జమ్మూకశ్మీర్ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ
శ్రీనగర్: త్వరలో జరిగే జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సోమవారం మేనిఫెస్టోను విడుదల చేసింది. అధికారంలోకి వస్తే రైతులు, మ హిళలు, యువత కోసం పలు సంక్షేమ పథకాల ను అమలు చేస్తామని ప్రకటించింది. ప్రకృతి వైపరీ త్యాలతో నష్టపోయే అన్ని రకాల పంటలకు బీమా సౌకర్యం, యాపిల్‌కు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ ) కిలోకు రూ.72 అమలు చేస్తామంది. శ్రీనగర్‌లోని పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్ర మంలో ఏఐసీసీ ప్రతినిధి పవన్ ఖేరా, పీసీసీ చీఫ్ తారిఖ్ హమీద్ కర్రా మేనిఫెస్టోను విడుదల చేశారు.
కౌలు రైతులకు సాయం
భూమిలేని, కౌలుదార్లకు ఏటా అదనంగా రూ.4 వేల ఆర్థిక సాయం. రైతులకు సాగు భూములను 99 ఏళ్లకు లీజుకివ్వడం. సాగు భూములను 100 శాతం సాగులోకి తెచ్చేందుకు జిల్లా స్థాయి సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.2,500 కోట్లతో నిధి ఏర్పాటు.
నిరుద్యోగ యువతకు..
జమ్మూకశ్మీర్‌లోని అర్హులైన నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,500 చొప్పున ఏడాదిపాటు అలయెన్స్. అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లో జాబ్ క్యాలెండర్ విడుదల. ఖాళీగా ఉన్న లక్ష ప్రభుత్వ పోస్టుల భర్తీ. పోలీసు, ఫైర్, ఫారెస్ట్ పోస్టుల భర్తీకి ప్రత్యేక రిక్రూట్‌మెంట్ కార్యక్రమం. నిర్మాణ రంగ పనుల్లో నిరుద్యోగ ఇంజినీర్లకు 30 శాతం ఇచ్చే పథకం పునరుద్ధరణ. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ సమయంలో, పాస్‌పోర్టులు, ఇతర అవసరాల కోసం ధ్రువీకరణ పత్రాల పరిశీలన సులభతరం చేయడం.
మహిళలకు నెలకు రూ.3 వేలు
భారత్ జోడో యాత్ర సమయంలో రాహుల్ గాంధీ, ఇతర నేతలు ఇచ్చిన హామీల మేరకు మహిళా సమ్మాన్ కార్యక్రమం అమలు. ఇందులో భాగంగా కుటుంబ యజమాని అయిన మహిళకు నెలకు రూ.3 వేలు చొప్పున సాయం అందజేత. స్వయం సహాయక బృందాలకు రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణం. ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే మైనారిటీ కమిషన్ ఏర్పాటు. కశ్మీరీ పండిట్లకు పునరావాసం కల్పిస్తామంటూ గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ ఇచ్చిన హామీ అమలు.
Comments
Please login to add a commentAdd a comment