అసోం: తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న బీజేపీ కూటమి | Assam Assembly Election Results 2021: Counting, Live Updates In Telugu | Sakshi
Sakshi News home page

అసోం: తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న బీజేపీ కూటమి

Published Sun, May 2 2021 4:02 AM | Last Updated on Sun, May 2 2021 7:33 PM

Assam Assembly Election Results 2021: Counting, Live Updates In Telugu - Sakshi

లైవ్‌ అప్‌డేట్స్‌:

Time 7.12

అసోంలో ఎన్డీయే కూటమి మరోసారి అధికారంలో రావడానికి కృషి చేసిన బీజేపీ పార్టీ కార్యకర్తలకు  సర్బానంద సోనోవాల్ అసోం ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
ప్రస్తుతం అసోంలో బీజేపీ కూటమి ఆధిక్యంలో ఉండగా.., బీజేపీ 75, కాంగ్రెస్‌ 50, ఇతరులు 1 చోట్ల ఆధిక్యంలో ఉ‍న్నాయి. బీజేపీ మ్యాజిగ్‌ ఫిగర్ దాటి, తిరిగి అసోంలో ఏన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనుంది.

Time 5.38
హిమంత బిస్వా శర్మ భారీ మెజార్టీతో గెలుపు
హిమంత బిస్వా శర్మ జలుక్బారి నియోజకవర్గం నుంచి వరుసగా ఐదోసారి గెలుపొందారు. సుమారు లక్షపైగా మెజార్టీని సాధించారు.  ఈ సందర్భంగా హిమంత బిస్వా శర్మ నియోజక వర్గ ప్రజలకు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కృతజ్ఞతలు తెలిపారు.

కాగా ప్రస్తుతం అసోంలో బీజేపీ కూటమి ఆధిక్యంలో ఉండగా.., బీజేపీ 73, కాంగ్రెస్‌ 52, ఇతరులు 1 చోట్ల ఆధిక్యంలో ఉ‍న్నాయి. బీజేపీ మ్యాజిగ్‌ ఫిగర్ దాటి, తిరిగి అసోంలో ఏన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనుంది.

Time 5.03
సర్బనంద్‌ సోనావాల్‌కు అభినందనలు తెలిపిన రాజ్‌నాథ్‌ సింగ్‌
► అసోంలో ఎన్డీయే కూటమి విజయం సాధించినందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. అసోంలో ఎన్డీయే విజయానికి కృషి చేసిన బీజేపీ కార్యకర్తలను అభినందించారు.

Time 4.52

బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ సీనియర్  నాయకురాలు ఓటమి
► కోక్రాజార్ ఈస్ట్‌ నుంచి పోటిచేస్తున్న బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్‌) సీనియర్  నాయకురాలు ప్రమీలా రాణి బ్రహ్మ సమీప అభ్యర్థి యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ (యుపీపీఎల్) అభ్యర్థి లారెన్స్ ఇస్లారీ చేతిలో ఓడిపోయారు. 1991 నుంచి ప్రతిసారి ఈ స్థానాన్ని గెలుచుకుంటూ వచ్చారు. అంతకుముందు సర్బానంద సోనోవాల్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. ప్రస్తుత ఎన్నికల్లో  ఎన్డీయే కూటమి నుంచి  బీపీఎఫ్‌ బయటకు వచ్చి , కాంగ్రెస్ తో జత కట్టింది.

కాగా ప్రస్తుతం అసోంలో బీజేపీ కూటమి ఆధిక్యంలో ఉంది. అసోంలో ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. బీజేపీ 75, కాంగ్రెస్‌ 49, ఇతరులు 2 చోట్ల ఆధిక్యంలో ఉ‍న్నాయి. బీజేపీ మ్యాజిగ్‌ ఫిగర్ దాటింది


Time 4.00
► అసోంలో బీజేపీ కూటమి ఆధిక్యంలో ఉంది. అసోంలో ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. బీజేపీ 71, కాంగ్రెస్‌ 53, ఇతరులు 2 చోట్ల ఆధిక్యంలో ఉ‍న్నాయి. బీజేపీ మ్యాజిగ్‌ ఫిగర్ దాటింది.

Time 3.00
► అసోంలో బీజేపీ కూటమి ఆధిక్యంలో ఉంది. అసోంలో ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. బీజేపీ 73, కాంగ్రెస్‌ 50, ఇతరులు 3 చోట్ల ఆధిక్యంలో ఉ‍న్నాయి. బీజేపీ మ్యాజిగ్‌ ఫిగర్ దాటింది.

12.50
► అసోంలో బీజేపీ కూటమి ఆధిక్యంలో ఉంది. అసోంలో ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. బీజేపీ 76, కాంగ్రెస్‌ 47, ఇతరులు 3 చోట్ల ఆధిక్యంలో ఉ‍న్నాయి. బీజేపీ మ్యాజిగ్‌ ఫిగర్ దాటింది. 

Time 12.00
► అసోంలో బీజేపీ కూటమి ఆధిక్యం ప్రదర్శిస్తోంది. అసోంలో ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. బీజేపీ 81, కాంగ్రెస్‌ 44, ఇతరులు 1 చోట్ల ఆధిక్యంలో ఉ‍న్నాయి. బీజేపీ మ్యాజిగ్‌ ఫిగర్ దాటింది. 

