bundelkhand
-
బుందేల్‌ఖండ్‌లో బందిపోటు రాజకీయాలు!
ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌లో ఒకప్పుడు బందిపోటు దొంగల కనుసన్నల్లోనే రాజకీయాలన్నీ నడిచేవి. దశాబ్దాల తరబడి రాజకీయాలపై వారి ఆధిపత్యం కొనసాగింది. ఈ బందిపోటు దొంగలు ఎవరికి మద్దతిస్తే వారే ఎన్నికల్లో గెలిచేవారు. ఓట్ల కోసం ఆ బందిపోటు దొంగలు ఓటర్లను బెదిరించేవారు. ఎన్నికల రాజకీయాలను వారు తమ గుప్పిట్లో పెట్టుకునేవారు. 80వ దశకంలో యూపీలో భాగమైన బుందేల్‌ఖండ్‌లోని ఏడు జిల్లాలలోని ఆరింటిలో బందిపోట్లు తమ ఆధిపత్యం చెలాయించారు. ఝాన్సీ, జలౌన్, బందా, మహోబా, హమీర్పూర్, చిత్రకూట్‌లో వారి ఆటలు సాగేవి. దాదువా, నిర్భయ్ సింగ్ గుర్జార్, థోకియా తదిర బందిపోట్లు తాము ఈ ప్రాంతానికి రాజులుగా ప్రకటించుకున్నారు. తరువాతి కాలంలో వీరు రాజకీయ నేతలుగా, రాజకీయాలను శాసించేవారుగా మారారు. నేతలుగా మారిన దోపిడీ దొంగల జాబితాలో ముందుగా దాదువా పేరు వినిపిస్తుంది. దాదువా తన కుమారుడు వీర్ సింగ్‌ను జిల్లా పంచాయతీ అధ్యక్షునిగా చేయడంలో విజయం సాధించాడు. దాదువా 2007లో ఎన్కౌంటర్లో మృతిచెందాడు. అయితే అప్పటికే అతని కుటుంబ సభ్యులు రాజకీయ సామ్రాజ్యాన్ని స్థాపించారు. వీర్ సింగ్ చిత్రకూట్ నుంచి ఎస్పీ టికెట్ పై ఎమ్మెల్యేగా, అతని సోదరుడు బాల్ కుమార్ పటేల్ మీర్జాపూర్ నుంచి ఎంపీగా గెలుపొందారు. మేనల్లుడు రామ్ సింగ్ కూడా ఎస్పీ టిక్కెట్‌పై ప్రతాప్‌గఢ్‌లోని పట్టి అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల్లో గెలుపొందాడు.దాదువా మాదిరిగానే అంబికా పటేల్ అలియాస్ థోకియా కుటుంబ సభ్యులు కూడా రాజకీయాల్లో తమ హవా చాటుకున్నారు. 2005లో థోకియా అత్త సరిత బందాలోని కార్వీ బ్లాక్‌కు అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరో అత్త సవిత జిల్లా పంచాయతీ సభ్యురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2007లో తల్లి పిపారియా దేవి రాష్ట్రీయ లోక్‌దళ్ టిక్కెట్‌పై బందాలోని నారైని అసెంబ్లీ నుండి ఎన్నికలలో పోటీ చేశారు. ఆమె థోకియా పేరుతో 27 వేల ఓట్లను పొందగలిగారు. నిర్భయ్ సింగ్ గుర్జార్ కూడా ఎన్నికల్లో కాలు మోపారు. ఝాన్సీలోని గరౌత, జలౌన్, భోగానిపూర్‌లలోని రాజకీయాలన్నీ అతని కనుసన్నల్లో నడిచాయి. నిర్భయ్ సింగ్ గుర్జార్ అండతో నేతలు ఎన్నికల రేసులో దూసుకెళ్లేవారు. ఫూలన్ దేవి ఝాన్సీ డివిజన్లోని జలౌన్ జిల్లాలోని గోర్హా అనే చిన్న గ్రామానికి చెందిన బందిపోటు రాణిగా పేరొందింది. 1981 ఫిబ్రవరి 14న బెహ్మాయి ఊచకోత ఘటనతో ఫూలన్ దేవి దేశవ్యాప్తంగా వెలుగులోకి వచ్చింది. జైలు నుంచి విడుదలైన రెండేళ్ల తర్వాత 1996లో సమాజ్‌వాదీ పార్టీ ఆమెకు లోక్‌సభ టిక్కెట్ ఇచ్చింది. ఫూలన్ తన తొలి ఎన్నికల్లోనే మీర్జాపూర్ ఎంపీగా విజయం సాధించింది. అయితే ఆ తర్వాత ఆమె హత్యకు గురయ్యింది. -
బుందేల్‌ఖండ్‌లో బందిపోటు రాజకీయాలు!
ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌లో ఒకప్పుడు బందిపోటు దొంగల కనుసన్నల్లోనే రాజకీయాలన్నీ నడిచేవి. దశాబ్దాల తరబడి రాజకీయాలపై వారి ఆధిపత్యం కొనసాగింది. ఈ బందిపోటు దొంగలు ఎవరికి మద్దతిస్తే వారే ఎన్నికల్లో గెలిచేవారు. ఓట్ల కోసం ఆ బందిపోటు దొంగలు ఓటర్లను బెదిరించేవారు. ఎన్నికల రాజకీయాలను వారు తమ గుప్పిట్లో పెట్టుకునేవారు. 80వ దశకంలో యూపీలో భాగమైన బుందేల్‌ఖండ్‌లోని ఏడు జిల్లాలలోని ఆరింటిలో బందిపోట్లు తమ ఆధిపత్యం చెలాయించారు. ఝాన్సీ, జలౌన్, బందా, మహోబా, హమీర్పూర్, చిత్రకూట్‌లో వారి ఆటలు సాగేవి. దాదువా, నిర్భయ్ సింగ్ గుర్జార్, థోకియా తదిర బందిపోట్లు తాము ఈ ప్రాంతానికి రాజులుగా ప్రకటించుకున్నారు. తరువాతి కాలంలో వీరు రాజకీయ నేతలుగా, రాజకీయాలను శాసించేవారుగా మారారు. నేతలుగా మారిన దోపిడీ దొంగల జాబితాలో ముందుగా దాదువా పేరు వినిపిస్తుంది. దాదువా తన కుమారుడు వీర్ సింగ్‌ను జిల్లా పంచాయతీ అధ్యక్షునిగా చేయడంలో విజయం సాధించాడు. దాదువా 2007లో ఎన్కౌంటర్లో మృతిచెందాడు. అయితే అప్పటికే అతని కుటుంబ సభ్యులు రాజకీయ సామ్రాజ్యాన్ని స్థాపించారు. వీర్ సింగ్ చిత్రకూట్ నుంచి ఎస్పీ టికెట్ పై ఎమ్మెల్యేగా, అతని సోదరుడు బాల్ కుమార్ పటేల్ మీర్జాపూర్ నుంచి ఎంపీగా గెలుపొందారు. మేనల్లుడు రామ్ సింగ్ కూడా ఎస్పీ టిక్కెట్‌పై ప్రతాప్‌గఢ్‌లోని పట్టి అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల్లో గెలుపొందాడు. దాదువా మాదిరిగానే అంబికా పటేల్ అలియాస్ థోకియా కుటుంబ సభ్యులు కూడా రాజకీయాల్లో తమ హవా చాటుకున్నారు. 2005లో థోకియా అత్త సరిత బందాలోని కార్వీ బ్లాక్‌కు అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరో అత్త సవిత జిల్లా పంచాయతీ సభ్యురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2007లో తల్లి పిపారియా దేవి రాష్ట్రీయ లోక్‌దళ్ టిక్కెట్‌పై బందాలోని నారైని అసెంబ్లీ నుండి ఎన్నికలలో పోటీ చేశారు. ఆమె థోకియా పేరుతో 27 వేల ఓట్లను పొందగలిగారు. నిర్భయ్ సింగ్ గుర్జార్ కూడా ఎన్నికల్లో కాలు మోపారు. ఝాన్సీలోని గరౌత, జలౌన్, భోగానిపూర్‌లలోని రాజకీయాలన్నీ అతని కనుసన్నల్లో నడిచాయి. నిర్భయ్ సింగ్ గుర్జార్ అండతో నేతలు ఎన్నికల రేసులో దూసుకెళ్లేవారు. ఫూలన్ దేవి ఝాన్సీ డివిజన్లోని జలౌన్ జిల్లాలోని గోర్హా అనే చిన్న గ్రామానికి చెందిన బందిపోటు రాణిగా పేరొందింది. 1981 ఫిబ్రవరి 14న బెహ్మాయి ఊచకోత ఘటనతో ఫూలన్ దేవి దేశవ్యాప్తంగా వెలుగులోకి వచ్చింది. జైలు నుంచి విడుదలైన రెండేళ్ల తర్వాత 1996లో సమాజ్‌వాదీ పార్టీ ఆమెకు లోక్‌సభ టిక్కెట్ ఇచ్చింది. ఫూలన్ తన తొలి ఎన్నికల్లోనే మీర్జాపూర్ ఎంపీగా విజయం సాధించింది. అయితే ఆ తర్వాత ఆమె హత్యకు గురయ్యింది. -
ఈడీకి కౌంటర్ ఇచ్చిన అఖిలేష్ యాదవ్.. రెస్పాన్స్ ఎలా ఉండనుంది?
