Women welfare
-
మహిళా కమిషన్ ని కలవనున్న వైసీపీ మహిళా నేతలు
-
రైతులు, మహిళలకు సంక్షేమ పథకాలు
శ్రీనగర్: త్వరలో జరిగే జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సోమవారం మేనిఫెస్టోను విడుదల చేసింది. అధికారంలోకి వస్తే రైతులు, మ హిళలు, యువత కోసం పలు సంక్షేమ పథకాల ను అమలు చేస్తామని ప్రకటించింది. ప్రకృతి వైపరీ త్యాలతో నష్టపోయే అన్ని రకాల పంటలకు బీమా సౌకర్యం, యాపిల్‌కు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ ) కిలోకు రూ.72 అమలు చేస్తామంది. శ్రీనగర్‌లోని పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్ర మంలో ఏఐసీసీ ప్రతినిధి పవన్ ఖేరా, పీసీసీ చీఫ్ తారిఖ్ హమీద్ కర్రా మేనిఫెస్టోను విడుదల చేశారు. కౌలు రైతులకు సాయంభూమిలేని, కౌలుదార్లకు ఏటా అదనంగా రూ.4 వేల ఆర్థిక సాయం. రైతులకు సాగు భూములను 99 ఏళ్లకు లీజుకివ్వడం. సాగు భూములను 100 శాతం సాగులోకి తెచ్చేందుకు జిల్లా స్థాయి సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.2,500 కోట్లతో నిధి ఏర్పాటు.నిరుద్యోగ యువతకు..జమ్మూకశ్మీర్‌లోని అర్హులైన నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,500 చొప్పున ఏడాదిపాటు అలయెన్స్. అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లో జాబ్ క్యాలెండర్ విడుదల. ఖాళీగా ఉన్న లక్ష ప్రభుత్వ పోస్టుల భర్తీ. పోలీసు, ఫైర్, ఫారెస్ట్ పోస్టుల భర్తీకి ప్రత్యేక రిక్రూట్మెంట్ కార్యక్రమం. నిర్మాణ రంగ పనుల్లో నిరుద్యోగ ఇంజినీర్లకు 30 శాతం ఇచ్చే పథకం పునరుద్ధరణ. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ సమయంలో, పాస్‌పోర్టులు, ఇతర అవసరాల కోసం ధ్రువీకరణ పత్రాల పరిశీలన సులభతరం చేయడం.మహిళలకు నెలకు రూ.3 వేలుభారత్ జోడో యాత్ర సమయంలో రాహుల్ గాంధీ, ఇతర నేతలు ఇచ్చిన హామీల మేరకు మహిళా సమ్మాన్ కార్యక్రమం అమలు. ఇందులో భాగంగా కుటుంబ యజమాని అయిన మహిళకు నెలకు రూ.3 వేలు చొప్పున సాయం అందజేత. స్వయం సహాయక బృందాలకు రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణం. ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే మైనారిటీ కమిషన్ ఏర్పాటు. కశ్మీరీ పండిట్లకు పునరావాసం కల్పిస్తామంటూ గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ ఇచ్చిన హామీ అమలు. -
బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలి
