'బీజేపీ బాగా పెర్ఫామ్ చేసింది' | Assam's victory is important in many ways: amit shah | Sakshi
Sakshi News home page

'బీజేపీ బాగా పెర్ఫామ్ చేసింది'

Published Thu, May 19 2016 4:16 PM | Last Updated on Mon, May 28 2018 3:58 PM

'బీజేపీ బాగా పెర్ఫామ్ చేసింది' - Sakshi

'బీజేపీ బాగా పెర్ఫామ్ చేసింది'

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ బాగా పెర్ ఫామ్ చేసిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. తమ పార్టీకి మద్దతుగా నిలిచినందుకు ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తాము చేస్తున్న 'కాంగ్రెస్ లేని భారత్' ప్రచారానికి రెండు అడుగులు ముందుకు పడ్డాయని ఆయన వ్యాఖ్యానించారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

అస్సాంలో బీజేపీ చరిత్ర సృష్టించిందని అన్నారు. ఈశాన్య రాష్ట్రం అస్సాంలో విజయం సాధించడం అన్నివిధాలా తమకెంతో కీలకమని అన్నారు. అస్సాం అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కేరళలో తమ ఓట్ల శాతం 6 నుంచి 15 శాతానికి పెరిగిందని చెప్పారు. పుదుచ్చేరి, తమిళనాడు తమ ఓటు బ్యాంకును నిలబెట్టుకున్నామని తెలిపారు. పార్లమెంట్ కార్యకలాపాలను అడ్డుకుంటూ, ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్న కాంగ్రెస్ కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. తాజా ఎన్నికల ఫలితాలు నరేంద్ర మోదీ నాయకత్వానికి నిదర్శనమని అమిత్ షా పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement