా మహమ్మారి విరుచుకుపడ్డ తర్వాత విధించిన లాక్‌డౌన్‌తో సీఏఏ వ్యతిరేక ఆందోళన రాష్ట్రంలో చల్లబ డింది. ఆ తర్వాత అది మళ్లీ రాజుకున్న దాఖలా లేదు. బహుశా ఇది బీజేపీకి భరోసానిస్తుండవచ్చు. తమ పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపైనే ఆ పార్టీ దృష్టి నిలిపింది. ముస్లింలతో సహా అన్ని వర్గాలకూ అభివృద్ధి ఫలాలందాయి గనుక తమ గెలుపు ఖాయమని ఆ పార్టీ విశ్వాసంతో వుంది. కానీ బీజేపీ అధికారంలోకొస్తుందని చెబుతున్న సర్వేలే అధిక ధరలు ఆ పార్టీకి కొంత అవరో ధమేనని అంగీకరించాయి. అలాగే సీఏఏ కూడా. వాస్తవానికి సీఏఏను పార్లమెంటు ఆమోదించి చాన్నాళ్లు కావొస్తున్నా ఇంతవరకూ దాన్ని కేంద్రం నోటిఫై చేయకపోవటానికి కారణం అస్సాం, పశ్చిమ బెంగాల్ ఎన్నికలేనని చెబుతారు. బీజేపీ వ్యూహాత్మక మౌనానికి కూడా అదే కారణం. కానీ ఆ పార్టీ చేత సీఏఏ గురించి పలికించాలని, అదే జరిగితే బీజేపీపై వ్యతిరేకత పెరుగుతుందని కాంగ్రెస్ పక్ష కూటమి అనేకవిధాల ప్రయత్నిస్తోంది. రంగంలోకి కొత్త పార్టీలు రావటం కూడా బీజేపీకి తలనొప్పే. ఈసారి అస్సాం జాతీయ పరిషత్(ఏజేపీ), రాజియోర్ దళ్, అంచాలిక్ గణ మోర్చా రంగంలోవున్నాయి. సీఏఏ విషయంలో ఏజీపీలో అంతర్గత విభేదాలుండటం బీజేపీ కూట మికి కొంత ఇబ్బంది. ఇటు ముస్లింలలో పలుకుబడివున్న ఏఐయూడీఎఫ్‌తో చెలిమి కాంగ్రెస్‌కు ఎంతవరకూ లాభించగలదో చూడాలి. ఎన్నికల సమయంలో ప్రజా ప్రయోజన అంశాలు చర్చకు రావటం ఈమధ్యకాలంలో తగ్గింది. నాయకులు ఒకరిపై ఒకరు విసురుకునే సవాళ్లు, సంచలనాత్మక ప్రకటనలు, ఇరుగు పొరుగు దేశా లతో వుండే సంబంధాలు వగైరా ప్రాధాన్యతలోకొస్తున్నాయి. కానీ అస్సాం అందుకు భిన్నం. ఎవ రెంత కాదన్నా అక్కడ స్థానిక సమస్యలే ప్రాధాన్యత సంతరించుకుంటాయి. తన ప్రయోజనాలకు ఏ రూపంలోనైనా విఘాతం కలుగుతుందంటే అస్సాం భగ్గుమంటుంది. అది ఒక రకంగా మేలు కలి గించే అంశమే అయినా, భిన్న జాతులు నివసించే అస్సాంలో అది ఒక్కోసారి శాంతిభద్రతల సమ స్యను సృష్టిస్తోంది. ఏదేమైనా అస్సాం ఈసారి ఎవరి పక్షంవహిస్తుందన్నది ఉత్కంఠ రేపే అంశం. -
అక్కడ మాత్రమే బీజేపీ గెలుస్తుంది: శరద్ పవార్
పుణే: త్వరలో నాలుగు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం అస్సాంలోనే బీజేపీ అధికారంలోకి వస్తుందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల ఫలితాలు దేశానికి కొత్త దిశను నిర్దేశించనున్నాయన్నారు. పుణే జిల్లా బారామతిలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ పశ్చిమబెంగాల్లో ఎన్నికల వేళ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల తరఫున పోరాడుతున్న మమతా బెనర్జీపై దాడికి బీజేపీ యత్నిస్తోందని విమర్శించారు. బెంగాల్ ఆత్మగౌరవానికి సంబంధించి ఈ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు యావత్తూ మమతా బెనర్జీ వెంట నడుస్తున్నారని, టీఎంసీకి అధికారం ఖాయమని చెప్పారు. తమిళనాడు, కేరళ, బెంగాల్, అస్సాంతోపాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో జరగనున్న ఈ ఎన్నికల ఫలితాలపై ముందే మాట్లాడటం తప్పంటూనే ఆయన.. కేరళలో వామపక్షాలతో కలిసి ఎన్సీపీ పోటీ చేస్తోందనీ, అక్కడ స్పష్టమైన మెజారిటీ తమకు దక్కుతుందన్నారు. తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. తమకు తెలిసిన సమాచారం ప్రకారం అస్సాంలో బీజేపీ పరిస్థితి మెరుగ్గా ఉందనీ, ఆ పార్టీ అధికారం నిలబెట్టుకుంటుందని అన్నారు. చదవండి: బెంగాల్ ముఖచిత్రాన్ని ‘సినీలోకం’ మార్చేనా? -
మట్టిలో పరుగులు తీసిన ప్రియాంక గాంధీ
గుహవటి: కాంగ్రెస్ లీడర్ ప్రియాంక గాంధీ ప్రస్తుతం అస్సాం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. నిన్న టీ ఎస్టేట్‌లో కూలీలతో కలిసి ఆమె కూడా తేయాకు తెంపిన సంగతి తెలిసిందే. తాజాగా నేడు ప్రియాంక గాంధీకి సంబంధించిన మరో వీడియో వైరలవుతోంది. ఆమె పరిగెత్తుతూ సభా వేదిక వద్దకు వస్తోన్న వీడియో ఇది. ఆ వివరాలు.. ప్రియాంకా గాంధీ మంగళవారం అస్సాంలో నిర్వహించిన బహిరంగ సభకు హాజరుకావాల్సి ఉండగా కాస్త ఆలస్యమైంది. ఆ సమయాన్ని కవర్ చేసేందుకు పరిగెత్తుకుంటూ వేదిక వద్దకు వచ్చారు. మెరూన్ రంగు చీరలో ఉన్న ప్రియాంక గాంధీ మట్టిలో పరుగులు తీస్తూ వేదిక వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో ఆమె చుట్టు బాడీగార్డులు కూడా ఉన్నారు. ప్రియాంక గాంధీ పరిగెత్తుకుంటూ వస్తుండగా.. అక్కడ నిల్చొన్న జనం చప్పట్లు కొడుతూ ఆమెకు స్వాగతం పలికారు. వారందరికి చేతులు జోడించి నమస్తే చెబుతూ.. ప్రియాంక వేదిక వద్దకు చేరుకున్నారు. అనంతరం ప్రియాంక గాంధీ ప్రసంగిస్తూ.. ‘‘రెండు నెలలుగా 3లక్షల మందికి పైగా రైతులు ధర్నాలో కూర్చున్నారు. వారంతా ప్రధాని ఉండే ప్రాంతానికి కేవలం నాలుగైదు కిలోమీటర్ల దూరంలోనే ఉంటున్నారు. కానీ, ప్రధానికి వారిని కలవడానికి తీరిక దొరకడం లేదు. ఒకసారి వెళ్లి రైతులను కలిస్తే ఏమవుతుంది. చట్టాల వల్ల రైతులకు ఎదురయ్యే సమస్యల గురించి చర్చిస్తే బాగుంటుంది కదా. అప్పడు వారికి లాభం చేకూర్చేలాగే మార్పులు చేస్తే సరిపోతుంది. కానీ ఈ ప్రభుత్వం తీరు చూస్తే ఈ చట్టాలు, పాలసీలు ధనికుల కోసమే అన్నట్లుగా ఉంది’’ అంటూ ప్రియాంక మండి పడ్డారు. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ బ్రాండ్‌ను వాడుకుని డెవలప్మెంట్ పాలసీలు ఏమీ లేకుండానే గెలవాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. కాంగ్రెస్‌తో పాటు మిత్రపక్ష పార్టీలు అన్నీ కలిసి హక్కులు, సీఏఏ, ఎన్నార్సీ లాంటి అంశాలపై అస్సాంలో ప్రచారం చేపడుతున్నాయి. ఇవన్ని ఇక్కడ చాలా సున్నితమైన అంశాలు’’ అన్నారు ప్రియాంక. ఇక అస్సాంలో మార్చి, ఏప్రిల్ నెలల్లో మూడు వేర్వేరు రోజులలో ఎన్నికలు నిర్వహించనున్నారు. అస్సాంలో 126 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. చదవండి: ‘సరిగానే వేశానా.. బుట్టలో పడిందా?’ గెలిపిస్తే లైసెన్స్ ఇచ్చినట్లు కాదు.. -
‘సరిగానే వేశానా.. బుట్టలో పడిందా?’
గువాహటి: త్వరలో దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు పార్టీ తరఫున ప్రచారంలో బిజీగా ఉన్నారు. ప్రచారం విషయలో గతంతో పోలిస్తే.. ఈ సారి వీరద్దరూ తమ పంథాను మార్చుకున్నారు. ప్రజలతో మమెకమవతూ.. వారు చేసే పనుల్లో పాలుపంచుకుంటూ.. కష్టసుఖాలు తెలుసుకుంటూ.. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తమిళనాడు ప్రచారంలో రాహుల్ గాంధీ బస్కీలు తీస్తూ.. ముంజలు తింటూ.. డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకోగా.. తాజాగా ప్రియాంక గాంధీ కూడా ఇదే బాటలో నడుస్తున్నారు. అస్సాం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ప్రియాంక గాంధీ టీ ఎస్టేట్‌లో పని చేస్తోన్న వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రియాంక టీ ఎస్టేట్‌లో పని చేస్తోన్న కూలీలతో కలిసి తేయాకు తెంపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. బిశ్వనాథ్ ప్రాంతంలోని సాధురు టీ ఎస్టేట్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రచారంలో భాగంగా టీ తోటల్లోకి వెళ్లిన ప్రియాంక.. అక్కడి కూలీలతో కలిసి కాసేపు పనిచేశారు. తలకు బుట్టవేసుకుని తేయాకు తెంపారు. దాన్ని బుట్టలో వేసే సమయంలో ‘‘సరిగానే వేశానా.. కరెక్ట్‌గా బుట్టలో పడిందా’’ అంటూ పక్కన ఉన్న వారిని ప్రశ్నించారు. అనంతరం తోట పక్కనే కూర్చుని కూలీలతో ముచ్చటించారు. ‘‘తేయాకు కూలీలు అస్సాంతో పాటు ఈ దేశానికి కూడా విలువైనవారు. మీ హక్కులను పరిరక్షించేందుకు, మీకు గుర్తింపు తెచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అన్నివేళలా పోరాడుతూనే ఉంటుంది’’ అని తెలిపారు ప్రియాంక గాంధీ. #WATCH Assam: Congress General Secretary Priyanka Gandhi Vadra plucks tea leaves with other workers at Sadhuru tea garden, Biswanath. pic.twitter.com/8jpQD8IHma — ANI (@ANI) March 2, 2021 ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట అయిన అస్సాంలో గత ఎన్నికల్లో భారీ షాక్ తగిలింది. అక్కడ ఏళ్ల తరబడి అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను గద్దెదించి బీజేపీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఈ సారి అస్సాం ఎన్నికలు కాంగ్రెస్‌కు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. అయితే కీలక నేత, మాజీ సీఎం తరుణ్ గొగొయి మరణం కాంగ్రెస్‌కు లోటుగా మారింది. దీంతో ఈశాన్య రాష్ట్రంలో రంగంలోకి దిగిన ప్రియాంక గాంధీ.. ప్రజలతో మమేకమవుతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. చదవండి: రాహుల్ కండలపై నెటిజన్ల ట్రోలింగ్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఏఏ నిలిపేస్తాం -
మళ్లీ నేనే సీఎం.. నాలుగోసారి మాదే హవా!
గువాహటి: ఎగ్జిట్ పోల్స్ అంచనాలను అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ కొట్టిపారేశారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను నమ్మాల్సిన అవసరం లేదని, అందుకే వాటిని తాను అంగీకరించనని చెప్పారు. గతంలోనూ ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తప్పు అని ఎన్నో పర్యాయాలు నిరూపితమైందని పేర్కొన్నారు. గతంలో మూడుసార్లు కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని అందించానని నేటి ఫలితాలలో కూడా తమదే విజయమని ధీమా వ్యక్తంచేశారు. ఈ గెలుపుతో వరుసగా నాలుగోసారి సీఎం తానే అవ్వనున్నట్లు చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని తాము అధికారం నిలబెట్టుకుంటామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నో వాగ్దానాలు చేశారని, కేంద్రంలో అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తైనా చేసిందేమి లేదన్నారు. మంచి రోజులు ఎప్పుడు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చినప్పుడు ఆయన ప్రశ్నించారు. మరోవైపు అసోంలో తొలిసారిగా బీజేపీ అధికారంలోకి రానుందని ఎగ్జిట్ పోల్ సర్వేలు వెల్లడయ్యాయి. -
సర్వే అంచనాలను కొట్టిపారేసిన సీఎం
గువాహటి: ఎగ్జిట్ పోల్స్ అంచనాలను అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగొయ్ కొట్టిపారేశారు. అసోంలో మళ్లీ తమదే గెలుపని అన్నారు. తాము అధికారం నిలబెట్టుకుంటామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మంచి రోజులంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నో మాటలు చెప్పారని, కేంద్రంలో అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తైనా ఏమీ చేయలేదని అన్నారు. మంచి రోజులు ఎప్పుడు వస్తాయని ఆయన ప్రశ్నించారు. కాగా, అసోంలో తొలిసారిగా బీజేపీ అధికారంలోకి రానుందని ఎగ్జిట్ పోల్ సర్వేలు వెల్లడించాయి. -
ఎన్నికల అనంతర పొత్తు ప్రయత్నాలు!
అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెల 4, 11 తేదీల్లో జరిగిన తొలి రెండు దశల్లోనే పోలింగ్ ప్రక్రియ ముగిసింది. తొలి దశలో 82.2 శాతం, మలి దశలో 87.03 శాతం పోలింగ్ నమోదుచేసి ఓటర్లు రికార్డు సృష్టించారు. మొత్తంగా 84.72 శాతం పోలింగ్ నమోదైంది. ఇది 2014 సాధారణ ఎన్నికల్లో నమోదైన రికార్డు పోలింగ్ 80 శాతం కన్నా అధికం. ఇంతటి రికార్డు పోలింగ్ దేనికి సంకేతమని ఇప్పుడు ప్రధాన పక్షాలు విశ్లేషిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేసింది. అయితే ఎన్నికల అనంతర దోస్తీకి సంసిద్ధంగానే ఉంది. బీజేపీ ఇప్పటికే తన మిత్రపక్షమైన బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్)తో పాటు.. ఏజీపీతోనూ జట్టుకట్టి బరిలోకి దిగింది. ఆల్ ఇండియా యునెటైడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్).. జేడీయూ, ఆర్జేడీలతో కలిసి బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టి పోటీ చేసింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీఎం తరుణ్‌గొగొయ్ పదిహేనేళ్ల పాలన నుంచి ‘పరివర్తన్’ కావాలంటూ బీజేపీ ఇచ్చిన పిలుపుకే ఇంతటి ప్రతిస్పందన లభించిందని పలువురు భావిస్తున్నారు. అయితే.. ఆయా జిల్లాల వారీగా ఓటింగ్ సరళిని పరిశీలిస్తే.. కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తోందని మరికొందరు చెప్తున్నారు. నిజానికి రాష్ట్రంలో బీజేపీ 55 సీట్లు గెలుచుకుని అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని ఎన్నికలకు ముందు ఒక సర్వే అంచనా వేసింది. కాంగ్రెస్ 52 స్థానాలు గెలుచుకుంటుందనీ జోస్యం చెప్పింది. ఈ పరిస్థితుల్లో ఏఐయూడీఎఫ్ 12 సీట్లు గెలుచుకుని.. ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తుందని ఆ సర్వే వివరిస్తోంది. ఎన్నికల ప్రక్రియ ముగియటంతో.. బీజేపీ, ఏఐయూడీఎఫ్‌ల మధ్య జమ్మూకశ్మీర్ తరహాలో ఎన్నికల అనంతర పొత్తు కోసం చర్చలు మొదలయ్యాయి. -
మేమిచ్చాం.. బీజేపీ వెనక్కి తీసుకుంది
అస్సాంకు ప్రత్యేక హోదాపై సోనియా విమర్శ శివనగర్/అంగురి: అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే.. మత, విభజన రాజకీయాలు రాజ్యమేలతాయని బుధవారం శివనగర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ విమర్శించారు. ‘తేయాకు తోటల కార్మికులకు అచ్చేదిన్ తీసుకురాకుండా.. అస్సాం టీ అమ్మానని చెబితే ఓట్లేస్తారా?’అని ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి అన్నారు. 15 ఏళ్ల తరుణ్ గొగోయ్ పాలనలో రాష్ట్ర శాంతి సుసంపన్నత కోసం కృషి చేశామని పేర్కొన్నారు. అస్సాంకు యూపీఏ ప్రత్యేక హోదా ఇస్తే.. బీజేపీ ప్రభుత్వం దీన్ని వెనక్కు తీసుకుందని అన్నారు. తిరుగుబాట్లు కట్టడి చేశాం: రాజ్‌నాథ్ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే అస్సాంలో తిరుగుబాట్లు తగ్గుముఖం పట్టాయని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అస్సాంలోని దులియాజన్‌ల ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే ఆయుధాలు వదిలి.. చర్చలకు రావాల్సిందిగా ఉగ్రవాదులతో సంప్రదింపులు జరిపామన్నారు. బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి చొరబాట్లను, నకిలీ కరెన్సీని పూర్తిగా అరికట్టినట్లు తెలిపారు. సీపీఎం మోసం చేసింది: గౌరి తిరువనంతపురం: సీట్ల కేటాయింపులో సీపీఎం తమను మోసం చేసిందని కమ్యూనిస్టు నాయకురాలు, జనతిపథియ సంరక్షణ సమితి (జేఎస్ఎస్) చీఫ్ గౌరి (97) విమర్శించారు. బీజేపీ నుంచి ఆహ్వానం అందిందని దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆమె తెలిపారు. కేరళలో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని పార్టీ చీఫ్ అమిత్ షా ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి నడ్డా వెల్లడించారు. జంతువులతో ఓటర్లకు అవగాహన! కోల్‌కతా: ఓటర్లలో అవగాహన పెంచేందుకు పశ్చిమబెంగాల్ ఎన్నికల సంఘం వినూత్నంగా ముందుకెళ్తోంది. బెంగాల్‌కు పేరు తెచ్చిన ప్రకృతి ప్రాంతాలు, జంతువులతో మస్కట్లు (పులి, రెడ్ పాండా, ఖడ్గమృగం, డాల్ఫిన్ వంటివి) రూపొందించి.. ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించే ప్రయత్నాలు చేస్తోంది. 24 పరగణాల జిల్లాలో పులికి బెంగాలీ స్టైల్లో తెల్లని ధోవతీ కట్టి ‘మీ ఓటు బహుమూల్యం’ అని మస్కట్లను రూపొం దించింది. మరో చోట రెడ్ పాండాలతో ‘మనమంతా ఓటు వేద్దాం’ అని పోస్టర్లు రూపొందించి ప్రచారం చేస్తున్నారు. -
