మరింత ఆసరా.. మరికొంత సాయం! | Minister Harish Rao About BRS Party New Manifesto | Sakshi
Sakshi News home page

మరింత ఆసరా.. మరికొంత సాయం!

Published Sun, Oct 8 2023 3:19 AM | Last Updated on Sun, Oct 8 2023 3:19 AM

Minister Harish Rao About BRS Party New Manifesto  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న నేపథ్యంలో అధికార భారత్‌ రాష్ట్ర సమితి పార్టీ మేనిఫెస్టోకు తుది మెరుగులు దిద్దడంలో నిమగ్నమైంది. ప్రధాన విపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీ ఇస్తున్న హామీలకు మించిన అంశాలతో ఎన్నికల ప్రణాళికను రూపొందిస్తు న్నట్టు తెలిసింది. ఈ నెలలో ప్రకటించే బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగేలా ఉంటుందని మంత్రి హరీశ్‌రావు పదే పదే చెబు తుండటం గమనార్హం.

కాగా రైతుబంధు, ఆసరా పింఛన్ల పథకం కింద ఇస్తున్న మొత్తాన్ని పెంచడంపై కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం.  కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్‌ కిట్ల మొత్తాన్ని పెంచడంతో పాటు రైతులందరికీ పింఛన్‌ ఇవ్వాలనే ప్రతిపాదన సాధ్యాసాధ్యాలపై అధ్యయనం పూర్తయినట్లు తెలిసింది. రైతుబంధు, సామాజిక పింఛన్లు ఎంత మేర పెంచాలనే అంశంపై సీఎం కేసీఆర్‌ తుది నిర్ణ యం తీసుకోవాల్సి ఉందని పార్టీ వర్గాలు చెబుతు న్నాయి. వరంగల్‌లో ఈ నెల 16న బహిరంగ సభ వేదికగా పార్టీ మేని ఫెస్టోను ప్రకటించాలని బీఆర్‌ఎస్‌ భావించింది.

అయితే పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ఆరోగ్యా న్ని దృష్టిలో పెట్టుకుని వరంగల్‌ సభ వాయిదా పడే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల షెడ్యూ ల్‌ వెలువడ్డాక త్వరగా మేనిఫెస్టోను ప్రక టించాలని కేసీఆర్‌ నిర్ణయించినట్లు తెలిసింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్‌ తేదీకి ఐదు రోజుల ముందు మాత్రమే బీఆర్‌ఎస్‌ పార్టీ తన మేనిఫెస్టోను ప్రకటించింది. అయితే చాలా తక్కువ వ్యవధి కారణంగా మేనిఫెస్టోలోని అంశాలను ప్రజల్లోకి సరిగా తీసుకెళ్లలేకపోయినట్లు ఆ తర్వాత పార్టీ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ఈసారి వీలైనంత త్వరగా మేనిఫెస్టో విడుదల చేయాలని కేసీఆర్‌ భావిస్తున్నట్టు పార్టీవర్గాలు వెల్లడించాయి. 

విపక్షాల మేనిఫెస్టోలపై నజర్‌
గతంలో యువత, రైతు డిక్లరేషన్లు ప్రకటించిన కాంగ్రెస్‌ ఇటీవల తుక్కుగూడ సభ వేదికగా ఆరు గ్యారంటీల పేరిట ఎన్నికల హామీలను ప్రకటించింది. కర్ణాటక ఎన్నికల్లో ఐదు గ్యారెంటీలు ఫలితాన్ని ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణలో ఆరు గ్యారంటీలను కాంగ్రెస్‌ ప్రధానంగా ప్రచారంలో పెడుతోంది. ఎన్నికల మేని ఫెస్టోలో మరిన్ని జనాకర్షక పథకాలను కూడా చేర్చే అవకాశముంది.

బీఆర్‌ఎస్‌ బంగారు తెలంగాణ నినాదానికి విరుగుడుగా తాము సామాజిక తెలంగాణ నినాదాన్ని ఎత్తుకుని, ఆ మేరకు మేనిఫెస్టోలో ప్రతిఫలించేలా చూస్తామ ని కాంగ్రెస్‌ మేనిఫెస్టో కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు చెబుతున్నారు. మరోవైపు బీజేపీ కూడా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ఎన్నికల ప్రణాళికపై కసరత్తు చేస్తోంది. ఇలా రెండు ప్ర ధాన ప్రతిపక్ష పార్టీలు ప్రకటించే తాయిలాలు, ఇచ్చే హామీలను బీఆర్‌ఎస్‌ పరిగణనలోకి తీసుకుంటోందని, ఆయా అంశాలను మరిపించేలా బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో ఉండబోతోందని పార్టీ నేతలు చెబుతున్నారు.

అన్ని పథకాల మొత్తాలు పెంపు?
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తొలిసారిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆసరా పింఛన్ల మొత్తాన్ని రూ.200 నుంచి రూ.1,000కి పెంచింది. వితంతువులు, వృద్ధులు తదితరులకు ఇచ్చే ఈ పింఛన్‌ను తర్వాత రూ.2,016కు పెంచింది. కాగా ఈ మొత్తాన్ని రూ.3,016కు పెంచే అవకాశముందని, ఈ మేరకు మేనిఫెస్టోలో చేరుస్తున్నట్టు తెలుస్తోంది. వికలాంగుల పింఛన్‌ రూ.1,500తో ప్రారంభమై ప్రస్తుతం రూ.4,016కు చేరింది.

ఈ మొత్తాన్ని కూడా మరో రూ.1,000 మేర పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక రైతుబంధు పథకం కింద ఏటా రెండు విడతల్లో కలుపుకొని ఎకరానికి రూ.10 వేలు చొప్పున ఇస్తుండగా, దీనిని రూ.12 వేలకు పెంచేలా ప్రతిపాదించినట్లు సమాచారం. అలాగే కేసీఆర్‌ కిట్‌ పథకం కింద ఇస్తున్న రూ.12 వేలను రూ.15 వేలకు పెంచాలనే ప్రతిపాదనపై సీఎం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని మేనిఫెస్టో రూపకల్పన కసరత్తులో పాల్గొంటున్న నేతలు చెప్తున్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకం కింద ఇస్తున్న మొత్తాన్ని కూడా పెంచడం ద్వారా విపక్షాల దూకుడుకు అడ్డకట్ట వేయాలని కేసీఆర్‌ భావిస్తున్నట్టు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement