
ఏపీకి.. బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ: నిర్మలా సీతారామన్
ఏపీలో బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీని త్వరితగతిన అమలు చేయనున్నట్టు కేంద్ర వాణిజ్య, ఆర్థిక, పరిశ్రమలు, సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.
విశాఖపట్నం: ఏపీలో బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీని త్వరితగతిన అమలు చేయనున్నట్టు కేంద్ర వాణిజ్య, ఆర్థిక, పరిశ్రమలు, సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. దీనికిగాను ఒక కమిటీ అధ్యయనం చేస్తోందన్నారు. విశాఖలో బీజేపీ శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన సన్మాన సభలో మంత్రి మాట్లాడారు. ప్యాకేజీని ఆంధ్రకు ఎలా వర్తింపజేయాలో అనే దానిపై తీవ్ర చర్చ జరుగుతోందని చెప్పారు. తన మంత్రిత్వ శాఖ పరిధిలోనే ఒక బృందాన్ని నియమించామన్నారు. ఈ నెల 25న టీడీపీ, బీజేపీ ఎంపీలతో ఇదే విషయమై సమావేశం ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.