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ హయంలో ఈడీ దాడులు ఎక్కువయ్యాయి. ఈ దాడుల విషయంలో కూడా సుప్రీంకోర్టు వారికి మద్దతుగానే వ్యాఖ్యలు చేసింది. కానీ, ఈడీ దాడులపై ప్రతిపక్ష నేతలు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్.. ఈడీని కేంద్ర ప్రభుత్వం కేవలం ప్రతిపక్ష నేతలను వేధించడానికే వాడుకుంటున్నదని విమర్శించారు. ఈడీ స్వతహాగా దాడులు చేస్తే.. బీజేపీ నేతలకు సంబంధించిన అవినీతిపై ఎందుకు దర్యాప్తు చేయడంలేదని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే తాజాగా ఉత్తర ప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టులో జరిగిన అవినీతిని ఈడీ ఎందుకు బయటకు తీయడంలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందన్నారు. యోగి సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించిన బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభించిన నాలుగు రోజులకే వర్షాల కారణంగా కొట్టుకుపోయింది. కాగా, ఈ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ జూలై 16వ తేదీన ప్రారంభించారు. అయితే, ఈ ప్రాజెక్టు విషయంలో ఈడీ ఎందుకు విచారణ చేపట్టలేదని అఖిలేష్ ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: బీజేపీ నేత హత్య.. కేరళ నుంచి కుట్ర జరిగిందా? -
మోదీ చేతుల మీదుగా ప్రారంభం.. ఐదు రోజులకే గుంతలుపడ్డ రోడ్డు
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వేపై పలుచోట్ల గుంతలుపడ్డాయి. బుధవారం కురిసిన వర్షం కారణంగా రోడ్డు పాక్షికంగా ధ్వంసమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఐదు రోజుల క్రితమే 296 కిలోమీటర్ల పొడవైన ఈ నాలుగు లైన్ల రోడ్డును ప్రారంభించడం గమనార్హం. భారీ వర్షాల కారణంగానే సాలెంపుర్ చిరియా సమీపంలో ఈ రోడ్డుపై గంతలుపడిట్లు తెలుస్తోంది. దీనివల్ల బుధవారం రాత్రి ఇక్కడ రోడ్డు ప్రమాదాలు జరిగాయి. రెండు కార్లు, ఓ మోటార్ సైకిల్ ప్రమాదాలకు గురయ్యాయి. ఔరేయాలోని అజిత్మాల్ మాల్ ప్రాంతంలోనూ రోడ్డు ఇలాగే దెబ్బతింది. అయితే ఈ ప్రాంతాల్లో మరమ్మతులు ఇప్పటికే పూర్తయినట్లు అధికారులు చెప్పారు. 16 जुलाई यानि 5 दिन पहले प्रधानमंत्री मोदी ने बुंदेलखंड एक्सप्रेस वे का उद्घाटन किया था और कल शाम तेज़ बारिश के बाद ये एक्सप्रेस वे जगह जगह धंस गया .. @ndtv pic.twitter.com/hvdYLf5wTY — Saurabh shukla (@Saurabh_Unmute) July 21, 2022 ప్రతిపక్షాల విమర్శలు.. బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఐదు రోజులకే గుంతలుపడటంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. వర్షం వల్ల ఈ రోడ్డు అసంపూర్ణంగా ఉందనే విషయం ప్రజలకు తెలిసిందని సమాజ్‌వాదీ పార్టీ ఆరోపించింది. డబుల్ ఇంజిన్ సర్కార్ పనితీరు అంటే ఇదేనా.. వారం రోజులకే ఇలా అవుతుందా అని ఆమ్ ఆద్మీ పార్టీ సెటైర్లు వేసింది. రూ.8000 కోట్ల విలువైన బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వేను జులై 16న ప్రారంభించారు మోదీ. నాలుగు లైన్ల ఈ రోడ్డును ఆరు లైన్లకు కూడా విస్తరించుకోవచ్చు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఏడు జిల్లాలు, మధ్యప్రదేశ్‌లోని 6 జిల్లాలకు ఈ ఎక్స్‌ప్రెస్‌వే వ్యాపించి ఉంది. చదవండి: మోదీ అడ్డాలో పాగాకు కేజ్రీవాల్ పక్కా ప్లాన్! 300 యూనిట్ల ఉచిత కరెంటు, బకాయిల రద్దు హామీ -
ఉచిత పథకాలు దేశానికి ప్రమాదకరం
జలౌన్: ఉచిత పథకాల ద్వారా ఓట్లు దండుకునే సంస్కృతి దేశం అభివృద్ధికి చాలా ప్రమాదకరమని ప్రధాని మోదీ అన్నారు. ఇటువంటి తాయిలాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను ఆయన హెచ్చరించారు. యూపీలో రూ.14,850 కోట్లతో నిర్మించిన 296 కిలోమీటర్ల బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వేను జలౌన్ జిల్లా కైతెరి గ్రామం వద్ద శనివారం ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ రహదారితో వాహనాల వేగం మాత్రమే కాదు, బుందేల్‌ఖండ్ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి కూడా వేగవంతమవుతుందని చెప్పారు. చిత్రకూట్– ఢిల్లీ మధ్య ప్రయాణ కాలం మూడు నుంచి నాలుగు గంటలు తగ్గుతుందని కూడా చెప్పారు. ‘‘మన దేశంలో రేవడీ(ఉత్తర భారతంలో ఒక స్వీట్ పేరు)లు పంచుతూ ఓట్లు రాబట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రేవడీలతో ప్రజలను కొనుగోలు చేయవచ్చని అనుకుంటున్నారు. ఈ సంస్కృతి దేశం అభివృద్ధికి ప్రమాదకరం. రేవడీ సంస్కృతితో కొత్త ఎక్స్‌ప్రెస్ వేలు, ఎయిర్‌పోర్టులు, డిఫెన్స్ కారిడార్లు రావు. ఈ సంస్కృతిని దేశ రాజకీయాల నుంచి పారదోలినప్పుడే కొత్త రహదారులు, కొత్త రైలు మార్గాలు నిర్మించి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చవచ్చు’’అంటూ ఎన్నికల సమయంలో ఉచిత పథకాలను ప్రకటించే రాజకీయ పార్టీలపై పరోక్షంగా విమర్శలు చేశారు. బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు సులువైన రేవడీ సంస్కృతిని వదిలి, రాష్ట్రాభివృద్ధికి తీవ్రంగా పాటుపడుతున్నాయని ప్రధాని చెప్పారు. దేశ అభివృద్ధికి పునాదులు: కేజ్రీవాల్ ఉచిత పథకాలపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు. తమ ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా ఇస్తున్న విద్య, ఆరోగ్యం, విద్యుత్ సౌకర్యాలు ఓట్లు గుంజే తాయిలాలు కావని తెలిపారు. మన దేశం ప్రపంచంలోనే నంబర్ వన్‌గా నిలిచేందుకు పునాది వేసేందుకు చేస్తున్న ప్రయత్నాలని పేర్కొన్నారు. -
సొంతపిచ్‌పై...అఖిలేశ్‌కు అగ్నిపరీక్ష!
ఉత్తరప్రదేశ్ మొదటిదశ ఎన్నికల్లో జాట్లు కీలకంగా మారగా.. రెండోదశలో (ఫిబ్రవరి 14న పోలింగ్ జరిగింది) ముస్లిం ఆధిపత్య ప్రాంతాల్లో పోలింగ్ జరిగింది. ఈనెల 20న మూడోదశ పోలింగ్ యాదవుల బెల్ట్‌లో జరుగుతోంది. మూడు ప్రాంతాల్లో విస్తరించి ఉన్న 16 జిల్లాల్లోని 59 నియోజకవర్గాల్లో యాదవ సామాజికవర్గ బలమెక్కువ. సమాజ్‌వాది (ఎస్పీ)కి దీన్ని కంచుకోటగా అభివర్ణిస్తారు. అలాంటి ఈ ప్రాంతంలో 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీకి తలబొప్పి కట్టింది. అఖిలేశ్‌పై తిరుగుబాటు చేసి సొంతకుంపటి పెట్టుకున్న బాబాయి శివపాల్ సింగ్ యాదవ్‌తో ఇటీవలే సయోధ్య కుదుర్చుకోవడం ద్వారా పరిస్థితిని చక్కదిద్దుకున్నప్పటికీ ఎస్పీ అధినేతకు మూడోదశ విషమపరీక్షగా నిలుస్తుందని భావిస్తున్నారు. ఈ ప్రాంతంలోని కర్హల్ నుంచే అఖిలేశ్ స్వయంగా బరిలో నిలిచారు. బాబాయ్‌తో సయోధ్యతో పూర్వవైభవంపై ఆశలు పశ్చిమ యూపీలోని..ఐదు జిల్లాలు, అవధ్ ప్రాంతంలోని ఆరు జిల్లాలు, బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని ఐదు సీట్లకు ఫిబ్రవరి 20న మూడోదశ పోలింగ్ జరగనుంది. ఫిరోజాబాద్,, కాస్గంజ్, ఎతాహ్, మెయిన్‌పురి,, ఫరూకాబాద్,, కన్నౌజ్, ఔరాయా జిల్లాలు 2017లో అఖిలేశ్ పార్టీకి ఓటువేయలేదు.ఫలితంగా ఐదేళ్ల కిందట మొత్తం 59 సీట్లలో బీజేపీ ఏకంగా 49 తమ ఖాతాలో వేసేసుకుంది. సమాజ్‌వాది పార్టీ తొమ్మిది సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఎస్పీ అధినేత కుటుంబకలహాలు పార్టీ విజయావకాశాలను తీవ్రంగా దెబ్బతీశాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీఎస్పీతో పొత్తు ఉన్నప్పటికీ అఖిలేశ్ సతీమణి డింపుల్ యాదవ్ కన్నౌజ్ నుంచి ఓటమి పాలయ్యారు. అంతకుముందు 2012లో ఈ 59 సీట్లలో (20న పోలింగ్ జరిగే స్థానాలు) ఎస్పీ 37 చోట్ల నెగ్గడం గమనార్హం.. దీన్ని దృష్టిలో పెట్టుకొనే ఈ బెల్ట్‌లో ఎస్పీ విజయావకావలు దెబ్బతినకూడదనే ఉద్దేశంతో అఖిలేశ్ తన శివపాల్ యాదవ్‌ను మళ్లీ అక్కున చేర్చుకున్నారు. గతంలో హథ్రాస్ గ్యాంగ్‌రేప్ ఘటన కూడా ఈ ప్రాంతంలోనే జరిగింది. దీని నుంచి లబ్ధి పొందాలని చూస్తున్న ఎస్పీ అధినేత ఎన్నికల ప్రచారంలో పదేపదే ప్రస్తావిస్తున్నారు. అలాగే ప్రతినెలా ‘హథ్రాస్ కి బేటి స్మృతి దివస్’ను నిర్వహిస్తున్నారు. బుందేల్‌ఖండ్ బాగా వెనుకబడిన ప్రాంతం కావడతో నిరుద్యోగ సమస్య, నీటి ఎద్దటి తదిదర సమస్యలు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని.. ఎస్పీ అధికారంలోకి వస్తే ఉచిత రేషన్, నెలకు కిలో నెయ్యిని అందిస్తామని అఖిలేశ్ ఓటర్లుకు హామీ ఇచ్చారు. ఒకప్పుడు బుందేల్‌ఖండ్ బీఎస్పీకి కంచుకోటగా ఉండేది. కానీ 2017లో వీచిన బీజేపీ గాలితో బీఎస్పీ తుడిచిపెట్టుకుపోయింది. హైటెన్షన్ పోరు కర్హాల్ నియోజకవర్గంలో అఖిలేశ్‌కు పోటీగా ఓబీసీ నాయకుడు, కేంద్ర మంత్రి సత్యపాల్‌సింగ్ బఘేల్‌ను బీజేపీ బరిలోకి దింపింది. ఈ స్థానంలో మొత్తం ఓటర్లలో 38 శాతం మంది యాదవులే. తర్వాతి స్థానంలో క్షత్రియులు ఉంటారు. భోగావ్ నియోజకవర్గంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి రామ్‌నరేశ్ అగ్నిహోత్రికే బీజేపీ టిక్కెట్టు ఇచ్చింది. కాన్పూర్ నగర్ జిల్లాలోని మహారాజ్‌పూర్ నుంచి సతీష్ మహానాను బీజేపీ మరోసారి రంగంలోకి దిగింది. తొలిదశ ఎన్నికలు పశ్చిమ యూపీలో జరిగినందువల్ల తమకు అనుకూలత ఉందని భావిస్తున్న అఖిలేశ్ యాదవ్ మూడోదశలో ఎలాగైనా పైచేయి సాధించాలనే పట్టుదలతో పని చేస్తోంది.దీంట్లో పైచేయి సాధిస్తే మిగతా నాలుగు దశల్లో కొంత ప్రశాంతంగా పనిచేసుకోవచ్చని ఎస్పీ భావిస్తోంది. యోగి నేతృత్వంలోని బీజేపీ సర్కార్ కుల, సంకుచిత, నియంతృత్వ పాలనకు ముగింపు పల కండి. సమాజంలోని అన్ని వర్గాలను సమదృష్టితో చూసే బహుజన సమాజ్ పార్టీకే పట్టంకట్టండి. దోపిడీదారుల అరాచకాలతో గతంలో యూపీ ప్రాంత ప్రజలు అవస్థలు పడ్డారు. మా పాలనలో వీరందరినీ ఏరిపారేశాం. ఎస్పీ పాలనలో రాష్ట్రంలో కేవలం ఒక వర్గం వారే అభివృద్ధి ఫలాలను అందుకున్నారు. మా ప్రభుత్వం వెనకబడిన కులాల అభివృద్ధి కోసం ఎంతగానో శ్రమించింది. మిగతా పార్టీల్లా మేం నెరవేర్చని వాగ్దానాలు చేయబోం. అందుకే ఈసారి ఎన్నికల్లో పార్టీ మేనిఫెస్టోను విడుదలచేయలేదు. – బీఎస్పీ చీఫ్ మాయావతి అఖిలేశ్ గెలుపు ఖాయమని మొదట్లో అతి విశ్వాసంతో ఉన్నారు. తాను పోటీ చేస్తున్న కర్హాల్ నియోజకవర్గంలో స్వయంగా ప్రచారం చేయా ల్సిన పనే లేదని, నేరుగా ఫలితాలు వెలువడే రోజు(మార్చి పదో తేదీ)న కర్హాల్ వస్తానని అఖిలేశ్ ధీమా వ్యక్తంచేశారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారినట్లు స్పష్టంగా తెలుస్తోంది. స్వయంగా ములాయం సింగ్‌తో ముందే ప్రచారం చేయిస్తున్నారు. ఆయన ఈ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొనడం ఇదే తొలిసారి. ఈసారి ఎన్నికల్లో 300 సీట్లు సాధించి బీజేపీ ఘన విజయం సాధించాలని ఓటర్లు ఆకాంక్షిస్తే.. ఈ గెలుపు పరంపర కర్హాల్ నుంచే మొదలవ్వాలి. – హోం మంత్రి అమిత్ షా – నేషనల్ డెస్క్, సాక్షి -
తిరిగేది 8వేల కోట్ల విమానంలో..
మహోబా(యూపీ): రూ.8వేల కోట్ల ఖరీదైన విమానంలో ప్రయాణించే ప్రధాని మోదీ..రైతుల రుణాలను మాత్రం మాఫీ చేయడం లేదని కాంగ్రెస్ నేత ప్రియాంకాగాంధీ విమర్శించారు. శనివారం ఆమె యూపీలోని బుందేల్‌ఖండ్ జిల్లాలో కాంగ్రెస్ నిర్వహించిన ప్రతిజ్ఞార్యాలీలో ప్రసంగించారు. విమానాలు కొనుగోలు చేసేందుకు ప్రధాని వద్ద డబ్బుంటుంది కానీ, సామాన్యులకు ఇచ్చేందుకు ఉండదన్నారు. ప్రధాని మోదీ స్నేహితులైన బడాపారిశ్రామిక వేత్తల ఆదాయం రోజుకు రూ.10వేల కోట్లు కాగా, సాధారణ వ్యక్తి ఆదాయం రోజుకు కేవలం రూ.27 మాత్రమేనని ఆమె అన్నారు. ప్రధాని మోదీ రైతులు, ప్రజల సంక్షేమానికి చేసిందేమీ లేదన్నారు. -
బుందేల్‌ఖండ్‌ను నాశనం చేశారు: మోదీ
మహోబా(యూపీ): ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతాన్ని గతంలో కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం చెలాయించిన నాయకులు నాశనం చేశారని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. ఇక్కడి వనరులను, అటవీ సంపదను మాఫియాల చేతికి అప్పగించాయని దుయ్యబట్టారు. ఆయన శుక్రవారం బుందేల్‌ఖండ్‌లో రూ.3,425 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను ప్రారంభించడంతోపాటు మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. ఝాన్సీలో 600 మెగావాట్ల అల్ట్రా మెగా సోలార్ పవర్ పార్కు నిర్మాణానికి పునాదిరాయి వేశారు. అలాగే స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన లైట్ కంబాట్ హెలికాప్టర్లు, మానవరహిత ఏరియల్ వెహికిల్స్ (యూఏవీలు), యుద్ధనౌకల్లో వినియోగించే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్‌ను ఝాన్సీలో భారత సైనికదళాలకు అందించారు. -
మంచి మాట.. రేపటి కోసం...
‘ఆకాశవాణి... ఇప్పుడు మీరు వింటున్నది శుభ్ కల్(రేపటి కోసం)’ అని రేడియో నుంచి ఆమె గొంతు వినిపించినప్పుడు ఎన్నో గ్రామాల్లో ఎంతోమంది మహిళలు తమ రేడియో దగ్గరికి వడివడిగా వస్తారు. రేడియోసౌండ్ పెంచుతారు. గ్రామీణ మహిళలకు చాలా ఇష్టమైన రేడియో కార్యక్రమం ఇది. ‘శుభ్ కల్’లో సినిమా పాటలు, కథలు, నాటికలు వినిపించవు. పర్యావరణానికి సంబంధించిన మంచి విషయాలు వినిపిస్తాయి. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలు వినడానికి ఆసక్తి చూపేవారు తక్కువగా ఉంటారు. ఆసక్తికరంగా చెబితే ఎలాంటి విషయాలనైనా ఆసక్తికరంగా వింటారని నిరూపించింది 27 సంవత్సరాల వర్షా రైక్వార్. మధ్యప్రదేశ్‌లోని నివారి జిల్లాకు చెందిన వర్ష ‘బుందెల్‌ఖండ్ 90.4 ఎం.ఎమ్’లో రేడియో జాకీ. వర్ష నాన్న రైతు. ఆయన వరుస కరువులతో ఎన్నో కష్టాలు పడ్డాడు. ఒకానొక దశలో ఊరు విడిచి వలస వెళదామని కూడా ఆలోచించాడు. చిన్నప్పుడు తండ్రిని అడిగేది ‘వర్షాలు ఎందుకు రావడం లేదు?’ ‘కరువు ఎందుకు వస్తుంది?’.. ఇలాంటి ప్రశ్నలకు ఆయన చెప్పే జవాబు ఒక్కటే...‘అంతా విధినిర్ణయం తల్లీ. మనమేమీ చేయలేము. మనం మానవమాత్రులం’ అయితే పెరిగి పెద్దవుతున్న క్రమంలో...కరువు కాటకాల్లో విధి పాత్ర కంటే మానవతప్పిదాల పాత్రే ఎక్కువ ఉందని గ్రహించింది. తప్పులు మూడు విధాలుగా జరుగుతాయి. తెలిసి చేసే తప్పులు, తెలియక చేసే తప్పులు, తెలిసీ తెలియక చేసే తప్పులు. ఈ మూడు సమూహాలను దృష్టిలో పెట్టుకొని ‘శుభ్ కల్’ కార్యక్రమానికి డిజైన్ చేసింది వర్ష. గంభీరమైన ఉపన్యాసాలు, అంత తేలిగ్గా అర్థం కాని జటిల సాంకేతిక పదజాలం కాకుండా స్థానిక భాష, యాసలతో నవ్వుతూ, నవ్విస్తూ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటుంది వర్ష. కొన్ని స్కిట్స్‌లో రెండు పాత్రలు ఉంటాయి. ఒక పాత్ర పర్యావరణానికి సంబంధించి మంచిపనులు చేస్తుంటుంది. రెండో పాత్ర...ఇదంత వ్యర్థం అనుకుంటుంది. రెండు పాత్రల మధ్య స్థానిక యాసలలో జరిగే సరదా సంభాషణ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటుంది. వాదనలో చివరికి రెండో పాత్ర ఓడిపోతుంది. తన తప్పును తెలుసుకొని ‘ఇలాంటి తప్పు మీరు చేయవద్దు’ అని చెబుతుంది. ఈ కార్యక్రమంతో ప్రభావితం అయిన రాజ్పూర్ గ్రామరైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లారు. ఈ గ్రామాన్ని మిగిలిన గ్రామాలు కూడా ఆదర్శంగా తీసుకున్నాయి. కేవలం రేడియో కార్యక్రమానికే పరిమితం కాకుండా ‘పల్లె పల్లెకు’ అంటూ తన బృందంతో కలిసి పల్లెలకు వెళుతుంటుంది వర్ష. ఆమె వెళ్లే పల్లెలలో వాహనాలు వెళ్లలేనివి మాత్రమే కాదు కాలినడకన వెళ్లడానికి కూడా ఇబ్బంది పడే పల్లెలు ఉన్నాయి. రేడియో జాకీగా మంచి పేరు ఉండడంతో ఏ పల్లెకు వెళ్లినా వర్షను గుర్తుపట్టి ఆదరిస్తారు. ఆ ఆదరణతోనే మహిళలతో సమావేశాలు నిర్వహించి చెట్లు పెంచడం వల్ల ఉపయోగాలు, నీటి సంరక్షణ మార్గాలు, సేంద్రియ వ్యవసాయం...ఇలా ఎన్నో విషయాలను చెబుతుంది. ఆ కార్యక్రమాలు ఎంత మంచి ఫలితం ఇచ్చాయంటే మొక్కలు నాటడాన్ని మహిళలు తప్పనిసరి కార్యక్రమం చేసుకున్నారు. నీటి వృథాను ఆరికట్టే కార్యక్రమాలు చేపడుతున్నారు. కిచెన్ గార్డెన్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐక్యరాజ్య సమితి ‘వి చేంజ్ నౌ’ మూమెంట్ యంగ్క్లైమెట్ లీడర్స్‌లో వర్ష ఒకరు. ‘మన భూమిని మనమే రక్షించుకోవాలి’ అంటుంది వర్ష రైక్వార్. అందరూ వినదగిన మాటే కదా! -
జెండా ఎగురవేశాడని దళిత సర్పంచ్‌పై సెక్రటరీ పిడిగుద్దులు..
భోపాల్: మధ్యప్రదేశ్‌లో అమానుషమైన సంఘటన చోటుచేసుకుంది. ఒక దళిత వ్యక్తి జాతీయజెండాను ఎగురవేశాడనే కోపంతో.. ఆ గ్రామ కార్యదర్శి అతనిపై దాడికి తెగబడ్డాడు. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా సంచలనంగా మారింది. స్థానికుల ప్రకారం.. ఈ సంఘటన బుందేల్ ఖండ్‌లో జరిగింది. కాగా, నిన్న (ఆగస్టు 15) స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ఛత్తర్పూర్లోని ధాంచీ గ్రామస్తులు.. స్థానిక పాఠశాలలో జాతీయ జెండాను ఎగురవేయడానికి ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో సదరు గ్రామ కార్యదర్శి సునీల్ తివారి సమయానికి రాలేదు. దీంతో గ్రామస్తులు సర్పంచ్ హన్ను బాసర్ను జెండా ఎగురవేయాలని కోరారు. వారి కోరిక మేరకు.. హన్ను బాసర్ జెండాను ఎగురవేశాడు. కాసేపటికి అక్కడికి చేరుకున్న సునీల్ ఆగ్రహంతో ఊగిపోయాడు. తనను కాదని.. నువ్వు జెండా ఎలా ఎగురవేశావని ప్రశ్నించారు. కోపంతో విచక్షణ కోల్పోయిన సెక్రెటరీ.. దళిత సర్పంచ్‌పై పిడిగుద్దులు కురిపిస్తు దాడికి తెగబడ్డాడు. అంతటితో ఆగకుండా.. అడ్డు వచ్చిన సర్పంచ్ భార్య.. కోడలిపై కూడా దాడిచేశాడు. ప్రస్తుతం ఈ సంఘటనపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, కార్యదర్శిపై ఇప్పటికే పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో సర్పంచ్, అతని భార్య.. సెక్రెటరీ సునీల్‌పై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజా ఘటనపై కూడా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
స్ట్రాబెర్రీ గర్ల్‌గా మారుమోగుతున్న గుర్లీన్ చావ్లా
2021 సంవత్సరపు మొదటి ‘మన్ కీ బాత్’లో నరేంద్ర మోడీ గుర్లీన్ చావ్లాను ప్రస్తావించారు. ‘ఆమె బుందేల్‌ఖండ్ ఆశాజ్యోతి’ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌లో వ్యవసాయం దుర్భరంగా ఉంది. ఉష్ణోగ్రత ఎక్కువ. వానలు, నీటివసతి తక్కువ. అలాంటి చోట సంప్రదాయ పంటలే కష్టం. కాని లా చదువుతున్న 23 ఏళ్ల గుర్లిన్ లాక్డౌన్లో తన ఊరు ఝాన్సీ వచ్చి ఊరికే ఉండకుండా తండ్రి పొలంలో స్ట్రాబెర్రీ వేసింది. విజయవంతంగా పండించింది. ‘స్ట్రాబెర్రీ గర్ల్’గా ఇవాళ ఆమె పేరు ఉత్తరప్రదేశ్‌లో మారుమోగుతోంది. లాక్డౌన్ ఎవరికి ఏం హాని చేసినా బుందేల్ఖండ్కి ఒక మేలు చేసింది. ఒక లా చదివే అమ్మాయి– గుర్లిన్ చావ్లా అక్కడ స్ట్రాబెర్రీ పంటను పండించి ఆదాయం గడించవచ్చని రైతులకు అర్థమయ్యేలా చేసింది. నిజంగా ఇది అనూహ్యమైన విషయమే. ఎందుకంటే స్ట్రాబెర్రీ 35 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఎండలు కాసే చోట పండదు. నీటి వసతి కూడా ఉండాలి. బుందేల్‌ఖండ్‌లో ఉష్ణోగ్రత ఎక్కువే అయినా నీరు తక్కువే అయినా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని గుర్లిన్ ఈ ఘనత సాధించింది. అందుకే ఇప్పుడు ఆమె అక్కడ ‘స్ట్రాబెర్రీ గర్ల్’గా ఖ్యాతి పొందింది. ఇంటి పంటతో మొదలు గుర్లిన్ చావ్లాది బుందేల్‌ఖండ్ (ఉత్తరప్రదేశ్ దక్షిణాది ప్రాంతం)లో ఝాన్సీ. పూనెలో లా చదువుతోంది. లాక్డౌన్లో కాలేజీ మూతపడటంతో ఇంటికి చేరుకుంది. ఇంట్లో తండ్రి టెర్రస్ మీద ఆర్గానిక్ పద్ధతిలో కూరగాయలు పండించడం గమనించి ఎలాగూ ఖాళీగా ఉంది కనుక తోటపనిలో పడింది. రసాయనాలు లేని తాజా కూరగాయలు ఇంట్లోనే దొరుకుతున్నాయి అని అర్థం చేసుకుంది. ‘ఇలాంటి ఆరోగ్యకరమైన కూరగాయలు ఝాన్సీలో ప్రతి ఒక్కరూ తినే వీలు కల్పించాలి కదా’ అని తండ్రితో అంది. తండ్రి ‘అదంత సులభం కాదు తల్లీ’ అని గుర్లిన్తో అనేవాడు. స్ట్రాబెర్రీలను కోస్తున్న గుర్లీన్ చావ్లా మార్చిన స్ట్రాబెర్రీ ఒకరోజు గుర్లిన్ 20 స్ట్రాబెర్రీ మొలకలను తెచ్చి తన ఇంటి డాబా మీద ఉన్న తోటలో నాటింది. కోకోపీట్ ఉన్న మట్టికుండీలలో వాటిని వేసింది. ‘ఇవి బతకవు’ అని అందరూ అన్నారు. ‘కాని ఆ మొక్కలు బతికాయి. ఇంకా ఆశ్చర్యంగా కాయలు కూడా కాశాయి. అవి సైజులు చిన్నగా, జ్యూస్ తక్కువగా ఉన్నా రుచిగా ఉన్నాయి. అరె... వీటిని పొలంలో ఎందుకు పండించకూడదు అనుకుంది గుర్లిన్. తండ్రితో పోరు పెట్టడం మొదలెట్టింది. తండ్రికి ఝాన్సీ దాపునే నాలుగున్నర ఎకరాల పొలం ఉంది. అందులో సేద్యం ఏమీ చేయడం లేదు. ఝాన్సీ ఉత్సాహం చూసి ‘కావాలంటే అందులో ట్రై చెయ్’ అన్నాడు తండ్రి. లాక్డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంది గుర్లిన్. 2020 అక్టోబర్‌లో సేంద్రియ పద్ధతి ద్వారా ఒకటిన్నర ఎకరాలో స్ట్రాబెర్రీ పంట వేసింది. ఈ విషయం రైతులకు వింత వార్త అయ్యింది. కాని గుర్లిన్కు తెలుసు.. తాను ఎలాగైనా విజయం సాధిస్తానని. పది వేల కిలోల దిగుబడి... జనవరి నెల వచ్చేనాటికి స్ట్రాబెర్రీని పండించడంలో మెళకువలన్నీ తెలుసుకుంది గుర్లిన్. ‘ఈ సీజన్లో పది వేల కిలోల దిగుబడిని ఆశిస్తున్నాను. ఇప్పుడు రోజూ కాయను కోసి మార్కెట్లో కిలో 250 రూపాయలకు అమ్ముతున్నాను’ అని చెప్పిందామె. ఆమె పొలంలో స్ట్రాబెర్రీ కాయ పెద్దదిగా కాయడమే కాదు రంగులో, జ్యూస్‌లో మరింత ఫలవంతంగా ఉంది. ‘రైతులు ఒక పంట ఒకే పద్ధతిలో పోకుండా భిన్నంగా ఆలోచిస్తే ఇలాంటి విజయాలు సాధించవచ్చు’ అని కూడా గుర్లిన్ అంది. అంతే కాదు ఒకవైపు స్ట్రాబెర్రీ వేసి మరోవైపు మిగిలిన మూడు ఎకరాల్లో ఆమె సేంద్రియ పద్ధతిలో బెంగళూరు మిర్చి, టొమాటో, కాలిఫ్లవర్ పండిస్తోంది. ‘చదువుకున్న యువత కూడా సేద్యం చేయడానికి ఆసక్తిగా ఉంది. కాకపోతే ప్రభుత్వం నుంచి వారికి సపోర్ట్ కావాలి’ అని గుర్లిన్ అంది. స్ట్రాబెర్రీ అంబాసిడర్ జనవరి 16 నుంచి ఝాన్సీలో ‘స్ట్రాబెర్రీ ఫెస్టివల్’ జరుగుతోంది. ప్రభుత్వమే దానిని నిర్వహిస్తోంది. బుందేల్‌ఖండ్ ప్రాంతంలో స్ట్రాబెర్రీని ప్రోత్సహించడానికి చేస్తున్న ఈ ఉత్సవానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ గుర్లిన్‌ను ‘స్ట్రాబెర్రీ అంబాసిడర్’గా ప్రకటించారు. అంతే కాదు ప్రధాని మోడి తన మన్ కీ బాత్‌లో గుర్లిన్‌ను ప్రస్తావించారు. దాంతో గుర్లిన్పై ప్రశంసలు కురుస్తున్నాయి. భవిష్యత్తులో ఈమె కథా ఒక బయోపిక్ అయినా ఆశ్చర్యపోవాల్సింది లేదు. – సాక్షి ఫ్యామిలీ -
ఉద్దండుల కర్మభూమి కనౌజ్
లోక్‌సభ ఎన్నికల నాలుగో దశలో పోలింగ్ జరిగే ఉత్తరప్రదేశ్‌లోని 13 నియోజకవర్గాల్లో ఆసక్తికర పోటీ జరుగుతోంది. అవధ్ ప్రాంతంలోని ఐదు సీట్లు(ఉన్నావ్, హర్దోయ్, కాన్పూర్, ఖేరీ, మిస్రిక్), బుందేల్‌ఖండ్‌లోని మూడు స్థానాల్లో(జాలోన్, ఝాన్సీ, హమీర్పూర్) పాలకపక్షమైన బీజేపీకి బీఎస్పీ, ఆరెల్డీతో కూడిన మహాకూటమి మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ఈ నియోజకవర్గాలతోపాటు షాజహాన్‌పూర్, ఫరూఖాబాద్, ఇటావా, కనౌజ్, అక్బర్పూర్లో ఈ నెల 29న పోలింగ్ జరుగుతుంది. రాజకీయ ప్రాధాన్యం ఉన్న కనౌజ్లో ఎస్పీ స్థాపకుడు ములాయంసింగ్ యాదవ్ కోడలు డింపుల్ మరోసారి పోటీలో ఉండగా, ఉన్నావ్‌లో బీజేపీకి చెందిన వివాదాస్పద ఎంపీ సాక్షీ మహారాజ్ మళ్లీ బరిలోకి దిగారు. ఫరూఖాబాద్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్రమాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ కిందటి ఎన్నికల్లో ఓటమి తర్వాత మళ్లీ పోటీచేస్తున్నారు. కాన్పూర్‌లో 2014 ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ మాజీ అధ్యక్షుడు మురళీమనోహర్ జోషీ స్థానంలో సత్యదేవ్ పచౌరీని ఆ పార్టీ రంగంలోకి దింపింది. యూపీలోని మొత్తం 80 సీట్లలో మిగిలిన సీట్లలో మాదిరిగానే ఈ నెల 29న పోలింగ్ జరిగే ఈ 13 స్థానాల్లో మహాగuŠ‡బంధన్ సగం వరకూ గెలుచుకునే అవకాశాలున్నాయని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. త్రిముఖ పోటీలు జరిగే అనేక సీట్లలో బీజేపీ గెలుపు కాంగ్రెస్ చీల్చుకునే ఓట్లపైనే ఆధారపడి ఉందని భావిస్తున్నారు. మొదటి రెండు దశల్లో పోలింగ్ జరిగిన పశ్చిమ యూపీ, దాని పరిసర ప్రాంతాల నియోజకవర్గాల్లో ఎస్పీ, బీఎస్పీ మధ్య ఓట్ల బదిలీ సంతృప్తికర స్థాయిలోనే జరిగిందనే వార్తల నేపథ్యంలో రెండు పార్టీలు ఎన్నికల్లో బాగానే కలిసి పనిచేస్తున్నాయి. ములాయం పోటీచేస్తున్న మైన్‌పురీలో ఆయనతోపాటు బీఎస్పీ నాయకురాలు మాయావతి ఒకే వేదిక నుంచి ప్రసంగించడం, ఆమెకు ములాయం, మాజీ సీఎం అఖిలేశ్ ఇస్తున్న గౌరవ మర్యాదలు రెండు పార్టీల కార్యకర్తలు, మద్దతుదారులు బీజేపీకి వ్యతిరేకంగా కూటమి అభ్యర్థుల గెలుపునకు గట్టిగా కృషిచేయడానికి దారితీసింది. వరుసగా దళితులు, బీసీలకు ప్రాతినిధ్యం వహించే ఈ రెండు పక్షాల మధ్య పొత్తు క్షేత్రస్థాయిలో మంచి ఫలితాలిస్తోందని పోలింగ్ సరళిని బట్టి అంచనావేస్తున్నారు. ఇదే పరిస్థితి అన్ని ప్రాంతాల్లో కొనసాగితే నాలుగో దశలో పోలింగ్ జరిగే అవధ్, బుందేల్‌ఖండ్ ప్రాంతాల్లో కూడా ఎస్పీ, బీఎస్పీ మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. డింపుల్ యాదవ్, సల్మాన్ ఖుర్షీద్, సత్యదేవ్ పచౌరీ, సాక్షీ మహారాజ్, అనూ టండన్ ఉద్దండుల కర్మభూమి కనౌజ్ మాజీ సీఎం అఖిలేశ్ భార్య, ప్రస్తుత ఎంపీ డింపుల్ యాదవ్ మూడోసారి కనౌజ్ నుంచి పోటీచేస్తున్నారు. 1998 నుంచీ సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)కి కంచుకోట కనౌజ్ నియోజకవర్గం. ములాయం ఈ స్థానం నుంచి మూడు సార్లు గెలుపొందారు. 1967లో సోషలిస్ట్ నేత రాంమనోహర్ లోహియా గెలుపొందగా, 1984లో కాంగ్రెస్ తరఫున గెలిచిన ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ కేంద్ర మంత్రి అయ్యారు. 2009లో కనౌజ్‌తోపాటు ఫిరోజాబాద్ నుంచి కూడా పోటీచేసి గెలిచిన అఖిలేశ్ ఫిరోజాబాద్ స్థానానికి రాజీనామా చేశారు. దాంతో ఈ సీటుకు జరిగిన ఉప ఎన్నికలో ఎస్పీ తరఫున డింపుల్ పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి, బాలీవుడ్ నటుడు రాజ్‌బబ్బర్ చేతిలో ఓడిపోయారు. 2012లో అఖిలేశ్ యూపీ సీఎం పదవి చేపట్టాక కనౌజ్ సీటుకు జరిగిన ఉప ఎన్నికలో డింపుల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మళ్లీ 2014లో ఆమె తన సమీప అభ్యర్థి సుబ్రత్ పాఠక్‌పై 19 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. బీఎస్పీ అభ్యర్థి నిర్మల్ తివారీకి లక్షా 27 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ఎస్పీకి బీఎస్పీ మద్దతు ఇవ్వడంతో డింపుల్ విజయం ఖాయమన్న ధీమాతో ఉన్నారు. కిందటిసారి ఓడిపోయిన సుబ్రత్ పాఠక్ మరోసారి బీజేపీ టికెట్‌పై పోటీచేస్తుండడంతో డింపుల్‌కు గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్నారు. యాదవులతోపాటు గణనీయ సంఖ్యలో ఉన్న బ్రాహ్మణుల ఓట్లు ఈ వర్గానికి చెందిన పాఠక్‌కే పడితే డింపుల్‌కు గట్టి పోటీ తప్పదు. నామినేషన్ రోజు డింపుల్ ఊరేగింపులో పాల్గొన్న ఎస్పీ, బీఎస్పీ, ఆరెల్డీ మద్దతుదారుల సంఖ్యను బట్టి ఆమె విజయం సునాయాసమని మహా కూటమి అంచనావేస్తోంది. సాక్షీ మహారాజ్‌కు సాటి ఎవరు? ముస్లింలు, బీజేపీ వ్యతిరేకులపై దూకుడుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే సిట్టింగ్ సభ్యుడు సాక్షీ మహారాజ్ (డా.సచ్చిదానంద్ హరి సాక్షి)కు ఆలస్యంగా ఉన్నావ్‌లో పోటీకి మరోసారి బీజేపీ టికెట్ లభించింది. 63 ఏళ్ల ఈ హిందూ సన్యాసి 2014లో ఉన్నావ్ స్థానంలో తన సమీప ఎస్పీ అభ్యర్థి అరుణ్శంకర్ శుక్లాపై 3 లక్షల పది వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. బీఎస్పీ అభ్యర్థి బ్రజేష్ పాఠక్‌కు రెండు లక్షలకు పైగా ఓట్లు దక్కాయి. 2009లో ఇక్కడ నుంచి ఎన్నికైన కాంగ్రెస్ అభ్యర్థి అన్నూ టండన్ లక్షా 97 వేల ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి సాక్షి మహారాజ్ బీసీ వర్గానికి చెందిన లోధా కులానికి చెందిన నేత. 1991లో మథుర నుంచి, 1996, 98లో ఫరూఖాబాద్ నుంచి ఆయన లోక్‌సభకు ఎన్నికయ్యారు. బ్రాహ్మణులు పెద్ద సంఖ్యలో ఉన్న ఉన్నావ్‌లో కింద టిసారి ఎస్పీ, బీఎస్పీ అభ్యర్థులిద్దరూ ఈ వర్గం వారే. అయితే, ఈ వర్గం ప్రజలు యూపీలో కాషాయపక్షం వైపు మొగ్గు చూపడంతో సాక్షి గెలుపు సాధ్యమైంది. ఈసారి కూడా ఎస్పీ, కాంగ్రెస్ తరఫున అరుణ్శంకర్ శుక్లా, అనూ టండన్ పోటీకి దిగారు. పొత్తులో భాగంగా బీఎస్పీ పోటీలో లేదు. 1999 నుంచి జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ఏ పార్టీ వరుసగా రెండు సార్లు ఉన్నావ్‌లో గెలవలేదు. మహా కూటమి అభ్యర్థి నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్న సాక్షి ఈ ఆనవాయితీ నిజమైతే గెలవడం కష్టమే. ఫరూఖాబాద్‌లో సల్మాన్ ఖుర్షీద్ మరో ప్రయత్నం! రెండో యూపీఏ సర్కారులో విదేశాంగ మంత్రిగా పనిచేసిన వివాదాస్పద కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ మరోసారి ఫరూఖాబాద్ నుంచి రంగంలోకి దిగారు. ఆయన ఇక్కడ 1991, 2009లో రెండుసార్లు విజయం సాధించారు. కిందటి పార్లమెంటు ఎన్నికల్లో ఆయన నాలుగో స్థానంలో నిలవడమేగాక డిపాజిట్ కోల్పోయారు. 2014లో బీజేపీ అభ్యర్థి ముకేష్ రాజ్‌పుత్ తన సమీప ఎస్పీ అభ్యర్థి రామేశ్వర్ యాదవ్‌పై లక్షన్నరకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. బీజేపీ, కాంగ్రెస్ తరఫున రాజ్‌పూత్, ఖుర్షీద్ బరిలోకి దిగారు.ఈసారి మహాగuŠ‡బంధన్ తరఫున బీఎస్పీ అభ్యర్థి మనోజ్ అగర్వాల్ పోటీకి దిగారు. సల్మాన్ ఖుర్షీద్ మాజీ రాష్ట్రపతి డా.జాకిర్‌హుస్సేన్ మనవడు. 1984లో ఖుర్షీద్ తండ్రి ఖుర్షీద్ ఆలం ఖాన్ విజయం సాధించాక మరోసారి కేంద్ర మంత్రి అయ్యారు. కిందటి ఎన్నికల్లో ఖుర్షీద్ ఫరూఖాబాద్‌లో డిపాజిట్ దక్కించుకోలేదంటే కాంగ్రెస్ ఇక్కడ ఎంత బలహీనమైందో అర్థంచేసుకోవచ్చు. విద్యావంతుడు, ప్రసిద్ధ లాయర్ అయిన ఖుర్షీద్ నెహ్రూగాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడిగా పేరు సంపాదించారు. కాన్పూర్‌లో కొత్త నేత యూపీలో మొదటి పారిశ్రామిక నగరంగా పేరొందిన కాన్పూర్ స్థానం నుంచి బీజేపీ మాజీ అధ్యక్షుడు మురళీమనోహర్ జోషీ కిందటి ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. 85 ఏళ్ల జోషీకి మళ్లీ పోటీచేసే అవకాశం ఇవ్వలేదు. ఆయన స్థానంలో సత్యదేవ్ పచౌరీ బీజేపీ తరఫున పోటీచేస్తున్నారు. గతంలో కాన్పూర్ నుంచి మూడుసార్లు వరుసగా గెలిచిన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ (కాంగ్రెస్)ను 2014లో జోషీ రెండు లక్షల 22 వేలకు పైగా ఆధిక్యంతో ఓడించా రు. మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన బీఎస్పీ, ఎస్పీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు. ఎస్పీ. బీఎస్పీ కూటమి తరఫున శ్రీరాం కుమార్(ఎస్పీ) బరిలోకి దిగారు. 1999, 2004, 2009 ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ నేత జైస్వాల్‌కు బీజేపీ కొత్త అభ్యర్థికి మధ్యనే గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్నారు. బుందేల్‌ఖండ్‌పై బీజేపీ పై చేయి సాధిస్తుందా? యూపీ, మధ్యప్రదేశ్‌లో విస్తరించి ఉన్న బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని మూడు యూపీ లోక్‌సభ స్థానాల్లో బీజేపీ, మహా కూటమి మధ్య హోరాహోరీ ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. జాలోన్(ఎస్సీ), ఝాన్సీ, హమీర్పూర్ సీట్లలో నాలుగో దశలో పోలింగ్ జరుగుతుంది. ఈ ప్రాంతంలోని బందా స్థానంలో మే ఆరున పోలింగ్ జరుగుతుంది. బ్రాహ్మణులు, రాజపుత్రులతోపాటు బీసీలు, దళితులు గణనీయ సంఖ్యలో ఉన్నారు. ముస్లింల జనాభా బాగా తక్కువ. ఈ కారణంగా బీజేపీ, ఎస్పీబీఎస్పీ కూటమి మధ్య బుందేల్‌ఖండ్‌లో గట్టి పోటీ ఉన్నట్టు కనిపిస్తున్నా మొగ్గు కాషాయపక్షానికే ఉందని కొందరు ఎన్నికల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఇక్కడి నాలుగు సీట్లలో అత్యధికంగా 44.86 శాతం ఓట్లు సాధించి అన్నింటినీ కైవసం చేసుకుంది. మూడేళ్ల తర్వాత జరిగిన 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తన ఓట్ల శాతాన్ని 45.01 శాతానికి పెంచుకుని ఈ ప్రాంతంలోని మొత్తం 20 సీట్లలో విజయం సాధించింది. 1996, 1998 ఎన్నికల్లో సైతం బీజేపీ ఇక్కడ తిరుగులేని విజయం సాధించింది. అయితే ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ కలిసిపోటీచేయడంతో బీజేపీకి తొలిసారి ఊహించని పోటీ ఎదురవుతోంది. కాంగ్రెస్ రెండు సార్లు ఒక్కొక్క సీటునే గెలుచుకుంది. జాలోన్, హమీర్‌పూర్‌లో బీఎస్పీ పోటీచేస్తుండగా, ఝాన్సీలో ఎస్పీ అభ్యర్థిని నిలిపింది. స్వల్ప సంఖ్యలో ఉన్న ముస్లిం ఓట్లతోపాటు ఎస్సీ, బీసీ వర్గాల ఓట్లు అత్యధికంగా మహా కూటమి అభ్యర్థులకు పడితే కిందటి పార్లమెంటు ఎన్నికల్లో మాదిరిగా బీజేపీ నూరు శాతం విజయాలు సాధించడం కష్టమే. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీలకు దక్కిన ఓట్లను కలిపి చూస్తే బందా, ఝాన్సీలో ఈ కూటమి విజయానికి అవకాశాలున్నాయి. వరుస కరువు కాటకాలతో ఇబ్బందులుపడుతున్న బుందేల్‌ఖండ్ ప్రజలకు ప్రభుత్వం నుంచి తగిన సహాయం లభించలేదు. హిందుత్వ రాజకీయాల ప్రభావం ఎక్కువ ఉన్న ఈ మూడు సీట్లలో ప్రభుత్వంపై జనంలో అసంతృప్తి ఎంత వరకు ఉందనేది అంచనాలకు అందడం లేదు. -
అదృష్టం అంటే ఇతనిదే..!
భోపాల్ : అదృష్టం అంటే ఈ పేద రైతుదే. నిన్నటి వరకూ ‘ఈ రోజు ఎలా గడుస్తుందిరా దేవుడా..!’ అనుకున్న అతడు ఒక్క రాత్రిలోనే అపర కుబేరుడు అయ్యాడు. తాతల కాలం నుంచి చేస్తోన్న మైనింగ్ వ్యాపారం కలిసి వచ్చి అదృష్టం ‘వజ్రం’ రూపంలో తలుపు తట్టింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. బుందేల్‌ఖండ్ ప్రాంతానికి చెందిన మోతీలాల్ ప్రజాపతి కుటుంబం తరతరాలుగా భూమిని లీజుకు తీసుకుని మైనింగ్ జరుపుతుండే వారు. మోతీలాల్ కూడా ఇదే పని చేస్తున్నాడు. ఈ క్రమంలో గత నెల సెప్టెంబర్‌లో క్రిష్ణ కల్యాణ్‌పూర్ ప్రాంతంలో 25 గజాల భూమిని లీజుకు తీసుకుని మైనింగ్ చేస్తున్నారు. నెల తిరిగిలోపే అదృష్టం మోతీలాల్ తలుపు తట్టింది. మైనింగ్ చేస్తుండగా 42.59 క్యారెట్ బరువున్న వజ్రం దొరికింది. దీని విలువ సుమారు 1.5 కోట్ల రూపాయలుంటుందని అంచనా వేశారు. ఈ విషయం గురించి మోతీలాల్.. ‘మూడు తరాల నుంచి మా కుటుంబం మైనింగ్‌లోనే ఉంది. కానీ ఎప్పుడు లాభాలు రాలేదు. దేవుడి దయ వల్ల ఇప్పుడు అదృష్టం నా ఇంటి తలుపు తట్టింది. ఈ వజ్రాన్ని అమ్మడం వల్ల వచ్చిన సొమ్ముతో నా పిల్లలని బాగా చదివించుకుంటాను. ఇల్లు కట్టుకుంటాను.. నా సోదరుని కూతుళ్లకు వివాహం చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చారు. నవంబర్‌లో ఎన్నికలు ముగిసిన తరువాత ఈ వజ్రాన్ని వేలం వేస్తాము. వచ్చిన సొమ్ములో 11 శాతం సొమ్మును ట్యాక్స్ కింద కట్ చేసి మిగతా డబ్బును మోతీలాల్‌కు అందజేస్తామని అధికారులు తెలిపారు. -
మొక్కల ‘అంబులెన్స్’
రోడ్డు ప్రమాదం జరిగినా లేదా అత్యవసర వైద్య సాయం అవసరమైనా వెంటనే అంబులెన్స్ గుర్తుకొస్తుంది. రోగిని ఆస్పత్రికి తరలించే లోపు అంబులెన్స్‌లో ఉన్న వైద్య సిబ్బంది ప్రాథమిక చికిత్స అందిస్తారు. ఫలితంగా చాలామంది రోగులు ప్రాణాపాయస్థితి నుంచి బయటపడ్డ సందర్భాలు అనేకం. అదే మొక్కలకు రోగం వస్తే? అత్యవసర చికిత్స అవసరమైతే? అందుకోసమే ఇప్పుడు కొత్తరకం అంబులెన్స్ అందుబాటులోకి వచ్చింది. అదే ట్రీ అంబులెన్స్. మొక్కలకు అవసరమైన చికిత్స అందించడం, వాటిని సంరక్షించడం వీటి బాధ్యత. మధ్యప్రదేశ్ ఛత్తర్పూర్ జిల్లాలోని బుందేల్‌ఖండ్ ప్రాంతంలో ఈ అంబులెన్స్‌ను ఇటీవల ప్రారంభించారు. ఈ అంబులెన్స్‌లో మొక్కల నిపుణుడు, సహాయ సిబ్బంది, మొక్కలు నాటేందుకు అవసరమైన పరికరాలు, నీరు, ఎరువులు, క్రిమిసంహారక మందులు అందుబాటులో ఉంటాయి. బుందేల్‌ఖండ్ ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణ, మొక్కల సంరక్షణకు కృషి చేస్తున్న కొందరు కలసి సేవాలయ బృందంగా ఏర్పడ్డారు. ఎవరికైనా మొక్కల పెంపకంలో ఇబ్బందులు ఉంటే ఈ ట్రీ అంబులెన్స్ ద్వారా వారికి అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తారు. పర్యావరణం పరిరక్షణ, పచ్చదనం కోసం చాలామంది మొక్కలు నాటుతారు. అయితే 60 నుంచి 70 శాతం మొక్కలు వివిధ రకాల రోగాల బారిన పడుతున్నాయి. వీటిని ఎలా సంరక్షించాలో తెలియకపోవడం వల్ల చనిపోతున్నట్లుగా తాము గుర్తించామని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ట్రీ అంబులెన్స్ ద్వారా ఉచితంగానే సేవలందించడం మరో విశేషం. ఐడియా బాగుంది కదూ..! -
పెళ్లి కాని తల్లిదండ్రులకు.. పిల్లలు పెళ్లి
టీకంఘడ్: ప్రేమ గొప్పది. ఎంతంటే చెప్పలేనంత. అవును. ప్రేమ మొగ్గతొడిగిన నాటి నుంచి కాపాడుకుంటూ పోతే అది మాను అవుతుంది. అప్పుడు దాన్ని ఎవరూ ఆపలేరు. అడ్డుకోలేరు కూడా. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బుందేల్‌ఖండ్‌లో జరిగిన ఓ ప్రేమ జంట కథ పైన ఉన్న పదాలకు కచ్చితంగా సరిపోతుంది. 40 ఏళ్ల క్రితం అంటే 1970వ దశకంలో.. సుఖే కుష్వాహా తన పక్క గ్రామానికి చెందిన హరియాభాయ్ని ప్రేమించాడు. ఈ విషయాన్ని హరియాతో చెప్పగా ఆమె కూడా సుఖేను ఇష్టపడుతున్నట్లు చెప్పింది. అలా మొదలైన ఇరువురి ప్రేమ కథ కొన్నాళ్లు సజావుగానే సాగింది. ఆ కాలంలో కట్టుబాట్ల గురించి మనందరికీ తెలిసిందే. ఒకరోజు సుఖే, హరియాతో సాన్నిహిత్యంగా మెలగడం చూసిన సుఖే బంధువులు ఇద్దరి ప్రేమను ఒప్పుకోలేదు. దీంతో సుఖే, హరియాతో పాటు ఆమె స్వగ్రామం సేతపూర్కు వెళ్లిపోయాడు. అక్కడ కూడా ఇరువురి వివాహానికి పెద్దలు నిరాకరించడంతో సహజీవనం చేస్తూ ఒకే ఇంట్లో నివసించడం ప్రారంభించారు. అలా కొద్ది కాలానికి హరియా, సుఖేలకు కొడుకు, కూతురు జన్మించారు. ప్రస్తుతం వారి పిల్లలకు కూడా పిల్లలు పుట్టారు. అంటే సుఖే(81), హరియా(76)లు పెళ్లి చేసుకోకుండానే తాతయ్య, నానమ్మలు అయ్యారు. ఎన్నో ఏళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంటకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని అనిపించింది. అదే విషయాన్ని బిడ్డలతో పంచుకోగా.. వారు ఇరువురికి హిందూ సంప్రదాయం ప్రకారం ఘనంగా వివాహం జరిపించారు. 'జీవితంలో అన్ని రకాల ఎత్తుపల్లాలను చూశాం. బిడ్డలను ప్రాణంగా పెంచుకున్నాం. అయితే, ఇరువురం పెళ్లి చేసుకోలేదనే చిన్న బాధ మాత్రం ఉండేది. అది ఇవాళ ఇలా తీరింది. బిడ్డల చేతులపై పెళ్లి చేయించుకునే అదృష్టం ఎంత మందికి దక్కుతుంది' అని సుఖే అన్నారు. -
పెళ్లికొడుకును కిడ్నాప్ చేసిన ప్రేయసి
బుందేల్‌ఖండ్: అక్కడ ఓ పెళ్లి జరుగుతోంది. అప్పుడే కల్యాణమంటపం ముందు మహీంద్రా స్కార్పియో వాహనం వచ్చి ఆగింది. అందులోంచి ఓ యువతి, ఇద్దరు వ్యక్తులు దిగారు. సాధారణంగా పెళ్లి పీటల మీద నుంచి వధువును ఎత్తుకుపోవడం మనం చాలా సినిమాల్లో చూసుంటాం. కానీ ఇక్కడ మాత్రం కారులోంచి దిగిన యువతి నేరుగా పెళ్లి కొడుకు వద్దకు వెళ్లి అతని తలపై తుపాకీ గురిపెట్టింది. ‘ఇతను నన్ను ప్రేమిస్తున్నాడు. కానీ మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని నన్ను మోసం చేయాలనుకుంటున్నాడు. ఇది జరగనివ్వను’ అంటూ అతణ్ని కారులోకి ఎక్కించుకుని వెళ్లిపోయింది. సినిమాటిక్‌గా ఉన్న ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతంలో మంగళవారం రాత్రి జరిగింది. అశోక్ యాదవ్ అనే వ్యక్తికి భారతి అనే యువతితో పెళ్లి జరుగుతుండగా అతని ప్రియురాలు అతణ్ని ఎత్తుకుపోయింది. స్థానికుల సమాచారం ప్రకారం అశోక్, సదరు యువతి పట్టణంలో ఓ చోట కలిసి పనిచేసేవారు. అప్పుడే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించి రహస్యంగా వివాహం చేసుకున్నారు. కానీ ఇంట్లో వాళ్ల ఒత్తిడితో అతను భారతితో పెళ్లికి ఒప్పుకున్నాడు. ఈ ఘటనతో పెళ్లికూతురు తీవ్రంగా కలత చెందగా, ఆమె కుటుంబ సభ్యులు యువతిపై కిడ్నాప్ కేసు పెట్టారు. మరోవైపు కొందరు పోలీసులు మాత్రం యువతి ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. ఇలాంటివారు ఉండటం వల్ల అమ్మాయిలను మోసం చేయాలనుకునే పోకిరీల్లో భయం ఏర్పడుతుందని వారంటున్నారు. -
రివాల్వర్ రాణి: వరుడి తలకు తుపాకీ పెట్టి..
బుందేల్‌ఖండ్: తనను ప్రేమించి మోసం చేసి వేరే అమ్మాయిని వివాహం చేసుకుంటున్నాడంటూ ఓ యువతి రివాల్వర్‌తో పెళ్లి మండపానికి వచ్చి వరుడిని కిడ్నాప్ చేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌లో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పెళ్లి మండపానికి సుమోలో ఇద్దరు వ్యక్తులతో కలిసి వచ్చిన యువతి..' ఇతను నన్ను ప్రేమించాడు. ఇప్పుడు వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధమై నన్ను మోసగిస్తున్నాడు. నేను ఈ పెళ్లిని ఎట్టి పరిస్ధితుల్లో జరగనివ్వను' అంటూ వరుడి తలకు వెంట తెచ్చుకున్న తుపాకి గురి పెట్టి అతన్ని కిడ్నాప్ చేసింది. కళ్ల ముందు జరిగిన ఈ సంఘటనతో వివాహానికి హాజరైన బంధువులు షాక్‌కు గురయ్యారు. వెంటన్ దగ్గరలోని పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఇలాంటి అమ్మాయిలు ఉంటేనే అబ్బాయిలకు బుద్ధి వస్తుందని ఓ పోలీస్ అధికారి కిడ్నాప్ చేసిన యువతిని 'రివాల్వర్ రాణి' వ్యాఖ్యానించారు. కాగా, పెళ్లిపీటల మీద పెళ్లి ఆగిపోవడంపై స్పందించిన వధువు ఇలాంటి కష్టం శత్రువులకు కూడా రాకూడదని ఆవేదన వ్యక్తం చేసింది. వరుడు అశోక్ యాదవ్ కిడ్నాప్‌పై స్ధానికులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. కిడ్నాప్ చేసిన యువతి అశోక్‌కు ముందే తెలుసని చెప్పారు. మరికొందరు వారు సీక్రెట్‌గా గతంలోనే పెళ్లి చేసుకున్నారని.. తల్లిదండ్రుల ఒత్తిడి కారణంగా ఈ పెళ్లికి అశోక్ ఒప్పుకున్నాడని తెలిపారు. పెళ్లిమండపంలో వివాహం ఆగిపోవడంపై స్పందించిన వరుడి తండ్రి.. తన కొడుకు ప్రవర్తన కొంతకాలంగా అనుమానాస్పదంగా ఉన్నట్లు చెప్పారు. పని చేసే నగరానికి కలవడానికి వెళ్తే ఇంటికి తీసుకెళ్లకుండా.. గుడికి రమ్మనేవాడని తెలిపారు. అక్కడే ఏదో ఒక రెస్టారెంట్లో భోజనం పెట్టించి తిరిగి బస్ ఎక్కించేసేవాడని చెప్పారు. -
‘పవర్లో ఉన్నాం.. ఇక ధర్నాలొద్దు’
లక్నో: ‘ఇక నుంచి ధర్నాలు, రాస్తారోకోలో చేయడం మీ పనికాదు’ అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ బీజేపీ కార్యకర్తలకు సూచించారు. తొలిసారి బుందేల్‌ఖండ్‌కు వచ్చిన ఆయన ఆ ప్రాంతంలో అభివృద్ధి ప్రాజెక్టులను ధర్నాలు, నిరసనలతో అడ్డుకునే ప్రయత్నం చేయొద్దంటూ కాస్తంత గట్టిగా హెచ్చరించారు. ‘ఏదైనా సమస్య ఉంటే పార్టీ కార్యాలయంలో ఉండేవారికి లేదా, అధికారులకు తెలియజేయండి. మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధర్నాలు, ఆందోళనలకు న్యాయసమ్మతమే. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నాం. ఇప్పుడు మీ పని అది కాదు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే మీ ముందున్న పని’ అని ఆయన చెప్పారు. బుందేల్ ఖండ్ నుంచి నేరుగా ఢిల్లీకి ఆరు లేన్ల రహదారిని నిర్మించే ఆలోచన చేస్తున్నామని అన్నారు. మరోపక్క, సమాజ్‌వాది పార్టీ నేత అఖిలేశ్ యాదవ్‌కు చెందిన మరో ప్రాజెక్టుపై యోగి విశ్లేషణ ప్రారంభించారు. నాలుగు నెలల కిందట అఖిలేశ్ పూర్తి చేసి ప్రారంభించిన లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టులో ఎన్నో అవకతవకలు జరిగాయని, పెద్ద మొత్తంలో కుంభకోణం చోటుచేసుకుందని, రైతులకు అన్యాయం జరిగిందని ఆరోపణలు రావడంతో ఆ ప్రాజెక్టు తీరు తెన్నులను యోగి పరిశీలిస్తున్నారు. ప్రాజెక్టుకు అయిన వ్యయం, రహదారి నిర్మాణం విషయంలో రైతుల నుంచి తీసుకున్న భూములకు చెల్లించిన నష్టపరిహారం తదితర అంశాలను పరిశీలిస్తున్నారు. అయితే, ప్రాజెక్టులను తప్పు బట్టడం తమ ఉద్దేశం కాదని, బాధిత రైతులకు న్యాయం జరిగిందా లేదా అనే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. -
బుందేల్‌ఖండ్ నుంచే అఖిలేష్ పోటీ ఎందుకు?
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బుందేల్‌ఖండ్ ప్రాంతం నుంచి పోటీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నానని రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ రెండు రోజుల క్రితం సూచనప్రాయంగా తెలియజేశారు. ఎందుకు ఆయన అక్కడినుంచి పోటీ చేయాలనుకుంటున్నారు? పోటీ చేస్తే ఆయనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి? తండ్రి ములాయం సింగ్ యాదవ్‌తో తగువును కొనసాగిస్తూనే అఖిలేష్ యాదవ్ బుందేల్‌ఖండ్ ప్రాంతంలో పలు ఎన్నికల ర్యాలీలు నిర్వహించారు. రాష్ట్రంలోనే బాగా వెనకబడి ఉన్న ఆ ప్రాంతంలో పలు సౌర విద్యుత్ ప్రాజెక్టులను కూడా చేపట్టారు. మరిన్ని అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టారు. పలు ఉచిత పథకాలను ప్రకటించారు. ఆ ప్రాంతాభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామీణ జాతీయ ఉపాధి హామీ, ఆహార భద్రతా పథకం, మధ్యాహ్న భోజన పథకాలను పటిష్టంగా అమలు చేయడంతో పాటు సామాజిక భద్రతా పింఛన్లను మంజూరుచేస్తానని చెప్పారు. జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా ఎప్పుడూ వార్తల్లో నిలిచే బుందేల్‌ఖండ్ ప్రాంతంలో ప్రస్తుతం మాయావతి నాయకత్వంలోని బహుజన సమాజ్ పార్టీ ఆధిపత్యం కొనసాగుతోంది. ఆ ప్రాంతంలో తమ పట్టు నిలబెట్టుకోవాలన్నది అఖిలేష్ ఎత్తుగడ. రాష్ట్ర అసెంబ్లీలో 403 సీట్లు ఉండగా బుందేల్‌ఖండ్‌లో కేవలం 19 స్థానాలు మాత్రమే ఉన్నాయి. సాంస్కృతికంగా, చారిత్రకంగా ఈ ప్రాంతానికి ఎంతో గుర్తింపు ఉంది. ఇటు ఉత్తరప్రదేశ్‌తో పాటు అటు మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు విస్తరించి ఉన్న బుందేల్‌ఖండ్‌పై పట్టు సాధిస్తే మున్ముందు జాతీయ నాయకుడిగా ఎదిగేందుకు కూడా అది ఉపయోగపడుతుంది. అందుకనే ఎన్నికల్లో పోటీ చేస్తున్న అన్ని పార్టీలు కూడా బుందేల్‌ఖండ్ అభివృద్ధికి పలు హామీలు ఇస్తున్నాయి. ప్రభుత్వ పథకాల్లో అవినీతి, వరుస కరువుల వల్ల ఈ ప్రాంతం బాగా వెనకపడి పోయింది. నిజాయితీపరుడని పేరున్నందువల్ల అఖిలేష్ వాగ్దానాలను బుందేల్‌ఖండ్ ప్రజలు విశ్వసించే అవకాశం ఎక్కువగా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో ఎటావా, కనౌజ్, మైపూరి, ఫరూకాబాద్‌లో సమాజ్‌వాదీ పార్టీకి గట్టి పట్టుంది. దానికి బుందేల్‌ఖండ్ సీట్లు తోడైతే పార్టీకి ఎన్నికల్లో విజయావకాశాలు పెరుగుతాయన్నది అఖిలేష్ వ్యూహం. 2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బుందేల్‌ఖండ్‌లో బీఎస్పీకి 7, ఎస్పీకి 5, కాంగ్రెస్‌కు 4, బీజేపీకి 3 సీట్లు వచ్చాయి. వాటిలో బాబినా లేదా మహోబా అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేయాలని అఖిలేష్ భావిస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ రెండు సీట్లకు కూడా ప్రస్తుతం బీఎస్పీ ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈ రెండింటిలో ఏదో ఒక సీటు నుంచి పోటీచేయడం ద్వారా పార్టీ శ్రేణుల్లో అత్మవిశ్వాసం నెలకొల్పాలన్నది అఖిలేష్ వ్యూహంగా కనిపిస్తోంది. -
ప్రాణం తీసిన ప్రాయశ్చిత్తం
భోపాల్: పంచాయతీ పెద్దల తీర్పు మధ్యప్రదేశ్ లో ఓ వృద్ధరైతు మరణానికి కారణమైంది. బుందేల్ ఖండ్ ప్రాంతంలోని ఛత్తర్ పూర్ జిల్లా బాదా మల్హెరా గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటనను ‘ది టెలిగ్రాఫ్’ వెలుగులోకి తెచ్చింది. హర్ సింగ్ లోధి పొలంలో ఇటీవల ఓ ఆవు దూడ చనిపోయింది. దాని ప్రక్కనే ఎలుకల మందు డబ్బా పడివుండడంతో దూడ మరణానికి హర్ సింగ్ కారణమని పంచాయతీ పెద్దలు తీర్మానించారు. ఆయనకు రూ. 500 జరిమానా విధించి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఆదేశించారు. దీనికి అంగీకరించిన సింగ్ మూడు గంటల పాటు ఒంటికాలిపై నిల్చోని ఒక్కసారిగా కుప్పకూలిపోయి ప్రాణాలు వదిలాడు. ‘దూడ మరణానికి మా నాన్నే కారణమని పంచాయతీ పెద్దలు తేల్చారు. వారి తీర్పును అంగీకరించి ఒంటి కాలిపై నిల్చున్నారు. కాళ్లు అటుఇటు మారుస్తూ మూడు గంటలపాలు నిల్చుకున్నాడు. తర్వాత కుప్పకూలిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పార’ని హర్ సింగ్ కొడుకు దరియాబ్ కన్నీళ్ల పర్యంతమయ్యాడు. గోపరిరక్షకులుగా చెలామణి అవుతున్న కొంతమంది అమాయకుల చావుకు కారణమైన ఉదంతాలు గతంలోనూ రాష్ట్రంలో జరిగాయి. చనిపోయిన ఆవు చర్మాన్ని ఒలిచారనే కారణంతో జూలై నలుగురు దళిత యువకులను గోపరిరక్షకులు చావబాదారు. -
భగ్గుమంటున్న అబ్బాయి, బాబాయ్‌ల వివాదం
సమాజ్‌వాద్ అధికార పార్టీ ఇంట నెలకొన్న రాజకీయ సంక్షోభం, సీట్ల పంపకం విషయంలో మళ్లీ తారాస్థాయికి వెళ్తోంది. టిక్కెట్ల పంపిణీల్లో బాబాయి శివ్‌పాల్ యాదవ్, అబ్బాయి అఖిలేష్ యాదవ్ మధ్య విభేదాలు ముదురుతున్నాయి. టిక్కెట్ల విషయంలో బెంగ పడొద్దని ఎమ్మెల్యేలకు భరోసా ఇచ్చిన అఖిలేష్, 403 మంది అభ్యర్థులతో కూడిన సొంత జాబితాను తయారుచేసి బాబాయి శివ్‌పాల్‌కు పంపించారు. అయితే ఆ జాబితాపై శివపాల్ అసంతృప్తి వ్యక్తంచేసినట్టు తెలుస్తోంది. క్రమశిక్షణ ఉల్లంఘించిన వారికి టిక్కెట్ ఇచ్చే ప్రసక్తే లేదని శివ్ పాల్ తేల్చిచెప్పినట్టు రిపోర్టులు పేర్కొన్నాయి. ఈ జాబితాలోనే బుందేల్ ఖండ్‌లోని రెండు స్థానాల నుంచి తాను పోటీచేయనున్నట్టు అఖిలేష్ తెలిపారు. బబినా, మహోబ నుంచే అఖిలేష్ పోటీచేస్తున్నారని రిపోర్టులు తెలిపాయి. ఉత్తరప్రదేశ్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపక బాధ్యతలను రాష్ట్ర పార్టీ చీఫ్ శివ్‌పాల్ నిర్వహిస్తున్నారు. ఈ పంపక విషయంలో తనకు ఇష్టంలేని వారికి, క్రిమినల్స్‌కు బాబాయ్ టిక్కెట్లు ఇస్తారని అఖిలేష్ గుర్రుగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తనకిష్టమైన వారితో సొంత జాబితా సిద్ధం చేసి శివ్‌పాల్‌కు పంపించారు. కానీ అఖిలేష్ పంపిన జాబితాపై శివ్‌పాల్ అసంతృప్తి వ్యక్తంచేయడం మళ్లీ వీరిద్దరి మధ్య తీవ్రస్థాయిలో చిచ్చు రేపుతోంది. -
నేలను నమ్మినోడు.. నీళ్లను చోరీ చేశాడట!