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా బిల్లు ప్రవేశ పెట్టి అందులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను కోరారు. ఈమేరకు ఆయన శనివారం రాజకీయ పార్టీ లకు లేఖలు రాశారు. మహిళా బిల్లు, బీసీలకు ప్రత్యేక వాటా కల్పించేందుకు కేంద్ర ప్రభు త్వంపై దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఇందులో భాగంగా బీజేపీతో పాటు కాంగ్రెస్, జనతాదళ్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, అన్నా డీఎంకే, ఎన్సీపీ, రాష్ట్రీయ జనతాదళ్ తదితర పార్టీల అధ్యక్షులకు కృష్ణయ్య వేర్వేరుగా లేఖలు రాశారు. ప్రస్తుతం చట్టసభల్లో మహిళలకు అతి తక్కువగా ప్రాతినిధ్యం ఉందన్నారు. బీసీలకు అన్ని రంగాల్లో జనాభా ప్రకారం వా టా ఇవ్వకపోతే తిరుగుబాటు తప్పదన్నారు. -
ఇది కదా.. అసలైన ఐడియా, మహిళా సాధికారికతకు అసలైన నిదర్శనం
ఖాజీపేట : మహిళలు తలచుకుంటే ఏదైనా సాధిస్తారు .. అందుకు నిదర్శనం ఖాజీపేటలోని మహిళా చేయూత మార్ట్ చెప్పవచ్చు.. నేటి పోటీ వ్యాపారంలో తట్టుకుని అందరికన్నా భిన్నంగా.. ఆలోచిస్తూ తక్కువ ధరకే సరుకులతో పాటు నాణ్యమైన శుభ్రమైన సరుకులు వినియోగదారులకు ఇస్తున్నారు. ఫలితంగా వ్యాపారం బాగా వృద్ధి చెందడంతోపాటు మంచి లాభాలను గడిస్తున్నారు. ఫలితంగా ఇతర మహిళా మార్టులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 15 మహిళా మార్టులను ఏర్పా టు చేయాలని ప్రభుత్వ అధికారులు భావిస్తున్నారు. అందులో భాగంగా ఖాజీపేటను ఎంపిక చేశారు. మహిళా మార్టు ఏర్పాటుకు పెట్టుబడిగా ప్రతి సభ్యురాలు రూ.300 చొప్పున గ్రూపు నుంచి రూ. 3వేలు వసూలు చేశారు. ఇలా మండలంలో 950 గ్రూపులకు గాను రూ. 23లక్షలు పెట్టుబడిగా వచ్చింది. 2022 నవంబర్ 28న ఎమ్మెల్యే రఘురామిరెడ్డి చేతుల మీదుగా మహిళా మార్టును ప్రారంభించారు. విజయవంతంగా.. ఖాజీపేట లాంటి చోట మహిళామార్టులు విజయవంతంగా నడుస్తాయా అని అందరూ భావించారు. అయితే డ్వాక్రా మహిళల సహకారం.. అధికారుల పర్యవేక్షణతోపాటు మార్కెట్లో లభించే ధరలకంటే తక్కువ ధరకు, నాణ్యమైన సరుకులను వినియోగదారులకు అందించేలా సిబ్బంది కృషి చేశారు. ఫలితంగా 5 నెలల్లోనే రూ.కోటికి పైగా వ్యాపారం చేస్తూ విజయవంతంగా మహిళామార్టు నడుస్తోంది. లాభాలు అన్నీ సభ్యులకే మహిళా మార్టులో జరిగే వ్యాపారం వల్ల వచ్చే లాభాలు అన్ని మార్టులో పెట్టుబడి పెట్టిన సభ్యులకే. ప్రతి సంవత్సరం వచ్చిన ఆదాయంలో ఖర్చులను తీసి వచ్చిన ఆదాయాన్ని ప్రతి సభ్యురాలికి అందజేస్తామని అధికారులు అంటున్నారు. ప్రతి నెల ఆడిటింగ్ జరుగుతుందని వారు చెబుతున్నారు. మార్చికల్లా 15 మార్టుల ఏర్పాటు జిల్లాలో 15 మార్టులను ఏర్పాటు చేయాలని అధికారులు భావించారు. ఖాజీపేటలో విజయవంతం కావడంతో వేంపల్లి, పోరుమామిళ్ల, బద్వేలులో ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే స్థల పరిశీలన చేపట్టారు. -
స్త్రీ, శిశు సంక్షేమశాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
అడవిలోకి వెళ్లింది.. ఆదివాసీల జీవితాలకు ఆశాకిరణం అయ్యింది..
‘స్టుపిడ్ ఐడియా, ఈ ఆలోచనను ఇక్కడే ఆపెయ్’ అన్నారు... పేరెంట్స్. ‘పీహెచ్డీ పూర్తయింది కదా! మంచి ఉద్యోగం తెచ్చుకుని పెళ్లి చేసుకో’ అని కూడా అన్నారు. ఆమె వినలేదు... అడవిలోకి వెళ్లింది. ఆదివాసీల జీవితాలకు ఆశాకిరణం అయింది. వేలాది మంది జీవితాల్లో అభివృద్ధి వెలుగులు నింపింది... విజ్ఞాన దీపాలను వెలిగించింది. డాక్టర్ నీలమ్ గుప్తా... ఢిల్లీలో చదివారు. చదువుకున్న వాళ్లందరూ నగరంలోనే ఉండిపోతే ఆదివాసీలు ఎప్పటికీ అడవిలోనే ఉండిపోవాల్సి వస్తుంది. నగరాన్ని వాళ్లకు పరిచయం చేయాలి. వాళ్లను నగరంలోకి తీసుకురావాలి. అందుకు రోడ్‌మ్యాప్ తయారు చేసే పని తనకు తానుగా తీసుకున్నారు. ఇంట్లో వాళ్లను సమాధానపరిచి ఆదివాసీల గ్రామాల్లో అడుగుపెట్టారు. చదువురాని వాళ్ల కోసం ప్రింటింగ్ ప్రెస్ పెట్టారు. బొమ్మలతో చదువు చెప్పసాగారు. నగరానికి, కుగ్రామానికీ తేడా బొమ్మలతో చూపించారు. పేదరికం, అసమానత, లింగ వివక్షల విషయంలో తన సేవలను మరింతగా విస్తరించారు. ‘ఆరోహ్ (ఏ రే ఆఫ్ హోప్)’ పేరుతో స్వచ్ఛంద సంస్థ స్థాపించి సేవలను విస్తరించారు. ప్రభుత్వ సహభాగస్వామ్యంతో స్కిల్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ ప్రాజెక్టులను చేపట్టి విజయవంతం గా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు వెళ్లలేని కుగ్రామాలతో మమేకమైపోయిందామె జీవితం. అక్కడి యువతను కలుపుకుని వారి సహాయంతో సామాజిక, ఆర్థిక సర్వేలు నిర్వహించారు. వారిని ఎడ్యుకేట్ చేయడం ద్వారా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు సామాజిక కార్యకర్త డాక్టర్ నీలమ్ గుప్తా నీళ్లతో లెక్కలు ‘‘అభివృద్ధికి ఏ మాత్రం నోచుకోని ఈ కుగ్రామాల్లో నివసించే వారికి ప్రతిదీ నేర్పించాల్సిందే. నీటి శుభ్రత, సహజ వనరుల పరిరక్షణ, ఆరోగ్యం, జీవనోపాధి, మహిళాసాధికారత వంటి విషయాలతోపాటు తాము కూడా అందరి లాగానే చదువుకోవచ్చు అని కూడా చెప్పాల్సి వస్తోంది. సర్వే గణాంకాల ప్రకారం ఒక గ్రామంలో స్కూలుకు వెళ్లాల్సిన వయసు పిల్లల సంఖ్య పెద్దదిగా ఉంటుంది. స్కూల్ రికార్డులో ఎన్రోల్ మెంట్ దగ్గరకు వచ్చేసరికి చాలా పరిమితంగా ఉంటుంది. అంతపెద్ద గ్యాప్‌ను పూడ్చడానికి చేయని ప్రయత్నం లేదనే చెప్పాలి. ఎన్రోల్ మెంట్‌తో మా పని పూర్తయిందా? కానే కాదు. పాఠ్యాంశాల్లోని పాఠాలను యథాతథంగా బోధిస్తే సరిపోయేది కాదు. అక్కడి పరిస్థితి ఏమిటంటే... పదవ తరగతి విద్యార్థికి ఏదైనా ఒక రంగును చూపించి ‘అది ఏ రంగు? అని అడిగితే, ఇంగ్లిష్‌లో ఆ రంగు పేరు పలకడం, రాయడం రాక బిక్కమొహం పెట్టేవాళ్లు. కూడికలు, తీసివేతలు, భాగాహారాలను నేర్పించడానికి బకెట్లో నీటిని తీసుకుని మగ్గులతో కొలిచి మరో బకెట్లో పోస్తూ నేర్పించాం. ఇలా వాళ్లకోసం టీచింగ్ మెథడాలజీలో కొత్త కాన్సెప్ట్‌లను తయారు చేసుకున్నాం. నీరు మురికి కావడం, శుభ్రంగా ఉండడం వంటి తేడాలను చూపిస్తూ ఎన్విరాన్మెంట్ సైన్స్ నేర్పించాం. ‘పఢో ఔర్ బఢో’ అనే కార్యక్రమాన్ని రూపొందించి యాభై వేల మంది విద్యార్థులను ఎన్రోల్ చేయించి వారందరికీ చైల్డ్ ఓరియెంటెడ్ మోడల్ ద్వారా పాఠాలు చెప్పాం. బీహార్, జార్ఖండ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఒడిషా రాష్ట్రాల్లోని యాభై గ్రామాల్లో ఈ సేవలందించాం. ఆ తర్వాత మాకనిపించింది... మహిళలను చైతన్యవంతం చేసి, వారికి జీవనోపాధి కల్పించినట్లయితే తమ పిల్లలకు చదువు అవసరాన్ని వారే గుర్తించేలా చేయగలిగితే ఆ క్షణం నుంచి తమ అభివృద్ధికి తామే బాటలు వేసుకోగలుగుతారనిపించింది. అనిపించడమే కాదు, అదే నిజమైంది. మహిళలకు వారికి రకరకాల పనుల్లో శిక్షణ ఇవ్వడంతోపాటు సాఫ్ట్ స్కిల్స్ కూడా నేర్పించాం. కంప్యూటర్ బేసిక్ ఎడ్యుకేషన్, స్పోకెన్ ఇంగ్లిష్ కూడా నేర్పించాం. ఈ మార్పు ఒడిషాలోని కందమల్, రాయగడ, నౌపద, గజపతి, కోరాపుట్ జిల్లాల్లో నూ, జార్ఖండ్‌లోని గిరిడీహ్, ధన్‌బాద్, బొకారో జిల్లాలు, బీహార్‌లోని గయ జిల్లాలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు అక్కడ ప్రతి గ్రామంలోనూ నలభై శాతం మంది మహిళలు మా కార్యక్రమాల ద్వారా ప్రయోజనం పొందిన వాళ్లే ఉన్నారు. ఆకాశమే హద్దు ఈ గ్రామాల్లో ‘ఆడపిల్ల వద్దనుకునే తల్లిదండ్రులు లేరు. ఆ తరం ముగిసిపోయింది. రూపాలి అనే అమ్మాయి అక్కడ అందరికీ ఓ రోల్‌మోడల్. ఆమె ఓ జపాన్ వస్తువుల రీటైల్ దుకాణంలో ఉద్యోగం చేస్తూ నెలకు పద్దెనిమిది వేలు సంపాదిస్తోంది. కేంద్ర గ్రామీణ మంత్రిత్వ శాఖ నుంచి ‘స్టార్ పెర్ఫార్మర్ ఆఫ్ డీడీయూ–జీకేవై’ పురస్కారాన్ని అందుకుంది. ఒకప్పుడు చదువుకోవచ్చనే విషయం కూడా తెలియని ఈ గ్రామాల్లో ఇప్పుడు పర్యటిస్తే రూపాలి వంటి అమ్మాయిలు ఎందరో కనిపిస్తారు. వీరందరి ఎదుగుదల నాకు కూడా ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టింది’’ అని చెప్పారు 2019లో గ్లోబల్ కాంపాక్ట్ ఇండియా నెట్వర్క్ పురస్కారం అందుకున్న డాక్టర్ నీలమ్ గుప్తా. ఈ సందర్భంగా డాక్టర్ గుప్తా తాను బాల్యంలో ఈ ప్రదేశాల్లో పర్యటించినప్పుడు కంటపడిన సన్నివేశాలు, సంఘటనలను గుర్తు చేసుకున్నారు. స్వెటర్ అమ్మితే ‘‘నేనక్కడ అడుగుపెట్టేనాటికి అక్కడి పరిస్థితులు భయానకంగా ఉండేవి. మధ్యాహ్నం రెండు తర్వాత తెల్లవారు ఝామున ఐదింటి మధ్య బయటకు రావడం క్షేమకరం కాదు. అది తెలిసి మా పేరెంట్స్ నా ఆలోచనను అంగీకరించలేదు. అయితే అక్కడి యువతను చేరదీసి వారి ఆలోచన ధోరణిని మార్చడం ద్వారా నేను అనుకున్నది సాధించగలిగాను. అసలు నేను ఇంత మొండిగా ఈ పని తలకెత్తుకోవడానికి బలమైన కారణమే ఉంది. నా చిన్నప్పుడు ఒకసారి సెలవుల్లో మా నాన్నతో కలిసి ఇక్కడ పర్యటించాను. డిసెంబర్ చలిలో ఓ పదేళ్ల పాప చిరిగిన దుస్తులతో రోడ్డు పక్కన నిలబడి చలికి వణుకుతూ ఉంది. అప్పుడు నా స్వెటర్ ఇచ్చి వేసుకోమన్నాను. ఆ మరుసటి రోజు ఆ పాప మళ్లీ అలాగే చిరిగిన దుస్తులతోనే రోడ్డు పక్కన కనిపించింది. స్వెటర్ వేసుకోలేదేమని అడిగినపుడు నాకు మతి చలించిపోయే సమాధానం వచ్చింది. ఆ స్వెటర్‌ను పాప తండ్రి తీసుకువెళ్లి సంతలో అమ్మేసి ఇంట్లోకి తినడానికి సరుకులు తెచ్చాట్ట. కడుపు నింపుకోవడానికి ఇంక మరో దారి లేదు వాళ్లకప్పుడు. హాలిడే వెకేషన్ పూర్తి చేసుకుని నగరానికి వెళ్లిపోయిన తర్వాత కూడా ఆ సంఘటన నన్ను వెంటాడుతూనే ఉండేది. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్, అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పూర్తి అయిన తర్వాత నా ఆలోచనను ఇంట్లో చెప్పాను. ఇంట్లో వాళ్లందరూ కోప్పడ్డారు. మొండిగానే నా ప్రయత్నం మొదలుపెట్టాను. స్థానికుల సహకారంతో విజయపథంలో ముందుకు సాగుతున్నాను’’ అన్నారామె. ఆంక్షల వలయం ఒడిషాలోని కోరాపుట్ జిల్లాలో ఓ కుగ్రామం మాది. నేను ఇప్పుడిలా కనిపిస్తున్నాను. కానీ, నా చిన్నప్పుడు అక్కడ నాగరకత తెచ్చే సౌకర్యాలేవీ లేవు. మా జీవనం మీద ఎన్నో నిబంధనలుండేవి. చీకటి పడితే వీథిలోకి అడుగుపెట్టడానికి వీల్లేదు. ఎలక్ట్రిసిటీ, కమ్యూనికేషన్, ఎడ్యుకేషన్ వంటివన్నీ నిషేధం. ఈ నిషేధం పైకి కనిపించేది కాదు, కానీ అమల్లో ఉండేది. హింస, దాడులు నిత్యకృత్యం. నేను చదువుకోవడానికి స్కూలుకు వెళ్తానంటే మా పేరెంట్స్ వణికిపోయారు. ప్రపంచంతో సంబంధం లేనట్లు జీవించడమే అక్కడి వారికి తెలిసిన జీవితం. – రూపాలీ శర్మ -
World Food Day: పాలకూర, పప్పు దినుసులు, బాదం..తింటే స్త్రీలలో ఆ సమస్యలు ..
మన దేశంలో అనేకమంది స్త్రీలు పోషకాహారలోపంతో బాధపడుతున్నారనే విషయం అందరికీ విధితమే. దీనితో తాము అనారోగ్యంగా ఉండటమేకాకుండా, పోషకాహార లోపం ఉన్న రేపటి తరానికి జన్మనిస్తున్నారు. అందువల్ల మహిళలకు వారి పోషకాలలో వాటా అందేలా చూడడం అత్యవసరం. మన దేశంలో కేవలం ఆకలిని మాత్రమే నిర్మూలిస్తే సరిపోదు, బదులుగా, ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారం ప్రజలందరికీ అందుబాటులో ఉంచడమూ అవసరమేనని పోషకాహారనిపుణులు అభిప్రాయపడుతున్నారు. మహిళల ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలు, వాటి ప్రాముఖ్యత తెలుసుకుందాం.. పాలకూర పాలకూరలో పోషకాలను తక్కువగా అంచనా వేయకండి. ఇది రోగనిరోధక శక్తి పెరుగుదలకు, ఎముకల పుష్టికి సహాయపడుతుంది. పాలకూరను మహిళల సూపర్‌ఫుడ్ అని కూడా అంటారు. ఎందుకంటే దీనిలో మాగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇది మహిళల గర్భధారణ సంమయంలో అవసరమైనంతమేరకు శరీరానికి ఖనిజాలను అందిస్తుంది. చదవండి: పెట్రోల్ రేట్లు ఎంత పెరిగినా నో ప్రాబ్లం.. వాటే ఐడియా గురూ..!! పప్పు దినుసులు పప్పు దినుసుల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా 40 ఏళ్లు పైబడిన మహిళలకు అవసరమైన ప్రొటీన్లు అందించడంలో వీటి పాత్ర కీలకం. ప్రతి రకం పప్పుల్లో దానిదైన ప్రత్యేక పోషక ప్రయోజనాలను అందిస్తుంది. ఓట్స్ రోజువారీ శక్తికి అవసరమైన ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు, ఫైబర్ ను అందించడంలో ఓట్స్ కీలకం. వీటిల్లో ఇతర ధాన్యాల కంటే ఎక్కువ ప్రోటీన్లు, కొవ్వులు కలిగి ఉంటాయి. అంతేకాకుండా వీటిల్లో ఆరోగ్యకరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు కూడా అధికమే. పాలు వర్కింగ్ ఉమెన్‌కు ఎముకల్లో పటుత్వం తగ్గి, ఎముకల నిర్మాణంలో మార్పులు సంభవించే ప్రమాధం ఉంది. ఇది ఎముకల వ్యాధి వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఐతే పాలల్లో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. గ్లాస్ పాలు తాగితే రోజువారీ అవసరమైన కాల్షియంను తగుమోతాదులో అందిస్తుంది. ఇందులో ప్రోటీన్, భాస్వరం, పొటాషియం, డి, బి విటమిన్లు కూడా ఉన్నాయి. బ్రోకోలీ మహిళలకు మేలుచేసే ఆరోగ్యకరమైన ఆహారాల్లో బ్రోకోలీ అత్యంత కీలకమైనది. ఎందుకంటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడంలో ఎంతో సహాయపడుతుంది. క్యాన్సర్‌కు కారణమయ్యే ఈస్ట్రోజెన్ స్థాయిలను తగ్గిస్తుంది. ముఖ్యంగా రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ నివారణలో దీని పాత్ర కీలకం. గుండె ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది. దీనిలో కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఎముకల పటుత్వానికి దోహదపడుతుంది. బాదం జీర్ణవ్యవస్థను మెరుగుపరిచే ప్రోబయోటిక్స్ ఉత్పత్తికి బాదం ఎంతో సహాయపడుతుంది. అంతేకాకుండా పావు కప్పు బాదంలో గుడ్డు కంటే ఎక్కువ ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. దీనిలో మెగ్నీషియం కూడా అధికంగానే ఉంటుంది. నిపుణులు సూచిస్తున్న ఈ ఆహారాలను తీసుకుంటే మహిళల్లో పోషకాహారలోపాన్ని అరికట్టవచ్చు. చదవండి: ఈ వాటర్ బాటిల్ ధర సీఈవోల జీతం కంటే ఎక్కువే!.. రూ.45 లక్షలు.. -
ఇదేనా మహిళా ‘సంక్షేమం’?
లావేరు: లావేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం కుటుంబ సంక్షేమ శస్త్రచికిత్సలు చేసుకున్న బాలిం తలు నరకయాతన అనుభవించారు. ఒకే బెడ్‌పై ఇద్దరిని ఉంచడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సరైన సౌకర్యాలు కల్పించకపోవడంపై వైద్యసిబ్బందిపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. లావే రు పీహెచ్సీలో మంగళవారం కుటుంబ సంక్షేమ శస్త్రచికిత్సల శిబిరం నిర్వహిం చారు. 23 మందికి శస్త్రచికిత్సలు చేశా రు. వీరిని ఒక్కొక్క బెడ్‌పై ఉంచి వైద్యు లు ఎప్పటికప్పుడు పరిశీలించాలి. అయి తే లావేరు పీహెచ్సీలో నాలుగు బెడ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో ఒకే బెడ్‌పై ఇద్దరిని చొప్పున ఉం చారు. అప్పటికే శస్త్రచికిత్స కారణంగా తీవ్ర నొప్పులతో బాధపడుతున్న బాలి ంతలు ఇలా ఒకేబెడ్‌పై ఇద్దరేసి చొప్పున ఉండటంతో ఇబ్బందులు పడ్డారు. ప్ర భుత్వ ఆస్పత్రుల్లో సంక్షేమ శస్త్రచికిత్స లు చేసుకుంటే సురక్షితమని ప్రచారం చేస్తున్న పాలకులు తగిన సౌకర్యాలు కల్పించకపోవడంపై అన్ని వర్గాల నుంచీ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.