five states assembly election
-
ఎల్లుండి తెలంగాణ ఎన్నికల షెడ్యూల్.! ఒకే విడతలో పోలింగ్
సాక్షి, ఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తమైంది. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల ఎన్నికల పరిశీలకులతో ఇవాళ భేటీ కానుంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం ఇప్పటికే సమీక్షలు పూర్తి చేసిన ఈసీ ఓ అంచనాకి వచ్చినట్లు తెలుస్తోంది. నాలుగు రాష్ట్రాలకు ఒకే విడతలో.. ఒక రాష్ట్రానికి మాత్రం రెండు విడుతలుగా పోలింగ్ నిర్వహించాలని భావిస్తోందని సమాచారం. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్ , రాజస్థాన్ , చత్తీస్ ఘడ్, మిజోరాం రాష్ట్రాల ఎన్నికల పరిశీలకులతో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం కానుంది. పోలీస్, జనరల్ , ఎక్సపెండేచర్ పరిశీలకులు ఈ భేటీకి హాజరు కానున్నారు. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశాంతంగా, సజావుగా జరిగేందుకు వ్యూహాన్ని ఖరారు చేసేందుకే ఈ భేటీ నిర్వహిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. ఇక.. ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాంలలో ఒకే విడత పోలింగ్‌లో ఎన్నిక నిర్వహించాలని ఈసీ భావిస్తోంది. అలాగే.. ఛత్తీస్‌గఢ్‌లో రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించాలనుకుంటోంది. ఇక డిసెంబర్ 10-15 తేదీల మధ్య ఓట్ల కౌంటింగ్ నిర్వహించేందుకు ఈసీ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం. ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాజకీయ పార్టీలు ఉపయోగించే మద్యం , డబ్బు.. నియంత్రణ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే తమ అసహనం వ్యక్తం చేసింది. ఎన్నికల ప్రవర్తన నియమావళిని కఠినంగా అమలు చేయడంతో పాటుగా డబ్బు, మజిల్ పవర్ నియంత్రణకు కృషిచేయాలని పరిశీలకులకు సూచించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ నెల 8-10 తేదీల మధ్యలో.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించనుంది. -
తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ షురూ..
ఢిల్లీ:తెలంగాణతో సహా 5 రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియను సీఈసీ (కేంద్ర ఎన్నికల సంఘం) ప్రారంభించింది. ఈ మేరకు రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. కీలక స్థానాల్లో ఉన్న రెవెన్యూ, పోలీస్ అధికారులను బదిలీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికలు జరగనున్న ఈ రాష్ట్రాల్లో ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లకు వాళ్ల సొంత జిల్లాలో పోస్టింగ్ ఇవ్వొద్దని సీఈసీ ఆదేశాలు జారీ చేసింది. జులై 31 లోపు బదిలీల ప్రక్రియ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.స్థానికంగా అధికారులకు బంధుత్వాలు లేవని డిక్లరేషన్ తీసుకోవాలని తెలిపింది. క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తులను ఎన్నికల విధుల నుంచి దూరంగా ఉంచాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇదీ చదవండి:రెజ్లర్ల నిరసనపై నోరు విప్పిన కేంద్ర మంత్రి.. ఏమన్నారంటే! -
అల్లరిమూకలకు బీజేపీయే విరుగుడు
కనౌజ్: అల్లరిమూకలు, ఆరాచక శక్తులు, నేరగాళ్లకు బీజపీయే విరుగుడని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇప్పుడీ విషయాన్ని ఉత్తరప్రదేశ్ ప్రజలూ గుర్తించారన్నారు. గుజరాత్లో గత రెండు దశాబ్దాల్లో ఎలాంటి అల్లర్లూ జరగలేదనే విషయాన్ని ప్రస్తావించారు. యూపీలోని కనౌజ్లో శనివారం మోదీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. విపక్ష పార్టీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. యూపీలో తొలి దశ పోలింగ్ తర్వాత కుటుంబ పార్టీలకు కంటి మీద కునుకు కూడా కరువైందని అన్నారు. అధికారం కోసం ఇక కలలు కనలేరని అన్నారు. ఆ నాయకులందరూ ప్రభుత్వం అంటే కుటుంబం కోసం, కుటుంబం వలన, కుటుంబం చేత... అనుకుంటారని ఎద్దేవా చేశారు. మాఫియా నాయకుల్ని, అల్లరి మూకల్ని అరికట్టే సత్తా బీజేపీకే ఉందనేది ప్రజలకు అర్థమైందన్నారు. అధికారంలో ఉన్నపుడు విపక్షపార్టీలు శాంతిభద్రతలను కాపాడలేకపోయాయని ధ్వజమెత్తారు. అల్లర్లకు అడ్డుకట్టవేడయం, మాఫియాకు, గుండాలకు ముకుతాడు వేయడం యోగి ప్రభుత్వానికి మాత్రమే సాధ్యపడుతుంది కాబట్టి ఈ సర్కారును కొనసాగించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. -