లక్నో: కరువు ఉదంతాల్లో ఇదీ ఒకటి. నేలను నమ్ముకున్న రైతు చివరికి నీళ్ల దొంగతనం కేసులో కటకటాలపాలయ్యాడు. రైతుల ఆశ, అధికారుల అత్యుత్సాహాలకు అద్దంపట్టే ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ బుందేల్ ఖండ్ లోని మహోబా జిల్లా చోటుచేసుకుంది. గడిచిన మూడేళ్లుగా బుందేల్ ఖండ్ ను కరువు రక్కసి కాటేస్తూనేఉంది. ఇప్పుడు అరెస్టయిన హిరాలాల్ యాదవ్ లాంటి పేద రైతులు చాలామంది కొండంత అప్పుల్లో కూరుకుపోయి ఉన్నారు. ఎప్పటిలాగే ఈసారి కూడా హీరాలాల్ ప్రకృతితోపోటీపడి విత్తనాలు నాటాడు. మొక్క మొలిచింది. దానికి నీళ్లుకావాలి. ఊరికి దగ్గరలోనే ఉర్మిల్ డ్యామ్ ఉంది. ఇక అసలు కథ మొదలైంది.. ఉర్మిల్ డ్యామ్ వాల్వ్ లను ధ్వంసంచేసి హీరాలాల్ తన పొలానికి నీళ్లు మళ్లించుకుని వెళ్లాడని డ్యామ్ ఇంజనీర్లు కేసు పెట్టారు. వాల్వ్ ను ధ్వంసం చేసిన ప్రదేశంలో ఒక నీటి గుంటను తవ్వి.. అక్కడి నుంచి తన పొలానికి నీళ్లు పారించుకుంటున్నాడని అధికారులు ఆరోపించారు. ఈ మేరకు ప్రభుత్వ ఆస్ధిని ధ్వసం చేసి నందుకుగానూ అతనిపై సెక్షన్ 430, 353ల కింద కేసులు నమోదయ్యాయి. అయితే, మట్టిని నమ్ముకున్న తనకు నీళ్లను చోరీచేయాల్సిన అవసరం లేదని హీరాలాల్ వాదిస్తున్నాడు. వృథాగా పోతున్న నీటినే మళ్లించుకున్నానని చెబుతున్నాడు. డ్యామ్ వాల్వ్ ఇంతకు ముందే చెడిపోయిందని, ఆ తప్పును కప్పిపుచ్చుకునేందుకే అధికారులు తన భర్తపై తప్పుడుకేసు బనాయించారని హీరాలాల్ భార్య మున్నీదేవీ చెబుతున్నారు. జూన్ వరకు ఉర్మిల్ డ్యామ్ లోని నీటిని కేవలం తాగు అవసరాలకే వినియోగించాలనే నిబంధన ఉంది. -
సీఎంపై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ అహంకార దోరణితో వ్యవహరిస్తున్నారని కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమా భారతి విమర్శించారు. తాగునీటి సరఫరా విషయంలో ఆమె యువ సీఎంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బుందేల్ ఖండ్ ప్రాంతంలోని కొన్ని గ్రామాల్లో భూగర్భజలాలు అడుగంటి పోయాయి. కేంద్రం ఈ మధ్య రైళ్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే మధ్యప్రదేశ్ నుంచి గురువారం ఓ రైలు నీటిని తీసుకెళ్తుండగా ఝాన్సీ ప్రాంతంలో నిలిపివేసినట్లు మంత్రి తెలిపారు. ఈ విషయంలో కేంద్ర జోక్యం అనవసరమని, వారి ప్రమేయం ఎందుకంటూ అఖిలేశ్ వ్యాఖ్యానించడంపై ఉమా భారతి ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజకీయాలు చేసేందుకు ఇవి తగిన అంశాలు కావని హితవు పలికారు. సీఎం అఖిలేశ్ చదువుకున్న వ్యక్తి అయినప్పటికీ మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని, యూపీ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుందని ఆరోపించారు. నీళ్లు, ఆహారం లాంటి విషయాల్లో రాజకీయం చేయాల్సిన అవసరం తమకు లేదని స్పష్టంచేశారు. వాటర్ తో రైలు రావడం, అడ్డగించడం విషయంపై తమ వద్ద సరైన సమాచారం లేదని జిల్లా కలెక్టర్ అజయ్ శుక్లా పేర్కొన్నారు. వచ్చే ఏడాది యూపీలో ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ఇప్పటినుంచే పార్టీల నేతలు రాజకీయాలు మొదలుపెట్టారంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
సీఎంగారూ నీళ్లు ఇలా వృథా చేస్తారా?
ఆ ప్రాంతం కరువుతో అల్లాడిపోతున్నది. తాగడానికి కూడా గుక్కెడు నీళ్లు లేక జనం నానా అవస్థలు పడుతున్నారు. కరువు తాండవిస్తున్న అలాంటి ప్రాంతంలో సమీక్ష నిర్వహించడానికి ముఖ్యమంత్రి వస్తున్నారనేగానే.. ఆయన హెలిప్యాడ్ కోసం అధికారులు వేలలీటర్ల నీటిని వృథా చేసేశారు. ట్యాంకర్ల కొద్ది నీటి ఉపయోగించి హెలిప్యాడ్ సిద్ధం చేశారు. కరువు పీడిత ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌లో సీఎం అఖిలేశ్ యాదవ్ పర్యటన సందర్భంగా ఇలా నీటిని దుబరా చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్న బుందేల్‌ఖండ్ లోని లలిత్‌పూర్‌లో ప్రజలకు కరువు సహాయం ఏమేరకు అందుతున్నదో సమీక్షించడానికి సీఎం అఖిలేశ్ పర్యటన సందర్భంగా ఈ హెలిప్యాడ్‌ను అధికారులు ఏర్పాటుచేశారు. ఈ వివాదంపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ.. గుక్కెడు నీళ్లు లేక ప్రజలు చస్తుంటే ముఖ్యమంత్రి మాత్రం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విరుచుకుపడింది. సీఎం అఖిలేశ్ తీరు చాలా అసంబద్ధంగా ఉందని, నీటిని ఇలా వృథా చేయడంపై సీఎం వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ నేత రితా బహుగుణ డిమాండ్ చేశారు. హెలిప్యాడ్ కోసం నీటి వృథా అంశంపై సీఎం క్షమాపణ చెప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుండగా.. అధికార ఎస్పీ మాత్రం ఆ అవసరం లేదంటోంది. హెలిప్యాడ్ సిద్ధం చేసే బాధ్యత సెక్యూరిటీ అధికారులదని, దానిపై సీఎం ఎలా క్షమాపణ చెప్తారని ప్రతిపక్షాలను ప్రశ్నిస్తోంది. కరువు పీడిత లాతూరులో మహారాష్ట్ర మంత్రి ఏక్నాథ్ ఖడ్సే పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ కోసం 10వేల లీటర్ల నీటిని వృథా చేయడం ఇప్పటికే దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. -
బతకడం కోసం.. గడ్డి రోటీలు తింటున్నారు
భారీ వర్షాలు, వరదలకు చెన్నైవాసులు వారం రోజుల పాటు ఎన్నో కష్టాలుపడ్డారు. తినడానికి తిండిలేక, తాగడానికి నీళ్లు దొరకక అలమటించారు. చెన్నై వాసుల కష్టాలు చూసి దేశమంతా చలించిపోయింది. వారిని ఆదుకునేందుకు ఎందరో దాతలు ముందుకువచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌లో చాలా గ్రామాల్లో నిత్యం ఇదే పరిస్థితి. అక్కడ వర్షాలు, వరదలు లేవు కానీ.. కరువు, పేదరికంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. తినడానికి తిండి లేదు. గడ్డితో తయారు చేసిన రోటీలు తిని బతుకుతున్నారంటే వారి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతుంది. యూపీలోని బుందేల్‌ఖండ్ ప్రాంతంలో వర్షాభావం వల్ల కొన్నేళ్లుగా పంటలు పండటం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. చాలా గ్రామాల్లో ప్రజలు పేదరికంతో మగ్గిపోతున్నారు. ఆకలితో అలమటిస్తున్నారు. వారికి గడ్డి, కలుపు మొక్కలే ఆహారం. వీటిని రోటీలుగా చేసుకుని కడుపు నింపుకొంటున్నారు. 'సాధారణంగా గడ్డిని పశువులకు వేస్తాం. ప్రస్తుత పరిస్థితుల్లో మేం బతకాలంటే ఇదే గడ్డి తినడం మినహా మరో మార్గం లేదు' అని స్థానికులు వాపోయారు. ఎండిన గడ్డి మొక్కలను (ఫికార్) కోసుకుని వాటిలోని విత్తనాలను ఇంటికి తీసుకెళతారు. ఆ విత్తనాలను రోకట్లో దంచి పిండిలా తయారు చేస్తారు. ఈ పిండినీ రోటీల ఆకారంలో చేసి పొయ్యిలో కాల్చుకుంటారు. ఆ ప్రాంతంలో లభించే 'సమాయ్' అనే మొక్కల ఆకులను నీళ్లలో ఉడికించి కొంచెం ఉప్పు, నూనె వేసి కూరగా చేస్తారు. వీటిని పిల్లలకు వండిస్తారని స్థానికులు తెలిపారు. పేదరికం వల్ల బుందేల్‌ఖండ్‌లో చాలా గ్రామాల ప్రజలకు రోజుకు రెండుసార్లు మాత్రమే భోజనం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో జాతీయ ఆహార భద్రత చట్టాన్ని అమలు చేయాలని రెణ్నెల్ల క్రితమే యూపీ ప్రభుత్వం నిర్ణయించింది.