గుహవాటి: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల వేళ ఓటర్లకు ప్రధాన పార్టీలు భారీగా తాయిలాలు ప్రకటిస్తున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు పెద్ద ఎత్తున హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలు విడుదల చేస్తున్నాయి. తాజాగా అసోంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. ఐదు హామీలు కచ్చితంగా అమలు చేస్తామని ప్రకటించింది.
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)లో లేని మహిళలకు రూ.2 వేల ఆర్థిక సహాయం, 5 లక్షల ఉద్యోగాల కల్పన, నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, తేయాకు కార్మికులకు కనీస కూలీ రూ.365 కల్పిస్తామని మేనిఫెస్టో కాంగ్రెస్ ప్రధాన హామీలు ప్రకటించింది. అసోంవాసుల కలలు.. ఆశలు మేనిఫెస్టోలో ప్రతిబింబిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహూల్ గాంధీ తెలిపారు. అసోం భాష, చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతామని స్పష్టం చేశారు. ‘ఇది మా నిబద్ధత.. మీరు బీజేపీ, ఆరెస్సెస్ దాడుల నుంచి అప్రమత్తంగా ఉండండి’ అసోం ప్రజలకు పిలుపునిచ్చారు.
చదవండి: ఏపీ పథకంపై కేంద్రానికి ఢిల్లీ సీఎం విజ్ఞప్తి
Comments
Please login to add a commentAdd a comment