కోవిడ్ టీకా సర్టిఫికెట్‌పై ప్రధాని ఫొటో ఉండదు
న్యూఢిల్లీ: త్వరలో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో జారీ చేసే కోవిడ్ సర్టిఫికెట్‌పై ప్రధాని మోదీ ఫొటో ఉండదని అధికారులు తెలిపారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవాల అసెంబ్లీ ఎన్నికలకు శనివారం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో అమల్లోకి వచ్చిన ఎన్నికల నియమావళికి లోబడి చర్యలు తీసుకుంటామని వారు వెల్లడించారు. కేంద్ర ఆరోగ్యశాఖ కోవిన్ యాప్‌లో ఈ మేరకు మార్పులు చేపడుతుందని వివరించారు. రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో 2021 మార్చిలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లోనూ ఈసీ సూచన మేరకు ఆరోగ్య శాఖ ఇలాంటి చర్యలనే తీసుకుంది. -
మోదీ ఎప్పుడైనా టీ గార్డెన్‌ను సందర్శించారా?
-
మోదీ ఎప్పుడైనా టీ గార్డెన్‌ను సందర్శించారా?
గువహటి: అసోం ఎన్నికల ప్రచారం రసవత్తరంగా కొనసాగుతోంది. అందులో భాగంగా ప్రధాన జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఒకరిపైఒకరు తీవ్రంగా విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గతంలో అస్సాంలో వరదలు వస్తే , పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) సమస్యపై స్పందించని ప్రధాని, 22 ఏళ్ల దిశ రవి ట్విట్‌పై మాత్రం ఎలా స్పందించారంటూ కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఆదివారం అస్సాంలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీని విమర్శించారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఉన్న యువతియువకులను , కార్మికులను, రైతులను భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మోసం చేసిందని ప్రియాంక గాంధీ ఆరోపించారు. అసోంలోని జోర్హాట్లో జరిగిన బహిరంగ సభలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. "ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడైనా ఒక టీ గార్డెన్‌ను సందర్శించారా..!, అక్కడ మహిళా కార్మికులను కలిశారా? టీ ఎస్టేట్‌లో పనిచేసే కార్మికులకు రోజువారీ వేతనం 350 రూపాయలు ఇస్తానన్న వాగ్దానాన్ని ఇంకా నెరవెర్చలేనందుకు కార్మికుల పట్ల బాధగా లేదా..! " అని ప్రధాని నరేంద్ర మోదీని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ అసోంలో అధికారంలో రావడానికి తీవ్రంగా కృషిచేస్తోందని ప్రియాంక గాంధీ తెలిపారు. అస్సాంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.కాంగ్రెస్ పార్టీ కేవలం అభివృద్ధి కొరకు పాటుపడుతుందన్నారు. అసోంలో 126 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు మూడు దశల్లో జరగనున్నాయి. (చదవండి: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఏఏ నిలిపేస్తాం ) -
'బీజేపీ బాగా పెర్ఫామ్ చేసింది'
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ బాగా పెర్ ఫామ్ చేసిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. తమ పార్టీకి మద్దతుగా నిలిచినందుకు ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తాము చేస్తున్న 'కాంగ్రెస్ లేని భారత్' ప్రచారానికి రెండు అడుగులు ముందుకు పడ్డాయని ఆయన వ్యాఖ్యానించారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అస్సాంలో బీజేపీ చరిత్ర సృష్టించిందని అన్నారు. ఈశాన్య రాష్ట్రం అస్సాంలో విజయం సాధించడం అన్నివిధాలా తమకెంతో కీలకమని అన్నారు. అస్సాం అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కేరళలో తమ ఓట్ల శాతం 6 నుంచి 15 శాతానికి పెరిగిందని చెప్పారు. పుదుచ్చేరి, తమిళనాడు తమ ఓటు బ్యాంకును నిలబెట్టుకున్నామని తెలిపారు. పార్లమెంట్ కార్యకలాపాలను అడ్డుకుంటూ, ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్న కాంగ్రెస్ కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. తాజా ఎన్నికల ఫలితాలు నరేంద్ర మోదీ నాయకత్వానికి నిదర్శనమని అమిత్ షా పేర్కొన్నారు.