లావేరు: లావేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం కుటుంబ సంక్షేమ శస్త్రచికిత్సలు చేసుకున్న బాలిం తలు నరకయాతన అనుభవించారు. ఒకే బెడ్‌పై ఇద్దరిని ఉంచడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సరైన సౌకర్యాలు కల్పించకపోవడంపై వైద్యసిబ్బందిపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. లావే రు పీహెచ్‌సీలో మంగళవారం కుటుంబ సంక్షేమ శస్త్రచికిత్సల శిబిరం నిర్వహిం చారు. 23 మందికి శస్త్రచికిత్సలు చేశా రు. వీరిని ఒక్కొక్క బెడ్‌పై ఉంచి వైద్యు లు ఎప్పటికప్పుడు పరిశీలించాలి.
అయి తే లావేరు పీహెచ్‌సీలో నాలుగు బెడ్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో ఒకే బెడ్‌పై ఇద్దరిని చొప్పున ఉం చారు. అప్పటికే శస్త్రచికిత్స కారణంగా తీవ్ర నొప్పులతో బాధపడుతున్న బాలి ంతలు ఇలా ఒకేబెడ్‌పై ఇద్దరేసి చొప్పున ఉండటంతో ఇబ్బందులు పడ్డారు. ప్ర భుత్వ ఆస్పత్రుల్లో సంక్షేమ శస్త్రచికిత్స లు చేసుకుంటే సురక్షితమని ప్రచారం చేస్తున్న పాలకులు తగిన సౌకర్యాలు కల్పించకపోవడంపై అన్ని వర్గాల నుంచీ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇదేనా మహిళా ‘సంక్షేమం’?
Published Wed, Jun 8 2016 12:09 AM | Last Updated on Mon, Sep 4 2017 1:55 AM
Advertisement