Time 11.10 
►  అసోంలో ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. బీజేపీ 83, కాంగ్రెస్‌ 41, ఇతరులు 2 చోట్ల ఆధిక్యంలో ఉ‍న్నాయి. బీజేపీ మ్యాజిగ్‌ ఫిగర్ దాటింది. 
► అసోంలో ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. బీజేపీ మ్యాజిగ్‌ ఫిగర్ దాటింది. బీజేపీ 78, కాంగ్రెస్‌ 35, ఇతరులు 2 చోట్ల ఆధిక్యంలో ఉ‍న్నాయి.
Time 10.20 
► అసోంలో ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. బీజేపీ మ్యాజిగ్‌ ఫిగర్ దాటింది. 73 చోట్ల బీజేపీ ఆధిక్యంలో ఉంది.
Time 10.00
► అసోంలో ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. బీజేపీ ఆధిక్యంతో దూసుకుపోతుంది. బీజేపీ 68, కాంగ్రెస్‌ 39, ఇతరులు 2 చోట్ల ఆధిక్యంలో ఉ‍న్నాయి.
అసోంలో ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. జలుక్బరిలో బీజేపీ అభ్యర్థి హిమంత బిశ్వ శర్మ ముందంజ
అసోంలో ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. మజోలిలో సీఎం శర్బానంద సోనావాల్‌ వెనుకంజ.
Time 9.40
►  అసోంలో ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. ఇప్పటి వరకు బీజేపీ అధిక్యంతో కొనసాగుతోంది. బీజేపీ 49, కాంగ్రెస్‌ 24, ఇతరులు 2 చోట్ల ఆధిక్యంలో ఉ‍న్నాయి.
► అసోంలో ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. అసోంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మ్యాజిక్‌ ఫిగర్ కోసం 64 అవసరం అవుతాయి. సీఎం సోనోవాల్‌(బీజేపీ) మజులీలో పోటీ చేశారు. హిమంత బిశ్వశర్మ(బీజేపీ) జులుక్బారీలో పోటీ చేశారు. కేశబ్‌ మహంత(ఏజీపీ) సమగురిలో పోటీ చేశారు. 2016లో 86 సీట్లతో ఎన్డీఏ అధికారం దక్కించుకుంది.
► అసోంలో ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. ఇప్పటి వరకు బీజేపీ ముందంజలో ఉంది.  బీజేపీ 43, కాంగ్రెస్‌ 20, ఇతరులు 2 చోట్ల ఆధిక్యంలో ఉ‍న్నాయి.
►  అసోంలో బీజేపీ ముందంజలో ఉంది.  బీజేపీ 36, కాంగ్రెస్‌ 19, ఇతరులు 2 చోట్ల ఆధిక్యంలో ఉ‍న్నాయి.
►  అసోంలో బీజేపీ ముందంజలో ఉంది.  బీజేపీ 35, కాంగ్రెస్‌ 17 చోట్ల ఆధిక్యంలో ఉ‍న్నాయి.
►  అసోంలో బీజేపీ ముందంజలో ఉంది.  బీజేపీ 29, కాంగ్రెస్‌ 14 చోట్ల ఆధిక్యం కనబరుస్తున్నాయి.
►  అసోంలో బీజేపీ ముందంజలో ఉంది.  బీజేపీ 27, కాంగ్రెస్‌ 14 చోట్ల ఆధిక్యంలో ఉ‍న్నాయి.
► అసోంలో బీజేపీ ముందంజలో ఉంది.  బీజేపీ 23, కాంగ్రెస్‌ 11 చోట్ల ఆధిక్యం కనబరుస్తున్నాయి.
►  అసోంలో బీజేపీ ముందంజలో ఉంది.  బీజేపీ 18, కాంగ్రెస్‌ 11 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి.
► అసోంలో బీజేపీ ముందంజలో ఉంది. బీజేపీ 11, కాంగ్రెస్‌ 5 చోట్ల ఆధిక్యం కనబరుస్తున్నాయి.
► అసోంలో పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు కొనసాగుతోంది. పోస్టల్‌ బ్యాలెట్‌లో బీజేపీ ముందంజలో ఉంది.
►  అసోంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్‌ ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది.

కౌంటింగ్‌ సిబ్బంది కౌంటింగ్‌ కేంద్రాలకు చేరుకుంటున్నారు. కరోనా జాగ్రత్తలు తీసుకొని అధికారులు థర్మల్‌ స్కానింగ్‌ చేసి సిబ్బందిని కౌంటింగ్‌ కేంద్రాలకు అనుమతిస్తున్నారు.

దిస్పుర్: అసోంలో ఎవరు అధికారంలోకి రానున్నారో నేటి ఫలితాలు తేల్చనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పోలింగ్‌ జరిగిన 47 స్థానాల ఫలితాల కౌంటింగ్‌ ప్రక్రియ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. అధికారాన్ని కాపాడుకోవడానికి బీజేపీ-ఏజీపీ కూటమి పకడ్బందీ వ్యూహాలను రచించిన విషయం తెలిసిందే. 126 అసెంబ్లీ స్థానాలున్న అస్సాంలో మార్చి 27 నుంచి ఏప్రిల్‌ 6 దాకా మూడు దశల్లో ఎన్నికలు జరిగాయి. గత ఎన్నికల్లో బీజేపీ-ఏజీపీలు 47 స్థానాలకు గాను 35 సీట్లలో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

అయితే అసోంలో ఈ ఎన్నికల్లో గెలిచి తప్పకుండా అధికారంలోకి రావాలని భావిస్తున్న కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహాకూటమి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. లోకల్‌ కార్డుతో కొత్తగా ఏర్పాటైన అసోం జాతీయ పరిషత్‌ కూడా బరిలో నిలవటంలో అసెంబ్లీ ఎన్నికల పోరు ఉత్కంఠ రేపుతోంది. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ని, జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ)ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నేపథ్యంలో అస్సాం అసెంబ్లీ పోరు రసవత్తరంగా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement