సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాల పరిధిని విస్తరించడంతోపాటు కొత్తగా సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూ భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఆదివారం అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులతో కలసి బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ మేనిఫెస్టోలోని అంశాలను వివరించారు.
రైతు బంధు, ఆసరా, ఆరోగ్య రక్ష వంటి పాత పథకాల పరిధిని విస్తరించడం ద్వారా రాష్ట్రంలోని సుమారు కోటికి పైగా కుటుంబాలను ఆకట్టుకునేలా మేనిఫెస్టోను ప్రకటించారు. ఇటీవల కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలకు ప్రతిగా ‘సౌభాగ్యలక్ష్మి’, రూ.400కే వంట గ్యాస్ సిలిండర్ వంటి పథకాలను అందులో చేర్చారు. పేదలకు రూ.5 లక్షల జీవిత బీమా, రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం సరఫరా వంటి కొత్త పథకాలను ప్రకటించారు. అగ్ర వర్ణ పేద విద్యార్థుల కోసం రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
బీఆర్‌ఎస్ మేనిఫెస్టోలోని పథకాలు, హామీలివీ..
- దివ్యాంగుల పెన్షన్లు ప్రస్తుత రూ.4,016కు ఏటా రూ.300 చొప్పున చేర్చుతూ రూ.6,016కు పెంపు
- రెసిడెన్షియల్ విద్యా సంస్థలు: అగ్రవర్ణ పేదల కోసం నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు. ఇప్పటికే వివిధ వర్గాల కోసం ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ పాఠశాలలను డిగ్రీ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేయడం.
- ఉద్యోగులను కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) నుంచి పాత పెన్షన్ స్కీం (ఓపీఎస్)కు తిరిగి మార్చే అంశంపై అధ్యయనానికి ప్రత్యేక కమిటీ. దాని నివేదిక ఆధారంగా నిర్ణయం.
- మహిళా సమాఖ్యలకు సొంత భవనాలు
- అనాథ పిల్లల కోసం ప్రత్యేక పాలసీ
- అసైన్డ్ భూముల విముక్తి కోసం చర్యలు
- మైనారిటీ సంక్షేమ పథకాలు మరింత విస్తరణ
Comments
Please login to add a commentAdd a comment