నేను అమ్మింది అస్సాం టీ: మోదీ
మా పోరు గొగోయ్‌పై కాదు టిన్సుకియా/బోకాఖాట్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి టీ అస్త్రాన్ని బయటికి తీశారు. అస్సాంకు ప్రత్యేక గుర్తింపైన టీపొడి ఉత్పత్తిదారులను ఆకట్టుకునేందుకు రాష్ట్ర బ్రాండ్ టీపై పొడగ్తలు కురిపించారు. ‘గుజరాతీయుల్లో ఉత్సాహం నింపేందుకు అస్సాం టీనే అమ్మేవాడిని. అందుకే నాకు అస్సాంతో బలమైన బంధముంది’ అని అన్నారు. మోదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం టిన్సుకియా, మజూలీ, బిహుపురియా, బొకాఖాట్ ప్రాంతాల్లో జరిగిన సభల్లో పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ పాలనతో 60 ఏళ్లుగా అభివృద్ధికి దూరంగా ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు బీజేపీకి ఓ అవకాశం ఇవ్వాలని కోరారు. తను సీఎం తరుణ్ గొగోయ్‌కు వ్యతిరేకంగా పోరాడటం లేదని.. పేదరికం, అవినీతి, రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసాన్ని ఆపటమే బీజేపీ ఉద్దేశ్యమన్నారు. ‘నాకు మూడు ఎజెండాలున్నాయి. అభివృద్ధి, వేగవంతమైన అభివృద్ధి, సర్వతోముఖాభివృద్ధి. ఈ ఎన్నికలు ప్రధాని, సీఎంల మధ్య యుద్ధమని గొగోయ్ చెబుతున్నారు. గొగోయ్ నాకంటే చాలా సీనియర్. ఆయన ఆశీర్వాదాలు నాక్కావాలి. ఒక వ్యక్తితో పోరాడటం వల్ల నా సమయం వృథా చేసుకోదలచుకోలేదు. నా పోరాటం.. పేదరికం, నిరుద్యోగం, అవినీతి, విద్య లేకపోవటం, అనారోగ్యం, వెనకబాటుతనంపైనే’ అని మోదీ అన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పదేళ్లపాటు ఇక్కడినుంచే ప్రాతినిధ్యం వహించినా ఈ రాష్ట్రానికి పెద్దగా ఒరిగిందేమీ లేదన్నారు. స్వాతంత్య్రం వచ్చినపుడు..అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో అస్సాం ఒకటిగా ఉండేదని గుర్తుచేసిన మోదీ.. ఆ తర్వాత కాంగ్రెస్ పాలనలో తీవ్రమైన వెనకబాటుకు గురైందన్నారు. కళ్లముందు నీరున్నా తాగలేని స్థితి.. అస్సాంకు జలవనరులున్నా.. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరందకపోవటం బాధకలిగించిందని మోదీ అన్నారు. రాష్ట్రాభివృద్ధికి భారీ నిధులిచ్చామన్నారు. రాష్ట్రంలో ఖడ్గమృగాలను చంపేవాళ్లను ప్రభుత్వం కాపాడుతోందని, వారందరికీ సరైన సమాధానం చెప్పాల్సిన అవసరం వచ్చిందని మోదీ పిలుపునిచ్చారు. ప్రజలు ఏప్రిల్ 4, 11 తేదీల్లో జరిగే ఎన్నికల్లో ఈవీఎంలలో బీజేపీ, కూటమి పార్టీల (అస్సాం గణ పరిషత్, బోడో పీపుల్స్ ఫ్రంట్) సభ్యులకు ఓటేసి గెలిపించటం ద్వారా ప్రభుత్వానికి సరైన సమాధానం ఇవ్వాలని అన్నారు. -
ఏజీపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
గువాహటి: అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న అసోం గణ పరిషత్ (ఏజీపీ) 25 మంది అభ్యర్థులతో తొలి జాబితాను గురువారం ప్రకటించింది. బీజేపీ పోటీ చేసే చోట తమ పార్టీ స్నేహపూర్వక పోటీకి దిగుతుందని ఏజీపీ అధ్యక్షుడు అతుల్ బోరా తెలిపారు. కాగా, తమిళనాడులో తన పొత్తు కోసం తీవ్రంగా కుస్తీలు పట్టిన డీఎంకే, బీజేపీలకు దేశీయ ద్రావిడ ముర్పోక్కు కళగం(డీఎండీకే) అధినేత విజయకాంత్ షాక్ ఇచ్చారు. ఎన్నికల్లో తాను ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు గురువారం చెన్నైలో స్పష్టం చేశారు.